STAR TRINETHRAM
రిపోర్టర్
మీ ప్రాంత వార్తల కోసం లొకేషన్ ఆన్ చేయండి
Breaking
⚡ BREAKING

Kulkarni Rajaprabhakar Rao: నందిపహాడ్ గ్రామస్థుల అభిమానానికి రుణపడి ఉంటా

Breaking
⚡ BREAKING

Dr.Nalamasa Srikanth Goud: ఉద్యమ ప్రస్థానం నుంచి శాసన మండలి బరిలోకి

Breaking
⚡ BREAKING

Kulkarni Rajaprabhakar: కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

Breaking
⚡ BREAKING

Post Office Schems: టాప్ 5 స్కీమ్స్ గురించి తెలుసా?.. మీకు ఏది బెస్ట్..?

Breaking
⚡ BREAKING

Kulkarni Rajaprabhakar Rao: కన్నీటి సంద్రంలో వెలిగిన సూర్యుడు

ఫ్లిప్ న్యూస్
ప్రపంచం (World)
క్రీడలు (Sports)
ఈ-పేపర్
లైవ్ టీవీ
రీల్స్ / షార్ట్స్
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

తాజా వార్తలు (Top Stories)

Thumb
📍 వార్తలు

Kulkarni Rajaprabhakar Rao: నందిపహాడ్ గ్రామస్థుల అభిమానానికి రుణపడి ఉంటా

1 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Dr.Nalamasa Srikanth Goud: ఉద్యమ ప్రస్థానం నుంచి శాసన మండలి బరిలోకి

3 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Kulkarni Rajaprabhakar: కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Govt Schemes

Post Office Schems: టాప్ 5 స్కీమ్స్ గురించి తెలుసా?.. మీకు ఏది బెస్ట్..?

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Kulkarni Rajaprabhakar Rao: కన్నీటి సంద్రంలో వెలిగిన సూర్యుడు

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Khairatabad: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

12 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Nagaram Division: ఎంగిలి పూల బతుకమ్మ సంబరాల్లో ఏనుగు సుదర్శన్ రెడ్డి

12 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Telangana: రైతుల కోసం టోల్‌ఫ్రీ సేవలు

15 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Veleru: కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనం

29 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

SI Muthyam Rajender: కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా.. రాయపర్తి ఎస్సై సక్సెస్ స్టోరీ

9 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Telangana: స్మార్ట్ రేషన్ కార్డు.. పేరుకే స్మార్ట్?

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Hyderabad: కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్.. ఉద్రిక్తత

16 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Interesting

Interesting Fact: భార్య.. భర్తకు రాఖీ కట్టవచ్చా?.. పురాణాల్లో ఏముంది..?

27 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Entertainment

Entertainment: ఇరగదీస్తున్న ‘ఇరుముడి’కి ‘టాక్సిక్’ స్పీడ్ బ్రేకర్‌ కానుందా..?

29 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Life Style

Gen Z: ‘నో’ చెప్పడంలో నో మొహమాటం

18 గం. క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Aruri Ramesh: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

2 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Entertainment

Romantic Movie: అసలెలా తీశారురా బాబు ఈ సినిమాని.. చిన్న పిల్లలు అస్సలు చూడొద్దు..

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Viral

Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం

6 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Muhammad Ayub: సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు

7 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Political: సీఎం పరకాల పర్యటనలో కనిపించని కొండా సురేఖ.. కారణమేంటి..?

7 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Crime

Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..

7 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Wardhannapet: జాతీయ పతాకానికి అవమానం (VIDEO)

7 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Viral

Nude Restaurant: ఆడ, మగ నగ్నంగా భోజనం చేసే వింత రెస్టారెంట్

14 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Hanumakonda District: ‘స్టార్ త్రినేత్రం’ కథనాలకు కదులుతున్న నెట్‌వర్క్!

18 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Hanumakonda District: తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు

19 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Warangal: లంచం ఇస్తే.. పట్టా..!

21 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Hanumakonda: జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో కేంబ్రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ

22 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Entertainment

Ghost Train: ట్రైన్ మొత్తం దెయ్యాలే.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్

23 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Entertainment

Malaika Arora: 19 ఏళ్ల చిన్నవాడితో 52 ఏళ్ల హీరోయిన్ డేటింగ్..!

24 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 National

Inspirational Story: 21 ఏళ్లకే పెళ్లి.. 23 ఏళ్లకే తల్లి.. తండ్రి కలను నెరవేర్చిన ఐఏఎస్

25 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Entertainment

Lakshmi: వేశ్యాగృహంలో మిస్టరీ.. క్లైమాక్స్‌లో ఆ సీన్లు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది..

26 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Business

New Rules: ఆగస్టు 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఇవే..

27 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Mantena Manikumar: సేవకు మారుపేరైన ‘అమ్మ ఫౌండేషన్’

28 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Health Update: నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం

28 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Sirikonda Lakshminarayana: ఒక ఆలోచన.. వేలాది జీవితాలకు ఆశాకిరణం

29 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Devotional

Hindu Festival: తొలి ఏకాదశి విశిష్టత.. పూజా విధానం

30 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Entertainment

Actress Jeevitha: ఎవరి భర్త సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్నా నేను సమర్థిస్తా!

14 గం. క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Entertainment

Ek Din: మీకు తెలుసా?.. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారట!

1 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Edu/Jobs

PNB: ఈ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా..?

2 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Andhra Pradesh

Bumper Offer: ఫ్రీగా ఫ్లైట్ ఎక్కే ఛాన్స్

2 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
News News
Reporter
STAR TRINETHRAM
1 రోజుల క్రితం
Logo

Kulkarni Rajaprabhakar Rao: నందిపహాడ్ గ్రామస్థుల అభిమానానికి రుణపడి ఉంటా

Kulkarni Rajaprabhakar Rao: తెలంగాణ రక్షణ సేన కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ కులకర్ణి రాజప్రభాకర్ రావు బుధవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మద్దూరు మండలం నందిపహాడ్ గ్రామంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన రైడ్ అండ్ రూల్ జట్టుకు మొదటి బహుమతిగా రూ.11,000, కాలాగ్ని జట్టుకు రెండో బహుమతిగా రూ.5,500 అందించారు. ఈ సందర్భంగా కులకర్ణి రాజప్రభాకర్ రావు మాట్లాడుతూ.. నందిపహాడ్ గ్రామస్థులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఇంకా అనేక పనులు చేయాల్సి...

Kulkarni Rajaprabhakar Rao: తెలంగాణ రక్షణ సేన కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ కులకర్ణి రాజప్రభాకర్ రావు బుధవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మద్దూరు మండలం నందిపహాడ్ గ్రామంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన రైడ్ అండ్ రూల్ జట్టుకు మొదటి బహుమతిగా రూ.11,000, కాలాగ్ని జట్టుకు రెండో బహుమతిగా రూ.5,500 అందించారు. ఈ సందర్భంగా కులకర్ణి రాజప్రభాకర్ రావు మాట్లాడుతూ.. నందిపహాడ్ గ్రామస్థులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఇంకా అనేక పనులు చేయాల్సి ఉందని, ప్రజల ఆదరణను ఎల్లవేళలా గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. గ్రామస్థుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నందిపహాడ్ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తాననే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ALSO READ: Kulkarni Rajaprabhakar Rao: కన్నీటి సంద్రంలో వెలిగిన సూర్యుడు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
3 రోజుల క్రితం
Logo

Dr.Nalamasa Srikanth Goud: ఉద్యమ ప్రస్థానం నుంచి శాసన మండలి బరిలోకి

తెలంగాణ రక్షణ సేన తొలి అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ వరంగల్-ఖమ్మం-నల్గొండ బరిలోకి ఉద్యమకారుడు శ్రీకాంత్ గౌడ్ దసరా సందర్భంగా ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత Dr.Nalamasa Srikanth Goud: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ బాధ్యతల దిశగా మరో కీలక అడుగు పడింది. తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోయే తొలి అభ్యర్థిగా ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరును పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత దసరా పండుగ సందర్భంగా ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన...

  • తెలంగాణ రక్షణ సేన తొలి అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
  • వరంగల్-ఖమ్మం-నల్గొండ బరిలోకి ఉద్యమకారుడు శ్రీకాంత్ గౌడ్
  • దసరా సందర్భంగా ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
Dr.Nalamasa Srikanth Goud: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ బాధ్యతల దిశగా మరో కీలక అడుగు పడింది. తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోయే తొలి అభ్యర్థిగా ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరును పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత దసరా పండుగ సందర్భంగా ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయాన్ని వెల్లడించారు. అదే సమయంలో ఈ ఎన్నికల సమన్వయం కోసం సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను రాష్ట్ర పార్టీ పరిశీలకుడిగా, ఎన్నికల సమన్వయ బాధ్యుడిగా నియమించారు. దసరా వేళ వెలువడిన ఈ ప్రకటనతో తెలంగాణ రక్షణ సేన ఎన్నికల ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఉద్యమమే పునాది.. ప్రజల మధ్యే ప్రస్థానం ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని, గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న ఆయన, తెలంగాణ జాగృతి ప్రారంభ దశ నుంచే కల్వకుంట్ల కవితతో కలిసి పనిచేశారు. ఉద్యమ కాలంలో ఏర్పడిన పరిచయాలు, ప్రజా సమస్యలపై సాగిన కార్యాచరణ ఆయన రాజకీయ ప్రయాణానికి నేపథ్యంగా నిలిచాయి. తెలంగాణ సాధన కోసం సాగిన పోరాటంలో భాగస్వామిగా ఉన్న ఆయన, అనంతరం పార్టీ కార్యక్రమాల్లోనూ తన పాత్రను కొనసాగించారు. పార్టీ గొంతుకగా.. ప్రజా వేదికలపై తనదైన పాత్ర తెలంగాణ జాగృతితో అనుబంధం కొనసాగించిన శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ రక్షణ సేనలో అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూ టెలివిజన్ చర్చా కార్యక్రమాలు, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ తరఫున తన వాణిని వినిపించారు. పార్టీ విధానాలు, రాజకీయ అంశాలను వివిధ వేదికలపై ప్రస్తావిస్తూ సంస్థాగత కార్యకలాపాల్లో భాగస్వామ్యమయ్యారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆయన పేరును ప్రకటించడం ద్వారా పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల దిశగా అడుగు వేసింది. తొలి అభ్యర్థి ప్రకటనతో ఎన్నికల సమరానికి శ్రీకారం తెలంగాణ రక్షణ సేన స్థాపించిన తర్వాత తొలిసారిగా శాసన మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. ఈ క్రమంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను తొలి అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ఎన్నికల సమన్వయం, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం సయ్యద్ ఇస్మాయిల్‌కు బాధ్యతలు అప్పగించారు. బహుజనుల సమస్యలపై గత 3 సంవత్సరాలుగా పలు ఉద్యమాలకు రూపకల్పన చేసినట్లు పేర్కొంటున్న కల్వకుంట్ల కవిత, అదే రాజకీయ ప్రయాణంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు. ఈ నిర్ణయంతో పార్టీ ఎన్నికల కార్యాచరణకు అధికారికంగా శ్రీకారం చుట్టింది. ALSO READ: Post Office Schems: టాప్ 5 స్కీమ్స్ గురించి తెలుసా?.. మీకు ఏది బెస్ట్..?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

Telangana News
Reporter
STAR TRINETHRAM
4 రోజుల క్రితం
Logo

Kulkarni Rajaprabhakar: కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

Kulkarni Rajaprabhakar: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కులకర్ణి రాజప్రభాకర్ రావు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తూ, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నూతన ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రజల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందిస్తూ, పరస్పర సహకారం, ఐక్యతకు...

Kulkarni Rajaprabhakar: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కులకర్ణి రాజప్రభాకర్ రావు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తూ, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నూతన ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రజల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందిస్తూ, పరస్పర సహకారం, ఐక్యతకు మరింత బలాన్ని చేకూర్చాలని ఆకాంక్షించారు. ‘ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి’.. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ప్రశాంతమైన జీవనం సాగించాలని కులకర్ణి రాజప్రభాకర్ రావు ఆకాంక్షించారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఒకచోట చేర్చి ఆప్యాయతలను పెంచుతాయని పేర్కొన్నారు. విజయదశమి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాల సాధనకు ముందుకు సాగాలని, సమాజంలో సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవాలని కోరారు. కొడంగల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ దసరా పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపి, ప్రజలందరికీ విజయాలను అందించాలని కోరుతూ మరోసారి నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ALSO READ: Kulkarni Rajaprabhakar Rao: కన్నీటి సంద్రంలో వెలిగిన సూర్యుడు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Govt Schemes News
Reporter
STAR TRINETHRAM
4 రోజుల క్రితం
Logo

Post Office Schems: టాప్ 5 స్కీమ్స్ గురించి తెలుసా?.. మీకు ఏది బెస్ట్..?

Post Office Schems: భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును భద్రపరచుకోవాలని, పెట్టుబడిపై స్థిరమైన రాబడి పొందాలని కోరుకునేవారికి తపాలా శాఖ అందించే పొదుపు పథకాలు ఉపయోగకరమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు వీటిని పరిశీలించవచ్చు. దీర్ఘకాలిక పొదుపు, ఆడపిల్లల విద్యాభవిష్యత్తు, పదవీ విరమణ తర్వాత ఆదాయం, ప్రతి నెలా వడ్డీ పొందడం వంటి వేర్వేరు అవసరాలకు అనుగుణంగా పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 5 పథకాలు, వాటి పెట్టుబడి పరిమితులు, కాలపరిమితులు, వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు, నగదు ఉపసంహరణ...

Post Office Schems: భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును భద్రపరచుకోవాలని, పెట్టుబడిపై స్థిరమైన రాబడి పొందాలని కోరుకునేవారికి తపాలా శాఖ అందించే పొదుపు పథకాలు ఉపయోగకరమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు వీటిని పరిశీలించవచ్చు. దీర్ఘకాలిక పొదుపు, ఆడపిల్లల విద్యాభవిష్యత్తు, పదవీ విరమణ తర్వాత ఆదాయం, ప్రతి నెలా వడ్డీ పొందడం వంటి వేర్వేరు అవసరాలకు అనుగుణంగా పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 5 పథకాలు, వాటి పెట్టుబడి పరిమితులు, కాలపరిమితులు, వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు, నగదు ఉపసంహరణ సౌకర్యాల గురించి తెలుసుకోవడం ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలకు తగిన నిర్ణయం తీసుకోవచ్చు. 1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ (పీపీఎఫ్‌) దీర్ఘకాలిక పొదుపుతో పాటు పన్ను ప్రయోజనాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ దీర్ఘకాలిక పొదుపు లక్ష్యాలతో రూపొందించిన పథకం. అర్హులైన భారతీయ నివాసితులు బ్యాంకు లేదా తపాలా కార్యాలయంలో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఎన్‌ఆర్‌ఐలకు కొత్త ఖాతా ప్రారంభించే అవకాశం ఉండదు. ఈ పథకం కాలపరిమితి 15 సంవత్సరాలు. సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు. ఒకేసారి లేదా విడతలవారీగా పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం పేర్కొన్న వడ్డీ రేటు సంవత్సరానికి 7.1 శాతం. ఈ పథకంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద వర్తించే నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే కొత్త పన్ను విధానంలో ఈ ప్రయోజనం సాధారణంగా అందుబాటులో ఉండదు. పాత పన్ను విధానంలో అర్హతకు లోబడి ప్రయోజనం లభిస్తుంది. ఖాతా ప్రారంభించిన 3వ ఆర్థిక సంవత్సరం నుంచి 6వ ఆర్థిక సంవత్సరం వరకు నిబంధనలకు అనుగుణంగా రుణం పొందవచ్చు. 6వ ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక నగదు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 2. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) పెట్టుబడి మొత్తం రెట్టింపు కావాలనుకునేవారికి కిసాన్ వికాస్ పత్ర పథకం నిర్దిష్ట కాలవ్యవధిలో పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేసుకునే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం పెట్టుబడి మొత్తం రెట్టింపు కావడానికి 115 నెలలు, అంటే సుమారు 9 సంవత్సరాల 7 నెలలు పడుతుంది. దీర్ఘకాలం పాటు డబ్బును భద్రపరచాలనుకునేవారికి ఇది పరిశీలించదగిన పథకం. అయితే ఈ పథకంలో పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు లభించదు. పెట్టుబడిపై వచ్చే వడ్డీకి వర్తించే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 3. సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) ఆడపిల్లల విద్య, వివాహ ఖర్చులకు దీర్ఘకాలిక పొదుపు ఆడపిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన. 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్ల పేరిట తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా ప్రారంభించినప్పటి నుంచి 21 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. అయితే మొదటి 15 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడులు జమ చేయాలి. సంవత్సరానికి కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు పొదుపు చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో అర్హతకు లోబడి ఆదాయపు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఉన్నత విద్య కోసం అవసరమైన ఖర్చులకు నిబంధనల ప్రకారం ఖాతాలోని మొత్తంలో 50 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. వివాహం వంటి అవసరాలకు కూడా నిర్దేశిత నిబంధనలు వర్తిస్తాయి. దీర్ఘకాలికంగా పొదుపు చేస్తూ ఆడపిల్ల చదువు, భవిష్యత్తు అవసరాల కోసం నిధిని సమకూర్చుకోవాలనుకునే కుటుంబాలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. 4. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ (ఎంఐఎస్‌) ఒకేసారి పెట్టుబడి.. ప్రతి నెలా వడ్డీ ఆదాయం పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునేవారికి తపాలా శాఖ నెలవారీ ఆదాయ పథకం అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఇందులో ఒకే విడతలో పెట్టుబడి పెట్టాలి. వ్యక్తిగత ఖాతాలో గరిష్ఠంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో గరిష్ఠంగా రూ.15 లక్షలు జమ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. వడ్డీని ప్రతి నెలా చెల్లిస్తారు. ఉదాహరణకు, ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.1,11,000 వడ్డీ వస్తుంది. అంటే నెలకు సుమారు రూ.9,250 ఆదాయం పొందవచ్చు. పదవీ విరమణ చేసినవారు, క్రమమైన ఆదాయం కోరుకునేవారు లేదా తమ పొదుపు మొత్తంపై నెలవారీ వడ్డీ పొందాలనుకునేవారు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు. అయితే వడ్డీ ఆదాయంపై వర్తించే పన్ను నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 5. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) వృద్ధులకు త్రైమాసిక వడ్డీతో ఆర్థిక భరోసా 60 సంవత్సరాలు నిండినవారి కోసం రూపొందించిన ప్రత్యేక పొదుపు పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌. సాధారణంగా అర్హులైన 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో వడ్డీని ప్రతి 3 నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేస్తారు. గరిష్ఠంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు, సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ ప్రకారం ప్రతి త్రైమాసికానికి సుమారు రూ.61,500 వడ్డీ లభిస్తుంది. పదవీ విరమణ తర్వాత క్రమమైన ఆదాయం అవసరమయ్యేవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు అర్హతలు, ముందస్తు ఖాతా మూసివేత నిబంధనలు, పన్ను ప్రయోజనాలను పరిశీలించడం అవసరం. NOTE: పెట్టుబడి పెట్టే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు పైన పేర్కొన్న వడ్డీ రేట్లు 2026 అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి వర్తించే రేట్లు. కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను త్రైమాసికాలవారీగా సమీక్షిస్తుంది. కాబట్టి ఖాతా ప్రారంభించే సమయంలో తాజా రేట్లను, పెట్టుబడి పరిమితులను, ఉపసంహరణ నిబంధనలను అధికారికంగా నిర్ధారించుకోవాలి. కొన్ని చిన్న తపాలా కార్యాలయాల్లో అన్ని పథకాల వివరాలు వెంటనే అందుబాటులో లేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో సమీపంలోని పెద్ద తపాలా కార్యాలయాన్ని లేదా ప్రధాన తపాలా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. తమ వయసు, ఆదాయం, కుటుంబ అవసరాలు, పెట్టుబడి కాలపరిమితిని బట్టి సరైన పథకాన్ని ఎంచుకోవడం ముఖ్యం.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
11 రోజుల క్రితం
Logo

Kulkarni Rajaprabhakar Rao: కన్నీటి సంద్రంలో వెలిగిన సూర్యుడు

కష్టాల నుంచి కీర్తి పథం.. అనుభవమే ప్రజాసేవకు పునాది.. కష్టజీవి నుంచి ప్రజానాయకుడిగా.. కొడంగల్ కోసం ఓ సంకల్ప ప్రయాణం! తాను పడ్డ కష్టాలు మరొకరికి రాకూడదనే సంకల్పం పుట్టిపెరిగిన ఊరు కన్నీళ్లు తుడవాలన్న తపన.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆశయం!.. ఉచిత విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యం పేదరికం తెలిసిన మనసు.. ప్రజల భవిష్యత్తు మార్చాలనే తపన! సేవే లక్ష్యంగా సాగుతున్న కులకర్ణి రాజప్రభాకర్ రావు ప్రస్థానం.. ‘స్టార్ త్రినేత్రం’తో తన అనుభవాలు పంచుకున్న టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ‘కులకర్ణి రాజప్రభాకర్ రావు' Kulkarni Rajaprabhakar: బాల్యంలో...

