STAR TRINETHRAM
రిపోర్టర్
మీ ప్రాంత వార్తల కోసం లొకేషన్ ఆన్ చేయండి
Breaking
⚡ BREAKING

Dr.Nalamasa Srikanth Goud: ఉద్యమ ప్రస్థానం నుంచి శాసన మండలి బరిలోకి

Breaking
⚡ BREAKING

Hyderabad: కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్.. ఉద్రిక్తత

Breaking
⚡ BREAKING

Political: సీఎం పరకాల పర్యటనలో కనిపించని కొండా సురేఖ.. కారణమేంటి..?

Breaking
⚡ BREAKING

Minister Ponguleti: త్వరలో మరో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

Breaking
⚡ BREAKING

CM Revanth Reddy: భద్రాద్రి రాముడిపై ఆన..

ఫ్లిప్ న్యూస్
ప్రపంచం (World)
క్రీడలు (Sports)
ఈ-పేపర్
లైవ్ టీవీ
రీల్స్ / షార్ట్స్
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

Politics వార్తలు

అన్ని వార్తలు ×
Thumb
📍 Politics

Dr.Nalamasa Srikanth Goud: ఉద్యమ ప్రస్థానం నుంచి శాసన మండలి బరిలోకి

3 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Hyderabad: కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్.. ఉద్రిక్తత

16 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Political: సీఎం పరకాల పర్యటనలో కనిపించని కొండా సురేఖ.. కారణమేంటి..?

7 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Minister Ponguleti: త్వరలో మరో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

13 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

CM Revanth Reddy: భద్రాద్రి రాముడిపై ఆన..

13 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

TRS: కవిత కొత్త పార్టీకి షాక్ తప్పదా..?

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

CM Chandrababu Naidu: మోదీ హయాంలో నూతన స్వర్ణయుగం వైపు భారత్

14 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

HD Deve Gowda: మోదీ విజయ రహస్యం ఇదేనట..

14 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Telangana: సీఎం రేవంత్ రెడ్డిపై కవిత ఫైర్

15 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Politics: మళ్లీ ప్రజల్లోకి బీఆర్ఎస్.. కేసీఆర్ బస్సుయాత్ర, కేటీఆర్ పాదయాత్రకు రంగం సిద్ధం?

15 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

CM Revanth Reddy: త్వరలో 5 వేల ఉద్యోగాలు.. సీఎం కీలక ప్రకటన

17 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

CM Assets: దేశంలో ధనిక ముఖ్యమంత్రులు ఎవరు..? రెండో స్థానంలో తెలుగు సీఎం

18 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

TamilNadu Politics: సీఎం కాక‌ముందే త‌న విశ్వ‌రూపం చూపిన బీజేపీ..?

16 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

TamilNadu Politics: విజయ్ కులంపై ప్రజల్లో ఆసక్తి.. నెట్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్

17 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Congress: రెండున్నరేళ్ల విధ్వంసం.. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ పాలు!

19 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

TN Election Results: TVK విజయ్ సంచలనం.. 100కు పైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యం

19 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Telangana Rastra Sena: కొత్త విప్లవం.. తెలంగాణలో కవిత కొత్త పార్టీ

28 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Telangana Politics: ఏడాది తర్వాత బహిరంగ సభకు కేసీఆర్..

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Political: ఒకే రోజు సీఎం, మాజీ సీఎం పర్యటన!

6 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 National

Indian Politics: ఇకపై 850కి చేరనున్న లోక్‌సభ సీట్ల సంఖ్య!

9 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

KTR vs Kavitha: టీఆర్ఎస్ ఎవరిది?

9 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Telangana: బీజేపీలో చేరికలకు బ్రేక్!

9 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Telangana Politics: కవిత ‘బ్లూ వార్’ సిద్ధం!

10 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Politics: నాడు తిట్టి.. నేడు జంపింగ్!

10 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Cabinet Expansion: 2029లో కేబినెట్‌ విస్తరణలో లక్కీ ఛాన్స్ ఎవరికో?

22 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Charishma Reddy: రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు?

23 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Vijay's Speech: జగన్, పవన్‌పై పంచులు? (VIDEO)

23 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Telangana Politics: గులాబీ పార్టీకి కవిత సవాల్?

25 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

TamilNadu: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. రెండు స్థానాల నుంచి పోటీకి విజయ్ సిద్ధం

25 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Bhadrachalam vs Ayodhya: మోదీ గారు.. దక్షిణ అయోధ్యపై ఎందుకీ వివక్ష?

26 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

KCR: గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తారా?

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Political Drugs: డ్రగ్ టెస్ట్‌కి ఎవరు రెడీ?

5 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Telangana Congress: జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలా?

5 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Congress Strategy: హైదరాబాద్‌లో హస్తం స్ట్రాటజీ!

6 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

State Elections 2026: అసలు సిసలు తీర్పు అప్పుడే..

6 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

BJP: రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ వన్నాల వెంకటరమణ

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

CM Revanth Reddy: మహిళల కోసం చట్టాలు రూపొందిస్తే సరిపోదు

16 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Congress Government: తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి

17 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Revanth Reddy: పెరుగుతున్న నేరాల నేపథ్యంలో అదనపు ఐపీఎస్ అధికారుల అవసరం

18 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Ponguleti Srinivas Reddy: జనం గుండెల్లో నిలిచిన నాయకుడి గాధ

18 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Politics News
Reporter
STAR TRINETHRAM
3 రోజుల క్రితం
Logo

Dr.Nalamasa Srikanth Goud: ఉద్యమ ప్రస్థానం నుంచి శాసన మండలి బరిలోకి

తెలంగాణ రక్షణ సేన తొలి అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ వరంగల్-ఖమ్మం-నల్గొండ బరిలోకి ఉద్యమకారుడు శ్రీకాంత్ గౌడ్ దసరా సందర్భంగా ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత Dr.Nalamasa Srikanth Goud: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ బాధ్యతల దిశగా మరో కీలక అడుగు పడింది. తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోయే తొలి అభ్యర్థిగా ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరును పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత దసరా పండుగ సందర్భంగా ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన...