కష్టాల నుంచి కీర్తి పథం.. అనుభవమే ప్రజాసేవకు పునాది.. కష్టజీవి నుంచి ప్రజానాయకుడిగా.. కొడంగల్ కోసం ఓ సంకల్ప ప్రయాణం! తాను పడ్డ కష్టాలు మరొకరికి రాకూడదనే సంకల్పం పుట్టిపెరిగిన ఊరు కన్నీళ్లు తుడవాలన్న తపన.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆశయం!.. ఉచిత విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యం పేదరికం తెలిసిన మనసు.. ప్రజల భవిష్యత్తు మార్చాలనే తపన! సేవే లక్ష్యంగా సాగుతున్న కులకర్ణి రాజప్రభాకర్ రావు ప్రస్థానం.. ‘స్టార్ త్రినేత్రం’తో తన అనుభవాలు పంచుకున్న టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ‘కులకర్ణి రాజప్రభాకర్ రావు' Kulkarni Rajaprabhakar: బాల్యంలో ఎదురైన కష్టాలు.. చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులు.. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన రోజులు.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయని మనస్తత్వం.. తాను అనుభవించిన కష్టాలు మరొకరు పడకూడదనే ఆలోచనతో ప్రజాసేవ వైపు అడుగులు.. ఉచిత విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలనే ఆశయం.. కొడంగల్ ప్రాంత ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పం! ఇవన్నీ కలగలిసిన వ్యక్తిత్వం ‘కులకర్ణి రాజప్రభాకర్ రావు’. జీవితంలో ఎదురైన అనుభవాలను కేవలం జ్ఞాపకాలుగా మిగిల్చుకోకుండా, వాటిని సమాజానికి ఉపయోగపడే ఆలోచనలుగా మార్చుకోవాలనే తపన కొందరిలోనే కనిపిస్తుంది. తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఇతరులకు ఎదురుకాకూడదని భావిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్న వారిలో కులకర్ణి రాజప్రభాకర్ రావు ఒకరు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆయన, తన జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాల నుంచి ప్రజాసేవ పట్ల ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు. ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యంతో పాటు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు మారాలనే ఆకాంక్షను తన రాజకీయ ఆలోచనల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తిమ్మారెడ్డిపల్లి నుంచి మొదలైన ప్రయాణం.. కులకర్ణి రాజప్రభాకర్ రావు వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం, దౌల్తాబాద్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. సంజయ్ రావు, మనోహరమ్మ దంపతులకు జన్మించిన ఆయన.. బాల్యం గ్రామీణ వాతావరణంలో గడిచింది. ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దడంలో కుటుంబ నేపథ్యం, చిన్ననాటి అనుభవాలు, విద్యాభ్యాసం కీలక పాత్ర పోషిస్తాయి. రాజప్రభాకర్ రావు జీవిత ప్రయాణంలోనూ ఈ అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చిన్నతనం నుంచే జీవితంలోని వాస్తవ పరిస్థితులను దగ్గరగా చూసిన అనుభవం, భవిష్యత్తులో తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలనే ఆలోచనకు పునాది వేసింది. పరిస్థితులకు అనుగుణంగా సాగిన విద్యాభ్యాసం.. రాజప్రభాకర్ రావు విద్యాభ్యాసం ఒకే ప్రాంతానికి పరిమితం కాలేదు. 6వ తరగతి వరకు దౌల్తాబాద్ మండలంలోని గోకాఫాసాల్‌వాద్ గ్రామంలో చదువుకున్నారు. అనంతరం 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బాలంపేట్‌లో విద్యను కొనసాగించారు. పదో తరగతిని మద్దూరులో 1999-2000 విద్యా సంవత్సరంలో పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో చదువుకోవడం ద్వారా విద్యార్థి దశలోనే భిన్నమైన వాతావరణాలను పరిచయం చేసుకునే అవకాశం ఆయనకు లభించింది. పదో తరగతి అనంతరం మహబూబ్‌నగర్‌లో ఇంటర్ విద్యను ప్రారంభించారు. అయితే, 2001లో చదువును మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనుకున్న మార్గంలోనే ముందుకు సాగేందుకు అవకాశాలు ఉండవు. కొన్నిసార్లు పరిస్థితులు మనిషిని వేరే దారిలో నడిపిస్తాయి. రాజప్రభాకర్ రావు జీవితంలోనూ విద్యాభ్యాసానికి విరామం పలకాల్సి రావడం అలాంటి ఒక మలుపుగా నిలిచింది. విద్యార్థి నుంచి హైదరాబాద్‌లో ఆఫీస్ బాయ్‌గా.. చదువును ఆపిన అనంతరం రాజప్రభాకర్ రావు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఆఫీస్ బాయ్‌గా పనిచేశారు. విద్యార్థి జీవితం నుంచి ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టిన ఆ దశ ఆయన ప్రయాణంలో కీలకమైనది. జీవితంలో ముందుకు సాగాలంటే కష్టపడటం తప్పనిసరనే వాస్తవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం ఈ కాలంలో ఆయనకు లభించింది. చదువును కొనసాగించాలనే వయసులోనే జీవనోపాధి కోసం ఉద్యోగం చేయాల్సి రావడం అనేక మంది యువత ఎదుర్కొనే పరిస్థితులను గుర్తు చేస్తుంది. ఆర్థిక, కుటుంబ లేదా ఇతర కారణాలతో విద్యకు దూరమయ్యే యువత భవిష్యత్తుపై ఇటువంటి అనుభవాలు ఆలోచింపజేస్తాయి. రాజప్రభాకర్ రావు తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకుంటూ, తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదనే ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఆలోచనే ఆయన ప్రజాసేవ ప్రయాణానికి ఒక ముఖ్యమైన పునాదిగా మారింది. 2009లో కేఆర్‌పీ యువసేన స్థాపన.. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పానికి ఒక సంస్థాగత రూపం ఇవ్వాలనే ఉద్దేశంతో రాజప్రభాకర్ రావు 2009లో కులకర్ణి రాజప్రభాకర్ (కేఆర్‌పీ) యువసేనను స్థాపించారు. కేఆర్‌పీ యువసేనగా పిలిచే ఈ సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం. వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న కష్టాలు ఇతరులకు ఎదురుకాకూడదనే భావనతో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. సమాజంలో వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు అండగా నిలవడం, అవసరమైన వారికి సహాయం చేయాలనే ఆలోచనతో ప్రజాజీవితంలో తనదైన పాత్ర పోషించాలని ఆయన భావించారు. ఒక వ్యక్తి తన జీవిత అనుభవాలను సమాజ ప్రయోజనానికి అనుసంధానించాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. రాజప్రభాకర్ రావు తన పేరుతోనే యువసేనను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని ఒక వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నించారు. యువసేన స్థాపనతో ఆయన ప్రయాణం వ్యక్తిగత జీవనోపాధి, స్వీయ అభివృద్ధి అనే పరిధిని దాటి ప్రజా సమస్యలపై దృష్టి సారించే దిశగా సాగింది. ప్రజల అవసరాలు ఏమిటి? వారికి ఏ విధమైన సహాయం అవసరం? సమాజంలో ఎదురవుతున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి? అనే అంశాలపై పనిచేయాలనే ఆలోచనకు ఈ వేదిక ఒక రూపంగా నిలిచింది. బీజేపీలోకి అడుగు.. రాజకీయ ప్రస్థానానికి కొత్త దిశ ప్రజాసేవను మరింత విస్తృతంగా కొనసాగించాలనే ఆలోచనతో రాజప్రభాకర్ రావు 2022లో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజకీయ పార్టీ ద్వారా ప్రజల సమస్యలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు, తన ఆలోచనలకు విస్తృతమైన వేదికను కల్పించుకునేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించడం ఒక కోణమైతే, వాటిని మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయడం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం రాజకీయ వ్యవస్థలో పనిచేయడం మరో కోణం. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అయితే, తాను చేస్తున్న మంచి పనులకు పార్టీలో తగిన గుర్తింపు లభించలేదని రాజప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు. స్థానిక నాయకులు తన సేవా కార్యక్రమాల వివరాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితుల కారణంగా తాను ఆశించిన గుర్తింపు, ప్రోత్సాహం లభించలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలతో పాటు, ఆ ప్రయత్నాలకు సంస్థాగతంగా లభించే గుర్తింపు కూడా కీలకమని ఆయన అనుభవం చెబుతోంది. తెలంగాణ రక్షణ సేనలో చేరిక.. ఉచిత విద్య, వైద్యమే ప్రధాన లక్ష్యం బీజేపీలో తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించలేదని తెలుసుకున్న అనంతరం ఇటీవల తెలంగాణ రక్షణ సేనలో చేరినట్లు రాజప్రభాకర్ రావు తెలిపారు. తనకు తగిన గుర్తింపు లభించకపోవడం, ప్రజాసేవా కార్యక్రమాలకు అవసరమైన ప్రాధాన్యం దక్కలేదనే భావన ఈ నిర్ణయానికి కారణమని వివరించారు. తెలంగాణ రక్షణ సేనలోని పాంచజన్యాల కార్యక్రమాల్లో భాగంగా ఉచిత విద్య, ఉచిత వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన తనను ఆకర్షించిందని పేర్కొన్నారు. విద్య, వైద్యం అనేవి ప్రతి కుటుంబ జీవితానికీ నేరుగా సంబంధించిన అంశాలు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆకాంక్ష ప్రతి తల్లిదండ్రిలోనూ ఉంటుంది. అదే సమయంలో అనారోగ్యం ఎదురైనప్పుడు వైద్య ఖర్చులు కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ రెండు రంగాల్లో ఎదురయ్యే ఇబ్బందులు మరింత భారంగా మారుతాయి. ఇటువంటి సమస్యలకు పరిష్కారాలు చూపాలనే లక్ష్యంతో ఉచిత విద్య, వైద్యం అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజప్రభాకర్ రావు భావిస్తున్నారు. తన రాజకీయ ప్రయాణంలో పార్టీలు మారడం కంటే, ప్రజలకు ఉపయోగపడే లక్ష్యాలను సాధించడానికి ఏ వేదిక ద్వారా కృషి చేయగలననే అంశానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టంగా చెప్పారు. విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే తన ఆకాంక్షను కార్యరూపంలోకి తీసుకురావడమే ముందున్న లక్ష్యమని చెప్పారు. కొడంగల్ స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి.. కొడంగల్ నియోజకవర్గం గురించి రాజప్రభాకర్ రావు ప్రస్తావిస్తున్న మరో ముఖ్యమైన అంశం స్థానిక నాయకత్వం. తన అభిప్రాయం ప్రకారం, కొడంగల్‌లో పోటీ చేయడానికి పక్క నియోజకవర్గాల నుంచి నాయకులు రావడం జరుగుతోందని, స్థానిక ప్రాంతానికి చెందిన నాయకులకు తగిన ప్రాధాన్యం లభించాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. స్థానిక ప్రజల సమస్యలు, వారి జీవన పరిస్థితులు, ప్రాంతీయ అవసరాలపై అవగాహన కలిగిన వ్యక్తులు ముందుకు రావాలనే ఉద్దేశంతో తాను రాజకీయ రంగంలోకి వచ్చానని చెబుతున్నారు. స్థానిక సమస్యలపై పనిచేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, కొడంగల్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు అక్కడి ప్రజలకు ఎదురవుతున్న వాస్తవ సమస్యలను గుర్తించడం, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడం అవసరం. స్థానిక నాయకత్వం, ప్రజల భాగస్వామ్యం, విద్య, వైద్యం, ఉపాధి వంటి అంశాలు ప్రాంత అభివృద్ధిలో కీలకమైనవిగా నిలుస్తాయి. కొడంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తన వంతు పాత్ర పోషించాలని, స్థానిక ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాజప్రభాకర్ రావు భావిస్తున్నారు. రాజకీయాల్లో తన ప్రస్థానానికి ప్రాంతీయ సమస్యల పరిష్కారాన్ని ఒక ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఆయన వెల్లడించిన అభిప్రాయాలు సూచిస్తున్నాయి. వలసలు ఆగాలి.. స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరగాలి కొడంగల్ ప్రజలకు తన సందేశం ఏమిటని అడిగినప్పుడు రాజప్రభాకర్ రావు స్పష్టంగా ప్రస్తావించిన అంశం వలసలు ఆగాలనేది. ఉపాధి, జీవనోపాధి కోసం ప్రజలు తమ గ్రామాలను, కుటుంబాలను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు తగ్గాలని ఆయన కోరుకుంటున్నారు. కుటుంబానికి దూరంగా ఉండటం, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలు, జీవన వ్యయాలు వంటి అంశాలు వలస వెళ్లే అనేక మందికి సవాళ్లుగా మారుతాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగితే ప్రజలు తమ స్వగ్రామాల్లోనే జీవనోపాధిని కొనసాగించేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. వలసల సమస్యను పరిష్కరించాలంటే స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, విద్యకు ప్రోత్సాహం, ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాల విస్తరణ వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ దిశగా కొడంగల్ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన జీవనావకాశాలు ఏర్పడాలని రాజప్రభాకర్ రావు ఆకాంక్షిస్తున్నారు. ప్రజలు తమ కుటుంబాలతో కలిసి స్వగ్రామాల్లోనే గౌరవప్రదమైన జీవితం గడపగలగాలనేది ఆయన సందేశంలోని ప్రధాన భావం. ఉచిత విద్య, వైద్యం.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆకాంక్ష కొడంగల్ ప్రజల కోసం ఏ పని చేస్తే సంతృప్తిగా ఉంటుందని అడిగినప్పుడు, విద్య, వైద్యం ఉచితంగా అందుబాటులోకి రావాలని రాజప్రభాకర్ రావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, అవసరమైన వైద్య సేవలు ఆర్థిక భారం లేకుండా అందితే అనేక కుటుంబాలకు ఉపశమనం లభిస్తుందని ఆయన అభిప్రాయం. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తే, ఆరోగ్యకరమైన జీవనానికి వైద్యం పునాది అవుతుంది. పేదరికం కారణంగా పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకూడదని, వైద్య ఖర్చుల భయంతో ఎవరూ అవసరమైన చికిత్సకు దూరం కాకూడదనే ఆలోచన ఆయన లక్ష్యాల్లో ప్రతిఫలిస్తోంది. తన జీవితంలో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చిన అనుభవం ఉండటంతో విద్య ప్రాధాన్యంపై ఆయనకు ప్రత్యేకమైన అవగాహన ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే, ఈ లక్ష్యాలను అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ, వనరులు, ప్రభుత్వ విధానాలు, సంబంధిత సంస్థల సహకారం వంటి అంశాలు కూడా కీలకమవుతాయి. ఉచిత విద్య, వైద్యం అనే లక్ష్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొడంగల్ ప్రాంతంలో సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ లక్ష్యాల సాధన కోసం భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపడతారనేది ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రాధాన్యం సంతరించుకోనుంది. అనుభవాల నుంచి ఆశయాల వరకు.. ముందున్న ప్రయాణం కులకర్ణి రాజప్రభాకర్ రావు జీవిత ప్రయాణాన్ని పరిశీలిస్తే, విద్యార్థి దశ నుంచి ఉద్యోగ జీవితం వరకు ఎదురైన అనుభవాలు, 2009లో కేఆర్‌పీ యువసేన స్థాపన, 2022లో బీజేపీలో చేరిక, ఇటీవల తెలంగాణ రక్షణ సేనలోకి అడుగుపెట్టడం వంటి కీలక ఘట్టాలు కనిపిస్తాయి. ఈ ప్రయాణంలో ప్రజాసేవను ప్రధాన అంశంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. కొడంగల్ ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావడం, వలసల సమస్య తగ్గడం తన లక్ష్యాల్లో ముఖ్యమైనవని చెబుతున్నారు. ఒక వ్యక్తి రాజకీయ ప్రస్థానం ఆయన ఆశయాలతో పాటు వాటిని అమలు చేసేందుకు చేపట్టే కార్యాచరణ ద్వారా కూడా అంచనా వేయబడుతుంది. రాజప్రభాకర్ రావు ముందున్న సవాలు తన ఆలోచనలను ఆచరణాత్మక ప్రణాళికలుగా మార్చడం, ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించడం, వాటి ఫలితాలను ప్రజలకు అందించడం. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడం ద్వారా తన లక్ష్యాలకు మరింత స్పష్టమైన రూపాన్ని ఇవ్వవచ్చు. తాను ఎదుర్కొన్న కష్టాలు ఇతరులకు ఎదురుకాకూడదనే ఆలోచనతో ప్రారంభమైన ఆయన ప్రజాసేవా సంకల్పం, ఇప్పుడు కొడంగల్ ప్రాంత అభివృద్ధి, ఉచిత విద్య, వైద్యం, వలసల నివారణ వంటి అంశాల చుట్టూ సాగుతోంది. ఈ ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ఆయన ఎలాంటి అడుగులు వేస్తారు? స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ఏ విధమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు? అన్నది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను ప్రజలకు ఉపయోగపడే మార్పుగా మలచాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న కులకర్ణి రాజప్రభాకర్ రావు రాజకీయ ప్రయాణంలో, ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలనే ఆకాంక్షతో పాటు వలసలు తగ్గి స్థానికంగా మెరుగైన జీవనావకాశాలు ఏర్పడాలనే లక్ష్యం ప్రధానంగా నిలుస్తోంది. ఈ లక్ష్యాల సాధన దిశగా ఆయన చేసే ప్రయత్నాలే భవిష్యత్తులో ఆయన ప్రజా ప్రస్థానానికి కీలకంగా నిలవనున్నాయి. ALSO READ: Khairatabad: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
12 రోజుల క్రితం
Logo

Khairatabad: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Khairatabad: ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇంద్రనగర్, జూబ్లీహిల్స్ డివిజన్ బస్తీల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 9 రోజుల బతుకమ్మ సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. వాడవాడలా, బస్తీబస్తీలో పండుగ వాతావరణం నెలకొనగా, స్థానిక మహిళలు, బస్తీవాసులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేలా నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజుల బతుకమ్మ వేడుకల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఇన్‌చార్జ్‌లు గీత గౌడ్, డీకొండ కవిత, సోనిక చామకూర బస్తీవాసులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో పండుగకు ప్రత్యేక శోభ...

Khairatabad: ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇంద్రనగర్, జూబ్లీహిల్స్ డివిజన్ బస్తీల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 9 రోజుల బతుకమ్మ సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. వాడవాడలా, బస్తీబస్తీలో పండుగ వాతావరణం నెలకొనగా, స్థానిక మహిళలు, బస్తీవాసులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేలా నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజుల బతుకమ్మ వేడుకల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఇన్‌చార్జ్‌లు గీత గౌడ్, డీకొండ కవిత, సోనిక చామకూర బస్తీవాసులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో పండుగకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. రానున్న రోజుల్లోనూ నియోజకవర్గంలోని వివిధ బస్తీల్లో బతుకమ్మ వేడుకలను కొనసాగించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ALSO READ: Nagaram Division: ఎంగిలి పూల బతుకమ్మ సంబరాల్లో ఏనుగు సుదర్శన్ రెడ్డి
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
12 రోజుల క్రితం
Logo

Nagaram Division: ఎంగిలి పూల బతుకమ్మ సంబరాల్లో ఏనుగు సుదర్శన్ రెడ్డి

Nagaram Division: నాగారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సంబరాలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. కాలనీవాసుల ఆహ్వానం మేరకు బీజేపీ నాయకుడు, మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకుంటుండగా, ఆయన వారితో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ఆత్మీయంగా ముచ్చటించి, సోదరీ సోదరుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు పీవీఆర్ (పోతంశెట్టి వెంకటేశ్వర రావు), మామిడి జంగా రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్య...

Nagaram Division: నాగారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సంబరాలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. కాలనీవాసుల ఆహ్వానం మేరకు బీజేపీ నాయకుడు, మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకుంటుండగా, ఆయన వారితో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ఆత్మీయంగా ముచ్చటించి, సోదరీ సోదరుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు పీవీఆర్ (పోతంశెట్టి వెంకటేశ్వర రావు), మామిడి జంగా రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్య శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కర్ర వెంకటేశ్వర్, నాగ మల్లేశ్వర్ పాల్గొన్నారు. ALSO READ: Interesting Fact: భార్య.. భర్తకు రాఖీ కట్టవచ్చా?.. పురాణాల్లో ఏముంది..?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
15 రోజుల క్రితం
Logo

Telangana: రైతుల కోసం టోల్‌ఫ్రీ సేవలు

ఒక్క ఫోన్‌తో వ్యవసాయ సందేహాలకు పరిష్కారం తెలుగులోనే వ్యవసాయ సలహాలు రైతులకు అందుబాటులో కిసాన్‌ హెల్ప్‌లైన్‌ వాతావరణ హెచ్చరికల నుంచి పంటల సలహాల వరకు.. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు టోల్‌ఫ్రీ సేవలు Telangana: అరచేతిలోని మొబైల్‌ ఫోన్‌తోనే రైతులు తమ వ్యవసాయ సందేహాలకు సమాధానాలు పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పంటలకు తెగుళ్లు సోకడం, ఎరువులను ఎంత మోతాదులో వినియోగించాలి, విత్తనాల ఎంపిక, పురుగుమందుల వాడకం, ఆధునిక సాగు పద్ధతులు వంటి అంశాలపై రైతులు ఇకపై ప్రత్యేకంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా హెల్ప్‌లైన్‌ ద్వారా సలహాలు పొందవచ్చు. పంటకు...

  • ఒక్క ఫోన్‌తో వ్యవసాయ సందేహాలకు పరిష్కారం
  • తెలుగులోనే వ్యవసాయ సలహాలు
  • రైతులకు అందుబాటులో కిసాన్‌ హెల్ప్‌లైన్‌
  • వాతావరణ హెచ్చరికల నుంచి పంటల సలహాల వరకు..
  • ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు టోల్‌ఫ్రీ సేవలు
Telangana: అరచేతిలోని మొబైల్‌ ఫోన్‌తోనే రైతులు తమ వ్యవసాయ సందేహాలకు సమాధానాలు పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పంటలకు తెగుళ్లు సోకడం, ఎరువులను ఎంత మోతాదులో వినియోగించాలి, విత్తనాల ఎంపిక, పురుగుమందుల వాడకం, ఆధునిక సాగు పద్ధతులు వంటి అంశాలపై రైతులు ఇకపై ప్రత్యేకంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా హెల్ప్‌లైన్‌ ద్వారా సలహాలు పొందవచ్చు. పంటకు సంబంధించిన ఏదైనా సమస్య ఎదురైనా, ప్రభుత్వ వ్యవసాయ పథకం అందకపోయినా 1800-180-1551 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి అవసరమైన సమాచారం, సూచనలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ సేవలో తెలుగులోనే రైతుల సందేహాలను నివృత్తి చేయడం ప్రత్యేకతగా నిలుస్తోంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2004 నుంచి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కిసాన్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రం తెలంగాణ రైతులకు కూడా సేవలు అందిస్తోంది. హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనర్‌, సంచాలకుల కార్యాలయంలో ఈ కేంద్రం పనిచేస్తోంది. పంటలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాంకేతిక సాగు విధానాలకు సంబంధించి రైతులకు కిసాన్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రం ద్వారా అవసరమైన సలహాలు అందుతున్నాయి. పంటలకు సంబంధించిన శాస్త్రీయ అంశాలపై శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంతో రైతులకు సూచనలు పొందే అవకాశం ఉంది. ఏ పంటకు ఎలాంటి విత్తనాలు అనుకూలం, ఎరువులను ఏ మోతాదులో వినియోగించాలి, పురుగుమందులను ఎలా ఉపయోగించాలి, మార్కెట్‌లో పంటలకు లభిస్తున్న ధరలు వంటి విషయాలపై కూడా రైతులు వివరాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు, వాటి ద్వారా లభించే ప్రయోజనాలు, పథకాలకు సంబంధించిన సందేహాలను కూడా హెల్ప్‌లైన్‌ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. అర్హత ఉన్నప్పటికీ ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనం అందకపోతే ఆ సమస్యను కూడా సంబంధిత హెల్ప్‌లైన్‌ ద్వారా తెలియజేసే అవకాశం ఉంది. రైతులకు సలహాలు, సమాచారం అందించడంతోపాటు వారి సమస్యలు, ఫిర్యాదులను నమోదు చేసుకునేందుకు కూడా కిసాన్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రం ఉపయోగపడుతోంది. రైతుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఇదే డిజిటల్‌ వేదికపై అందుబాటులో ఉంచారు. రైతులు తమ సమస్యను నమోదు చేసిన తర్వాత దాని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఈ కేంద్రం సహకరిస్తుంది. వ్యవసాయంతోపాటు పశువుల ఆరోగ్యం, వాటి పోషణకు సంబంధించిన అంశాలపై కూడా రైతులు సలహాలు పొందవచ్చు. వాతావరణ శాఖ అందించే సూచనల ఆధారంగా వాతావరణ పరిస్థితులు, ప్రకృతి విపత్తులకు సంబంధించిన హెచ్చరికలు, ఇతర అవసరమైన సమాచారాన్ని కూడా హెల్ప్‌లైన్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. కేంద్ర ఎరువుల యాప్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, సందేహాలకు కూడా ఈ సేవ ద్వారా పరిష్కారం పొందవచ్చు. రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కిసాన్‌ హెల్ప్‌లైన్‌ సేవలు వారంలో 7 రోజులూ అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రైతులు 1800-180-1551 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి తమకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని పొందవచ్చు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ సేవలపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి రైతుకూ ఈ టోల్‌ఫ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయం తెలియజేసేలా క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని వ్యవసాయ శాఖ సంచాలకులు డా.బీ.గోపి, ఐఏఎస్‌ సూచించారు. పంటల సాగు నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు సమస్యలకు పరిష్కారం పొందేందుకు రైతులు ఈ హెల్ప్‌లైన్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ALSO READ: Interesting Fact: భార్య.. భర్తకు రాఖీ కట్టవచ్చా?.. పురాణాల్లో ఏముంది..?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
29 రోజుల క్రితం
Logo

Veleru: కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనం

స్టార్ త్రినేత్రం, హన్మకొండ: హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో బుధవారం గణేశ్ నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడికి నిమజ్జనానికి ముందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుడిని శోభాయాత్రగా తరలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. https://twitter.com/i/status/2103149407646666907 గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో యువతులు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో సందడి చేశారు. గణపతి నామస్మరణలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. 9 రోజుల...

స్టార్ త్రినేత్రం, హన్మకొండ: హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో బుధవారం గణేశ్ నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడికి నిమజ్జనానికి ముందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుడిని శోభాయాత్రగా తరలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. https://twitter.com/i/status/2103149407646666907 గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో యువతులు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో సందడి చేశారు. గణపతి నామస్మరణలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. 9 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ భక్తులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి నిర్వహకులు, భక్తులు పాల్గొని గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ALSO READ: SI Muthyam Rajender: కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా.. రాయపర్తి ఎస్సై సక్సెస్ స్టోరీ
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
9 రోజుల క్రితం
Logo

SI Muthyam Rajender: కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా.. రాయపర్తి ఎస్సై సక్సెస్ స్టోరీ

జనం నమ్మకమే పోలీసులకు బలం.. ఒక్క కెమెరా ఎన్నో నేరాలకు చెక్.. నేరగాడి అడుగుపై నిఘా.. గ్రామానికి భరోసా.. అప్రమత్తతే ఆయుధం.. సీసీ కెమెరానే కవచం.. మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం.. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి.. యువత మత్తు పదార్థాల వల్ల చిక్కదు.. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపొద్దు.. ప్రాణం విలువ తెలుసుకొని జీవిద్దాం.. నేర రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. "స్టార్ త్రినేత్రం"తో ఎస్సై ముత్యం రాజేందర్ ముత్యాల్లాంటి సూచనలు.. SI Muthyam Rajender: పోలీసు ఉద్యోగం అంటే కేవలం నేరం జరిగిన తర్వాత కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవడం మాత్రమే...