  • తెలంగాణ రక్షణ సేన తొలి అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
  • వరంగల్-ఖమ్మం-నల్గొండ బరిలోకి ఉద్యమకారుడు శ్రీకాంత్ గౌడ్
  • దసరా సందర్భంగా ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
Dr.Nalamasa Srikanth Goud: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ బాధ్యతల దిశగా మరో కీలక అడుగు పడింది. తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోయే తొలి అభ్యర్థిగా ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరును పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత దసరా పండుగ సందర్భంగా ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయాన్ని వెల్లడించారు. అదే సమయంలో ఈ ఎన్నికల సమన్వయం కోసం సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను రాష్ట్ర పార్టీ పరిశీలకుడిగా, ఎన్నికల సమన్వయ బాధ్యుడిగా నియమించారు. దసరా వేళ వెలువడిన ఈ ప్రకటనతో తెలంగాణ రక్షణ సేన ఎన్నికల ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఉద్యమమే పునాది.. ప్రజల మధ్యే ప్రస్థానం ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని, గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న ఆయన, తెలంగాణ జాగృతి ప్రారంభ దశ నుంచే కల్వకుంట్ల కవితతో కలిసి పనిచేశారు. ఉద్యమ కాలంలో ఏర్పడిన పరిచయాలు, ప్రజా సమస్యలపై సాగిన కార్యాచరణ ఆయన రాజకీయ ప్రయాణానికి నేపథ్యంగా నిలిచాయి. తెలంగాణ సాధన కోసం సాగిన పోరాటంలో భాగస్వామిగా ఉన్న ఆయన, అనంతరం పార్టీ కార్యక్రమాల్లోనూ తన పాత్రను కొనసాగించారు. పార్టీ గొంతుకగా.. ప్రజా వేదికలపై తనదైన పాత్ర తెలంగాణ జాగృతితో అనుబంధం కొనసాగించిన శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ రక్షణ సేనలో అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూ టెలివిజన్ చర్చా కార్యక్రమాలు, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ తరఫున తన వాణిని వినిపించారు. పార్టీ విధానాలు, రాజకీయ అంశాలను వివిధ వేదికలపై ప్రస్తావిస్తూ సంస్థాగత కార్యకలాపాల్లో భాగస్వామ్యమయ్యారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆయన పేరును ప్రకటించడం ద్వారా పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల దిశగా అడుగు వేసింది. తొలి అభ్యర్థి ప్రకటనతో ఎన్నికల సమరానికి శ్రీకారం తెలంగాణ రక్షణ సేన స్థాపించిన తర్వాత తొలిసారిగా శాసన మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. ఈ క్రమంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను తొలి అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ఎన్నికల సమన్వయం, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం సయ్యద్ ఇస్మాయిల్‌కు బాధ్యతలు అప్పగించారు. బహుజనుల సమస్యలపై గత 3 సంవత్సరాలుగా పలు ఉద్యమాలకు రూపకల్పన చేసినట్లు పేర్కొంటున్న కల్వకుంట్ల కవిత, అదే రాజకీయ ప్రయాణంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు. ఈ నిర్ణయంతో పార్టీ ఎన్నికల కార్యాచరణకు అధికారికంగా శ్రీకారం చుట్టింది. ALSO READ: Post Office Schems: టాప్ 5 స్కీమ్స్ గురించి తెలుసా?.. మీకు ఏది బెస్ట్..?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
16 రోజుల క్రితం
Logo

Hyderabad: కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్.. ఉద్రిక్తత

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు బీఆర్‌ఎస్ నేతలు నలుపు టీషర్ట్లు ధరించి, ఫ్లకార్డులు చేతబట్టి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని భద్రతా సిబ్బంది,...

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు బీఆర్‌ఎస్ నేతలు నలుపు టీషర్ట్లు ధరించి, ఫ్లకార్డులు చేతబట్టి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని భద్రతా సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని చివరకు తోపులాటకు దారితీసింది. పోలీసులు తమను అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ నేతలు రోడ్డుపైనే కూర్చొని నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళన కారణంగా రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తెలంగాణ భవన్‌కు తరలిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతల ఆందోళనలు, పోలీసుల అరెస్టులతో అసెంబ్లీ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ALSO READ: Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

Politics News
Reporter
STAR TRINETHRAM
7 రోజుల క్రితం
Logo

Political: సీఎం పరకాల పర్యటనలో కనిపించని కొండా సురేఖ.. కారణమేంటి..?

Political: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మేడారంలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన సమయంలో మంత్రి కొండా సురేఖ అక్కడ కనిపించకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలోనూ కొండా సురేఖ పాల్గొనకపోవడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటనకు మంత్రి గైర్హాజరు కావడం వెనుక అసలు కారణమేంటనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాల కారణంగానే కొండా...

Political: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మేడారంలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన సమయంలో మంత్రి కొండా సురేఖ అక్కడ కనిపించకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలోనూ కొండా సురేఖ పాల్గొనకపోవడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటనకు మంత్రి గైర్హాజరు కావడం వెనుక అసలు కారణమేంటనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాల కారణంగానే కొండా సురేఖ ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో కొండా కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రభావం నేపథ్యంలో ఈ పరిణామం స్థానికంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొండా అభిమానుల్లో ప్రస్తుతం ఒకింత గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పరకాల బహిరంగ సభలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి స్వయంగా రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును ప్రస్తావించడం వెనుక రాజకీయ సమీకరణాలపై ఇప్పుడు చర్చ సాగుతోంది. మరోవైపు కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ గతంలో పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. పరకాల నుంచి కొండా కుటుంబ వారసురాలిగా సుస్మిత పటేల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం కొంతకాలంగా కొనసాగుతోంది. అంతేకాకుండా తమ కూతురు పరకాల ఎమ్మెల్యే అవుతుందని కొండా మురళి గతంలో బహిరంగంగానే ప్రకటించారు. అయితే తాజాగా పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరడంతో ఈ పరిణామం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశానికి అడ్డంకులు ఏర్పడినట్టేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కొండా కుటుంబం నుంచి పరకాల రాజకీయాల్లో వారసత్వంగా ముందుకు రావాలనుకున్న సుస్మిత పటేల్ విషయంలో ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు, కొండా కుటుంబం భవిష్యత్ వ్యూహం, రేవూరి ప్రకాష్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత వంటి అంశాలు ప్రస్తుతం రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉండటం, పరకాల సభలో ఆమె కనిపించకపోవడం, అదే సభలో రేవూరి ప్రకాష్ రెడ్డికి సీఎం మద్దతుగా మాట్లాడటం వంటి పరిణామాలను రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పరకాల కాంగ్రెస్ రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ALSO READ: Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
13 రోజుల క్రితం
Logo

Minister Ponguleti: త్వరలో మరో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

Minister Ponguleti: రాష్ట్రంలోని పేదలు, రైతుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. రైతులకు అవసరమైన సాయం అందించడంతో పాటు వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు...

Minister Ponguleti: రాష్ట్రంలోని పేదలు, రైతుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. రైతులకు అవసరమైన సాయం అందించడంతో పాటు వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరిన్ని అవకాశాలు యువతకు ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి 2 సంవత్సరాల్లోనే సుమారు 71 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో త్వరలో మరో 20 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అర్హత ఉన్న యువత ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాల భర్తీతో పాటు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులకు భూధార్ కార్డులు.. రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే రైతులకు భూ హక్కులను మరింత స్పష్టంగా కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలోని ప్రతి గజం భూమిని సర్వే చేసి సాగులో ఉన్న రైతులకు మ్యాప్‌లతో పాటు భూధార్ కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించడం ద్వారా రైతులు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా బలోపేతం చేసి వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపిస్తూ, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై విమర్శలు.. ప్రజలే తీర్పు చెబుతున్నారని వ్యాఖ్య ప్రతిపక్ష పార్టీలు ప్రజా ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని విమర్శించారు. ఇప్పటికే బీఆర్ఎస్‌కు ప్రజలు 2 సార్లు గట్టి గుణపాఠం చెప్పారని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలే మరోసారి సరైన తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు ప్రజా ప్రభుత్వానికే మద్దతు తెలుపుతున్నారని, అదే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేర్పు పేదలకు గృహ వసతి కల్పించడంలో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పూర్తైందని, ఆ తర్వాత మూడో, నాలుగో విడతలను కూడా అమలు చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ALSO READ: CM Revanth Reddy: భద్రాద్రి రాముడిపై ఆన..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
13 రోజుల క్రితం
Logo

CM Revanth Reddy: భద్రాద్రి రాముడిపై ఆన..

2029లో 117 సీట్లతో మళ్లీ మనదే పీఠం! 'రైతు ఆశీర్వాద సభ'లో సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ రాజకీయంగానూ, రైతు సంక్షేమ పరంగానూ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం చింతకాని మండలం జగన్నాథపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా తుది విడత నిధులుగా రూ.1009 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధుల విడుదలతో...