  • జనం నమ్మకమే పోలీసులకు బలం..
  • ఒక్క కెమెరా ఎన్నో నేరాలకు చెక్..
  • నేరగాడి అడుగుపై నిఘా.. గ్రామానికి భరోసా..
  • అప్రమత్తతే ఆయుధం.. సీసీ కెమెరానే కవచం..
  • మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం..
  • సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి..
  • యువత మత్తు పదార్థాల వల్ల చిక్కదు..
  • అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపొద్దు..
  • ప్రాణం విలువ తెలుసుకొని జీవిద్దాం..
  • నేర రహిత సమాజాన్ని నిర్మిద్దాం..
  • "స్టార్ త్రినేత్రం"తో ఎస్సై ముత్యం రాజేందర్ ముత్యాల్లాంటి సూచనలు..
SI Muthyam Rajender: పోలీసు ఉద్యోగం అంటే కేవలం నేరం జరిగిన తర్వాత కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవడం మాత్రమే కాదు.. నేరం జరగకుండా ముందే ప్రజలను అప్రమత్తం చేయడం, యువతను చెడు మార్గాలకు దూరంగా ఉంచడం, మహిళల్లో భద్రతపై నమ్మకాన్ని పెంచడం, సమాజంలో శాంతిభద్రతల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడం కూడా పోలీసు వ్యవస్థలో కీలకమైన బాధ్యతే. ఈ ఆలోచనతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు చేరువగా ఉంటున్న అధికారుల్లో రాయపర్తి సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ ముత్యం రాజేందర్ ఒకరు. సాధారణ గ్రామీణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన డిగ్రీ చివరి సంవత్సరంలోనే కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో అడుగుపెట్టారు. అక్కడితో ఆగిపోకుండా ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో నిరంతరం కష్టపడి 2020లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఎస్సైగా తొలి పోస్టింగ్ వరంగల్‌లో పొందిన ఆయన ప్రస్తుతం రాయపర్తిలో గత 16 నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పాఖాల కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామంలో 15/06/1992న జన్మించిన ముత్యం రాజేందర్ చిన్ననాటి నుంచే గ్రామీణ వాతావరణంలో పెరిగారు. స్వగ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన ఆయన అనంతరం నర్సంపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తి చేశారు. చదువుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగిన ఆయనకు డిగ్రీ చివరి సంవత్సరంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజేందర్.. ఉద్యోగం చేస్తూనే చదువు, కృషి, పట్టుదలను కొనసాగించారు. చివరకు 2020లో ఎస్సైగా ఎంపికై తన లక్ష్యాన్ని చేరుకున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు పట్టుదలతో కృషి చేస్తే పోలీసు శాఖలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఆయన ప్రయాణం నిరూపిస్తోంది. ప్రస్తుతం రాయపర్తి ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముత్యం రాజేందర్ నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తత, సైబర్ మోసాల నివారణ, మహిళల భద్రత, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన, యువతను సన్మార్గంలో నడిపించడం, రోడ్డు ప్రమాదాల నియంత్రణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాయపర్తిలో పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, శివారు ప్రాంతాలపై నిఘా పెడుతున్నారు. ఇలాంటి అనేక అంశాలపై ‘స్టార్ త్రినేత్రం’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎస్సై ముత్యం రాజేందర్ తన అనుభవాలను, ఆలోచనలను, ప్రజలకు ఇవ్వాలనుకున్న సందేశాలను పంచుకున్నారు. గ్రామ భద్రతకు సీసీ కెమెరాలే కీలక బలం.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి గ్రామం తన భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ముత్యం రాజేందర్ అన్నారు. పోలీసు శాఖ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఉంటే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో గ్రామ పెద్దలు, యువత, ప్రజలు కలిసి అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామానికి వచ్చే ప్రధాన మార్గాలు, బయటకు వెళ్లే రహదారులు, ప్రధాన కూడళ్లు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాల నియంత్రణకు అవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఏదైనా నేరం జరిగినప్పుడు దర్యాప్తులో సీసీ కెమెరా దృశ్యాలు కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉందని వివరించారు. రాయపర్తి పరిధిలోనూ సీసీ కెమెరాల ప్రాధాన్యతపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించిన సందర్భాలు ఉన్నాయి. గ్రామ పెద్దలు, యువత కలిసి ముందుకు రావాలి సీసీ కెమెరాల ఏర్పాటు కేవలం పోలీసు శాఖ బాధ్యతగా భావించకూడదని ఎస్సై రాజేందర్ అన్నారు. గ్రామ భద్రత అనేది గ్రామ ప్రజలందరి ఉమ్మడి బాధ్యతగా భావించాలని సూచించారు. గ్రామ పెద్దలు చొరవ తీసుకుని యువతను భాగస్వామ్యం చేస్తే ప్రతి గ్రామంలో బలమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామంలో ఎక్కడ సమస్యలు వస్తున్నాయి, ఏ ప్రాంతాల్లో నిఘా అవసరం ఉంది అనే విషయాలు స్థానిక ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. అందువల్ల గ్రామ పెద్దల అనుభవం, యువత ఉత్సాహం, ప్రజల సహకారం, పోలీసుల మార్గనిర్దేశం కలిస్తే నేరాలకు మరింత సమర్థంగా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. “మన గ్రామం- మన భద్రత” అనే ఆలోచన రావాలి.. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే నేరం జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని ముత్యం రాజేందర్ అన్నారు. ప్రతి గ్రామంలో “మన గ్రామం-మన భద్రత” అనే భావన పెరగాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామంలో నిఘా వ్యవస్థ బలపడటమే కాకుండా నేరాలకు పాల్పడే వారిలో కూడా భయం ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపించినప్పుడు ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రాయపర్తి పోలీసులు కూడా అనుమానాస్పద వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల సూచించారు. కొత్త పద్ధతుల్లో పెరుగుతున్న సైబర్ నేరాలు.. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో జరుగుతున్నాయని ఎస్సై రాజేందర్ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు మోసగాళ్ల మాటలు నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద సందేశాలు, లింకులు, ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే స్పందించకుండా ముందుగా పరిశీలించాలని చెప్పారు. ప్రజల అప్రమత్తత, అవగాహనే సైబర్ నేరాలను అడ్డుకోవడంలో కీలకమని పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు.. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ముత్యం రాజేందర్ తెలిపారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావడానికి అవసరమైన సహాయక వ్యవస్థలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థినులకు భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలకు సూచిస్తున్నామని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువత జీవితాలను నాశనం చేసే ప్రమాదం ఉందని ఎస్సై రాజేందర్ హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జాగృతి కళాబృందం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నామని చెప్పారు. మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడవాలి.. యువతే సమాజానికి భవిష్యత్తు అని ముత్యం రాజేందర్ అన్నారు. చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసైతే జీవిత లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, సమాజంలో మంచి గుర్తింపు సాధించే దిశగా యువత ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజ పెద్దలు కూడా యువతను సరైన మార్గంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. యువత మంచి మార్గంలో ఉంటే కుటుంబం, గ్రామం, సమాజం కూడా అభివృద్ధి దిశగా సాగుతుందని పేర్కొన్నారు. అవగాహనతో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు.. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల్లో నిరంతర అవగాహన అవసరమని ఎస్సై రాజేందర్ అన్నారు. రహదారిపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా యువత అత్యుత్సాహానికి దూరంగా ఉండాలని చెప్పారు. వేగం కోసం ప్రాణాలను పణంగా పెట్టకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రహదారి నిబంధనలు పాటించాలని సూచించారు. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణానికే కాకుండా కుటుంబం మొత్తాన్ని విషాదంలోకి నెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. రాయపర్తిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల్లోనూ ఆయన ఇదే అంశాలను ప్రజలకు వివరించారు. పోలీసు ఉద్యోగం.. బాధ్యతతో పాటు ఒత్తిడి పోలీసు ఉద్యోగంలో కుటుంబానికి సమయం కేటాయించడం చాలా కష్టంగా ఉంటుందని ముత్యం రాజేందర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. విధుల స్వభావం కారణంగా ఎప్పుడు ఏ బాధ్యత వస్తుందో ముందుగా చెప్పలేమని తెలిపారు. పండుగలు, సెలవులు, రాత్రి వేళలు అనే తేడా లేకుండా అవసరమైనప్పుడు విధులు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. కుటుంబ బాధ్యతలు ఒకవైపు, ఉద్యోగ బాధ్యతలు మరోవైపు ఉన్నప్పటికీ రెండింటినీ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగంలో ఒత్తిడి సహజమే అయినా దానిని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు సేవ చేయడమే తమ బాధ్యత అని తెలిపారు. సిబ్బంది తక్కువైనా.. విధుల్లో రాజీ లేదు పోలీసు శాఖలో సిబ్బంది కొరత, విధుల భారం ప్రధాన సవాళ్లలో ఒకటని ఎస్సై రాజేందర్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల సమస్యల పరిష్కారం, బందోబస్తులు, అవగాహన కార్యక్రమాలు వంటి అనేక బాధ్యతలను అందుబాటులో ఉన్న సిబ్బందితోనే నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ ప్రజల భద్రత విషయంలో రాజీపడకుండా విధులు నిర్వహించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పరిమిత వనరులతోనూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు, పోలీసులు కలిస్తేనే మరింత భద్రత నేరాల నియంత్రణ పోలీసుల ఒక్కరి బాధ్యత కాదని ముత్యం రాజేందర్ అన్నారు. ప్రజలు కూడా పోలీసులకు భాగస్వాములుగా మారాలని సూచించారు. సరైన సమయంలో సమాచారం అందితే అనేక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల్లో అప్రమత్తత పెరగాలని, అనుమానాస్పద అంశాలు కనిపించిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలు పోలీసులపై నమ్మకం ఉంచి సహకరిస్తే నేర రహిత, ప్రశాంత వాతావరణాన్ని మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి.. ఎస్సై స్థాయి వరకు ముత్యం రాజేందర్ ప్రయాణం చూస్తే లక్ష్యం, కృషి, పట్టుదల ఉంటే సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చనే విషయం స్పష్టమవుతుంది. డిగ్రీ చివరి సంవత్సరంలో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరి, ఉద్యోగ బాధ్యతలతో పాటు తన లక్ష్యాన్ని కొనసాగిస్తూ 2020లో ఎస్సైగా ఎదిగారు. ప్రస్తుతం రాయపర్తిలో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువగా ఉండటం, నేరాల నియంత్రణతో పాటు ముందస్తు అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన విధానంలో కనిపిస్తోంది. మొత్తంగా ఎస్సై ముత్యం రాజేందర్‌తో ‘స్టార్ త్రినేత్రం’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. పోలీసు వ్యవస్థ అంటే కేవలం నేరం జరిగిన తర్వాత స్పందించే వ్యవస్థ మాత్రమే కాదు.. ప్రజలతో కలిసి నేరం జరగకుండా ముందే అడ్డుకునే వ్యవస్థ కూడా. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నుంచి యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం వరకు, సైబర్ మోసాలపై అవగాహన నుంచి రోడ్డు భద్రత వరకు ప్రజల భాగస్వామ్యమే కీలకమని ఆయన వివరించారు. ప్రతి గ్రామం తన భద్రత విషయంలో బాధ్యత తీసుకుని ముందుకు వస్తే పోలీసులకు మరింత సహకారం లభిస్తుందని, నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని తెలిపారు. “మన గ్రామం-మన భద్రత” అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో పెరిగినప్పుడే సురక్షితమైన గ్రామాన్ని, ప్రశాంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నదే రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ ప్రధాన సందేశం. ALSO READ: Telangana: స్మార్ట్ రేషన్ కార్డు.. పేరుకే స్మార్ట్?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
11 రోజుల క్రితం
Logo

Telangana: స్మార్ట్ రేషన్ కార్డు.. పేరుకే స్మార్ట్?

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై లబ్ధిదారుల్లో కొత్త చర్చ మొదలైంది. పాత రేషన్ కార్డులతో పోలిస్తే ఆధునిక రూపంలో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో కొత్త కార్డులను అందిస్తున్న ప్రభుత్వం.. కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను కార్డుపై ముద్రించకపోవడంపై పలువురు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేసిన కార్డుల్లో కుటుంబ పెద్ద పేరు తప్ప ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఫొటోలు కనిపించకపోవడంతో ఈ కార్డు వల్ల తమ కుటుంబ వివరాలు ప్రత్యక్షంగా గుర్తించే అవకాశం లేకుండా పోయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు....

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై లబ్ధిదారుల్లో కొత్త చర్చ మొదలైంది. పాత రేషన్ కార్డులతో పోలిస్తే ఆధునిక రూపంలో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో కొత్త కార్డులను అందిస్తున్న ప్రభుత్వం.. కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను కార్డుపై ముద్రించకపోవడంపై పలువురు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేసిన కార్డుల్లో కుటుంబ పెద్ద పేరు తప్ప ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఫొటోలు కనిపించకపోవడంతో ఈ కార్డు వల్ల తమ కుటుంబ వివరాలు ప్రత్యక్షంగా గుర్తించే అవకాశం లేకుండా పోయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వార్తలు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను సాధారణ కాగితపు కార్డులకు భిన్నంగా పీవీసీ రూపంలో రూపొందించింది. ఆగస్టు 15, 2026న సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు ఈ కార్డులను అందించే ప్రక్రియ చేపట్టారు. నకిలీ కార్డులను అరికట్టడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ప్రయోజనాలు సక్రమంగా అందేలా చూడటం ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశాలుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ స్మార్ట్ కార్డులో క్యూఆర్ కోడ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాన్ని సంబంధిత యంత్రం ద్వారా పరిశీలించినప్పుడు కుటుంబ సభ్యుల వివరాలు, ఈ-కేవైసీ స్థితి, గతంలో తీసుకున్న రేషన్ సరుకుల వివరాలు వంటి సమాచారం డిజిటల్‌గా కనిపించే విధంగా వ్యవస్థను రూపొందించారు. అంటే కార్డుపై మొత్తం వివరాలు ముద్రించకుండా, అవసరమైన సమాచారాన్ని క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేసిన విధానం అమల్లోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా నకిలీలను నిరోధించేందుకు ఉబ్బెత్తు అక్షరాలు, సూక్ష్మ అక్షరాలు, ప్రత్యేక క్యూఆర్ కోడ్, అతినీలలోహిత గుర్తు, నీటి ముద్ర, త్రీడీ హోలోగ్రామ్ తదితర భద్రతా లక్షణాలను కార్డులో పొందుపరిచినట్లు పౌరసరఫరాల శాఖకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ఒక కుటుంబానికి రేషన్ కార్డు అంటే కేవలం రేషన్ సరుకులు పొందేందుకు ఉపయోగించే కార్డు మాత్రమేనా? లేక కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను చూపించే గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడాలా? గతంలో రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల పేర్లు, ఫొటోలు ఉండటంతో కార్డును చూసిన వెంటనే కుటుంబంలోని సభ్యుల వివరాలు తెలిసేవి. ఇప్పుడు కొత్త కార్డుపై ఆ వివరాలు లేకపోవడంతో పాత కార్డుతో పోలిస్తే కొత్త కార్డు ఉపయోగకరతపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల వివరాలు కార్డుపైనే కనిపించకుండా కేవలం క్యూఆర్ కోడ్‌లో ఉండే విధానం సాధారణ ప్రజలకు ఎంతవరకు సౌకర్యంగా ఉంటుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ కార్డును కేవలం ముద్రిత వివరాల ఆధారంగా కాకుండా డిజిటల్ సాంకేతికతతో అనుసంధానించిన ఆధునిక రేషన్ కార్డుగా రూపొందించినట్లు చెబుతోంది. క్యూఆర్ కోడ్ ద్వారా అవసరమైన సమయంలో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉండటంతో పాటు రేషన్ పంపిణీ వివరాలను కూడా పరిశీలించవచ్చని అధికారులు వివరిస్తున్నారు. అందువల్ల కార్డుపై వివరాలు తక్కువగా కనిపించడం వెనుక సమాచారాన్ని పూర్తిగా తొలగించడం కాకుండా డిజిటల్ విధానంలో భద్రపరచే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రజల అభ్యంతరాలు మాత్రం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్, డిజిటల్ వివరాలు, యంత్రాలపై ఆధారపడే పరిస్థితి ఉండకపోవచ్చు. వృద్ధులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, సాంకేతిక పరిజ్ఞానం అంతగా తెలియని లబ్ధిదారులకు కార్డుపై కుటుంబ సభ్యుల పేర్లు, అవసరమైన ప్రాథమిక వివరాలు ఉంటే మరింత సౌకర్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు స్మార్ట్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తూనే మరోవైపు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించే కనీస వివరాలను కూడా కార్డుపై ముద్రిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు సాంకేతికంగా అనేక భద్రతా లక్షణాలతో రూపొందించినప్పటికీ, కార్డుపై కుటుంబ సభ్యుల వివరాలు కనిపించకపోవడం మాత్రం ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం చెబుతున్న డిజిటల్ ప్రయోజనాలు ఒకవైపు ఉంటే.. తమ కుటుంబ వివరాలు కార్డుపైనే కనిపించాలన్న లబ్ధిదారుల అభిప్రాయం మరోవైపు ఉంది. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు ప్రజల అభ్యంతరాలను పరిశీలించి అవసరమైతే కార్డు రూపకల్పనలో మార్పులు చేస్తుందా? లేదా క్యూఆర్ కోడ్ ఆధారిత విధానాన్నే కొనసాగిస్తుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది. ALSO READ: Ghost Train: ట్రైన్ మొత్తం దెయ్యాలే.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
16 రోజుల క్రితం
Logo

Hyderabad: కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్.. ఉద్రిక్తత

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు బీఆర్‌ఎస్ నేతలు నలుపు టీషర్ట్లు ధరించి, ఫ్లకార్డులు చేతబట్టి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని భద్రతా సిబ్బంది,...

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు బీఆర్‌ఎస్ నేతలు నలుపు టీషర్ట్లు ధరించి, ఫ్లకార్డులు చేతబట్టి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని భద్రతా సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని చివరకు తోపులాటకు దారితీసింది. పోలీసులు తమను అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ నేతలు రోడ్డుపైనే కూర్చొని నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళన కారణంగా రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తెలంగాణ భవన్‌కు తరలిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతల ఆందోళనలు, పోలీసుల అరెస్టులతో అసెంబ్లీ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ALSO READ: Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Interesting News
Reporter
STAR TRINETHRAM
27 రోజుల క్రితం
Logo

Interesting Fact: భార్య.. భర్తకు రాఖీ కట్టవచ్చా?.. పురాణాల్లో ఏముంది..?

Interesting Fact: రాఖీ పండుగకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎంతో ప్రేమతో జరుపుకునే ఈ పండుగ బంధాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆగస్టు 28న రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు అండగా నిలుస్తామని, కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని హామీ ఇస్తారు. అయితే రాఖీ అంటే కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య మాత్రమే ఉండే బంధమా? భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? పురాణాల్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయా? దేవతల్లో ఎవరు ఎవరికి...

Interesting Fact: రాఖీ పండుగకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎంతో ప్రేమతో జరుపుకునే ఈ పండుగ బంధాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆగస్టు 28న రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు అండగా నిలుస్తామని, కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని హామీ ఇస్తారు. అయితే రాఖీ అంటే కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య మాత్రమే ఉండే బంధమా? భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? పురాణాల్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయా? దేవతల్లో ఎవరు ఎవరికి రక్షాసూత్రం కట్టారు? వంటి ప్రశ్నలు చాలామందికి ఆసక్తిని కలిగిస్తాయి. రక్షాబంధనం వెనుక ఉన్న సంప్రదాయాలు, పురాణ కథలను పరిశీలిస్తే ఈ పండుగకు ఉన్న విస్తృతమైన అర్థం అర్థమవుతుంది. రాఖీ అనేది కేవలం చేతికి కట్టే దారం మాత్రమే కాదు.. రక్షణకు సంబంధించిన ఒక వాగ్దానానికి ప్రతీకగా భావిస్తారు. తనకు రాఖీ కట్టిన వ్యక్తికి అవసరమైన సమయంలో అండగా నిలబడటం, కష్టాల్లో తోడుగా ఉండటం, రక్షణ కల్పించడం అనే భావన ఈ సంప్రదాయం వెనుక ఉంది. ఈ కారణంగానే రక్షాబంధనం కేవలం రక్తసంబంధాలకు మాత్రమే పరిమితం కాదని పురాణ కథలు చెబుతున్నాయి. భార్య తన భర్తకు రక్షాసూత్రం కట్టిన సందర్భాలు కూడా పురాణాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంద్రుడి భార్య ఇంద్రాణి తన భర్తకు రక్షాసూత్రం కట్టిన కథ రక్షాబంధనానికి సంబంధించిన ప్రముఖ ప్రస్తావనగా చెబుతారు. వేదకాలంలో దేవతలు, రాక్షసుల మధ్య తీవ్ర యుద్ధం జరిగినప్పుడు దేవతలు ఓటమి అంచుకు చేరుకున్నారని పురాణ కథనం. శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున జరిగిన ఆ యుద్ధంలో రాక్షసుల బలం పెరగడంతో దేవేంద్రుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. యుద్ధంలో ఓడిపోతే ఎదురయ్యే పరిణామాల గురించి ఆలోచించిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని సంప్రదించాడు. అప్పుడు ఇంద్రుడి మణికట్టుకు రక్షాసూత్రం కట్టించాలని బృహస్పతి సూచించినట్లు కథనం చెబుతోంది. గురువు సూచన మేరకు ఇంద్రుడి భార్య ఇంద్రాణి శ్రావణ పౌర్ణమి రోజున ఆయన మణికట్టుకు రక్షాసూత్రం కట్టింది. ఆ రక్షాసూత్రం అనంతరం ఇంద్రుడికి ధైర్యం పెరిగి, దేవతల విజయంలో అది దోహదపడిందని పురాణ కథనం వివరిస్తుంది. ఇదే విధంగా దేవేంద్రుడికి ఆయన భార్య శచీదేవి రక్షాబంధనం కట్టిన మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. స్వర్గలోకాధిపతి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతిని బలిచక్రవర్తి స్వాధీనం చేసుకున్న సందర్భంలో, తన రాజ్యాన్ని తిరిగి పొందేందుకు ఇంద్రుడు బలిచక్రవర్తిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. భర్త యుద్ధానికి బయలుదేరే సమయంలో ఆయన విజయాన్ని కోరుకున్న శచీదేవి విష్ణుమూర్తిని ప్రార్థించినట్లు పురాణ కథనం చెబుతోంది. ఆమె ప్రార్థనకు ప్రసన్నమైన విష్ణుమూర్తి శచీదేవికి ఒక రక్షను అందించాడని, ఆ రక్షను ఆమె తన భర్త దేవేంద్రుడి మణికట్టుకు కట్టి యుద్ధానికి పంపిందని చెబుతారు. అనంతరం జరిగిన యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధించి తన రాజ్యాన్ని తిరిగి పొందినట్లు పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఈ కథ ద్వారా కూడా రక్షాసూత్రం కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య బంధానికే పరిమితం కాదనే భావనకు బలం లభిస్తుంది. పూర్వకాలంలో యుద్ధాలకు వెళ్లే భర్తలకు భార్యలు విజయాన్ని ఆకాంక్షిస్తూ వీరతిలకం దిద్ది, రక్షాసూత్రాన్ని కట్టి పంపే సంప్రదాయం ఉండేదని కూడా చెబుతారు. యుద్ధానికి వెళ్లే వ్యక్తి క్షేమంగా తిరిగి రావాలని, విజయం సాధించాలని కోరుతూ రక్ష కట్టడం ఒక ఆచారంగా కొనసాగిందనే అభిప్రాయం ఉంది. కాలక్రమంలో రక్షాసూత్రం కట్టే ఈ సంప్రదాయం విస్తరించి, రక్షాబంధనం అనే పండుగ రూపాన్ని సంతరించుకుందని చెబుతారు. అందువల్ల రాఖీ పండుగను కేవలం సోదరసోదరీమణుల ప్రేమకు సంబంధించిన పండుగగా మాత్రమే చూడకుండా, పరస్పర రక్షణ, నమ్మకం, ఆప్యాయతకు ప్రతీకగా కూడా భావించవచ్చు. భార్య భర్తకు రాఖీ కట్టినప్పటికీ దాని వెనుక ఉన్న భావం రక్షణ, శ్రేయస్సు, విజయాన్ని కోరుకోవడమేనని పురాణ కథలు సూచిస్తున్నాయి. రక్షాబంధనం సంప్రదాయం వేదకాలం నుంచే ఉన్నట్లు పురాణ కథనాలు చెబుతున్నప్పటికీ, కలియుగంలోనూ ఈ పండుగను ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకుంటున్నారు. కాలం మారినా రాఖీ పండుగకు ఉన్న ప్రాధాన్యం తగ్గలేదు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు మాత్రమే కాకుండా ప్రేమ, ఆప్యాయత, పరస్పర నమ్మకం ఉన్న బంధాల్లోనూ రక్షాసూత్రానికి ప్రత్యేకమైన భావన కనిపిస్తుంది. పురుషుడా, స్త్రీనా అనే తేడా లేకుండా రక్షణకు ప్రతీకగా రాఖీని భావించే సంప్రదాయాలు మన సంస్కృతిలో కనిపిస్తాయి. మొదటి రాఖీని ఎవరు ఎవరికి కట్టారనే విషయం పూర్తిగా నిర్ధారించలేకపోయినా, రక్షాబంధనం మాత్రం తరతరాలుగా కొనసాగుతున్న ఆనందోత్సవంగా నిలిచింది. పండుగ ఏదైనా కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి ప్రేమానురాగాలను పంచుకుంటే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అదే రాఖీ పండుగ ప్రత్యేకత.. బంధాలను గుర్తుచేసుకోవడం, ప్రేమను పంచుకోవడం, ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇవ్వడమే ఈ పండుగ అసలైన సందేశంగా భావించవచ్చు. NOTE: పై వార్తలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే తెలియజేశాం. స్టార్ త్రినేత్రం దీనిని అధికారికంగా ధృవీకరించట్లేదు. పాఠకులు గమనించగలరు. ALSO READ: Entertainment: ఇరగదీస్తున్న ‘ఇరుముడి’కి ‘టాక్సిక్’ స్పీడ్ బ్రేకర్‌ కానుందా..?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Entertainment News
Reporter
STAR TRINETHRAM
29 రోజుల క్రితం
Logo

Entertainment: ఇరగదీస్తున్న ‘ఇరుముడి’కి ‘టాక్సిక్’ స్పీడ్ బ్రేకర్‌ కానుందా..?

Entertainment: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి జోరును కొనసాగిస్తున్న వేళ, సినిమాకు మరో భారీ సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. యశ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చిత్రం ‘టాక్సిక్’ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పంపిణీ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఇప్పటికే ప్రదర్శితమవుతున్న ‘ఇరుముడి’కి ఎన్ని థియేటర్లు కొనసాగుతాయి, ‘టాక్సిక్’కు ఎన్ని కేటాయిస్తారన్నది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’కి థియేటర్ల సంఖ్య తగ్గితే దాని కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం...

Entertainment: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి జోరును కొనసాగిస్తున్న వేళ, సినిమాకు మరో భారీ సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. యశ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చిత్రం ‘టాక్సిక్’ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పంపిణీ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఇప్పటికే ప్రదర్శితమవుతున్న ‘ఇరుముడి’కి ఎన్ని థియేటర్లు కొనసాగుతాయి, ‘టాక్సిక్’కు ఎన్ని కేటాయిస్తారన్నది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’కి థియేటర్ల సంఖ్య తగ్గితే దాని కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ‘టాక్సిక్’ విడుదల రోజున మీలాదునబీ, ఓనం పండుగలు కలిసి రావడం ఆ సినిమాకు అదనపు ప్రయోజనంగా మారనుంది. సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండటంతో మొదటి రోజే గట్టిగా వసూళ్లు రాబట్టేందుకు చిత్రబృందం భారీ ఏర్పాట్లు చేస్తోంది. యశ్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు, విస్తృత స్థాయిలో నిర్వహించిన ప్రచారం, పండుగ సెలవు కలిసిరావడం వంటి అంశాలు ‘టాక్సిక్’కు బలంగా మారుతాయని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో విడుదల రోజునే పెద్ద స్థాయిలో వసూళ్లు సాధించేలా చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘టాక్సిక్’కు గణనీయమైన సంఖ్యలో థియేటర్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో ప్రముఖ పంపిణీదారులు దిల్ రాజు, ఏషియన్ సునీల్ వంటి బడా పేర్లు ‘టాక్సిక్’ విడుదలలో భాగం కావడంతో ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దక్కే పరిస్థితి ఏర్పడినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘ఇరుముడి’ ప్రదర్శితమవుతున్న థియేటర్లలో దాదాపు 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బుధవారం లభించనున్న సెలవు రోజును పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని మరిన్ని వసూళ్లు సాధించాలనుకుంటున్న ‘ఇరుముడి’కి ఇది కొంత ప్రతికూలంగా మారే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా ఒక సినిమా మంచి వసూళ్లతో కొనసాగుతున్న సమయంలో థియేటర్ల సంఖ్య తగ్గితే దాని కలెక్షన్ల వేగంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సెలవు రోజుల్లో అదనపు ప్రదర్శనలు, అధిక సంఖ్యలో ప్రేక్షకుల రాకతో వసూళ్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో స్క్రీన్లు తగ్గిపోతే ‘ఇరుముడి’ వసూళ్లకు ఇది స్పీడ్ బ్రేకర్‌గా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పరిణామంపై ‘ఇరుముడి’ చిత్రబృందం మాత్రం పెద్దగా ఆందోళన చెందడం లేదని తెలుస్తోంది. రెండు సినిమాల కథా నేపథ్యాలు, శైలులు, లక్ష్య ప్రేక్షకులు వేర్వేరుగా ఉండటమే తమకు అనుకూలంగా మారుతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ‘టాక్సిక్’ ప్రధానంగా యువత, యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండగా, ‘ఇరుముడి’ కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న భావోద్వేగ కుటుంబ వినోద చిత్రంగా కొనసాగుతోంది. అందువల్ల రెండు సినిమాల మధ్య నేరుగా పోటీ ఉన్నప్పటికీ ప్రేక్షకుల ఎంపికలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తమకు నచ్చిన కథ, తమ అభిరుచికి సరిపోయే సినిమాను ప్రేక్షకులు ఎంచుకుని థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని ‘ఇరుముడి’ చిత్రబృందం నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంచనాలు నిజమైతే ‘టాక్సిక్’, ‘ఇరుముడి’ చిత్రాలు ఒకేసారి థియేటర్లలో కొనసాగుతూ తమ తమ ప్రేక్షకుల ఆదరణతో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. గతంలోనూ విభిన్న కథాంశాలు, వేర్వేరు శైలులకు చెందిన సినిమాలు ఒకే సమయంలో విడుదలై, తమ తమ ప్రేక్షకుల మద్దతుతో విజయవంతమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ‘టాక్సిక్’ రాకతో ‘ఇరుముడి’కి ఎలాంటి ప్రభావం ఎదురవుతుందో, థియేటర్ల సంఖ్య ఎంత మేరకు మారుతుందో, రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తుందో చూడాలి. ALSO READ: Gen Z: ‘నో’ చెప్పడంలో నో మొహమాటం
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Life Style News
Reporter
STAR TRINETHRAM
18 గం. క్రితం
Logo

Gen Z: ‘నో’ చెప్పడంలో నో మొహమాటం

Gen Z: జెన్ Z తరం తమకు నచ్చని విషయాలకు ఎక్కువ వివరణలు ఇవ్వకుండా నేరుగా ‘నో’ చెప్పడంలో స్పష్టత చూపిస్తోంది. ఇతరులు ఏమనుకుంటారనే ఆలోచనతో ప్రతి విషయానికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఈ తరం.. తమ వ్యక్తిగత సరిహద్దులను స్పష్టంగా తెలియజేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పని ప్రదేశంలో అదనపు బాధ్యతలు అప్పగించినప్పుడు, సామాజిక కార్యక్రమాలకు రావాలని ఒత్తిడి చేసినప్పుడు, కుటుంబ సభ్యులు వ్యక్తిగత విషయాల్లో అనవసరమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా పెద్దగా వివరణలు ఇవ్వకుండా సింపుల్‌గా ‘నో’ చెప్పేస్తున్నారు. గత తరాల దృష్టిలో ఇది కొంత అమర్యాదగా లేదా అగౌరవంగా...

Gen Z: జెన్ Z తరం తమకు నచ్చని విషయాలకు ఎక్కువ వివరణలు ఇవ్వకుండా నేరుగా ‘నో’ చెప్పడంలో స్పష్టత చూపిస్తోంది. ఇతరులు ఏమనుకుంటారనే ఆలోచనతో ప్రతి విషయానికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఈ తరం.. తమ వ్యక్తిగత సరిహద్దులను స్పష్టంగా తెలియజేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పని ప్రదేశంలో అదనపు బాధ్యతలు అప్పగించినప్పుడు, సామాజిక కార్యక్రమాలకు రావాలని ఒత్తిడి చేసినప్పుడు, కుటుంబ సభ్యులు వ్యక్తిగత విషయాల్లో అనవసరమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా పెద్దగా వివరణలు ఇవ్వకుండా సింపుల్‌గా ‘నో’ చెప్పేస్తున్నారు. గత తరాల దృష్టిలో ఇది కొంత అమర్యాదగా లేదా అగౌరవంగా కనిపించే అవకాశం ఉన్నప్పటికీ.. జెన్ Z మాత్రం దీనిని తమ సమయం, శక్తి, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకునే విధానంగా భావిస్తోంది. ఇదే అంశం ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ విధానాన్ని జెన్ Z తరం తమను తాము కాపాడుకునే మార్గంగా చూస్తోంది. పని ప్రదేశంలో అదనపు గంటలు పనిచేయాలని కోరినప్పుడు కారణాలు చెబుతూ సమర్థించుకోవడం కంటే తమకు సాధ్యం కాదని స్పష్టంగా చెప్పడం, అలసటకు గురిచేసే కార్యక్రమాలకు వెళ్లకుండా ఉండటం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు పరిమితులు విధించడం వంటి విషయాల్లో ఈ తరం వెనుకడుగు వేయడం లేదు. తమకు అసౌకర్యంగా అనిపించే పరిస్థితుల్లో ఇతరులను సంతృప్తిపరచడానికి అంగీకరించడం కంటే.. తమకు ఏది అవసరమో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడమే మంచిదని భావిస్తున్నారు. గత తరాలకు చెందిన కొందరు వ్యక్తులు ఈ ధోరణిని మర్యాద తగ్గిపోవడంగా లేదా గౌరవం లేకపోవడంగా భావించే అవకాశం ఉన్నా.. జెన్ Z మాత్రం దీన్ని నిజాయితీ, స్పష్టత, స్వీయ రక్షణకు సంబంధించిన అంశంగా పరిగణిస్తోంది. ప్రముఖ నటి జోడీ ఫోస్టర్ కూడా ఈ తరం ‘నో’ చెప్పడంలో చాలా ముందుందని పేర్కొంటూ.. తాము యువతలో ఉన్నప్పుడే ఇలాంటి నైపుణ్యాన్ని నేర్చుకుని ఉంటే బాగుండేదని చెప్పడం ఈ అంశంపై మరింత ఆసక్తిని పెంచింది. జెన్ Z తరం ఆలోచనా విధానంలో వచ్చిన ఈ మార్పుకు అనేక కారణాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సమయం, శక్తి, పని ఒత్తిడి కారణంగా కలిగే అలసటను తగ్గించుకోవడం వంటి అంశాలకు ఈ తరం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఎప్పుడూ పని చేయాలనే ఒత్తిడి, ప్రతి అభ్యర్థనకూ అంగీకారం తెలపాలనే సామాజిక అంచనాలు, సోషల్ మీడియా కారణంగా పెరుగుతున్న మానసిక అలసట నుంచి బయటపడేందుకు తమకు అవసరమైన పరిమితులను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ‘నో’ చెప్పడం కూడా సాధనతో మెరుగుపడే ఒక నైపుణ్యమేననే అభిప్రాయం సోషల్ మీడియాలో విస్తరిస్తోంది. ‘నో’ చెప్పడాన్ని ఒక కండరంతో పోలుస్తూ.. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత బలపడుతుందని చెప్పే చర్చలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు తమకు అసౌకర్యం కలిగించే పరిస్థితులను స్పష్టంగా తిరస్కరించడంలో, వ్యక్తిగత సరిహద్దులను నిర్ణయించుకోవడంలో మరింత సౌకర్యంగా వ్యవహరిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మొత్తంగా చూస్తే.. ‘నో’ చెప్పడం అనేది కేవలం ఒక అభ్యర్థనను తిరస్కరించడం మాత్రమే కాదని ఈ తరం భావిస్తోంది. తమ గురించి తాము తెలుసుకోవడం, తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం, సమయం మరియు శక్తిని ఎక్కడ వినియోగించాలో తెలుసుకోవడం, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడం వంటి అంశాలతో దీనికి సంబంధం ఉందని చెబుతోంది. అయితే జెన్ Z తరానికి చెందిన ప్రతి ఒక్కరూ ఇదే విధంగా వ్యవహరిస్తారని చెప్పలేం. కొందరు ఇప్పటికీ ఇతరులను సంతృప్తిపరచడానికి తమ ఇష్టాలకు వ్యతిరేకంగా అంగీకరిస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ సరళంగా ‘నో’ చెప్పే ధోరణి ఆన్‌లైన్ చర్చల్లోనే కాకుండా పని ప్రదేశాల్లో, కుటుంబాల్లో, స్నేహ సంబంధాల్లో, రోజువారీ జీవితంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తమ సరిహద్దులను తాము గౌరవించుకోవడంతో పాటు.. ఇతరుల సరిహద్దులను కూడా గౌరవించే సంస్కృతి భవిష్యత్ తరాల్లో మరింత బలపడేందుకు ఈ మార్పు దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ALSO READ: Romantic Movie: అసలెలా తీశారురా బాబు ఈ సినిమాని.. చిన్న పిల్లలు అస్సలు చూడొద్దు..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
2 రోజుల క్రితం
Logo

Aruri Ramesh: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

పంద్రాగస్టు రోజున నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అరూరి రమేష్ సహా 25 మందిపై కేసు Aruri Ramesh: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో పాటు 25 మంది బీఆర్ఎస్ నాయకులపై గురువారం కేసు నమోదైంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేటలో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి పలు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేయడంతో పాటు, నేషనల్ హైవేపై అంబేద్కర్ సెంటర్‌లో ఎలాంటి అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారని, తద్వారా రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కార్యక్రమంలో డీజే సౌండ్...

  • పంద్రాగస్టు రోజున నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు
  • అరూరి రమేష్ సహా 25 మందిపై కేసు
Aruri Ramesh: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో పాటు 25 మంది బీఆర్ఎస్ నాయకులపై గురువారం కేసు నమోదైంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేటలో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి పలు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేయడంతో పాటు, నేషనల్ హైవేపై అంబేద్కర్ సెంటర్‌లో ఎలాంటి అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారని, తద్వారా రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కార్యక్రమంలో డీజే సౌండ్ సిస్టం ఉపయోగించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై వర్ధన్నపేట మునిసిపల్ ఇన్‌చార్జి కమిషనర్ కె.కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 285, 189 (2), ఆర్/డబ్ల్యూ 190బీఎన్ఎస్, 2 (4)(1) పీఐఎన్‌హెచ్‌ఏ కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో కౌన్సిలర్లు గుజ్జ వీరన్న, తిరుపతి సురేష్, సిలివేరు కుమారస్వామి, నాయకులు తూళ్ల కుమారస్వామి, గోధుమల మధుసూదన్, తుమ్మల యాకయ్య, బానోతు నవీన్, భూక్యా రామన్న, లక్ష్మణ్‌లతో పాటు పలువురి పేర్లు ఉన్నాయి. మొత్తం 25 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు కావడంతో వర్ధన్నపేట రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ALSO READ: Wardhannapet: జాతీయ పతాకానికి అవమానం (VIDEO)
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Entertainment News
Reporter
STAR TRINETHRAM
4 రోజుల క్రితం
Logo

Romantic Movie: అసలెలా తీశారురా బాబు ఈ సినిమాని.. చిన్న పిల్లలు అస్సలు చూడొద్దు..

Romantic Movie: ఇంట్లోనే కూర్చొని తమ అభిరుచికి తగ్గ సినిమాలను ఎంచుకుని వీక్షించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రేమకథలు, ఉత్కంఠభరితమైన కథనాలు, రహస్యాలతో కూడిన చిత్రాలకు డిజిటల్ వినోద వేదికలపై మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలతో పాటు నేరుగా డిజిటల్ వేదికల్లోకి వచ్చే విభిన్న కథాంశాల సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చర్చనీయాంశంగా మారింది. 'వైఫ్, ఐ' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ,...

Romantic Movie: ఇంట్లోనే కూర్చొని తమ అభిరుచికి తగ్గ సినిమాలను ఎంచుకుని వీక్షించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రేమకథలు, ఉత్కంఠభరితమైన కథనాలు, రహస్యాలతో కూడిన చిత్రాలకు డిజిటల్ వినోద వేదికలపై మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలతో పాటు నేరుగా డిజిటల్ వేదికల్లోకి వచ్చే విభిన్న కథాంశాల సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చర్చనీయాంశంగా మారింది. 'వైఫ్, ఐ' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ, దాంపత్య జీవితం, అనూహ్య పరిణామాలు, రహస్యాలు, నేరం వంటి అంశాలను కలిపి ఆసక్తికరమైన కథనంతో ముందుకు సాగుతుంది. ఈ సినిమా కథ ఓ యువకుడి చుట్టూనే తిరుగుతుంది. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న అతని జీవితం మొదట్లో చిన్నపాటి సరదాలు, అలకలు, గొడవలతో సాధారణంగానే కొనసాగుతుంది. అయితే ఒక్కసారిగా అతని భార్య కనిపించకుండా పోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. తొలుత ఆమె అదృశ్యాన్ని సాధారణ ఘటనగానే భావించినా, ఆమె కోసం అన్వేషణ మొదలైన తర్వాత అసలు కథలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడటం ప్రారంభమవుతుంది. ఆమె స్వచ్ఛందంగా వెళ్లిపోయిందా, మరొకరితో సంబంధం కారణంగానే దూరమైందా, లేక ఆమె అదృశ్యం వెనుక ఎవరికీ తెలియని పెద్ద ప్రణాళిక ఏదైనా ఉందా అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. భార్య కనిపించకుండా పోయిన తర్వాత కథలో చోటుచేసుకునే పరిణామాలు సాధారణ అదృశ్య ఘటనను మించి ఉత్కంఠను పెంచుతాయి. ప్రతి దశలోనూ కొత్త అనుమానాలు, ఊహించని మలుపులు ఎదురవుతుండటంతో కథ ఎటు వెళ్తుందో ముందుగా అంచనా వేయడం కష్టంగా మారుతుంది. ప్రేమ, అనుబంధం, అనుమానం, రహస్యం, నేరం వంటి అంశాలను మేళవించి కథను నడిపించడంతో ప్రేక్షకులు చివరి వరకు ఆసక్తిగా వీక్షించేలా సినిమా రూపొందింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రేమకు సంబంధించిన సన్నివేశాలతో పాటు బోల్డ్ అంశాలు కూడా సినిమాలో ఉండటంతో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ చిత్రానికి జీ.ఎస్.ఎస్.పి.కల్యాణ్ దర్శకత్వం వహించారు. సూర్య అకొండి ప్రధాన పాత్రలో నటించగా, గున్జన్ అరాస్ భార్య పాత్రలో కనిపించారు. 2019 డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. మొత్తం 1 గంట 45 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రముఖ చిత్రాల రేటింగ్ సంస్థలో 7.7/10 రేటింగ్ లభించింది. కథలోని మలుపులు, ప్రేమకు సంబంధించిన అంశాలు, రహస్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం 'వైఫ్, ఐ' చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండటంతో డిజిటల్ ప్రేక్షకులు దీనిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమకథలకు ఉత్కంఠభరితమైన రహస్యాలను జోడించిన సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఆసక్తికరమైన ఎంపికగా మారింది. అయితే సినిమాలో బోల్డ్ అంశాలు ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించడం కంటే ఒంటరిగా చూడటమే అనుకూలమని సినీ ప్రియులు సూచిస్తున్నారు. కథలోని రహస్యాలను చివరి వరకు కొనసాగిస్తూ, మధ్య మధ్యలో వచ్చే అనూహ్య మలుపులతో ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టే ఈ చిత్రం ప్రస్తుతం డిజిటల్ వేదికపై మంచి స్పందనను అందుకుంటోంది. ALSO READ: Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Viral News
Reporter
STAR TRINETHRAM
6 రోజుల క్రితం
Logo

Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం

Viral Video: సోషల్ మీడియాలో రకరకాల గొడవలు, వింత ఘటనలకు సంబంధించిన దృశ్యాలు తరచూ వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఇద్దరు యువతుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ యువకుడి విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం చివరకు బహిరంగ ప్రదేశంలోనే తీవ్ర గొడవకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్లో కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకున్నట్లు కనిపిస్తోంది. చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే ఇద్దరూ పరస్పరం దాడి చేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది....

Viral Video: సోషల్ మీడియాలో రకరకాల గొడవలు, వింత ఘటనలకు సంబంధించిన దృశ్యాలు తరచూ వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఇద్దరు యువతుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ యువకుడి విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం చివరకు బహిరంగ ప్రదేశంలోనే తీవ్ర గొడవకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్లో కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకున్నట్లు కనిపిస్తోంది. చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే ఇద్దరూ పరస్పరం దాడి చేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రదేశంలో ఉన్నామని కూడా పట్టించుకోకుండా ఇద్దరూ కొట్టుకోవడం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం.
 
View this post on Instagram
 

A post shared by ᴀʀᴏx ⛩ (@arox_xd)

వివరాల ప్రకారం.. ఓ యువకుడి ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు యువతుల మధ్య వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఒకే యువకుడిని ప్రేమించడం లేదా అతనికి సంబంధించిన ఏదో విషయంపై ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడటంతో మాటలతో మొదలైన గొడవ క్రమంగా తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. ఒకరిపై ఒకరు ఆగ్రహంతో దూసుకెళ్లిన ఇద్దరూ పరస్పరం చెంపదెబ్బలు కొట్టుకోవడం ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న కొందరు వారిని నిలువరించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ సమయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇద్దరూ వెనక్కి తగ్గకుండా గొడవ కొనసాగించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో 15 సెకన్లలోనే 14 చెంపదెబ్బలు తగులుకోవడం ఈ ఘటనలో ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్దిసేపటికే విస్తృతంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఇద్దరు యువతుల తీరుపై భిన్నమైన రీతుల్లో స్పందిస్తున్నారు. ఒక యువకుడి విషయంలో బహిరంగ ప్రదేశంలో ఇలా గొడవపడటం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నపాటి విభేదాలను మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సింది పోయి, నలుగురి మధ్య పరస్పరం దాడి చేసుకోవడం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం కేవలం 15 సెకన్లలో 14 చెంపదెబ్బలు ఎలా కొట్టుకున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతూ నెటిజన్లలో చర్చకు కారణమవుతోంది. ALSO READ: Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
7 రోజుల క్రితం
Logo

Muhammad Ayub: సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు

జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ కోరిన మహమ్మద్ అయూబ్ విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై సీఎంకు వినతి సర్టిఫికెట్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన డీసీసీ అధ్యక్షులు విద్యార్థులు, యువత సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అయూబ్ వెల్లడి Muhammad Ayub: హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ పరకాల...

  • జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి
  • మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ కోరిన మహమ్మద్ అయూబ్
  • విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై సీఎంకు వినతి
  • సర్టిఫికెట్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన డీసీసీ అధ్యక్షులు
  • విద్యార్థులు, యువత సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చ
  • ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అయూబ్ వెల్లడి
Muhammad Ayub: హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ పరకాల టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వరంగల్ జిల్లా అభివృద్ధితో పాటు విద్యార్థులు, యువత, మైనార్టీ వర్గాలకు సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం తగిన స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలకు శాశ్వత కార్యాలయం అందుబాటులో ఉంటే కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ విద్యార్థులు, యువతకు అవసరమైన సహకారం అందించేందుకు మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ సదుపాయం కల్పించాలని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు మహమ్మద్ అయూబ్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, యువతకు ఉచిత శిక్షణ అందితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారు మరింత సమర్థవంతంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మైనార్టీ వర్గాల విద్యా, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరినట్లు వెల్లడించారు. అదేవిధంగా డిగ్రీ, బీటెక్ విద్యను పూర్తి చేస్తున్న పలువురు విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు కళాశాల యాజమాన్యాలకు అందకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని మహమ్మద్ అయూబ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తమ విద్యాభ్యాసానికి సంబంధించిన సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని కూడా మహమ్మద్ అయూబ్ పేర్కొన్నారు. జిల్లాలో కళాకారులు, సాంస్కృతిక రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం లభించేలా వరంగల్ జిల్లాకు కళాక్షేత్రం కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. వీటితో పాటు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులు, యువత, మైనార్టీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు అయూబ్ వెల్లడించారు. వరంగల్ జిల్లా ప్రజలు, విద్యార్థులు, యువత, మైనార్టీ వర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందేలా సంబంధిత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ALSO READ: Political: సీఎం పరకాల పర్యటనలో కనిపించని కొండా సురేఖ.. కారణమేంటి..?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
7 రోజుల క్రితం
Logo

Political: సీఎం పరకాల పర్యటనలో కనిపించని కొండా సురేఖ.. కారణమేంటి..?