  • 2029లో 117 సీట్లతో మళ్లీ మనదే పీఠం!
  • 'రైతు ఆశీర్వాద సభ'లో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ రాజకీయంగానూ, రైతు సంక్షేమ పరంగానూ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం చింతకాని మండలం జగన్నాథపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా తుది విడత నిధులుగా రూ.1009 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధుల విడుదలతో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పెట్టుబడి సాయంగా మొత్తం రూ.8,759 కోట్లను అందించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 74 లక్షల మంది రైతులకు చెందిన 1.45 కోట్ల ఎకరాల భూములకు పెట్టుబడి సాయం విజయవంతంగా చేరిందని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధమన్న సీఎం సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని గుర్తు చేశారు. తన రాజకీయ ప్రయాణంలో ఖమ్మం జిల్లా ఎంతో కీలకమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. 2023 జులైలో ఇదే జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ అహంకార పాలనను వ్యతిరేకిస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని, ఇప్పుడు మళ్లీ అదే జులై నెలలో రైతులు, ప్రజలు ప్రజాపాలనకు ఆశీర్వాదం అందించేందుకు పెద్దఎత్తున సభకు తరలివచ్చారని పేర్కొన్నారు. ఈ స్పందన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌పై విమర్శలు.. ఎన్నికల ఫలితాల ప్రస్తావన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే గట్టి తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ మళ్లీ పునరుద్ధరించే పరిస్థితి లేదని ప్రజలే నిర్ణయించారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో తమ విజయంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని గుర్తుచేస్తూ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడే ధైర్యంగా చెప్పానని తెలిపారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరో 2 స్థానాలు సాధించి తమ బలం మరింత పెంచుకున్నామని చెప్పారు. ప్రజల విశ్వాసమే తమ ప్రభుత్వానికి అతిపెద్ద బలమని ఆయన పేర్కొన్నారు. 2029 ఎన్నికలపై ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఎన్నికలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2029 జూన్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని, దాంతో పార్లమెంట్ స్థానాలు 25కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని తెలిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని సాక్షిగా ఈ మాట చెబుతున్నానని, ఇది తన వ్యక్తిగత నమ్మకం మాత్రమే కాదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త విశ్వాసమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ALSO READ: Employee: సెలవుల్లోనూ పని.. అర్ధరాత్రి ఫోన్.. కట్‌చేస్తే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా..?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
11 రోజుల క్రితం
Logo

TRS: కవిత కొత్త పార్టీకి షాక్ తప్పదా..?

TRS: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన అంశంగా కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు మారింది. ఈ పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రక్షణ సేన పేరును భారత ఎన్నికల సంఘం ఆమోదించిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ పార్టీ పేరుపై వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తుల నుంచి 600కుపైగా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్...

TRS: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన అంశంగా కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు మారింది. ఈ పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రక్షణ సేన పేరును భారత ఎన్నికల సంఘం ఆమోదించిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ పార్టీ పేరుపై వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తుల నుంచి 600కుపైగా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ తన అభ్యంతరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉన్న “టీఆర్ఎస్” అనే పేరుకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని పార్టీ పేర్కొంది. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారని, అనంతరం జరిగిన ఉద్యమం మొత్తం ఆ పార్టీ పేరుతోనే సాగిందని గుర్తు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా టీఆర్ఎస్ ప్రజల్లో బలమైన రాజకీయ బ్రాండ్‌గా కొనసాగిందని ఫిర్యాదులో ప్రస్తావించినట్లు సమాచారం. తర్వాత అక్టోబర్ 2022లో పార్టీని జాతీయ స్థాయికి విస్తరించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పటికీ, ప్రజలలో ఇప్పటికీ టీఆర్ఎస్ అనే పేరుకే విస్తృత గుర్తింపు ఉందని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన కూడా సంక్షిప్త రూపంలో “టీఆర్ఎస్”గానే ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడవచ్చని పార్టీ అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పార్టీ పేర్లు, సంక్షిప్త నామాలు, గుర్తుల ఆధారంగా ఓటర్లు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండటంతో ఈ అంశాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిగణించాలని కోరినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వాదన ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలా మంది ఓటర్లు పూర్తి పార్టీ పేర్ల కంటే సంక్షిప్త నామాలను ఎక్కువగా గుర్తుంచుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేన కూడా “టీఆర్ఎస్” అనే సంక్షిప్త రూపంతో ప్రచారం నిర్వహిస్తే ప్రజల్లో అయోమయం ఏర్పడే అవకాశముందని పేర్కొంటోంది. ఇది ఎన్నికల సమయంలో ప్రత్యక్షంగా తమ పార్టీకి రాజకీయ నష్టం కలిగించే పరిస్థితిని తీసుకురావచ్చని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీల నమోదుకు సంబంధించిన నిబంధనలు, ఇప్పటికే ఉన్న పార్టీల పేర్లతో పోలికలు, ఓటర్లలో గందరగోళం ఏర్పడే అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ పేరు యథాతథంగా కొనసాగుతుందా లేదా మార్పులు సూచిస్తారా అన్న అంశంపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఇప్పటికే ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది. కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తు, తెలంగాణ రక్షణ సేన పార్టీ విస్తరణ, బీఆర్ఎస్ అభ్యంతరాలు వంటి అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు చేరిన నేపథ్యంలో ఈ అంశంపై తీసుకునే నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రక్షణ సేన పేరు కొనసాగుతుందా లేదా కొత్త పేరు సూచించబడుతుందా అనే విషయంపై ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల సంఘం వైపే ఉంది. ALSO READ: Raghava Lawrence: రాజకీయాల్లోకి రావాలా.. వద్దా?.. ఫ్యాన్స్‌ను అడిగిన హీరో
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
14 రోజుల క్రితం
Logo

CM Chandrababu Naidu: మోదీ హయాంలో నూతన స్వర్ణయుగం వైపు భారత్

ACM Chandrababu Naidu: భారత రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయిని అధిగమించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. దేశానికి అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ సాధించిన ఘనత భారత ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. “దేశమే ప్రథమం” అనే సిద్ధాంతంతో సాగుతున్న మోదీ పాలన దేశానికి కొత్త దిశను చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం తన సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూనే ఆధునిక అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి మోదీ నాయకత్వం కీలకంగా నిలిచిందని చంద్రబాబు తన...

ACM Chandrababu Naidu: భారత రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయిని అధిగమించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. దేశానికి అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ సాధించిన ఘనత భారత ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. “దేశమే ప్రథమం” అనే సిద్ధాంతంతో సాగుతున్న మోదీ పాలన దేశానికి కొత్త దిశను చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం తన సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూనే ఆధునిక అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి మోదీ నాయకత్వం కీలకంగా నిలిచిందని చంద్రబాబు తన ప్రత్యేక వ్యాసంలో పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ జ్ఞానం, సంప్రదాయాలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయడం ద్వారా దేశం ప్రపంచ వేదికపై మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. దేశ ఆర్థిక ప్రగతిని ప్రస్తావిస్తూ, గత దశాబ్దంలో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన స్థానం సంపాదించిందని చంద్రబాబు గుర్తు చేశారు. డిజిటల్ సేవల విస్తరణ, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు దేశ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయని పేర్కొన్నారు. జన్ ధన్ ఖాతాలు, ఆధార్ అనుసంధానం, యూపీఐ వ్యవస్థ, ప్రత్యక్ష నగదు బదిలీల ద్వారా కోట్లాది మంది ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా చేరాయని ఆయన అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించిందని చంద్రబాబు అన్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, రైల్వేలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులు భవిష్యత్ భారత నిర్మాణానికి బలమైన పునాదులుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో సహకార సమాఖ్య విధానానికి ప్రాధాన్యం పెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యాలతో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేసే విధానం వల్ల రాష్ట్రాల పురోగతి వేగవంతమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం లభిస్తోందని వివరించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే “వికసిత్ భారత్” లక్ష్య సాధన దిశగా దేశం ముందుకు సాగుతోందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో భారత్ కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ప్రపంచ వేదికపై మరింత ప్రభావవంతమైన దేశంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. ALSO READ: Personal Finance: బ్యాంక్ అకౌంట్ లేకుండా డబ్బులు పంపడం ఎలా..?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
14 రోజుల క్రితం
Logo

HD Deve Gowda: మోదీ విజయ రహస్యం ఇదేనట..