Political: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మేడారంలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన సమయంలో మంత్రి కొండా సురేఖ అక్కడ కనిపించకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలోనూ కొండా సురేఖ పాల్గొనకపోవడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటనకు మంత్రి గైర్హాజరు కావడం వెనుక అసలు కారణమేంటనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాల కారణంగానే కొండా...

Political: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మేడారంలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన సమయంలో మంత్రి కొండా సురేఖ అక్కడ కనిపించకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలోనూ కొండా సురేఖ పాల్గొనకపోవడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటనకు మంత్రి గైర్హాజరు కావడం వెనుక అసలు కారణమేంటనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాల కారణంగానే కొండా సురేఖ ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో కొండా కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రభావం నేపథ్యంలో ఈ పరిణామం స్థానికంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొండా అభిమానుల్లో ప్రస్తుతం ఒకింత గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పరకాల బహిరంగ సభలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి స్వయంగా రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును ప్రస్తావించడం వెనుక రాజకీయ సమీకరణాలపై ఇప్పుడు చర్చ సాగుతోంది. మరోవైపు కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ గతంలో పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. పరకాల నుంచి కొండా కుటుంబ వారసురాలిగా సుస్మిత పటేల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం కొంతకాలంగా కొనసాగుతోంది. అంతేకాకుండా తమ కూతురు పరకాల ఎమ్మెల్యే అవుతుందని కొండా మురళి గతంలో బహిరంగంగానే ప్రకటించారు. అయితే తాజాగా పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరడంతో ఈ పరిణామం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశానికి అడ్డంకులు ఏర్పడినట్టేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కొండా కుటుంబం నుంచి పరకాల రాజకీయాల్లో వారసత్వంగా ముందుకు రావాలనుకున్న సుస్మిత పటేల్ విషయంలో ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు, కొండా కుటుంబం భవిష్యత్ వ్యూహం, రేవూరి ప్రకాష్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత వంటి అంశాలు ప్రస్తుతం రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉండటం, పరకాల సభలో ఆమె కనిపించకపోవడం, అదే సభలో రేవూరి ప్రకాష్ రెడ్డికి సీఎం మద్దతుగా మాట్లాడటం వంటి పరిణామాలను రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పరకాల కాంగ్రెస్ రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ALSO READ: Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Crime News
Reporter
STAR TRINETHRAM
7 రోజుల క్రితం
Logo

Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..

Crime: చోడవరంలోని రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన వెంకటరావు (58), ఇందిర దంపతుల మధ్య చోటుచేసుకున్న కుటుంబ కలహం చివరకు విషాదాంతమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిర అక్కడి అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళలు, తల్లులు, గర్భిణులకు ఆరోగ్యం, కుటుంబం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారని స్థానికులు తెలిపారు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉండగా, వారిలో ఒకరికి ఇప్పటికే వివాహమైంది. వెంకటరావు ప్రైవేటు కేబుల్‌ నెట్‌వర్క్‌లో పనిచేసేవాడని తెలిసింది. అయితే కొంతకాలంగా వెంకటరావుకు మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానం ఇందిరలో ఉన్నట్లు సమాచారం....

Crime: చోడవరంలోని రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన వెంకటరావు (58), ఇందిర దంపతుల మధ్య చోటుచేసుకున్న కుటుంబ కలహం చివరకు విషాదాంతమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిర అక్కడి అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళలు, తల్లులు, గర్భిణులకు ఆరోగ్యం, కుటుంబం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారని స్థానికులు తెలిపారు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉండగా, వారిలో ఒకరికి ఇప్పటికే వివాహమైంది. వెంకటరావు ప్రైవేటు కేబుల్‌ నెట్‌వర్క్‌లో పనిచేసేవాడని తెలిసింది. అయితే కొంతకాలంగా వెంకటరావుకు మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానం ఇందిరలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం అనకాపల్లిలోని కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం మరోసారి దంపతుల మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఇందిర తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. ఈ సమయంలో కత్తితో భర్త వెంకటరావుపై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. భర్తపై దాడి చేసిన అనంతరం ఇందిర వెంకటరావు మృతదేహం వద్ద తలవైపు దీపం పెట్టినట్లు సమాచారం. అనంతరం ఆమె నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడు వెంకటరావు, ఇందిర ఇద్దరూ చోడవరం ప్రాంతానికి చెందినవారేనని, వారిద్దరిదీ ప్రేమ వివాహమని బంధువులు వెల్లడించారు. అప్పట్లో పెద్దలు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి పెళ్లి చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య గతంలో చోటుచేసుకున్న వివాదాలు, వెంకటరావుపై ఇందిరకు ఉన్న అనుమానం, శనివారం జరిగిన గొడవకు దారితీసిన కారణాలు, దాడి జరిగిన పరిస్థితులపై పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగిన దాంపత్య జీవితం అనుమానం, ఆవేశం కారణంగా విషాదకరంగా ముగియడంతో అంబేడ్కర్‌ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ALSO READ: Nude Restaurant: ఆడ, మగ నగ్నంగా భోజనం చేసే వింత రెస్టారెంట్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
7 రోజుల క్రితం
Logo

Wardhannapet: జాతీయ పతాకానికి అవమానం (VIDEO)

జాతీయ జెండా తలకిందులుగా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే జెండా ఆవిష్కరణలో కనిపించిన నిర్లక్ష్యం కాషాయ రంగు కింది భాగంలో కనిపించిన వైనం కనీస జాగ్రత్త తీసుకోలేదన్న విమర్శలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన దృశ్యాలు Wardhannapet: జాతీయ జెండా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి జాతీయ పండుగను ఘనంగా నిర్వహిస్తే.. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర దుమారం రేపింది. శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో...

  • జాతీయ జెండా తలకిందులుగా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే
  • జెండా ఆవిష్కరణలో కనిపించిన నిర్లక్ష్యం
  • కాషాయ రంగు కింది భాగంలో కనిపించిన వైనం
  • కనీస జాగ్రత్త తీసుకోలేదన్న విమర్శలు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన దృశ్యాలు
Wardhannapet: జాతీయ జెండా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి జాతీయ పండుగను ఘనంగా నిర్వహిస్తే.. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర దుమారం రేపింది. శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు ఆరూరి రమేష్ జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయాల్సిన వేళ.. జెండాను తలకిందులుగా ఎగురవేయడం పట్ల పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వర్ధన్నపేటలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో కాషాయ రంగు పైభాగంలో, ఆకుపచ్చ రంగు కింది భాగంలో ఉండేలా పతాకాన్ని సరిగ్గా అమర్చాల్సిన కనీస జాగ్రత్త కూడా తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో మరో అంశం కూడా తీవ్ర చర్చకు కారణమైంది. జెండా తలకిందులుగా ఉన్న విషయాన్ని వెంటనే గుర్తించాల్సిన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం ఆ సమయంలో గుర్తించకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తలకిందులుగా ఉన్న జాతీయ జెండానే ఎగురవేసిన అనంతరం చప్పట్లు కొట్టడం, సెల్యూట్ చేయడం వంటి దృశ్యాలు కనిపించడంతో కార్యక్రమ నిర్వహణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ పతాకం విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అక్కడున్న వారు ఆ సమయంలో విషయాన్ని గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే జెండా ఆవిష్కరణ పూర్తయిన వెంటనే కొంతసేపటికి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తలకిందులుగా ఉన్న జాతీయ పతాకాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు జెండాను కిందకు దించి, సరైన విధంగా అమర్చి తిరిగి ఎగురవేశారు. పొరపాటును సరిచేసినప్పటికీ అప్పటికే జరిగిన ఘటన అక్కడ తీవ్ర చర్చకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం వంటి అత్యంత ప్రాధాన్యమైన జాతీయ పండుగ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే జాతీయ జెండా విషయంలో ఇలాంటి తప్పిదం చోటుచేసుకోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ పతాకం పట్ల గౌరవం, దాని నిర్వహణకు సంబంధించిన అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలని, ముఖ్యంగా ప్రజలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ జెండాను తప్పుగా ఎగురవేయడం లేదా దానిని కించపరిచే విధంగా వ్యవహరించడం జాతీయ పతాక నిబంధనలు, జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం - 1971 పరిధిలో తీవ్రమైన అంశంగా పరిగణించబడుతుందని పలువురు గుర్తుచేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయడం దేశభక్తి భావాలను అవమానపరిచే చర్యగా కనిపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పతాకాన్ని అత్యంత పవిత్రంగా భావించే దేశంలో దాని ఆవిష్కరణ సమయంలోనే ఇంతటి నిర్లక్ష్యం ఎలా చోటుచేసుకుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు బాధ్యత, క్రమశిక్షణ, దేశభక్తి గురించి చెప్పాల్సిన నాయకులే ముందుగా జాతీయ చిహ్నాల పట్ల పూర్తి అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. జెండానే సరిగా ఎగురవేయలేని వారు పరిపాలన ఏం చేస్తారు?: స్థానికుల గుసగుసలు జెండానే సరిగా ఎగురవేయలేని వారు పరిపాలన ఏం చేస్తారు? అనే ప్రశ్నలు ఇప్పుడు వర్ధన్నపేటలో వినిపిస్తున్నాయి. ఎంతో పవిత్రంగా, గౌరవంగా నిర్వహించాల్సిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలోనే ఇలాంటి అలసత్వం బయటపడితే.. ఇక ప్రజలకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాల్లో ఎంత మేరకు బాధ్యత, పారదర్శకత, అప్రమత్తత ఉంటుందనే సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాటుగా తీసిపారేయకుండా జాతీయ పతాకానికి సంబంధించిన అంశాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యక్రమ నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు, కఠిన ఆదేశాలు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వర్ధన్నపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జెండా తలకిందులుగా ఎగురుతున్న సమయంలో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు స్పందించిన తీరు కూడా వీడియోలో కనిపిస్తుండటంతో ఈ ఘటనపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాన జాతీయ పతాకం విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా, సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చ ఎటువైపు దారితీస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ALSO READ: Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Viral News
Reporter
STAR TRINETHRAM
14 రోజుల క్రితం
Logo

Nude Restaurant: ఆడ, మగ నగ్నంగా భోజనం చేసే వింత రెస్టారెంట్

Nude Restaurant: ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల వినూత్న ఆలోచనలతో రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తుంటారు. సాధారణంగా ప్రత్యేకమైన వంటకాలు, విభిన్న అలంకరణలు, వినూత్న వాతావరణంతో కస్టమర్లను ఆకర్షించే రెస్టారెంట్లు కనిపిస్తుంటాయి. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన విధానంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ నిర్వహించే ప్రత్యేక విందులో పాల్గొనే వారు ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా ఒకచోట కూర్చుని భోజనం చేస్తారు. ఈ అసాధారణ విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న 'క్లాస్ సోయిరీ స్టిక్ హాస్' అనే రెస్టారెంట్‌లో ప్రతి...

Nude Restaurant: ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల వినూత్న ఆలోచనలతో రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తుంటారు. సాధారణంగా ప్రత్యేకమైన వంటకాలు, విభిన్న అలంకరణలు, వినూత్న వాతావరణంతో కస్టమర్లను ఆకర్షించే రెస్టారెంట్లు కనిపిస్తుంటాయి. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన విధానంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ నిర్వహించే ప్రత్యేక విందులో పాల్గొనే వారు ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా ఒకచోట కూర్చుని భోజనం చేస్తారు. ఈ అసాధారణ విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న 'క్లాస్ సోయిరీ స్టిక్ హాస్' అనే రెస్టారెంట్‌లో ప్రతి నెలా మొదటి సోమవారం ప్రత్యేకంగా 'బేర్ ఇట్ ఆల్' కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక విందుకు ప్రతిసారి 15 నుంచి 20 మంది వరకు హాజరవుతారని సమాచారం. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు నగ్నంగా కూర్చుని భోజనం చేస్తారు. సాధారణ రెస్టారెంట్లకు భిన్నంగా ఉండే ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రత్యేక అనుభూతిగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విందులో పాల్గొనే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని సమాచారం. ఈ వినూత్న విందులో పాల్గొనేందుకు నిర్వాహకులు నిర్ణయించిన ప్రవేశ రుసుము కూడా ఆసక్తికరంగా ఉంది. ఒక్కో మహిళకు రూ.14,300, పురుషుడికి రూ.23,842 చొప్పున టికెట్ ధర ఉంటుందని సమాచారం. ఇక జంటగా హాజరయ్యే వారికి రూ.28,575 వరకు రుసుము వసూలు చేస్తారట. ఈ ప్రత్యేక ప్రవేశ రుసుములో భాగంగా షాంపైన్‌తో పాటు 5 రకాల వంటకాలతో కూడిన భోజనాన్ని అందిస్తారని తెలుస్తోంది. దీంతో సాధారణంగా రెస్టారెంట్లలో కనిపించని ఈ తరహా కార్యక్రమం విభిన్న అనుభూతిని కోరుకునే వారిని ఆకర్షిస్తున్నట్లు సమాచారం. సాధారణ భోజన విధానాలకు పూర్తిగా భిన్నంగా ఉండే ఈ కార్యక్రమం కారణంగా ఫ్లోరిడాలోని ఈ రెస్టారెంట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వింత ఆలోచనలతో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు కొందరిని ఆకట్టుకుంటుండగా, మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన విందు విధానం, దాని కోసం నిర్ణయించిన రుసుములు, అక్కడ అందించే వంటకాలపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ALSO READ: Lakshmi: వేశ్యాగృహంలో మిస్టరీ.. క్లైమాక్స్‌లో ఆ సీన్లు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
18 రోజుల క్రితం
Logo

Hanumakonda District: ‘స్టార్ త్రినేత్రం’ కథనాలకు కదులుతున్న నెట్‌వర్క్!

వేలేరు తహశీల్దార్ కార్యాలయ ఆరోపణలపై పెరుగుతున్న చర్చ కథనాలపై ఆరా.. తమకూ అన్యాయం జరిగిందంటున్న ఇతర బాధితులు..? ఉన్నతాధికారులు స్పందించాలని ‘బాధితుల’ విజ్ఞప్తి Hanumakonda District: హనుమకొండ జిల్లా వేలేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ‘స్టార్ త్రినేత్రం’లో ప్రచురితమైన కథనాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కథనం వెలువడిన అనంతరం పలువురు ‘స్టార్ త్రినేత్రం’ను సంప్రదిస్తున్నారు. అదే సమయంలో తమకు కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని పనుల కోసం అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మరికొందరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ పేర్లు ప్రస్తుతం బయటకు వెల్లడించేందుకు ఇష్టపడకపోయినా,...

  • వేలేరు తహశీల్దార్ కార్యాలయ ఆరోపణలపై పెరుగుతున్న చర్చ
  • కథనాలపై ఆరా..
  • తమకూ అన్యాయం జరిగిందంటున్న ఇతర బాధితులు..?
  • ఉన్నతాధికారులు స్పందించాలని ‘బాధితుల’ విజ్ఞప్తి
  • Hanumakonda District: హనుమకొండ జిల్లా వేలేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ‘స్టార్ త్రినేత్రం’లో ప్రచురితమైన కథనాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కథనం వెలువడిన అనంతరం పలువురు ‘స్టార్ త్రినేత్రం’ను సంప్రదిస్తున్నారు. అదే సమయంలో తమకు కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని పనుల కోసం అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మరికొందరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ పేర్లు ప్రస్తుతం బయటకు వెల్లడించేందుకు ఇష్టపడకపోయినా, అవసరమైతే సంబంధిత ఆధారాలతో అధికారుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని, ఆరోపణల్లో నిజానిజాలు నిర్ధారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తమకు కూడా అన్యాయం జరిగిందంటూ మరికొందరు బాధితులు ‘స్టార్ త్రినేత్రం’ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అందువల్ల ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ‘బాధితులు’ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. విచారణ అనంతరం వాస్తవ పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ALSO READ: Hanumakonda District: తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
19 రోజుల క్రితం
Logo

Hanumakonda District: తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు

మధ్యవర్తిగా రికార్డ్ అసిస్టెంట్..! పట్టా కోసం ఎకరానికి రూ.10వేల డిమాండ్..? 3 ఎకరాలకు రూ.30 వేలు కోరినట్లు రైతుల ఆరోపణ గిఫ్ట్ డీడ్ పట్టాకు డబ్బుల డిమాండ్ కలకలం మేడం డబ్బులు అడుగుతున్నారని చెప్పిన రికార్డ్ అసిస్టెంట్ వేలేరు మండలంలో బయటపడ్డ 'డీల్' బాగోతం! అధికారుల వ్యవహారంపై 'స్టార్ త్రినేత్రం'ను సంప్రదించిన రైతులు Hanumakonda District: హనుమకొండ జిల్లా వేలేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. గిఫ్ట్ డీడ్ ఆధారంగా భూమికి పట్టా మంజూరు చేయించుకునేందుకు వచ్చిన రైతుల నుంచి ఎకరానికి రూ.10వేల చొప్పున డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితులు...

  • మధ్యవర్తిగా రికార్డ్ అసిస్టెంట్..!
  • పట్టా కోసం ఎకరానికి రూ.10వేల డిమాండ్..?
  • 3 ఎకరాలకు రూ.30 వేలు కోరినట్లు రైతుల ఆరోపణ
  • గిఫ్ట్ డీడ్ పట్టాకు డబ్బుల డిమాండ్ కలకలం
  • మేడం డబ్బులు అడుగుతున్నారని చెప్పిన రికార్డ్ అసిస్టెంట్
  • వేలేరు మండలంలో బయటపడ్డ 'డీల్' బాగోతం!
  • అధికారుల వ్యవహారంపై 'స్టార్ త్రినేత్రం'ను సంప్రదించిన రైతులు
Hanumakonda District: హనుమకొండ జిల్లా వేలేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. గిఫ్ట్ డీడ్ ఆధారంగా భూమికి పట్టా మంజూరు చేయించుకునేందుకు వచ్చిన రైతుల నుంచి ఎకరానికి రూ.10వేల చొప్పున డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 3 ఎకరాల భూమికి రూ.30 వేలు ఇవ్వాలని కోరినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రక్రియకు డబ్బులు అడగడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల కథనం ప్రకారం.. పట్టా కావాలంటే "మేడం డబ్బులు అడుగుతున్నారు" అని రికార్డ్ అసిస్టెంట్ తమతో చెప్పినట్లు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రైతుల్లో మరింత అనుమానాలకు తావిచ్చాయని, ప్రభుత్వ కార్యాలయంలో జరిగే పనులకు ఇలాంటి డిమాండ్లు రావడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న వివరాలు, ఫోన్ సంభాషణల ఆధారంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. వేలేరు మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ ఆరోపణలు స్థానికంగా సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ బాధితులు ‘స్టార్ త్రినేత్రం’ను ఆశ్రయించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. విచారణ అనంతరం ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంతుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ALSO READ: Warangal: లంచం ఇస్తే.. పట్టా..!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
21 రోజుల క్రితం
Logo

Warangal: లంచం ఇస్తే.. పట్టా..!

మధ్యవర్తిగా రికార్డ్ అసిస్టెంట్!.. ఎమ్మార్వో డీల్? Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మండల రెవెన్యూ కార్యాలయంలో పట్టాల మంజూరు పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన చోట కొంతమంది అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పట్టా సంబంధిత పనులు పూర్తి చేయించాలంటే తప్పనిసరిగా డబ్బు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని పలువురు బాధిత రైతులు వాపోతున్నారు. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకుండా, ప్రక్రియ పేరుతో వారిని కార్యాలయం చుట్టూ తిప్పించి చివరికి లంచం డిమాండ్...

మధ్యవర్తిగా రికార్డ్ అసిస్టెంట్!.. ఎమ్మార్వో డీల్? Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మండల రెవెన్యూ కార్యాలయంలో పట్టాల మంజూరు పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన చోట కొంతమంది అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పట్టా సంబంధిత పనులు పూర్తి చేయించాలంటే తప్పనిసరిగా డబ్బు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని పలువురు బాధిత రైతులు వాపోతున్నారు. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకుండా, ప్రక్రియ పేరుతో వారిని కార్యాలయం చుట్టూ తిప్పించి చివరికి లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ రికార్డ్ అసిస్టెంట్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడని, అతని ద్వారా మొత్తం వ్యవహారం నడుస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. పట్టా మంజూరు కోసం ఎకరానికి రూ.10 వేల చొప్పున డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. డబ్బు చెల్లించిన వారి దరఖాస్తులు వేగంగా ముందుకు సాగుతుండగా, చెల్లించని వారి ఫైళ్లు పెండింగ్‌లో ఉంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎమ్మార్వో కార్యాలయానికి చెందిన అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డ్ అసిస్టెంట్ ద్వారా డబ్బు వసూలు చేసి పైస్థాయికి చేరవేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో ఎమ్మార్వో అధికారిక వాహనం నడిపే డ్రైవర్‌కు కూడా లంచాల ద్వారానే జీతం అందుతున్నట్లు ప్రచారం జరుగుతుండడం వివాదానికి మరింత ఊతమిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలు, బాధితుల వాంగ్మూలాలు, ఆధారాలతో కూడిన ప్రత్యేక కథనాన్ని త్వరలో ‘స్టార్ త్రినేత్రం’ పాఠకుల ముందుకు తీసుకురానుంది. ALSO READ: Ghost Train: ట్రైన్ మొత్తం దెయ్యాలే.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
22 రోజుల క్రితం
Logo

Hanumakonda: జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో కేంబ్రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ

60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌లో ఆకట్టుకున్న విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్ష Hanumakonda: హనుమకొండ జిల్లాలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ఇంటర్నేషనల్ స్కూల్, గోపాలపూర్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు. హనుమకొండలోని జె.ఎన్.ఎస్. స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకుంటూ పోటీల్లో ధైర్యంగా పాల్గొనడం పాఠశాల విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులు 60 మీటర్ల పరుగుపందెం, లాంగ్...

  • 60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌లో ఆకట్టుకున్న విద్యార్థులు
  • భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్ష
Hanumakonda: హనుమకొండ జిల్లాలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ఇంటర్నేషనల్ స్కూల్, గోపాలపూర్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు. హనుమకొండలోని జె.ఎన్.ఎస్. స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకుంటూ పోటీల్లో ధైర్యంగా పాల్గొనడం పాఠశాల విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులు 60 మీటర్ల పరుగుపందెం, లాంగ్ జంప్ విభాగాల్లో పోటీపడి తమ ప్రతిభను చాటుకోవడంతో పాటు పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పోటీతత్వం వంటి విలువలు అలవడతాయని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తాబేటి శ్రావణి, మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ ఐలి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ సమానంగా రాణించాలని, ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను వెలికితీసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు పాఠశాల యాజమాన్యం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జెన్నిఫర్, పీ.ఈ.టీలు సతీష్, సమ్రీన్, ఉపాధ్యాయులు దివ్య, కావ్య విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తూ ప్రతి దశలో ప్రోత్సహించారు. పోటీలకు ముందు శిక్షణ నుంచి పోటీలు ముగిసే వరకు విద్యార్థులకు అండగా నిలిచి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, పాఠశాల యాజమాన్యం అందిస్తున్న సహకారం వల్లే విద్యార్థులు క్రీడల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని కల్పించిన హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ.వరదా రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె.సారంగపాణికి మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ ఐలి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు జిల్లా అథ్లెటిక్స్ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచడంతో పాటు ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రేరణగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరిన్ని క్రీడా వేదికలు ఏర్పడి విద్యార్థుల ప్రతిభకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ALSO READ: Ghost Train: ట్రైన్ మొత్తం దెయ్యాలే.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Entertainment News
Reporter
STAR TRINETHRAM
23 రోజుల క్రితం
Logo

Ghost Train: ట్రైన్ మొత్తం దెయ్యాలే.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్

Ghost Train: 2024లో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన కొరియన్ భయానక చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఘోస్ట్ ట్రైన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అందుబాటులోకి వచ్చింది. ప్రతి వారం మాదిరిగానే ఈసారి కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ వేదికల్లో సందడి చేస్తున్నాయి. తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది ఘోస్ట్ ట్రైన్. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉండటంతో భయానక కథలను ఇష్టపడే సినీ ప్రియుల్లో ఆసక్తి...

Ghost Train: 2024లో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన కొరియన్ భయానక చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఘోస్ట్ ట్రైన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అందుబాటులోకి వచ్చింది. ప్రతి వారం మాదిరిగానే ఈసారి కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ వేదికల్లో సందడి చేస్తున్నాయి. తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది ఘోస్ట్ ట్రైన్. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉండటంతో భయానక కథలను ఇష్టపడే సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. కేవలం గంటన్నర నిడివి ఉన్నప్పటికీ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ, ఊహించని మలుపులు, ఉత్కంఠ రేపే సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తోంది. ఈ చిత్రం కథ ఆధునిక కాలంలో సోషల్ మీడియా ప్రభావాన్ని భయానక కథతో మేళవిస్తూ ముందుకు సాగుతుంది. అసాధారణ సంఘటనలు, అతీంద్రియ కథనాలపై వీడియోలు రూపొందించే ఓ యువతి తనకు ఆశించిన ఆదరణ, వీక్షణలు రాకపోవడంతో సంచలన అంశాల కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో వింత కథనాలు ప్రచారంలో ఉన్న ఓ పాత రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి స్టేషన్ మాస్టర్ ఆమెకు నాలుగు భయానక సంఘటనల గురించి వివరిస్తాడు. ఆ కథలు విన్న తర్వాత ఆమె జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. కేవలం పేరు, గుర్తింపు కోసం వెళ్లిన ఆమె స్వయంగా ఆ భయంకరమైన రైలులో దాగి ఉన్న రహస్య ఉచ్చులో ఎలా చిక్కుకుంది, అక్కడి నుంచి బయటపడగలిగిందా లేదా అనే అంశాల చుట్టూనే కథ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి మలుపులో కొత్త ఉత్కంఠను సృష్టించే ఈ చిత్రం చివరి వరకు ప్రేక్షకులను ఆలోచింపజేస్తూనే భయపెడుతుంది. 2024లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఘోస్ట్ ట్రైన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషలో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండటంతో మరింత మంది ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఏర్పడింది. భయానక కథలు, అతీంద్రియ సంఘటనలు, ఉత్కంఠభరిత కథనాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం మంచి వినోదాన్ని అందించే అవకాశముంది. ముఖ్యంగా సోషల్ మీడియా కోసం సంచలనాల వెంటపడే పరిస్థితులు ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తాయో చూపించే విధానం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ALSO READ: Malaika Arora: 19 ఏళ్ల చిన్నవాడితో 52 ఏళ్ల హీరోయిన్ డేటింగ్..!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Entertainment News
Reporter
STAR TRINETHRAM
24 రోజుల క్రితం
Logo

Malaika Arora: 19 ఏళ్ల చిన్నవాడితో 52 ఏళ్ల హీరోయిన్ డేటింగ్..!

Malaika Arora: ప్రేమకు, వివాహానికి వయసుతో సంబంధం లేదనే అభిప్రాయాన్ని పలువురు సినీ ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల ద్వారా మరోసారి చర్చనీయాంశంగా మారుస్తున్నారు. కొందరు చిన్న వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెడితే, మరికొందరు చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే తమకంటే పెద్దవారిని లేదా చిన్నవారిని జీవిత భాగస్వాములుగా ఎంచుకున్న సినీ ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి మలైకా అరోరా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఒక వివాహం ముగియడం, అనంతరం మరో ప్రేమ బంధానికి కూడా ముగింపు పలకడం తర్వాత ఇప్పుడు మరో వ్యక్తితో...

Malaika Arora: ప్రేమకు, వివాహానికి వయసుతో సంబంధం లేదనే అభిప్రాయాన్ని పలువురు సినీ ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల ద్వారా మరోసారి చర్చనీయాంశంగా మారుస్తున్నారు. కొందరు చిన్న వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెడితే, మరికొందరు చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే తమకంటే పెద్దవారిని లేదా చిన్నవారిని జీవిత భాగస్వాములుగా ఎంచుకున్న సినీ ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి మలైకా అరోరా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఒక వివాహం ముగియడం, అనంతరం మరో ప్రేమ బంధానికి కూడా ముగింపు పలకడం తర్వాత ఇప్పుడు మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా కనిపిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. మలైకా అరోరా గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మలైకా, తనకంటే 12 సంవత్సరాలు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలాకాలం పాటు వినిపించాయి. ఇద్దరూ కలిసి పలు సందర్భాల్లో కనిపించడంతో వారి సంబంధం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఆ బంధం కూడా ఎక్కువకాలం కొనసాగకుండా 2024లో ముగిసినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాల అనంతరం మలైకా వ్యక్తిగత జీవితం మరోసారి ఆసక్తికరంగా మారింది. తాజాగా మలైకా అరోరా తనకంటే 19 సంవత్సరాలు చిన్నవాడైన హర్ష్ మెహతాతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపార కుటుంబానికి చెందిన హర్ష్ మెహతా ప్రస్తుతం కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. అతడి వయసు 33 సంవత్సరాలు కాగా, మలైకా వయసు 52 సంవత్సరాలు. గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో కనిపించడం చర్చకు దారితీసింది. విమానాశ్రయం, వ్యక్తిగత వేడుకలు, స్నేహితుల సమావేశాల్లో ఇద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నిర్వహించిన ఒక వ్యక్తిగత వేడుకకు మలైకా అరోరా, హర్ష్ మెహతా హాజరుకావడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై మలైకా అరోరా లేదా హర్ష్ మెహతా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వీరిద్దరి గురించి వినిపిస్తున్న సమాచారం అంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆధారంగానే ఉంది. ALSO READ: Inspirational Story: 21 ఏళ్లకే పెళ్లి.. 23 ఏళ్లకే తల్లి.. తండ్రి కలను నెరవేర్చిన ఐఏఎస్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
National News
Reporter
STAR TRINETHRAM
25 రోజుల క్రితం
Logo

Inspirational Story: 21 ఏళ్లకే పెళ్లి.. 23 ఏళ్లకే తల్లి.. తండ్రి కలను నెరవేర్చిన ఐఏఎస్

Inspirational Story: పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్యసాధనపై అచంచలమైన నమ్మకం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించి అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని ఐఏఎస్ అధికారిణి మిన్ను పి.ఎం.జోషి జీవిత ప్రయాణం మరోసారి చాటిచెబుతోంది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, చిన్నారి సంరక్షణ వంటి ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూనే సివిల్ సర్వీసెస్ వంటి అత్యంత కఠినమైన పరీక్షలో విజయం సాధించిన ఆమె కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ఎన్నో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని వదులుకోకుండా నిరంతర శ్రమతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సొంతమవుతుందనే సందేశాన్ని ఆమె జీవిత గాథ అందిస్తోంది. కేరళలోని పత్తనంతిట్టకు...

Inspirational Story: పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్యసాధనపై అచంచలమైన నమ్మకం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించి అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని ఐఏఎస్ అధికారిణి మిన్ను పి.ఎం.జోషి జీవిత ప్రయాణం మరోసారి చాటిచెబుతోంది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, చిన్నారి సంరక్షణ వంటి ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూనే సివిల్ సర్వీసెస్ వంటి అత్యంత కఠినమైన పరీక్షలో విజయం సాధించిన ఆమె కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ఎన్నో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని వదులుకోకుండా నిరంతర శ్రమతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సొంతమవుతుందనే సందేశాన్ని ఆమె జీవిత గాథ అందిస్తోంది. కేరళలోని పత్తనంతిట్టకు చెందిన మిన్ను పి.ఎం.జోషి చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయారు. పోలీస్ అధికారిగా పనిచేసిన ఆయన మరణంతో ప్రభుత్వం కల్పించిన కారుణ్య నియామకం కింద 2012లో కేరళ పోలీస్ శాఖలో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు. అయితే ఉద్యోగం వచ్చినంత మాత్రాన అక్కడితో ఆగిపోకుండా, తన తండ్రి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఉద్యోగంతో పాటు కేరళ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి తన విద్యాప్రస్థానాన్ని మరింత బలపరిచారు. చిన్నప్పటి నుంచే తన కుమార్తె ఉన్నతాధికారిగా ఎదగాలని తండ్రి కలలు కనడం మిన్నుకు జీవితాంతం ప్రేరణగా నిలిచింది. 21 ఏళ్ల వయసులో ఇస్రోలో అధికారిగా పనిచేస్తున్న జోషి డి.జె.ను వివాహం చేసుకున్న ఆమె, 23 ఏళ్లకే తల్లిగా కొత్త బాధ్యతలను స్వీకరించారు. దీంతో సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధం కావడంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. కేవలం కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తిగానే కాకుండా, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని సంకల్పించి 26 ఏళ్ల వయసులో సివిల్స్‌కు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ప్రతి రోజూ ఉదయం శంకర్ లైబ్రరీకి వెళ్లి వార్తాపత్రికలు అధ్యయనం చేయడం, శంకర్ ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందడం, పగలు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం, రాత్రి గంటల తరబడి చదవడం, అదే సమయంలో కుటుంబ బాధ్యతలను నిర్వహించడం వంటి కఠినమైన దినచర్యను అలవాటు చేసుకున్నారు. వరుసగా 5 ప్రయత్నాల్లో అపజయాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా, ప్రతి వైఫల్యాన్ని పాఠంగా మలుచుకుని చివరకు 6వ ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 150వ అఖిల భారత ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిణిగా నిలిచారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో భట్కులి-తివాసా ఉపవిభాగానికి అసిస్టెంట్ కలెక్టర్‌గా సేవలందిస్తున్న మిన్ను పి.ఎం. జోషి, ఉద్యోగం, కుటుంబం, పిల్లల బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే అత్యున్నత లక్ష్యాలను సాధించవచ్చని తన విజయగాథతో ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ALSO READ: Lakshmi: వేశ్యాగృహంలో మిస్టరీ.. క్లైమాక్స్‌లో ఆ సీన్లు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Entertainment News
Reporter
STAR TRINETHRAM
26 రోజుల క్రితం
Logo

Lakshmi: వేశ్యాగృహంలో మిస్టరీ.. క్లైమాక్స్‌లో ఆ సీన్లు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది..

Lakshmi: సమాజంలో దాగి ఉన్న చేదు వాస్తవాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కొన్ని సినిమాలు ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఆలోచింపజేసే కథలతో ప్రేక్షకుల మనసులను కదిలించే చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో ఒకటే 2014లో విడుదలైన లక్ష్మి. మానవ అక్రమ రవాణా, బాలికలపై జరుగుతున్న దారుణాలు, అధికార వ్యవస్థలోని లోపాలు, న్యాయం కోసం ఒక చిన్నారి చేసిన పోరాటం వంటి అంశాలను హృదయాన్ని కదిలించేలా ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేయడమే కాకుండా, సమాజంలో ఇలాంటి ఘటనలు ఎంత భయానకంగా...

Lakshmi: సమాజంలో దాగి ఉన్న చేదు వాస్తవాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కొన్ని సినిమాలు ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఆలోచింపజేసే కథలతో ప్రేక్షకుల మనసులను కదిలించే చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో ఒకటే 2014లో విడుదలైన లక్ష్మి. మానవ అక్రమ రవాణా, బాలికలపై జరుగుతున్న దారుణాలు, అధికార వ్యవస్థలోని లోపాలు, న్యాయం కోసం ఒక చిన్నారి చేసిన పోరాటం వంటి అంశాలను హృదయాన్ని కదిలించేలా ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేయడమే కాకుండా, సమాజంలో ఇలాంటి ఘటనలు ఎంత భయానకంగా జరుగుతున్నాయో ఈ సినిమా స్పష్టంగా చూపించింది. అందుకే ఈ చిత్రాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రత్యేకంగా గుర్తించారు. ఈ చిత్రానికి నాగేష్ కుకునూర్ కథ, కథనం, దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రలో మోనాలి ఠాకూర్ నటించారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. అలాగే షెఫాలీ షా, రామ్ కపూర్, సతీష్ కౌశిక్, నాగేష్ కుకునూర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను అత్యంత సహజంగా చూపించిన ఈ చిత్రం పామ్ స్ప్రింగ్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ కథా చిత్రం విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ, భారతదేశంలో విడుదలకు ముందు సెన్సార్ సమస్యలను ఎదుర్కొంది. దీంతో సినిమా విడుదల కొంతకాలం ఆలస్యమై, చివరకు 2014 మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్‌లో ఉచితంగా వీక్షించేందుకు అందుబాటులో ఉంది. ఈ సినిమా కథ 14 ఏళ్ల లక్ష్మి అనే బాలిక జీవితాన్ని ఆధారంగా తీసుకుని సాగుతుంది. గ్రామంలో నివసించే ఆమెను ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి హైదరాబాద్‌కు తీసుకువస్తారు. అయితే అక్కడ ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంటి పనుల కోసం తీసుకొచ్చిన బాలికపై పలుకుబడి ఉన్న రెడ్డి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా తీవ్రంగా హింసిస్తాడు. అనంతరం ఆమెను వ్యభిచార గృహానికి విక్రయిస్తారు. అక్కడి నుంచి ప్రాణాలను పణంగా పెట్టి తప్పించుకున్న లక్ష్మి పోలీసులను ఆశ్రయించినా, ఆమెకు న్యాయం దక్కదు. నిందితుడి ప్రభావం, లంచాలతో పోలీసులు కూడా ఆమె ఫిర్యాదును పట్టించుకోరు. అయినప్పటికీ లక్ష్మి వెనక్కి తగ్గకుండా తనపై జరిగిన అన్యాయాన్ని బయటపెట్టేందుకు నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది. సినిమా చివరి భాగం ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంది. న్యాయస్థానంలో సాక్ష్యం చెబుతున్న సమయంలో లక్ష్మి సంచలన నిజాన్ని బయటపెడుతుంది. తన సొంత తండ్రే తనను స్థానిక రాజకీయ నాయకుడికి అమ్మేశాడని, ఆ తర్వాత ఆ రాజకీయ నాయకుడు తనను మానవ అక్రమ రవాణా ముఠాకు అప్పగించాడని ఆమె వెల్లడిస్తుంది. ఈ సంఘటనతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. తనలాంటి బాధిత బాలికలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో బెదిరింపులను, ఒత్తిడులను లెక్కచేయకుండా నిందితులపై పోరాటం కొనసాగించిన లక్ష్మి ధైర్యసాహసాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. సమాజంలో మానవ అక్రమ రవాణా వంటి నేరాలపై అవగాహన కల్పిస్తూ, బాధితుల గొంతుకగా నిలిచిన ఈ చిత్రం నేటికీ ఆలోచింపజేసే సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ALSO READ: Hyderabad: పిల్లలున్నా పెళ్లిచేసుకుంటానని.. మోజు తీరాక బ్లాక్!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Business News
Reporter
STAR TRINETHRAM
27 రోజుల క్రితం
Logo

New Rules: ఆగస్టు 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఇవే..

New Rules: ఆగస్టు నెల ప్రారంభంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపే పలు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, పెట్టుబడులు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ రవాణా సేవలు వంటి అనేక రంగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా వినియోగదారుల గుర్తింపు ప్రక్రియను మరింత సులభతరం చేసే కొత్త కేవైసీ విధానం, రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త టోకెన్ విధానం, బ్యాంకుల సేవా రుసుముల్లో మార్పులు, షేర్ల బైబ్యాక్ నిబంధనల్లో సవరణలు అమల్లోకి రానుండటంతో ప్రజలు ఈ మార్పులపై ముందుగానే అవగాహన కలిగి ఉండటం...

New Rules: ఆగస్టు నెల ప్రారంభంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపే పలు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, పెట్టుబడులు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ రవాణా సేవలు వంటి అనేక రంగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా వినియోగదారుల గుర్తింపు ప్రక్రియను మరింత సులభతరం చేసే కొత్త కేవైసీ విధానం, రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త టోకెన్ విధానం, బ్యాంకుల సేవా రుసుముల్లో మార్పులు, షేర్ల బైబ్యాక్ నిబంధనల్లో సవరణలు అమల్లోకి రానుండటంతో ప్రజలు ఈ మార్పులపై ముందుగానే అవగాహన కలిగి ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతినెల మాదిరిగానే ఆగస్టు 1న కూడా ఎల్పీజీ సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సమీక్షించనున్నాయి. ఇప్పటికే జూలై 1న 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.183.50 మేర తగ్గించగా, 5 కేజీల సిలిండర్ ధరను కూడా రూ.13 తగ్గించారు. దీంతో ఈసారి కూడా ధరల్లో మార్పులు ఉండే అవకాశాలపై వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం.. ఆగస్టు 1 నుంచి బ్యాంకులు, బీమా సంస్థలు కలిసి "సెంట్రల్ కేవైసీ 2.0" విధానాన్ని ప్రారంభించనున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా ఒకసారి వినియోగదారుడి వివరాలు ధృవీకరించబడితే, ప్రతి ఆర్థిక సంస్థకు విడివిడిగా గుర్తింపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. వినియోగదారుడి సమ్మతితో కేంద్ర రిజిస్ట్రీలో ఉన్న ధృవీకరించిన సమాచారాన్ని సంబంధిత సంస్థలు నేరుగా పొందగలుగుతాయి. కొత్త ఖాతా ప్రారంభం లేదా వివరాల నవీకరణ సమయంలో ఈ ప్రక్రియ అమలవుతుంది. ధృవీకరణ వివరాలు వినియోగదారుడి మొబైల్ నంబర్‌కు చేరిన అనంతరం ఆమోదం లభిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. భవిష్యత్తులో ఆస్తి నిర్వహణ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఈ వ్యవస్థలో భాగం కానున్నాయి. రైల్వే ప్రయాణికులకు కూడా ఆగస్టు 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. పశ్చిమ మధ్య రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం టోకెన్ పంపిణీ సమయాల్లో మార్పులు చేసింది. కొత్త విధానం ప్రకారం ఏసీ 1 తరగతి టోకెన్లు ఉదయం 8:30 నుంచి 9:00 గంటల వరకు, నాన్-ఏసీ టోకెన్లు ఉదయం 9:00 నుంచి 9:30 గంటల వరకు అందజేస్తారు. దీంతో ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్‌కు రెండుసార్లు వెళ్లాల్సిన అవసరం లేకుండా బుకింగ్ ప్రక్రియ మరింత సులభంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. బ్యాంకింగ్ రంగంలో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి వస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ అంతర్జాతీయ లావాదేవీలపై వర్తించే డైనమిక్ కరెన్సీ మార్పిడి రుసుమును 1 శాతం నుంచి 3.5 శాతానికి పెంచింది. దీనికి అదనంగా వర్తించే పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం సేకరణ నిర్వహణ సేవలు, జాతీయ స్వయంచాలక క్లియరింగ్ సేవలు, ఏకీకృత చెల్లింపుల విధానానికి సంబంధించిన రుసుములను సవరించింది. యూపీఐ మాండేట్ నమోదు కోసం ఒక్కో మాండేట్‌కు రూ.125 చెల్లించాల్సి ఉండగా, ఆర్థిక కారణాలతో తిరస్కరించబడిన లావాదేవీలపై వసూలు చేసే రుసుమును ఒక్కో లావాదేవీకి రూ.250కు పెంచింది. పెట్టుబడిదారులకు సంబంధించిన నిబంధనల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత సెక్యూరిటీల నియంత్రణ సంస్థ ఓపెన్ మార్కెట్‌లో కంపెనీలు తమ సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే విధానానికి సంబంధించిన నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం బైబ్యాక్ ప్రక్రియ గరిష్టంగా 66 పనిదినాల్లో పూర్తవ్వాలి. బహిరంగ ప్రకటన వెలువడిన 4 పనిదినాల్లో బైబ్యాక్ ప్రారంభం కావాల్సి ఉంటుంది. అలాగే సాధారణ ట్రేడింగ్ విధానం ద్వారా కూడా షేర్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ కొనుగోళ్లు కంపెనీ చెల్లించిన మూలధనం, ఉచిత నిల్వలలో 15 శాతం పరిమితిని మించకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కొత్త నిబంధనలను అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఆగస్టు 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు రాష్ట్ర నివాస ధృవీకరణ పత్రం తప్పనిసరి కానుంది. ఇక ఢిల్లీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి పింక్ సహేలి స్మార్ట్ కార్డు తప్పనిసరి చేయనున్నారు. జూలై 31 వరకు పాత కాగితపు టికెట్ విధానం కొనసాగుతుండగా, ఆగస్టు 1 నుంచి స్మార్ట్ కార్డు ఉన్నవారికే ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ మార్పులతో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో కొత్త విధానాలు అమల్లోకి వస్తుండటంతో ప్రజలు ముందుగానే వాటి గురించి తెలుసుకుని అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ALSO READ: Actress Jeevitha: ఎవరి భర్త సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్నా నేను సమర్థిస్తా!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
28 రోజుల క్రితం
Logo

Mantena Manikumar: సేవకు మారుపేరైన ‘అమ్మ ఫౌండేషన్’

ఉద్యమం నుంచి మానవ సేవ వరకు మంతెన మణికుమార్ ప్రయాణం పదేళ్లుగా నిరంతర సేవతో ప్రత్యేక గుర్తింపు ఆకలికి అండగా నిలిచిన అమ్మ ఫౌండేషన్ కరోనా కాలంలో ఆదర్శంగా నిలిచిన సేవలు పుట్టినరోజులను సేవా దినోత్సవాలుగా మార్చిన సంస్థ విద్య, వైద్యం, అన్నదానంలో విశేష కృషి జనగామలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం భవిష్యత్ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న అమ్మ ఫౌండేషన్ సేవే లక్ష్యంగా సాగుతున్న దశాబ్దపు ప్రయాణం Mantena Manikumar: జనగామ నేలపై ఎన్నో సామాజిక, రాజకీయ ఉద్యమాలు జరిగినా, కొందరి జీవిత ప్రయాణాలు మాత్రం ఉద్యమాలకే పరిమితం కాకుండా సేవా భావానికి కొత్త నిర్వచనం...