HD Deve Gowda: దేశ రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని అధిగమించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమిస్తూ మోదీ కొత్త చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మోదీ రాజకీయ ప్రస్థానం, నాయకత్వ లక్షణాలు, దేశ పాలనలో ఆయన చూపుతున్న దృఢ సంకల్పంపై విశ్లేషణాత్మక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మోదీ విజయాల వెనుక ఉన్న ప్రధాన కారణం ఆయన నిరంతర ఆలోచనా విధానం, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడని తత్వమని...

HD Deve Gowda: దేశ రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని అధిగమించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమిస్తూ మోదీ కొత్త చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మోదీ రాజకీయ ప్రస్థానం, నాయకత్వ లక్షణాలు, దేశ పాలనలో ఆయన చూపుతున్న దృఢ సంకల్పంపై విశ్లేషణాత్మక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మోదీ విజయాల వెనుక ఉన్న ప్రధాన కారణం ఆయన నిరంతర ఆలోచనా విధానం, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడని తత్వమని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. భారత రాజకీయ పరిస్థితులు నెహ్రూ హయాంలో ఎలా ఉన్నాయో, ప్రస్తుతం ఎంతగా మారిపోయాయో దేవెగౌడ గణాంకాలతో వివరించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ రాజకీయాల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవని, 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో కేవలం 53 రాజకీయ పార్టీలు మాత్రమే పోటీ చేశాయని గుర్తు చేశారు. ఆ సమయంలో దేశంలో సుమారు 17 కోట్ల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. అయితే 2024 ఎన్నికల నాటికి రాజకీయ పోటీ తీవ్రంగా పెరిగి, దేశవ్యాప్తంగా 2,593 రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయని తెలిపారు. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 146 కోట్లకు పైగా చేరుకుందని వివరించారు. తాను 1996లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయానికే రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని దేవెగౌడ పేర్కొన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన నాయకులు కాకుండా ఇతర నాయకులు ప్రధానమంత్రి స్థాయికి ఎదగడం అంత సులభం కాదని, అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి కావడం మోదీ సాధించిన విశేష ఘనత అని కొనియాడారు. మోదీ కేబినెట్ సామాజిక వైవిధ్యానికి ప్రతిబింబంగా నిలుస్తోందని దేవెగౌడ వ్యాఖ్యానించారు. నెహ్రూ పాలనలో ఉన్న మంత్రివర్గంతో పోలిస్తే ప్రస్తుతం వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం పెరిగిందని తెలిపారు. ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ వర్గాలకు, 10 మంది ఎస్సీ వర్గాలకు, 5 మంది ఎస్టీ వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నారని పేర్కొన్నారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయడంలో మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, మహిళలకు మరింత అవకాశాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అభినందించారు. ప్రస్తుత కాలంలో నాయకత్వం వహించడం గతంతో పోలిస్తే మరింత సవాలుతో కూడుకున్నదని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. నెహ్రూ కాలంలో పరిమిత సంఖ్యలో వార్తాపత్రికలు మాత్రమే ఉండేవని, ఎలక్ట్రానిక్ మీడియా లేదా సోషల్ మీడియా వంటి వేదికలు అందుబాటులో లేవని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం 24 గంటల మీడియా పర్యవేక్షణతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రతి చర్యపై నిరంతర చర్చ, విమర్శలు జరుగుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొంటూ మోదీ దేశ పరిపాలనను కొనసాగించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠను పెంచడంలో మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో నిలబెట్టడం, క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు ఆయన నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా అనుసంధానం కోసం నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని తాను క్రమం తప్పకుండా వింటానని, సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ప్రతి పౌరుడికి చేరువ కావడంలో మోదీ ప్రత్యేక శైలి కనబరుస్తున్నారని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు, విమర్శలను స్వీకరిస్తూ నిరంతరం ముందుకు సాగడమే మోదీ విజయానికి ప్రధాన కారణమని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. ALSO READ: Solo Travelers: భారత్‌లో బెస్ట్.. 5 సోలో టూరిస్ట్ ప్లేసెస్!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
15 రోజుల క్రితం
Logo

Telangana: సీఎం రేవంత్ రెడ్డిపై కవిత ఫైర్

Telangana: తెలంగాణలో విద్యారంగానికి సంబంధించిన అంశాలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే అంశంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న వేలాది ప్రభుత్వ పాఠశాలలను కుదించే ఆలోచన విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, నిరుపేద కుటుంబాలు, బాలికల విద్యపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన...

Telangana: తెలంగాణలో విద్యారంగానికి సంబంధించిన అంశాలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే అంశంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న వేలాది ప్రభుత్వ పాఠశాలలను కుదించే ఆలోచన విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, నిరుపేద కుటుంబాలు, బాలికల విద్యపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాల్సిన సమయంలో ప్రభుత్వ విద్యాసంస్థలను తగ్గించే విధానాలు సరైనవి కావని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర విద్యాశాఖ పనితీరుపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ, కళాశాలల అనుబంధ గుర్తింపులు, డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ వంటి అంశాల్లో స్పష్టత లేకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఉన్నత విద్యా వ్యవస్థలో సమన్వయ లోపాలు కనిపిస్తున్నాయని, కోర్సుల అనుమతులు మరియు అడ్మిషన్ల ప్రక్రియల్లో గందరగోళం నెలకొందని విమర్శించారు. గురుకుల విద్యాసంస్థల పరిస్థితిపై కూడా కవిత ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమం, వసతి, ఆరోగ్య భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాన్ని ప్రస్తావిస్తూ, విద్యార్థులు మరియు విద్యాసంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ కోసం సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరమని కవిత డిమాండ్ చేశారు. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్య అనేది హక్కు అని, దానిని అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో విద్యా విధానాలపై రాజకీయ చర్చ మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ALSO READ:Politics: మళ్లీ ప్రజల్లోకి బీఆర్ఎస్.. కేసీఆర్ బస్సుయాత్ర, కేటీఆర్ పాదయాత్రకు రంగం సిద్ధం?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
15 రోజుల క్రితం
Logo

Politics: మళ్లీ ప్రజల్లోకి బీఆర్ఎస్.. కేసీఆర్ బస్సుయాత్ర, కేటీఆర్ పాదయాత్రకు రంగం సిద్ధం?

Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర ద్వారా ప్రజలతో నేరుగా మమేకం కావడానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన అనంతరం...

Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర ద్వారా ప్రజలతో నేరుగా మమేకం కావడానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన అనంతరం బీఆర్ఎస్ తన దృష్టిని సంస్థాగత పునర్నిర్మాణంపై కేంద్రీకరించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, గ్రామస్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, కేడర్ శిక్షణ శిబిరాలు వంటి కార్యక్రమాల ద్వారా పార్టీ శ్రేణులను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో చర్చకు దారితీసే అంశాలను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ హామీల అమలుపై పోరాటమే ప్రధాన అజెండా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీలు, రైతు సమస్యలు, నిరుద్యోగ యువత ఆందోళనలు, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది. అంతేకాకుండా ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాలను కూడా ప్రధాన రాజకీయ అస్త్రాలుగా మలుచుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ వర్గాల సమస్యలను సేకరించే పనిలో నాయకత్వం నిమగ్నమైందని తెలుస్తోంది. యువతకు పెద్దపీట వేయనున్న బీఆర్ఎస్.. భవిష్యత్తు రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషిస్తారనే అభిప్రాయంతో బీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. సభ్యత్వ నమోదు నుంచి పార్టీ కమిటీల వరకు యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని యోచిస్తోంది. రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా యువ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలపై పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సదస్సులతో పాటు త్వరలో విద్యార్థి, యువజన నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది. యువతలో పార్టీ ప్రభావాన్ని పెంచడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రజా ఉద్యమాలకు మరింత ఊపు.. ప్రస్తుతం పార్టీ ముఖ్య నాయకులు ప్రభుత్వం విధానాలపై విమర్శలను మరింత తీవ్రతరం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికతో పాటు సోషల్ మీడియాలు, జిల్లా స్థాయి సమావేశాలు, ఉద్యమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు వంటి వర్గాల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర.. కేటీఆర్ పాదయాత్ర? తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు నిర్వహించిన కేసీఆర్ మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రతి జిల్లాలో కార్యకర్తల సమావేశాలు, ప్రజా ప్రతినిధులతో చర్చలు, భారీ బహిరంగ సభలు నిర్వహించేలా యాత్ర ప్రణాళిక రూపొందించే అవకాశముంది. మరోవైపు కేటీఆర్ కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టే అంశంపై పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యువత, నిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులతో నేరుగా మమేకం కావడానికి పాదయాత్ర సమర్థవంతమైన మార్గమని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ఒకవైపు సంస్థాగత బలోపేతం, మరోవైపు రాష్ట్రవ్యాప్త ప్రజా కార్యక్రమాలతో మళ్లీ రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ALSO READ:Finance: గృహ రుణాలపై వడ్డీ రేట్లు స్థిరం.. ఏ బ్యాంకులో లోన్ చౌకగా లభిస్తుందంటే?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
17 రోజుల క్రితం
Logo

CM Revanth Reddy: త్వరలో 5 వేల ఉద్యోగాలు.. సీఎం కీలక ప్రకటన

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా పరిపాలనా రంగంలోనూ విస్తృత చర్చకు దారితీశాయి. బెంగళూరులో నిర్వహించిన ‘ది హిందూ హడిల్’ ఆరో ఎడిషన్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. తెలంగాణలో అమలు చేస్తున్న పలు కీలక కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలు, ఉద్యోగాల భర్తీ, వ్యవసాయం, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం: తెలంగాణలో సుపరిపాలన’ అనే అంశంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. హైడ్రా ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని...

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా పరిపాలనా రంగంలోనూ విస్తృత చర్చకు దారితీశాయి. బెంగళూరులో నిర్వహించిన ‘ది హిందూ హడిల్’ ఆరో ఎడిషన్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. తెలంగాణలో అమలు చేస్తున్న పలు కీలక కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలు, ఉద్యోగాల భర్తీ, వ్యవసాయం, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం: తెలంగాణలో సుపరిపాలన’ అనే అంశంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. హైడ్రా ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. హైడ్రా అనే పదం అడాల్ఫ్ హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదమని, ఆ పదం నుంచే తాను స్ఫూర్తి పొంది ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేద ప్రజలు జీవనోపాధి కోసం చెరువులు లేదా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే మానవతా దృక్పథంతో చూడవచ్చని, అయితే ధనికులు మరియు ప్రభావశీలులు జలాశయాలను ఆక్రమించడం వల్లే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైడ్రా వ్యవస్థలో 3,000 మంది పదవీ విరమణ పొందిన సైనిక సిబ్బందిని నియమించామని, దాని ఫలితంగా తెలంగాణలో జలాశయాలను ఆక్రమించేందుకు ఎవరూ సాహసించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మాదకద్రవ్యాలపై ప్రత్యేక దళం.. రాష్ట్రంలో యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మాదకద్రవ్యాల సమస్యను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఈగిల్ ఫోర్స్’ను ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న బలగాల్లో ఇదొకటిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా ఈ వ్యవస్థ పనిచేస్తోందని వివరించారు. మరో 5,000 పోలీసు పోస్టుల భర్తీకి సిద్ధం.. ఉద్యోగాల భర్తీ విషయంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన డిమాండ్లలో ఉద్యోగాల భర్తీ ఒకటని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వాటి భర్తీపై దృష్టి సారించలేదని ఆరోపించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై కూడా విమర్శలు చేసిన ఆయన, గతంలో నియామక వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. గత 15 నెలల కాలంలోనే 67,760 ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించిన ఆయన, త్వరలోనే మరో 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రూ.2,000 కోట్ల ఆదాయ నష్టం భరిస్తున్న ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జీరో పన్ను విధానాన్ని అమలు చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.2,000 కోట్ల ఆదాయ నష్టం కలుగుతున్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడటం మరింత ముఖ్యమని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రధాన కార్యనిర్వాహకులే పాలక మండలిలో సభ్యులుగా ఉంటూ పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తారని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. ఫుట్‌బాల్‌పై తన అభిరుచిని పంచుకున్న సీఎం.. తన వ్యక్తిగత అభిరుచుల గురించి కూడా ప్రస్తావించిన ముఖ్యమంత్రి, తనకు ఫుట్‌బాల్ ఆట అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. గతంలో క్రమం తప్పకుండా ఆడేవాడినని, ప్రస్తుతం ముఖ్యమంత్రి బాధ్యతల కారణంగా సమయం దొరకడం లేదని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సిని తెలంగాణకు ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తులో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కోసం సమయం కేటాయించాలని భావిస్తున్నట్లు సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులపై దృష్టి.. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో తన పోటీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదని, ప్రపంచ స్థాయి పారిశ్రామిక దేశాలతోనేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేస్తూ తెలంగాణను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ‘చైనా ప్లస్ వన్’ విధానంలో తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్లకు అవసరమైన ఉత్పత్తులను తెలంగాణ నుంచే తయారు చేసి సరఫరా చేసే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12,000.. వ్యవసాయ రంగంపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పంటల సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ధాన్యం, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. గతంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే జరిగేవని గుర్తుచేసిన ఆయన, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటివరకు 25,035 రైతు కుటుంబాలకు సంబంధించిన రూ.20,616 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వెల్లడించారు. 67 లక్షల మహిళలకు వడ్డీ లేని రుణాలు.. మహిళా సాధికారతకు కూడా తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 67 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక పురోగతి ద్వారానే కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ALSO READ: Bank Jobs: డిగ్రీ అర్హతతో 635 పోస్టులు.. ఇవాళ ఒక్కరోజే ఛాన్స్!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
18 రోజుల క్రితం
Logo

CM Assets: దేశంలో ధనిక ముఖ్యమంత్రులు ఎవరు..? రెండో స్థానంలో తెలుగు సీఎం

CM Assets: దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మరో కారణంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.1,413 కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ఆధారంగా దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలోని హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల కంటే కూడా ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ చాలా ఎక్కువగా...