  • ఉద్యమం నుంచి మానవ సేవ వరకు మంతెన మణికుమార్ ప్రయాణం
  • పదేళ్లుగా నిరంతర సేవతో ప్రత్యేక గుర్తింపు
  • ఆకలికి అండగా నిలిచిన అమ్మ ఫౌండేషన్
  • కరోనా కాలంలో ఆదర్శంగా నిలిచిన సేవలు
  • పుట్టినరోజులను సేవా దినోత్సవాలుగా మార్చిన సంస్థ
  • విద్య, వైద్యం, అన్నదానంలో విశేష కృషి
  • జనగామలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
  • భవిష్యత్ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న అమ్మ ఫౌండేషన్
  • సేవే లక్ష్యంగా సాగుతున్న దశాబ్దపు ప్రయాణం
Mantena Manikumar: జనగామ నేలపై ఎన్నో సామాజిక, రాజకీయ ఉద్యమాలు జరిగినా, కొందరి జీవిత ప్రయాణాలు మాత్రం ఉద్యమాలకే పరిమితం కాకుండా సేవా భావానికి కొత్త నిర్వచనం చెబుతాయి. అలాంటి అరుదైన ప్రయాణాల్లో జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, చిన్ననాటి కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన ఆయన జీవితం నేడు వేలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉద్యమాల నుంచి మానవ సేవ వైపు అడుగులు వేసిన ఆయన ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు, సమాజం కోసం అంకితమైన జీవితానికి నిలువెత్తు నిదర్శనం. పదేళ్లుగా నిరంతరాయంగా సాగుతున్న అమ్మ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నేడు జనగామ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. మంతెన మణికుమార్ 1984 అక్టోబర్ 27న జన్మించారు. వారి పూర్వీకుల స్వస్థలం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం లక్ష్మంజిపల్లి గ్రామం కాగా, తల్లి కుటుంబం జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందినది. కుటుంబ పరిస్థితుల కారణంగా జనగామకు వచ్చిన ఆయన కుటుంబం సంజయ్‌నగర్ ప్రాంతంలో స్థిరపడింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో తాత ఉడత వెంకటయ్య, అమ్మమ్మ వెంకటమ్మల సంరక్షణలో పెరిగారు. ఆ ప్రేమ, ఆప్యాయతల మధ్యే ఆయనలో మానవత్వం, సేవాభావం, సమాజంపై బాధ్యత అనే విలువలు బలంగా పెరిగాయి. బాల్యంలోనే పెద్దల నుంచి స్వాతంత్ర్య సమరయోధుల కథలు, నిజాం పాలనలో జరిగిన పోరాటాల గురించి వింటూ పెరిగిన మణికుమార్ మనసులో దేశభక్తి బలంగా నాటుకుపోయింది. చేనేత వృత్తితో జీవనం సాగించిన కుటుంబంలో జన్మించిన మణికుమార్‌కు శ్రమ విలువ చిన్నప్పుడే తెలిసింది. ఆయన తండ్రి మంతెన శంకరయ్య చేనేత కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు, పింఛన్లు, మరణానంతర ఆర్థిక సహాయం, అంత్యోదయ రేషన్ కార్డులు వంటి అనేక డిమాండ్ల సాధన కోసం నిరంతరం ఉద్యమాలు చేశారు. 2011లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో కూడా పాల్గొని చేనేత కార్మికుల సమస్యలను దేశ దృష్టికి తీసుకెళ్లారు. చిన్న వయసులోనే తండ్రితో కలిసి ఆ ఉద్యమాలను చూసిన మణికుమార్‌కు సమాజం కోసం పనిచేయాలనే సంకల్పం మరింత బలపడింది. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించే నాయకత్వ లక్షణాలు అప్పుడే ఆయనలో పెరిగాయి. విద్యాభ్యాసం జనగామలోని శ్రీవిద్య మందిర్ పాఠశాలలో పదో తరగతి వరకు కొనసాగింది. చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచిన ఆయన విప్లవ వీరుడు భగత్‌సింగ్ ఆలోచనలతో ప్రభావితమయ్యారు. యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించాలనే లక్ష్యంతో భగత్‌సింగ్ యువజన బృందాన్ని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యువతను ఒక్కచోట చేర్చి రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నాయకత్వాన్ని చాటుకున్నారు. యువతలో ఉన్న శక్తిని సమాజానికి ఉపయోగపడేలా మలచాలనే ఆలోచన అప్పుడే ఆయనలో స్పష్టంగా కనిపించింది. ప్రజా సమస్యలపై స్పందించే స్వభావం కారణంగా ఆయన రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా యువమోర్చా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో యువమోర్చా అధ్యక్షుడిగా రెండు సార్లు బాధ్యతలు చేపట్టి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి కార్యక్రమంలో ముందుండి పాల్గొన్నారు. నిరాహార దీక్షలు, మానవహారాలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులు, రైలు రోకోలు, కలెక్టరేట్ ముట్టడులు, పార్లమెంట్ ముట్టడి వంటి ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించారు. ఉద్యమ సమయంలో పలుమార్లు అరెస్టులు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా పోరాటాన్ని కొనసాగించారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ఆయన ధైర్యసాహసాలు ప్రత్యేకంగా నిలిచాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండుసార్లు టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఒకసారి సుమారు 9 గంటలు, మరోసారి 6 గంటలపాటు టవర్‌పైనే ఉండి తన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యమంలో పాల్గొన్న సహచరులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కూడా ఆయన పోరాటం చేశారు. అనేక సందర్భాల్లో పోలీసుల లాఠీచార్జీలు, అక్రమ అరెస్టులు, కేసులు ఎదుర్కొన్నప్పటికీ ఉద్యమ స్ఫూర్తిని కోల్పోలేదు. తెలంగాణ కోసం యువతతో కలిసి రాత్రింబవళ్లు పనిచేసిన ఆయన, ఉద్యమం అనేది కేవలం నినాదాలతో కాదు, త్యాగాలతో ముందుకు సాగుతుందని తన ఆచరణ ద్వారా నిరూపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో ఆయన ప్రయాణం ముగియలేదు. జనగామకు జిల్లా హోదా సాధించాలనే ఉద్యమంలో కూడా కీలకంగా వ్యవహరించారు. జనగామ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రిలే నిరాహార దీక్షలు, బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు, విద్యార్థుల ర్యాలీలు నిర్వహించారు. జిల్లా సాధన కోసం జరిగిన అమరణ నిరాహార దీక్షలో నాలుగు రోజులపాటు పాల్గొని ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. జనగామ జిల్లా ప్రకటన ఆలస్యమవుతుండటంతో జరిగిన నిరసనల్లో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు. ప్రజల ఆకాంక్ష నెరవేరే వరకు ఉద్యమం ఆగకూడదనే నమ్మకంతో ఆయన చేసిన కృషి స్థానిక ప్రజల మన్ననలు పొందింది. దేశభక్తి, ధర్మ పరిరక్షణ, సామాజిక చైతన్యం అనే మూడు విలువలను సమాజంలో బలపరచాలనే లక్ష్యంతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. జనగామలో తొలిసారిగా భారీ హనుమాన్ ర్యాలీలు, శివాజీ జయంతి కార్యక్రమాలు, భగత్‌సింగ్ స్ఫూర్తి యాత్రలు నిర్వహించి యువతలో చరిత్రపై అవగాహన పెంచేందుకు కృషి చేశారు. సమాజంలో ఐక్యత, క్రమశిక్షణ, సేవా దృక్పథం పెరగాలంటే యువత ముందుకు రావాలని ప్రతి కార్యక్రమంలో పిలుపునిచ్చారు. రాజకీయాలు, ఉద్యమాలు ప్రజలకు అవసరమైన మార్పు తీసుకురావడానికి ఒక మార్గమైతే, శాశ్వత మార్పు మాత్రం సేవ ద్వారానే సాధ్యమవుతుందని ఆయన క్రమంగా విశ్వసించారు. అదే ఆలోచన తర్వాత జనగామ అమ్మ ఫౌండేషన్ పుట్టుకకు బలమైన పునాది అయింది. జనగామలో అమ్మ ఫౌండేషన్ ఆవిర్భావం వెనుక ఉన్న ఆలోచన చాలా సరళమైనదే అయినా, దాని ప్రభావం మాత్రం ఎంతో గొప్పది. రాజకీయాలు, ఉద్యమాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేసిన మంతెన మణికుమార్, చివరికి సమాజానికి శాశ్వతంగా ఉపయోగపడేది సేవ మాత్రమే అనే నిర్ణయానికి వచ్చారు. అదే ఆలోచనతో తన స్నేహితులతో కలిసి ఒక చిన్న సమావేశం నిర్వహించి ప్రతి ఆదివారం నిరాశ్రయులు, యాచకులు, ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించాలని నిర్ణయించారు. అలా కోయాడ రవి ఇంట్లో ప్రారంభమైన చిన్న సేవా కార్యక్రమమే నేడు జనగామ అమ్మ ఫౌండేషన్‌గా వేలాది మందికి అండగా నిలుస్తోంది. మొదట కొద్దిమంది సభ్యులతో ప్రారంభమైన ఈ ప్రయాణం కాలక్రమేణా వందలాది మంది దాతలు, యువకులు, సేవాభావం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ప్రతి ఆదివారం అన్నదానం అనే చిన్న సంకల్పం, నేడు సంవత్సరమంతా కొనసాగే మానవతా ఉద్యమంగా రూపాంతరం చెందింది. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం, పెద్దల జ్ఞాపకార్థం వంటి సందర్భాలను ఆడంబరాలకు దూరంగా సమాజానికి ఉపయోగపడేలా మార్చాలని అమ్మ ఫౌండేషన్ ప్రారంభించిన పిలుపు విశేష స్పందనను పొందింది. కేకులు, ఫ్లెక్సీలు, బాణాసంచా వంటి తాత్కాలిక ఖర్చుల బదులుగా అదే డబ్బుతో ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయాలని, నిరుపేదలకు దుస్తులు అందించాలని, మొక్కలు నాటాలని, రక్తదానం చేయాలని సంస్థ ఇచ్చిన సందేశం ఎంతో మందిని ప్రభావితం చేసింది. జనగామ ప్రాంతంలో నేడు అనేక కుటుంబాలు తమ జీవితంలోని ముఖ్యమైన సందర్భాలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం వెనుక అమ్మ ఫౌండేషన్ చైతన్యం ప్రధాన కారణంగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సేవను ఒక పండుగగా మార్చి, ఆనందాన్ని పదిమందితో పంచుకోవచ్చని ఈ సంస్థ నిరూపించింది. ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటాలనే “బర్త్ డే ట్రీ” కార్యక్రమం కూడా సంస్థ చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఒకటి. మొక్క నాటడం మాత్రమే కాదు, దానిని సంరక్షించే బాధ్యత కూడా సంబంధిత వ్యక్తే తీసుకోవాలనే అవగాహన కల్పించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచింది. ఇదే విధంగా పుట్టినరోజు రోజున రక్తదానం చేయాలని చేపట్టిన కార్యక్రమం ద్వారా అనేక మంది యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు సకాలంలో రక్తం అందేలా ఫౌండేషన్ సభ్యులు నిరంతరం కృషి చేస్తున్నారు. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడిన సందర్భాలు సంస్థ సేవా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. కరోనా మహమ్మారి సమయంలో దేశమంతా భయాందోళనలకు గురై ఇళ్లకే పరిమితమైన రోజుల్లో కూడా అమ్మ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఒక్కరోజు కూడా ఆగలేదు. లాక్‌డౌన్ కారణంగా ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న యాచకులు, నిరాశ్రయులు, బాటసారులు, వివిధ రాష్ట్రాల నుంచి నడుచుకుంటూ వెళ్తున్న కార్మికులకు ప్రతిరోజూ వందల సంఖ్యలో భోజన ప్యాకెట్లు సిద్ధం చేసి పంపిణీ చేశారు. బీహార్, కోల్‌కతా, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల నుంచి జనగామకు ఉపాధి కోసం వచ్చిన కార్మికులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు, పిండి వంటి వస్తువులు అందించారు. కరోనా బాధితులకు మందులు, అవసరమైన సరుకులు చేర్చడం, మాస్కులు, పరిశుభ్రతకు అవసరమైన వస్తువులు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సేవ ఆగకూడదనే సంకల్పంతో పనిచేసిన ఈ బృందం ప్రజల ప్రశంసలు అందుకుంది. కరోనా సమయంలో కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉన్న అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడం అమ్మ ఫౌండేషన్ సేవల్లో అత్యంత మానవీయ ఘట్టంగా నిలిచింది. మృతదేహాలను ఎవరూ తాకడానికి ముందుకు రాని పరిస్థితుల్లో కూడా మానవత్వాన్ని ముందుంచి అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించింది. సేవ అంటే కేవలం జీవించి ఉన్నవారికి సహాయం చేయడం మాత్రమే కాదని, చివరి ప్రయాణంలో కూడా గౌరవం కల్పించడం మానవ ధర్మమని ఈ సంస్థ తన ఆచరణతో చాటిచెప్పింది. విద్యే సమాజాభివృద్ధికి పునాది అనే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, పరీక్షా ప్యాడ్లు, స్టేషనరీ వస్తువులు పంపిణీ చేస్తూ వారి చదువుకు భరోసా కల్పిస్తోంది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా మరింత మంది పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచుతోంది. చలికాలంలో దుప్పట్లు, స్వెటర్లు, శాలువాలు పంపిణీ చేయడం, వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారుల దాహం తీర్చడం, ప్రమాదాలకు కారణమవుతున్న రహదారి గుంతలను స్వచ్ఛందంగా పూడ్చడం, తప్పిపోయిన చిన్నారులను వారి కుటుంబాలకు చేర్చడం, వైద్య సహాయం అవసరమైన వారికి దాతల సహకారంతో చికిత్స అందించడం వంటి అనేక కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది. అడవుల నుంచి జనవాసాల్లోకి వచ్చిన నెమళ్లు, ఇతర పక్షులను అటవీ శాఖకు అప్పగించి వాటి ప్రాణాలను కాపాడడం ద్వారా ప్రకృతి పరిరక్షణలోనూ తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల బంధువుల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో “అమ్మ క్యాంటీన్” కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. ప్రతిరోజూ ఎవరో ఒక దాత పుట్టినరోజు లేదా ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అల్పాహారం, భోజనం, పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడం ద్వారా ఆసుపత్రికి వచ్చే వందలాది మందికి ఉపశమనం కలిగిస్తోంది. వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో మిగిలిపోయే మంచి ఆహారాన్ని వృథా కాకుండా అవసరమైన వారికి చేరవేయాలనే లక్ష్యంతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా సంస్థ సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ సేవలను మరింత విస్తరించేందుకు అవసరమైన వాహనాన్ని అందించిన దాతల సహకారాన్ని సంస్థ ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటోంది. ఇప్పటికే పదేళ్ల విజయవంతమైన సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అమ్మ ఫౌండేషన్ భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆకలితో ఉన్నవారు ఎప్పుడైనా వచ్చి ఆహారం తీసుకెళ్లేందుకు “అమ్మ ఫుడ్ బ్యాంక్” ఏర్పాటు చేయడం, ప్రయాణ మధ్యలో ఇబ్బందులు పడే నిరుపేదలకు ఆశ్రయం కల్పించే “నైట్ షెల్టర్ హోమ్” నిర్మించడం, నిరాశ్రయులు, యాచకులు, పేదల కోసం తక్కువ ఖర్చుతో భోజనం అందించే “అమ్మ క్యాంటీన్”ను మరింత విస్తరించడం, పేద కుటుంబాలకు ఉచితంగా ఫ్రీజర్ బాక్స్ సేవలు అందించడం, ఉపయోగించని దుస్తులు, పుస్తకాలు, చెప్పులు అవసరమైన వారికి చేరేలా “దయగల గోడ” ఏర్పాటు చేయడం, గుడిసెల్లో నివసించే పిల్లలకు సాయంత్రం ఉచిత బోధన అందించే “అమ్మ బడి” ప్రారంభించడం వంటి ఎన్నో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఈ లక్ష్యాలన్నీ దాతల సహకారంతోనే సాధ్యమవుతాయని సంస్థ విశ్వసిస్తోంది. పదేళ్ల క్రితం కొద్దిమంది మిత్రులతో ప్రారంభమైన అమ్మ ఫౌండేషన్ నేడు జనగామలో మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. సేవ అంటే ప్రచారం కాదు, బాధలో ఉన్నవారికి భరోసా ఇవ్వడం అనే భావనతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఉద్యమాల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన మంతెన మణికుమార్, ఇప్పుడు సేవా కార్యక్రమాల ద్వారా మనిషి మనిషికి అండగా నిలబడితే సమాజం ఎంత అందంగా మారుతుందో చూపిస్తున్నారు. జనగామ అమ్మ ఫౌండేషన్ ప్రయాణం ఒక సంస్థ కథ మాత్రమే కాదు, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే సేవా గాథగా నిలుస్తోంది. జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతెన మణికుమార్ ఫోన్ నెంబర్: 9959922361 ALSO READ: Crime: మామ మర్మాంగాన్ని కోసిన కోడలు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
28 రోజుల క్రితం
Logo

Health Update: నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం

వైద్యుల కీలక ప్రకటనతో ఊరట అవాస్తవ ప్రచారాలు నమ్మొద్దన్న వైద్యులు మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు రోహిణి ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు తరలింపు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఊరట Health Update: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మరోసారి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్‌లలో ప్రచారంలో ఉన్న అవాస్తవ వార్తలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా,...

  • వైద్యుల కీలక ప్రకటనతో ఊరట
  • అవాస్తవ ప్రచారాలు నమ్మొద్దన్న వైద్యులు
  • మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
  • రోహిణి ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు తరలింపు
  • బీఆర్ఎస్ శ్రేణుల్లో ఊరట
Health Update: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మరోసారి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్‌లలో ప్రచారంలో ఉన్న అవాస్తవ వార్తలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, వైద్య బృందం అత్యవసరంగా సీపీఆర్‌తో పాటు అవసరమైన చికిత్స అందించిందని వెల్లడించింది. వైద్యుల సకాల చర్యలతో ఆయన గుండె స్పందన తిరిగి పునరుద్ధరించబడిందని, ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. వైద్యుల వివరాల ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని, ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తోందని వెల్లడించారు. అయితే న్యూమోనియా తీవ్రత కూడా ఉండటంతో శరీరం పూర్తిస్థాయిలో సహకరించకపోవడంతో సంబంధిత వైద్య చికిత్సను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్య పరామితిని నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వైద్యులు వివరించారు. మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో పెద్ది సుదర్శన్ రెడ్డిని హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. నిపుణుల బృందం పర్యవేక్షణలో అత్యాధునిక వైద్య చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన ప్రతి వైద్య చర్యను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఆదివారం ఉదయం పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించినట్లు సోషల్ మీడియాలో, పలు వెబ్‌సైట్‌లలో అవాస్తవ కథనాలు ప్రచారంలోకి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఆసుపత్రి వైద్యులు అధికారికంగా స్పందించి అలాంటి ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అధికారిక సమాచారం కాకుండా వస్తున్న వదంతులను నమ్మవద్దని, ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వైద్యుల అధికారిక ప్రకటనల ద్వారానే తెలుసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో విశేష పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా జీవితంలో చురుకుగా కొనసాగాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. వైద్యులు కూడా చికిత్సపై ఆశాజనకంగా ఉన్నట్లు పేర్కొనడంతో అభిమానుల్లో ఊరట నెలకొంది. ALSO READ: Hindu Festival: తొలి ఏకాదశి విశిష్టత.. పూజా విధానం
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
29 రోజుల క్రితం
Logo

Sirikonda Lakshminarayana: ఒక ఆలోచన.. వేలాది జీవితాలకు ఆశాకిరణం

ఒక గురువు కల.. వేలాది కుటుంబాల చిరునవ్వు కష్టాల్లో పెరిగిన బాలుడు.. నేడు వేల మందికి దారిచూపే దీపస్తంభం ఒక చిన్న గ్రామం నుంచి వేలాది మంది కలలకు మార్గదర్శి విద్యార్థుల కన్నీళ్లను విజయాలుగా మలిచిన జీవిత ప్రయాణం విజయం అంటే విద్యార్థులదేనని నమ్మిన మహోన్నత గురువు నేడు వేలాది జీవితాలకు దిక్సూచి సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ వ్యక్తి.. సిరికొండ లక్ష్మీనారాయణ విజయగాథ స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కల్లూరు గ్రామం. పచ్చని పొలాలు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు, సాధారణ జీవన విధానం. అలాంటి గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన...

  • ఒక గురువు కల.. వేలాది కుటుంబాల చిరునవ్వు
  • కష్టాల్లో పెరిగిన బాలుడు.. నేడు వేల మందికి దారిచూపే దీపస్తంభం
  • ఒక చిన్న గ్రామం నుంచి వేలాది మంది కలలకు మార్గదర్శి
  • విద్యార్థుల కన్నీళ్లను విజయాలుగా మలిచిన జీవిత ప్రయాణం
  • విజయం అంటే విద్యార్థులదేనని నమ్మిన మహోన్నత గురువు
  • నేడు వేలాది జీవితాలకు దిక్సూచి
  • సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ వ్యక్తి..
  • సిరికొండ లక్ష్మీనారాయణ విజయగాథ
స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కల్లూరు గ్రామం. పచ్చని పొలాలు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు, సాధారణ జీవన విధానం. అలాంటి గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాలుడు సిరికొండ లక్ష్మీనారాయణ. ఆర్థికంగా పెద్దగా సౌకర్యాలు లేకపోయినా, కుటుంబం మాత్రం విలువలు, నిజాయితీ, కష్టపడే తత్వాన్ని అతనికి చిన్నప్పటి నుంచే నేర్పింది. చిన్ననాటి నుంచి అతని కళ్ల ముందే గ్రామీణ జీవితంలోని ఎన్నో కష్టాలు కనిపించేవి. ముఖ్యంగా చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థులు సరైన అవకాశాలు లేక వెనుకబడిపోవడం అతని మనసును తీవ్రంగా కలిచివేసేది. గ్రామంలో చదువుతున్న చాలా మంది విద్యార్థులు మంచి ప్రతిభ ఉన్నప్పటికీ, పోటీ పరీక్షల గురించి సరైన అవగాహన లేక తమ కలలను మధ్యలోనే వదిలేసేవారు. కొందరు కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు మానేసి పనుల్లో చేరేవారు. మరికొందరు నగరాలకు వెళ్లే అవకాశం లేక ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు వదిలేసేవారు. ఇవన్నీ చిన్న వయసులోనే లక్ష్మీనారాయణ మనసులో ఒక ప్రశ్నను రేకెత్తించాయి. "గ్రామంలో పుట్టడం తప్పా? అవకాశాలు కేవలం నగరాల్లో ఉన్నవారికే పరిమితమా?" అనే ఆలోచన అతనిలో నాటుకుపోయింది. కలలను మార్చిన అనుభవాలు విద్యార్థిగా ఉన్న రోజుల్లో లక్ష్మీనారాయణ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక మంచి పుస్తకం కోసం, ఒక మంచి అధ్యాపకుడి క్లాస్ కోసం, ఒక సరైన మార్గదర్శకత్వం కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆయనకు బాగా తెలుసు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఆశలు అన్నింటినీ ఆయన స్వయంగా అనుభవించారు. ఒకవైపు చదువు, మరోవైపు భవిష్యత్తుపై ఆందోళన. గ్రామం నుంచి నగరానికి వచ్చి చదవాలంటే ఉండడానికి గది, తినడానికి భోజనం, కొనడానికి పుస్తకాలు అన్నీ ఖర్చే. ఈ కష్టాలు ఎందరో ప్రతిభావంతుల కలలను ఎలా చిదిమేశాయో ఆయన కళ్లారా చూశారు. అదే అనుభవం ఒక రోజు ఆయన జీవితానికి దిశను మార్చింది. "నేను ఎదుర్కొన్న కష్టాలు ఇంకో విద్యార్థి ఎదుర్కోకూడదు. నేను పొందలేకపోయిన మార్గదర్శకత్వం వేలాది మందికి అందాలి" అనే ఆలోచన ఆయనలో బలపడింది. ఒక ఆలోచన.. వేలాది జీవితాలకు ఆశాకిరణం చాలామంది విజయం సాధించిన తర్వాత తమ జీవితాన్ని మాత్రమే చూసుకుంటారు. కానీ లక్ష్మీనారాయణ మాత్రం తన విజయాన్ని సమాజ విజయంతో ముడిపెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్న ప్రతి యువకుడి వెనుక ఒక కుటుంబం ఉందని, ఆ కుటుంబ భవిష్యత్తు ఆ ఒక్క ఉద్యోగంపై ఆధారపడి ఉంటుందని ఆయన నమ్మారు. అందుకే కోచింగ్ అనేది కేవలం వ్యాపారం కాకూడదని, అది ఒక సామాజిక బాధ్యత కావాలని భావించారు. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించగలిగితే వారి జీవితాలు మారతాయని, ఒక విద్యార్థి ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వసించారు. ఈ ఆలోచనలే తర్వాత రామయ్య కంపిటేటివ్ కోచింగ్ సెంటర్ రూపంలో నిజమయ్యాయి. చిన్న ప్రారంభం.. పెద్ద ప్రయాణం ఒక గొప్ప సంస్థ ఒక్కరోజులో ఏర్పడదు. దాని వెనుక ఎన్నో రోజుల కష్టం, ఎన్నో రాత్రుల ఆలోచనలు, ఎన్నో సవాళ్లు ఉంటాయి. రామయ్య కంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రారంభమైన రోజుల్లో పెద్ద భవనాలు లేవు. వందలాది మంది సిబ్బంది లేరు. ఆధునిక సౌకర్యాలు కూడా లేవు. కానీ ఒకటి మాత్రం ఉంది. అది విద్యార్థుల జీవితాలను మార్చాలనే అచంచలమైన సంకల్పం. మొదట్లో కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రయాణం క్రమంగా విస్తరించింది. లక్ష్మీనారాయణ బోధించే విధానం, ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా అర్థం చేసుకుని ప్రోత్సహించే తీరు, పరీక్షలకు అవసరమైన ప్రణాళికను స్పష్టంగా వివరించే పద్ధతి విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంచింది. ఒక్కో విద్యార్థి విజయం మరో విద్యార్థికి స్ఫూర్తిగా మారింది. నోటిమాట ప్రచారం ద్వారా సంస్థ పేరు దూర ప్రాంతాలకు చేరుకుంది. ఒకప్పుడు కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభమైన కేంద్రం, వేలాది మంది ఆశల నిలయంగా ఎదగడం వెనుక ఉన్న అసలు బలం నమ్మకం, నాణ్యత, అంకితభావమే. గురువు అంటే పాఠాలు చెప్పేవాడు మాత్రమే కాదు.. సిరికొండ లక్ష్మీనారాయణ దృష్టిలో గురువు అంటే పుస్తకాల్లో ఉన్న పాఠాలను చెప్పేవాడు మాత్రమే కాదు. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించే వ్యక్తి. అందుకే ఆయన వద్ద చదివే ప్రతి విద్యార్థిని ఒక రోల్ నంబర్‌గా కాకుండా, ఒక కుటుంబ ఆశగా చూస్తారు. పరీక్షల్లో విఫలమైనప్పుడు నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించే ధైర్యాన్ని కల్పించడం, చదువుపై ఏకాగ్రత పెంచడం, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్పడం, మానసికంగా బలంగా నిలబెట్టడం వంటి అంశాలకు కూడా ఆయన సమాన ప్రాధాన్యం ఇచ్చారు. చాలామంది విద్యార్థులు తమ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత ఒత్తిడులను ఆయనతో పంచుకునేవారు. అలాంటి ప్రతి సందర్భంలో ఒక గురువుగానే కాదు, ఒక పెద్దన్నలా, ఒక మార్గదర్శిలా వారికి అండగా నిలిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. విజయం వెనుక ఉన్న అసలు తత్వం.. లక్ష్మీనారాయణ ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. "పోటీ పరీక్షల్లో విజయం సాధించేది కేవలం ఎక్కువ గంటలు చదివిన వ్యక్తి కాదు. సరైన దిశలో, సరైన ప్రణాళికతో, క్రమశిక్షణతో ముందుకు సాగిన వ్యక్తే విజేత అవుతాడు." అందుకే రామయ్య కంపిటేటివ్ కోచింగ్ సెంటర్‌లో బోధనతో పాటు ప్రణాళికాబద్ధమైన అధ్యయన విధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. సిలబస్‌ను చిన్న చిన్న భాగాలుగా విభజించడం, ప్రతి అంశాన్ని సులభంగా అర్థమయ్యేలా బోధించడం, నిరంతర పరీక్షల ద్వారా విద్యార్థుల పురోగతిని అంచనా వేయడం వంటి విధానాలు సంస్థ ప్రత్యేకతగా మారాయి. ప్రతి విజయవంతమైన అభ్యర్థి వెనుక ఒక మంచి ప్రణాళిక ఉంటుందని ఆయన నమ్మకం. అదే నమ్మకాన్ని వేలాది మంది విద్యార్థుల్లో నాటడమే ఆయన జీవిత లక్ష్యంగా మారింది. వేలాది విజయాల వెనుక నిలిచిన నమ్మకం.. రామయ్య కంపిటేటివ్ కోచింగ్ సెంటర్‌లో చదివిన ప్రతి విద్యార్థి ఒకే పరిస్థితి నుంచి రాలేదు. కొందరు రైతు కుటుంబాల నుంచి వచ్చారు. మరికొందరు కూలీల పిల్లలు. ఇంకొందరు చిన్న ఉద్యోగుల కుటుంబాలకు చెందినవారు. కొందరు ఇప్పటికే ఎన్నోసార్లు పోటీ పరీక్షలు రాసి విఫలమైనవారు. మరికొందరు మొదటిసారి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు. వారి పరిస్థితులు వేరు అయినా, వారందరికీ ఒకే లక్ష్యం. అదే ప్రభుత్వ ఉద్యోగం. ఈ విషయాన్ని సిరికొండ లక్ష్మీనారాయణ ఎంతో స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రతి విద్యార్థికి ఒకే పద్ధతిలో బోధించడం కాకుండా, వారి స్థాయిని అంచనా వేసి వారికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించే విధానాన్ని అమలు చేశారు. ఎవరైనా ఒక అంశంలో వెనుకబడి ఉంటే ప్రత్యేకంగా సమయం కేటాయించి అర్థమయ్యేలా బోధించడం, పరీక్షలలో చేసే చిన్న చిన్న తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దడం, సమయ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వంటి అంశాలు సంస్థలో సాధారణ ప్రక్రియగా మారాయి. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉద్యోగం సాధించడం అసాధ్యం కాదనే నమ్మకం ఏర్పడింది. నాణ్యతను రాజీపడని బోధనా విధానం.. పోటీ పరీక్షల ప్రపంచం రోజురోజుకూ మారుతోంది. ప్రతి నోటిఫికేషన్‌కు సిలబస్‌లో మార్పులు, ప్రశ్నల సరళిలో కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో పాత పద్ధతులతో ముందుకు సాగితే విజయం సాధించడం కష్టమని లక్ష్మీనారాయణ ముందుగానే గుర్తించారు. అందుకే ప్రతి కోర్సుకు సంబంధించిన సిలబస్‌ను లోతుగా విశ్లేషించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా స్టడీ మెటీరియల్‌ను రూపొందించారు. కేవలం పుస్తకాలు అందించడం కాకుండా, ప్రతి అంశంపై విశ్లేషణాత్మక బోధన, గత ప్రశ్నపత్రాల అధ్యయనం, తరచూ నిర్వహించే పరీక్షలు, వాటిపై సమగ్ర సమీక్ష, ప్రతి విద్యార్థి పురోగతిపై ప్రత్యేక పర్యవేక్షణ వంటి విధానాలను అమలు చేశారు. విద్యార్థి ఏ అంశంలో బలహీనంగా ఉన్నాడో గుర్తించి అదే అంశంపై ఎక్కువ దృష్టి పెట్టే విధంగా రూపొందించిన శిక్షణా ప్రణాళిక అనేక మందికి విజయానికి పునాది వేసింది. అందుకే రామయ్య కంపిటేటివ్ కోచింగ్ సెంటర్ పేరు నాణ్యమైన శిక్షణకు చిరునామాగా మారింది. కాలానికి అనుగుణంగా మారిన విద్యా ప్రయాణం.. కాలం మారుతున్న కొద్దీ విద్యా రంగంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు తరగతి గదుల్లో మాత్రమే జరిగే బోధన, నేడు సాంకేతికత సహాయంతో ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా చేరుకునే స్థాయికి వచ్చింది. ఈ మార్పును సవాలుగా కాకుండా అవకాశంగా చూసిన సిరికొండ లక్ష్మీనారాయణ, సంస్థను కూడా అదే దిశగా ముందుకు నడిపించారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని Online Coachingను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉద్యోగం చేస్తూ చదివే అభ్యర్థులు, దూర ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు, కుటుంబ పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌కు రాలేని వారు కూడా నాణ్యమైన శిక్షణ పొందేలా డిజిటల్ తరగతులను ప్రారంభించారు. అంతేకాకుండా AI ఆధారిత విద్యా కంటెంట్, సమయానుకూల పరీక్షలు, అంశాల వారీ విశ్లేషణ, సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే విద్యా సమాచారాన్ని అందించే కార్యక్రమాలను కూడా చేపట్టారు. దీంతో ఒక కోచింగ్ సెంటర్ మాత్రమే కాకుండా, విద్యార్థులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విద్యా వేదికగా సంస్థ రూపాంతరం చెందింది. ప్రతి అభ్యర్థి అవసరాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రత్యేక శిక్షణ.. ఒకే విధమైన శిక్షణ అందరికీ సరిపోదనే విషయాన్ని గుర్తించిన రామయ్య కంపిటేటివ్ కోచింగ్ సెంటర్, అభ్యర్థుల అవసరాలను బట్టి నాలుగు ప్రత్యేక శిక్షణా విధానాలను అందిస్తోంది. Offline Coaching Online Coaching Test Series Printed Materials ఈ నాలుగు విధానాలు విద్యార్థులకు తమ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తూనే పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు, దూర ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతోంది. అందుబాటులో ఉన్న కోర్సులతో విస్తృత అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన దాదాపు అన్ని ప్రధాన కోర్సులను రామయ్య కంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అందిస్తోంది. TET DSC Gurukula Teacher Recruitment Model School Teacher Recruitment SI (Sub-Inspector) Police Constable Forest Beat Officer (FBO) Groups – I, II, III & IV Deputy Educational Officer (Dy.E.O.) DIET Lecturer Junior Lecturer (JL) Degree Lecturer (DL) Assistant Section Officer (ASO) Hostel Welfare Officer (HWO) ఇతర అన్ని పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఈ కోర్సులన్నింటికీ అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, నాణ్యమైన స్టడీ మెటీరియల్, రెగ్యులర్ పరీక్షలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గురువు విజయం కాదు.. విద్యార్థి విజయం గొప్పది చాలామంది విజయాన్ని తమ పేరుతో కొలుస్తారు. కానీ సిరికొండ లక్ష్మీనారాయణ మాత్రం తన విజయాన్ని విద్యార్థుల నియామక ఉత్తర్వుల్లో చూస్తారు. ఒక విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కోచింగ్ సెంటర్‌కు వచ్చి కృతజ్ఞతలు చెప్పిన ప్రతి క్షణం ఆయనకు జీవితంలో అత్యంత విలువైన బహుమతిగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఫీజులు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడిన విద్యార్థులు, నేడు ప్రభుత్వ ఉద్యోగులుగా నిలబడి తమ కుటుంబాలను ఆదుకుంటున్న దృశ్యాలు ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అదే కారణంగా ప్రతి కొత్త బ్యాచ్‌ను కూడా మొదటి బ్యాచ్‌లాగే అంకితభావంతో తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తు కోసం మరింత పెద్ద లక్ష్యం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థికి నాణ్యమైన శిక్షణ అందించే విద్యా సంస్థగా రామయ్య కంపిటేటివ్ కోచింగ్ సెంటర్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సిరికొండ లక్ష్మీనారాయణ ముందుకు సాగుతున్నారు. సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగిస్తూ, నూతన బోధనా విధానాలను ప్రవేశపెడుతూ, ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే విద్యా వేదికను నిర్మించాలనే సంకల్పంతో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా నగర స్థాయి అవకాశాలు అందించాలనే ఆయన కల ఇంకా కొనసాగుతూనే ఉంది. సిరికొండ లక్ష్మీనారాయణ మాటల్లో.. "నేను ఒక గ్రామం నుంచి వచ్చాను. ఒకప్పుడు మంచి మార్గదర్శకత్వం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులలో నేనూ ఒకడిని. అందుకే నేడు నా వద్దకు వచ్చే ప్రతి విద్యార్థికి నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం అందించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. విద్యార్థుల విజయం.. అదే నా విజయం." ఒక వ్యక్తి కాదు.. ఒక ఉద్యమం ఈ రోజుల్లో కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. కానీ విద్యార్థుల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో నడిచే సంస్థలు చాలా అరుదు. అలాంటి అరుదైన ప్రయాణానికి ప్రతీకగా నిలిచిన పేరు సిరికొండ లక్ష్మీనారాయణ. ఒక చిన్న గ్రామంలో పుట్టిన బాలుడు, తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను సమాజానికి ఉపయోగపడే అవకాశాలుగా మార్చుకున్న తీరు నిజంగా ఆదర్శప్రాయమైనది. వేలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ఈ కాలంలో వారికి సరైన దిశ చూపించే మార్గదర్శకుడు ఎంత అవసరమో ఆయన ప్రయాణం చెబుతోంది. ఒక గురువు వెలిగించిన జ్ఞానదీపం, వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపగలదని ఆయన నిరూపించారు. కల్లూరు గ్రామం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేలాది మంది అభ్యర్థుల కలలకు చిరునామాగా మారింది. భవిష్యత్తులో ఈ ప్రయాణం మరింత విస్తరించి, ఇంకా ఎన్నో కుటుంబాల జీవితాల్లో సంతోషం నింపాలని కోరుకుంటూ, సిరికొండ లక్ష్మీనారాయణ విజయగాథ ప్రతి యువకుడికి ఒక సందేశాన్ని అందిస్తోంది. పుట్టిన ఊరు చిన్నదైనా, మనసులోని లక్ష్యం పెద్దదైతే ప్రపంచమే మన విజయానికి చప్పట్లు కొడుతుంది.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Devotional News
Reporter
STAR TRINETHRAM
30 రోజుల క్రితం
Logo

Hindu Festival: తొలి ఏకాదశి విశిష్టత.. పూజా విధానం

Hindu Festival: తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటిగా భావిస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉందని పండితులు చెబుతారు. దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీనికి "తొలి ఏకాదశి" అనే పేరు వచ్చింది. ఈ పర్వదినం నుంచే తెలుగు ప్రజలకు వరుసగా ముఖ్యమైన పండుగల కాలం ప్రారంభమవుతుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ ఏడాది తొలి ఏకాదశి జులై 25 శనివారం వచ్చింది. తిథి ప్రకారం జులై 24...

Hindu Festival: తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటిగా భావిస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉందని పండితులు చెబుతారు. దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీనికి "తొలి ఏకాదశి" అనే పేరు వచ్చింది. ఈ పర్వదినం నుంచే తెలుగు ప్రజలకు వరుసగా ముఖ్యమైన పండుగల కాలం ప్రారంభమవుతుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ ఏడాది తొలి ఏకాదశి జులై 25 శనివారం వచ్చింది. తిథి ప్రకారం జులై 24 శుక్రవారం ఉదయం 10.08 గంటలకు ఏకాదశి ప్రారంభమై, జులై 25 శనివారం ఉదయం 11.54 గంటలకు ముగియనుంది. అయితే సూర్యోదయ సమయానికి ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకునే సంప్రదాయం ప్రకారం ఈసారి తొలి ఏకాదశిని జులై 25 శనివారమే ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన పసుపు లేదా ఇతర శుభవర్ణ వస్త్రాలు ధరించి శ్రీమహావిష్ణువు, శ్రీలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఉపవాస దీక్ష పాటించడం ఎంతో శ్రేయస్కరంగా భావిస్తారు. అలాగే ధనం, ధాన్యం, వస్త్రాలు వంటి దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. శ్రీహరికి చేసే పూజలో తులసి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. అందువల్ల నైవేద్యం సమర్పించే సమయంలో తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచాలని ఆచారాలు సూచిస్తున్నాయి. మరో ముఖ్యమైన సంప్రదాయం ప్రకారం ఈ రోజున కొత్త వస్త్రాలు కొనుగోలు చేసి ముందుగా దేవుని సన్నిధిలో ఉంచి పూజించిన అనంతరం వాటిని అవసరమైన వారికి దానం చేయడం లేదా పెద్దలకు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబానికి ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు. తొలి ఏకాదశి రోజున కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసాహారం పూర్తిగా వర్జించాలి. పెద్దలను, స్త్రీలను గౌరవించాలి. బ్రహ్మచర్యం పాటించడం ఉత్తమమని చెబుతారు. తులసి ఆకులను మొక్క నుంచి కోయకూడదు. ఉపవాసం చేసే వారు ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదని సంప్రదాయం చెబుతోంది. కొందరు ఆచారాల ప్రకారం ఈ రోజున స్త్రీలు తలస్నానం చేయకుండా ఉండాలని కూడా పేర్కొంటారు. భక్తితో, నియమ నిష్ఠలతో తొలి ఏకాదశిని ఆచరిస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. NOTE: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనితో స్టార్ త్రినేత్రంకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులోని వివరాలకు స్టార్ త్రినేత్రం ఎలాంటి బాధ్యత వహించదు. ALSO READ: Actress Jeevitha: ఎవరి భర్త సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్నా నేను సమర్థిస్తా!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Entertainment News
Reporter
STAR TRINETHRAM
14 గం. క్రితం
Logo

Actress Jeevitha: ఎవరి భర్త సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్నా నేను సమర్థిస్తా!

Actress Jeevitha: నటి జీవిత తాజాగా ఐ డ్రీమ్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్యాభర్తల సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. వివాహ జీవితంలో నమ్మకం, ఆకర్షణ, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలపై ఆమె వెల్లడించిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భర్త భార్యకు తెలియకుండా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తే ప్రతి సందర్భంలోనూ దాన్ని ఒకే కోణంలో చూడకూడదని జీవిత వ్యాఖ్యానించడం పెద్ద దుమారానికి కారణమైంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం హాట్...

Actress Jeevitha: నటి జీవిత తాజాగా ఐ డ్రీమ్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్యాభర్తల సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. వివాహ జీవితంలో నమ్మకం, ఆకర్షణ, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలపై ఆమె వెల్లడించిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భర్త భార్యకు తెలియకుండా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తే ప్రతి సందర్భంలోనూ దాన్ని ఒకే కోణంలో చూడకూడదని జీవిత వ్యాఖ్యానించడం పెద్ద దుమారానికి కారణమైంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం వల్ల భార్యకు బాధ కలగడం సహజమేనని, అలాంటి పరిస్థితుల్లో విడిపోవాలా వద్దా అనేది ఆయా కుటుంబాల నిర్ణయమని పేర్కొంది. అయితే కేవలం ఆకర్షణ లేదా శారీరక కోరిక కారణంగా భార్యకు తెలియకుండా ఒక వ్యక్తి బయటకు వెళ్లి రావడం మాత్రమే జరిగితే, దాన్ని ప్రతి సందర్భంలోనూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి తీసుకెళ్లకూడదని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. భార్యపై ప్రేమ, కుటుంబంపై బాధ్యత ఉన్న వ్యక్తి తన కుటుంబాన్ని వదిలి వెళ్లకుండా అలాంటి విషయాలను దాచిపెట్టే అవకాశం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించింది. కానీ మరో మహిళతో వేరే కుటుంబం ఏర్పాటు చేసి, భార్యా పిల్లలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కొత్త జీవితం ప్రారంభిస్తే అలాంటి వ్యక్తితో కలిసి జీవించాల్సిన అవసరం లేదని, అలాంటి సందర్భంలో మహిళలు తమ జీవితంపై సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదే అభిప్రాయం మహిళలకు కూడా వర్తిస్తుందని జీవిత స్పష్టం చేసింది. పురుషులకు ఎలా వ్యక్తిగత ఆకర్షణలు లేదా సరదా భావనలు ఉంటాయో, మహిళలకూ అలాంటి భావనలు ఉండొచ్చని పేర్కొంది. భార్య ఎవరికైనా ఫోన్ మాట్లాడినా, బైక్‌పై ప్రయాణించినా అనవసర అనుమానాలతో వేధించే భర్త సరైన వ్యక్తి కాదని ఆమె అభిప్రాయపడింది. భార్యాభర్తల మధ్య అనుమానాల కంటే పరస్పర నమ్మకం, అవగాహన, గౌరవమే బంధాన్ని నిలబెడతాయని జీవిత వివరించింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీస్తుండగా, పలువురు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. జీవిత గతంలో నిర్వహించిన "బతుకు జట్కా బండి" కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాల సమస్యలను దగ్గరగా గమనించే అవకాశం తనకు లభించిందని కూడా గుర్తు చేసింది. అనేక దాంపత్య జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతోనే ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన జీవిత, నటుడు రాజశేఖర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు శివాత్మిక, శివాని రాజశేఖర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వారు తెలుగు చిత్రసీమలో కథానాయికలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ALSO READ: Gold Rivers: ఇక్కడ బంగారం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Entertainment News
Reporter
STAR TRINETHRAM
1 రోజుల క్రితం
Logo

Ek Din: మీకు తెలుసా?.. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారట!

Ek Din: ప్రస్తుతం ఓటీటీ వేదికలపై సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సస్పెన్స్, భయానక, ఉత్కంఠభరిత, ప్రేమకథా చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో భారీ అంచనాల నడుమ విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఎన్నో సినిమాలు తర్వాత ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కొత్త జీవితాన్ని పొందుతున్నాయి. అలాంటి జాబితాలో ఇప్పుడు మరో చిత్రం చేరింది. 2026 మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఏక్ దిన్’ చిత్రం థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, ఇప్పుడు ఓటీటీలో మాత్రం అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకుంటూ ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకుంది....

Ek Din: ప్రస్తుతం ఓటీటీ వేదికలపై సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సస్పెన్స్, భయానక, ఉత్కంఠభరిత, ప్రేమకథా చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో భారీ అంచనాల నడుమ విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఎన్నో సినిమాలు తర్వాత ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కొత్త జీవితాన్ని పొందుతున్నాయి. అలాంటి జాబితాలో ఇప్పుడు మరో చిత్రం చేరింది. 2026 మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఏక్ దిన్’ చిత్రం థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, ఇప్పుడు ఓటీటీలో మాత్రం అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకుంటూ ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన కుమారుడు జునైద్ ఖాన్, దక్షిణాది ప్రముఖ నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలకు ముందు ఈ ప్రేమకథపై మంచి అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి ఆశించిన స్థాయి స్పందన రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిరాశపరిచింది. దీంతో వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. అయితే థియేటర్లలో విఫలమైన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతూ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓటీటీలో విడుదలైన కొద్ది రోజులకే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడంతో ప్రైమ్ వీడియోలో అత్యధికంగా వీక్షిస్తున్న 10 చిత్రాల జాబితాలో 2వ స్థానానికి చేరుకుంది. దీంతో థియేటర్లలో నిరాశపరిచిన ఈ ప్రేమకథ ఓటీటీ ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ‘ఏక్ దిన్’ చిత్రం 2016లో విడుదలైన ‘వన్ డే’ చిత్రానికి అధికారిక రీమేక్ అనే విషయం కూడా మరోసారి చర్చకు వచ్చింది. జునైద్ ఖాన్, సాయి పల్లవి మధ్య తెరపై కెమిస్ట్రీ ఆశించిన స్థాయిలో కనిపించలేదని కొందరు విమర్శకులు అభిప్రాయపడగా, కథనం నెమ్మదిగా సాగడం కూడా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని పేర్కొన్నారు. అయినప్పటికీ జపాన్ నేపథ్యంలో చిత్రీకరించిన అందమైన దృశ్యాలు, సాయి పల్లవి సహజ నటన, భావోద్వేగాలను ఆవిష్కరించిన తీరు మాత్రం ప్రశంసలు అందుకున్నాయి. మొత్తంగా థియేటర్లలో పరాజయం పాలైన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ALSO READ: Interesting Fact: నిందితుల ముఖానికి పోలీసులు ముసుగు ఎందుకు వేస్తారు..?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Edu/Jobs News
Reporter
STAR TRINETHRAM
2 రోజుల క్రితం
Logo

PNB: ఈ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా..?

PNB: పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. బ్యాంకులోని హ్యూమన్ రీసోర్సెస్ విభాగం వివిధ రాష్ట్రాల్లోని శాఖల కోసం మొత్తం 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ నియామకాలలో ఆంధ్రప్రదేశ్‌కు 4 పోస్టులు, తెలంగాణకు 41 పోస్టులు కేటాయించారు. అలాగే గుజరాత్‌లో 77, కర్ణాటకలో 78, మహారాష్ట్రలో 67, తమిళనాడులో 51, పశ్చిమ బెంగాల్‌లో 80, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో 9, లద్దాఖ్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో...

PNB: పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. బ్యాంకులోని హ్యూమన్ రీసోర్సెస్ విభాగం వివిధ రాష్ట్రాల్లోని శాఖల కోసం మొత్తం 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ నియామకాలలో ఆంధ్రప్రదేశ్‌కు 4 పోస్టులు, తెలంగాణకు 41 పోస్టులు కేటాయించారు. అలాగే గుజరాత్‌లో 77, కర్ణాటకలో 78, మహారాష్ట్రలో 67, తమిళనాడులో 51, పశ్చిమ బెంగాల్‌లో 80, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో 9, లద్దాఖ్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో 4, అస్సాంలో 85, మణిపుర్‌లో 6, మేఘాలయలో 8, మిజోరంలో 5, నాగాలాండ్‌లో 5, సిక్కింలో 5, త్రిపురలో 18 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉండడం తప్పనిసరి. అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 9, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులకు రూ.1180 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.59గా నిర్ణయించారు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం అందించనున్నారు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆగస్టు లేదా సెప్టెంబరు 2026లో నిర్వహించే అవకాశం ఉంది. రాత పరీక్షలో మొత్తం 150 బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున నెగటివ్ మార్కింగ్ అమలు చేస్తారు. పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు తదుపరి ఎంపిక ప్రక్రియలో అవకాశం లభిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని కోరుకునే వారికి ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా నిలుస్తోంది. ALSO READ: Bumper Offer: ఫ్రీగా ఫ్లైట్ ఎక్కే ఛాన్స్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Andhra Pradesh News
Reporter
STAR TRINETHRAM
2 రోజుల క్రితం
Logo

Bumper Offer: ఫ్రీగా ఫ్లైట్ ఎక్కే ఛాన్స్

Bumper Offer: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే మహోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ అధికారిక వేడుకగా కాకుండా ప్రజలందరూ భాగస్వాములు అయ్యే ప్రజల పండుగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం భూములు అందించిన రైతులు, భూ యజమానుల సేవలను ప్రభుత్వం...

Bumper Offer: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే మహోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ అధికారిక వేడుకగా కాకుండా ప్రజలందరూ భాగస్వాములు అయ్యే ప్రజల పండుగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం భూములు అందించిన రైతులు, భూ యజమానుల సేవలను ప్రభుత్వం ఎన్నటికీ మరవదని స్పష్టం చేసిన ఆయన, వారి త్యాగానికి గుర్తింపుగా ఒక్కోసారి ఉచిత విమాన ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సహకారం లేకుండా ఈ భారీ ప్రాజెక్టు సాకారం అయ్యేది కాదని పేర్కొంటూ, వారి కృషికి తగిన గౌరవం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విమానాశ్రయం ద్వారా ప్రపంచ దేశాలతో అనుసంధానం మరింత బలోపేతం కావడంతో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. అదే కార్యక్రమంలో జీఎంఆర్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, విమానయాన కేంద్రం-విశ్వవిద్యాలయం, జీఎంఆర్-మాన్సాస్ విద్యా నగరానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు ఉత్తరాంధ్రను విద్య, నైపుణ్యాభివృద్ధి, విమానయాన రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిలో ఇది మైలురాయిగా మారుతుందని ఆయన వెల్లడించారు. ప్రారంభోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే థింసా, సవర, కొమ్ము కోయ నృత్యాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విశిష్ట స్వాగతం పలకాలని సూచించారు. జూలై 31 వరకు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఇంటికీ ప్రారంభోత్సవ సమాచారం చేరేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భోజనం, తాగునీరు, ఇతర మౌలిక ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహోత్సవంగా నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ALSO READ: Crime: మామ మర్మాంగాన్ని కోసిన కోడలు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి

ప్రధాన కేటగిరీలు (Categories)

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు (26)

తెలంగాణ జిల్లాలు (33)