CM Assets: దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మరో కారణంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.1,413 కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ఆధారంగా దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలోని హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల కంటే కూడా ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉండటం విశేషంగా మారింది. సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.931 కోట్లు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రూ.648 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన ఆస్తుల విలువను రూ.30 కోట్లుగా ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కేరళ ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ తక్కువ ఆస్తులు కలిగిన నేతగా నిలిచారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.6.6 కోట్లు మాత్రమే. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నిర్వహించిన అఫిడవిట్‌ల విశ్లేషణలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. బిహార్, ఛండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖాండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.106.75 కోట్లు మాత్రమేనని నివేదిక పేర్కొంది. ఈ లెక్కన చూస్తే డీకే శివకుమార్ ఒక్కరే ఆ 10 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ సంపద కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ గణాంకం దేశవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. డీకే శివకుమార్ ఆస్తులకు సంబంధించి మరో అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఆగస్టులో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చింది. అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కనకపుర నియోజకవర్గం కూడా ఈ జిల్లాలోనే ఉంది. జిల్లా పేరు మారిన తర్వాత భూముల విలువలు పెరుగుతాయని ఆయన అప్పట్లో ప్రకటించారు. ప్రస్తుతం డీకే శివకుమార్‌కు ఈ జిల్లాలో రూ.10.37 కోట్ల విలువైన 71 ఎకరాల భూమి ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడైంది. అదేవిధంగా ఆయన సోదరుడు, బెంగళూరు రూరల్ మాజీ ఎంపీ డీకే సురేష్‌‌కు 93.97 ఎకరాల వ్యవసాయ మరియు ఇతర ఆస్తులు ఉన్నట్లు సమాచారం. వాటి విలువను ఆయన అఫిడవిట్‌లో రూ.8.35 కోట్లుగా పేర్కొన్నారు. రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చిన అనంతరం ఆ ప్రాంతంలోని భూముల ధరలు రెట్టింపు నుంచి మూడు రెట్లు వరకు పెరిగినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు కూడా ప్రస్తుతం రాజకీయంగా మరియు ఆర్థికంగా విస్తృత చర్చకు కారణమవుతున్నాయి. ALSO READ: Hyderabad: భార్య గొంతు కోసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
16 రోజుల క్రితం
Logo

TamilNadu Politics: సీఎం కాక‌ముందే త‌న విశ్వ‌రూపం చూపిన బీజేపీ..?

TamilNadu Politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నటుడు విజయ్‌కు మరింత ప్రజాదరణను తీసుకువచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలోనే ప్రజల్లో విశేష ఆదరణ సంపాదించుకుని ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే స్థాయికి చేరుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు నుంచే విజయ్ రాజకీయ ప్రయాణంపై దేశ రాజకీయ వర్గాలు దృష్టి పెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్‌కు మద్దతుగా నిలుస్తోందనే సంకేతాలు రావడంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు దశలో గవర్నర్ రూపంలో ఏర్పడిన పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా...

TamilNadu Politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నటుడు విజయ్‌కు మరింత ప్రజాదరణను తీసుకువచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలోనే ప్రజల్లో విశేష ఆదరణ సంపాదించుకుని ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే స్థాయికి చేరుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు నుంచే విజయ్ రాజకీయ ప్రయాణంపై దేశ రాజకీయ వర్గాలు దృష్టి పెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్‌కు మద్దతుగా నిలుస్తోందనే సంకేతాలు రావడంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు దశలో గవర్నర్ రూపంలో ఏర్పడిన పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల వెనుక కేంద్రంలోని పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా వ్యూహాత్మకంగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో బీజేపీకి బలమైన రాజకీయ స్థితి లేకపోయినా, ప్రాంతీయ పార్టీలతో పొత్తుల ద్వారానే అక్కడ రాజకీయ ఉనికి కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో విజయ్ బీజేపీకి దూరంగా ఉండి కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం కేంద్ర నాయకత్వానికి నచ్చలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ముందు బీజేపీతో కలిసి పనిచేయాలంటూ పలుమార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ విజయ్ అంగీకరించలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో విజయ్ సాన్నిహిత్యం పెరగడం, రాజకీయంగా ఒకే వేదికపై కనిపించేందుకు ప్రయత్నాలు జరగడం బీజేపీకి అసౌకర్యంగా మారిందని ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా తమ రాజకీయ ప్రభావాన్ని విస్తరించుకుంటున్న సమయంలో తమిళనాడులో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం కేంద్ర నాయకత్వానికి మింగుడు పడలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ వ్యవహారశైలి కూడా ఈ వివాదానికి మరింత ఊతమిచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఆలస్యం చేయడం, వివిధ రాజకీయ చర్చలు జరగడం, అన్నాడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై ప్రచారం జరగడం తమిళనాడులో రాజకీయ అనిశ్చితిని పెంచింది. అయితే ఈ పరిస్థితుల్లో విజయ్ రాజకీయ పరిపక్వతతో వ్యవహరించాడనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎక్కడా ఆవేశానికి లోనుకాకుండా, రాజకీయ అనుభవం కలిగిన నేతలా వ్యవహరించాడని ఆయన అనుచరులు చెబుతున్నారు. అవసరమైన సంఖ్యాబలం తమ వద్ద ఉందని విజయ్ స్పష్టం చేయడం, గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తన వాదన వినిపించడం, మద్దతు కూడగట్టుకోవడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. చివరకు గవర్నర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకు రావడం రాజకీయంగా విజయ్‌కు అనుకూలంగా మారింది. ఈ పరిణామాల తర్వాత రాజకీయంగా నష్టపోయింది బీజేపీనే అనే చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. ఇక మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ వ్యవహరించిన తీరు కూడా రాజకీయ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది. అనవసర రాజకీయ ఉద్రిక్తతలకు దూరంగా ఉంటూ, హుందాగా స్పందించడం ద్వారా స్టాలిన్ తన రాజకీయ పరిణతిని చూపించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామాలు భవిష్యత్తులో మరింత కీలక మార్పులకు దారితీసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా విజయ్ రాజకీయ ప్రయాణం, కేంద్రం పాత్ర, గవర్నర్ నిర్ణయాలపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ALSO READ: Aruri Ramesh: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
17 రోజుల క్రితం
Logo

TamilNadu Politics: విజయ్ కులంపై ప్రజల్లో ఆసక్తి.. నెట్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్

TamilNadu Politics: దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ పేరు మారుమోగుతోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను ఆధిపత్యం చెలాయించిన ద్రవిడ పార్టీలకు గట్టి సవాల్ విసిరి విజయం సాధించడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విజయానికి అసలు కారణం ఏమిటి, ఆయనకు ఏ సామాజిక వర్గం మద్దతుగా నిలిచింది, విజయ్ అసలు ఏ వర్గానికి చెందినవారు అనే ప్రశ్నలపై ప్రజలు ఆసక్తిగా తెలుసుకోవాలని చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే అంశంపై విస్తృత చర్చ సాగుతోంది. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన...

TamilNadu Politics: దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ పేరు మారుమోగుతోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను ఆధిపత్యం చెలాయించిన ద్రవిడ పార్టీలకు గట్టి సవాల్ విసిరి విజయం సాధించడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విజయానికి అసలు కారణం ఏమిటి, ఆయనకు ఏ సామాజిక వర్గం మద్దతుగా నిలిచింది, విజయ్ అసలు ఏ వర్గానికి చెందినవారు అనే ప్రశ్నలపై ప్రజలు ఆసక్తిగా తెలుసుకోవాలని చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే అంశంపై విస్తృత చర్చ సాగుతోంది. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన విజయ్ గెలుపు వెనుక పలు అంశాలు కలిసి పనిచేశాయి. అభిమాన సంఘాల బలమైన మద్దతుతో పాటు, ఆయనకు చెందిన సామాజిక వర్గం కూడా కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులో ఆయన వర్గానికి చెందిన ప్రజలు గణనీయంగా ఉన్నారని అంచనా. ఈ మద్దతు ఎన్నికల్లో ప్రతిఫలించినట్లు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం విజయ్ కులం గురించి ప్రజలు పెద్దఎత్తున వెతకడం ఈ ఆసక్తిని మరింత స్పష్టంగా చూపిస్తోంది. విజయ్ సామాజిక వర్గంపై విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆయనను దళిత వర్గానికి చెందినవారని చెబుతుండగా, మరికొందరు ఉన్నత వర్గానికి చెందినవారని అంటున్నారు. ఈ గందరగోళానికి కారణం ఆయన ప్రజా వేదికలపై ప్రముఖ సామాజిక సంస్కర్తల పేర్లు ప్రస్తావించడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఆయన సర్టిఫికెట్‌లో కులం స్థానంలో ‘నో క్యాస్ట్’ అని నమోదు చేయబడింది. ఇది ఇటీవల తీసుకున్న నిర్ణయం కాదు.. చాలా కాలం క్రితమే ఆయన కుటుంబం తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్. ఆయన తండ్రి క్రైస్తవ మతానికి చెందినవారు కాగా, తల్లి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఈ నేపథ్యం వల్లే ఆయన వ్యక్తిత్వం మానవత్వానికి ప్రాధాన్యం ఇచ్చేలా రూపుదిద్దుకున్నట్లు చెబుతారు. సామాజిక విభజనలకంటే సమానత్వాన్ని నమ్మే కుటుంబంలో పెరిగిన ఆయన, అదే భావజాలాన్ని తన రాజకీయ ప్రయాణంలో కూడా ప్రతిబింబిస్తున్నారు. విజయ్ వాస్తవానికి తమిళనాడులో ప్రసిద్ధి చెందిన వెల్లాలార్ సమాజానికి చెందినవారని తెలుస్తోంది. ఈ సమాజం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత వర్గంగా పేరుపొందింది. సంప్రదాయంగా భూస్వామ్య వర్గంగా గుర్తింపు పొందిన ఈ వర్గం చరిత్రలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది. చోళులు, పాండ్యులు, పల్లవుల కాలం నుంచి ఈ వర్గం ప్రభావం కొనసాగుతోందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. పరిపాలన, యుద్ధ రంగాల్లో కూడా ఈ వర్గానికి చెందినవారు కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు ఉన్నాయి. వెల్లాలార్ సమాజం తమిళనాడు, కేరళ, శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉంది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండటంతో ‘వెలన్’ అనే పదం నుంచి ఈ పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ వర్గంలో కూడా అనేక ఉపవర్గాలు ఉన్నాయి. సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో చురుకుగా పాల్గొనే ఈ వర్గం ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. విజయ్ రాజకీయ విజయానికి ఈ వర్గం మద్దతు ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద విజయ్ గెలుపు కేవలం ఒక వర్గం మద్దతు వల్ల మాత్రమే కాకుండా, ప్రజల్లో పెరిగిన మార్పు ఆకాంక్ష, కొత్త నాయకత్వంపై ఉన్న నమ్మకం కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ASLO READ: Mumbai: వ్యక్తి తలలోకి దిగిన కొడవలి.. డాక్లర్లు ఏం చేశారంటే?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
19 రోజుల క్రితం
Logo

Congress: రెండున్నరేళ్ల విధ్వంసం.. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ పాలు!

తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన! ప్రజా భవన్‌ ముందు కంచెలు కూలిస్తే.. ప్రజల జీవితాలు మారుతాయా? తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు! సంక్షేమానికి పాతర- రైతులకు ద్రోహం బ్రాండ్ హైదరాబాద్ ఖతం- రియల్ ఎస్టేట్ ఢమాల్! అబద్ధపు హామీలు - నిరుద్యోగుల ఆక్రందన! చీకటి రోజులు - ప్రజా వ్యతిరేక నిర్ణయాలు! రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ అరాచక పాలనపై స్పెషల్ ఫోకస్ Congress: తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటే.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు కాస్తా వినాశనంగా మారి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ నిర్మించిన బంగారు తెలంగాణను రెండున్నరేళ్లలోనే చీకటి తెలంగాణగా...

  • తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన!
  • ప్రజా భవన్‌ ముందు కంచెలు కూలిస్తే.. ప్రజల జీవితాలు మారుతాయా?
  • తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు!
  • సంక్షేమానికి పాతర- రైతులకు ద్రోహం
  • బ్రాండ్ హైదరాబాద్ ఖతం- రియల్ ఎస్టేట్ ఢమాల్!
  • అబద్ధపు హామీలు - నిరుద్యోగుల ఆక్రందన!
  • చీకటి రోజులు - ప్రజా వ్యతిరేక నిర్ణయాలు!
  • రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ అరాచక పాలనపై స్పెషల్ ఫోకస్
Congress: తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటే.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు కాస్తా వినాశనంగా మారి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ నిర్మించిన బంగారు తెలంగాణను రెండున్నరేళ్లలోనే చీకటి తెలంగాణగా మార్చేసింది రేవంత్ ప్రభుత్వం. మార్పు పేరుతో అభివృద్ధికి పాతరేసి, సంక్షేమాన్ని సమాధి చేస్తూ.. హైడ్రా పేరుతో అలజడి, అక్రమ అరెస్టులతో అరాచకం సృష్టిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టామని, ఇనుప కంచెలు తొలగించామని గొప్పలు చెప్పుకున్న రేవంత్ సర్కార్.. సామాన్యుడి కష్టాలను మాత్రం తీర్చలేకపోయింది. కంచెలు పోయినా.. సామాన్యుడికి సచివాలయంలోకి ప్రవేశం లేదు. మొదట్లో ఆర్భాటం చేసిన ప్రజా దర్బార్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. వేల సంఖ్యలో వచ్చిన అర్జీలు బుట్టదాఖలయ్యాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి.. మార్పు తెస్తామని ప్రగల్భాలు పలికారు. నిజమే.. ఆయన చెప్పినట్లే తెలంగాణలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఏమిటంటే.. మళ్ళీ పాత సమైక్యాంధ్ర పాలన నాటి చీకటి రోజులు, కరెంటు కోతలు, నీటి కటకటలు తిరిగి రావడం. సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణకు చేసిన అన్యాయం గుర్తుకు తెచ్చుకుంటే కన్నీరు రాక మానదు. కరెంట్‌ లేక, ఉపాధి లేక, సాగు, మంచి నీటి కటకట. తెలంగాణ అంటేనే ఓ ఎడారిలా తయారైంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసి తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చారు. మిషన్ భగీరథతో ప్రజల ఇంటి ముందుకే మంచినీరు తీసుకొచ్చారు. కేసీఆర్ సర్కార్ వచ్చిన నెలరోజుల్లోనే కరెంట్ కష్టాలను తీర్చి.. నాడు సమైక్య పాలనలో కరెంట్ ఉంటే వార్త.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ పోతే వార్త అన్నట్లుగా తీర్చిదిద్దారు. సాగునీటి రంగంలో విప్లవాన్ని తీసుకొస్తూ కాళేశ్వరంతో మండే వేసవిలోనూ చెరువులను మత్తడి దూకించిన అపర భగీరథుడు కేసీఆర్. ఇలా ఒకటి రెండు కాదు అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్ది పల్లెలను దేశానికే పట్టుకొమ్మలుగా మార్చారు. తీరా పదేళ్ల తర్వాత ఇప్పుడు సీన్ పూర్తిగా రీవర్స్ అయింది. కేసీఆర్‌ కంటే బెటర్ పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గుంపు మేస్త్రి పాలనలో అంధకారంలోకి వెళ్లిపోయింది. ఆరు గ్యారెంటీలు.. 420 మామీలతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు రేవంత్. రైతు భరోసాకు అష్టకష్టాలు.. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకం అమలుకు సవాలక్ష సాకులు వెతుకుతోంది. గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిన 'రైతు బంధు'ను కూడా సమర్థవంతంగా అమలు చేయలేక చేతులెత్తేసింది. సాగునీటి నిర్వహణలో విఫలమై, ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు పంపడంలో నిమగ్నమయ్యారు. రైతు బంధుకు రాం రాం.. దళిత బంధుకు జై భీం.. కేసీఆర్ కిట్‌కు మంగళం ఇలా గత ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా తెచ్చిన సంక్షేమ పథకాలన్ని ఇప్పుడు కాల గర్భంలో కలిసిపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆక్రంధన పంట చేతికొచ్చినా, కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరువకపోవడంతో వడ్లు రోడ్డుపాలవుతున్నాయి. మక్క రైతులు గన్నీ సంచుల కొరత, మద్దతు ధర దక్కక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ ఉందని క్వింటాలుకు 5 కిలోల వరకు కోత.. ఇక యూరియా కోసం రైతులు అరిగోస పడే పరిస్థితి నెలకొంది. కేసీఆర్ పాలనలో యూరియా సజావుగా అందగా.. ఇప్పుడు యూరియా కోసం రైతులు రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి నెలకొంది. పదేళ్ల తర్వాత మళ్ళీ యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టాల్సిన దుస్థితిని రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. 'హైడ్రా'.. పేదల గుండెల్లో గుబులు! ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో హైడ్రాను అస్త్రంగా చేసుకుని రేవంత్ రెడ్డి సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది, ప్రభుత్వమే నల్లా కనెక్షన్ ఇచ్చింది.. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం బుల్డోజర్‌లతో కూల్చేస్తోంది. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా, బడా బాబుల ఆక్రమణల జోలికి వెళ్లకపోవడం ఈ ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమని ప్రజలు చెప్పకోని సందర్భాలు లేకపోలేదు. బ్రాండ్ హైదరాబాద్‌ ఖతం.. దశాబ్ద కాలంగా కేసీఆర్ నిర్మించిన 'బ్రాండ్ హైదరాబాద్'ను కాంగ్రెస్ మంటగలిపింది. ప్రపంచపటంలో వెలిగిన హైదరాబాద్ నగరం నేడు కళ తప్పింది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఇన్వెస్టర్లు పారిపోతున్నారు. హైడ్రా పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూల్చారు. కొత్త ఐటీ కంపెనీలు రాకపోగా, ఉన్న కంపెనీలు తమ కార్యకలాపాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు 40% పడిపోయాయి. సచివాలయంలో మంత్రుల కంటే వారి కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిపోయింది. అసలు పదవుల్లో లేని సీఎం సోదరులు సమీక్షలు నిర్వహిస్తుంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ప్రశ్నించే వారిని ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిని సైతం జైలుకు పంపే అధ్వాన్న పాలన సాగుతోంది. చీకటి రోజులు - ప్రజా వ్యతిరేక నిర్ణయాలు.. తెలంగాణను మళ్లీ కరెంట్ కోతల రాష్ట్రంగా మార్చారు. సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఆపేసి పంట ఎండిపోయేలా చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆటో డ్రైవర్ల పొట్టకొట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది ఆటోడ్రైవర్లు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం చేయని మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు రేవంత్. ఆరు గ్యారెంటీలు.. అన్నీ 420 హామీలే! మహాలక్ష్మి పథకం (మహిళల కోసం) నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అడిగే నాథుడే లేడు. కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాలయ ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏ ఒక్కరికి తులం బంగారం ఇచ్చిన పరిస్థితి లేదు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ అని ఉదరగొట్టారు.. కానీ అది పూర్తిస్థాయిలో అమలైందా అంటే ఆ పార్టీ నేతలే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు నెలకు రూ.4,000 పెన్షన్ అన్నారు. కానీ ఉన్న పెన్షన్‌లే ఇవ్వడానికి అష్టకష్టాలు పడుతున్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ధరణీ స్థానంలో తెచ్చిన భూమాత పోర్టల్‌ అట్టర్‌ ఫ్లాప్. భూమాత పోర్టల్‌లో జరిగిన కుంభకోణంతో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ.10 వేలు, 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ.3 వేల పెన్షన్, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షలు, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజూ 'ప్రజాదర్భార్' ఏర్పాటు ఇలా రేవంత్ సర్కార్ ఇచ్చిన ప్రతీ హామీ బుట్టాదాఖలైంది. ఢిల్లీకి బానిసత్వం! ఒకప్పుడు స్వయంపాలనలో గర్వంగా ఉన్న తెలంగాణ.. నేడు ఢిల్లీకి బానిసగా మారింది. తెలంగాణ సంపదను మూటలు కట్టి ఢిల్లీకి పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి చిన్న పనికి, మంత్రివర్గ విస్తరణకు, నామినేటెడ్ పదవులకు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి తీరని అవమానం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేమని చేతులెత్తేసిన చేతగాని ప్రభుత్వం ఇది. అబద్ధపు హామీలు - నిరుద్యోగుల ఆక్రందన! అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్వయంగా ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీని అశోక్ నగర్ రప్పించి నిరుద్యోగుల ఓట్లు దండుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా, ఉన్న ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీస్తున్నారు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు జాబ్స్ ఇచ్చి వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం విడ్డూరం. కొత్త గ్రూప్స్ నోటిఫికేషన్లు లేవు, మెగా డీఎస్సీ ఊసే లేదు. నిరుద్యోగ భృతి రూ.4,000 ఇస్తామన్న హామీ ఎటు పోయిందో రేవంత్ రెడ్డికే తెలియాలి. గురుకులాల్లో మరణ మృదంగం.. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో తెలంగాణ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతుందని అంతా భావించారు. ఇంటిగ్రెడెట్ స్కూల్స్ పేరుతో ఉదర గొడుతూ.. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గురుకులాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రెండేళ్లలో గురుకులాల్లో వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ మరియు ఇతర కారణాలతో మరణించడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. పేద విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలిచే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నిలిపివేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. కాంగ్రెస్ మార్కు పాలన అంటే అబద్ధాలు, అరాచకాలు, మరియు అరాచకత్వం అని ప్రజలకు అర్థమైపోయింది. ఆరు గ్యారెంటీలు అడ్రస్ లేవు కానీ, ప్రకటనల కోసం మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాగే మొండిగా ముందుకు వెళ్తే, తెలంగాణ ప్రజలు త్వరలోనే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ALSO READ: Social Media: చాటింగ్ పేరుతో చీటింగ్.. వీడియో కాలింగ్‌తో లూటింగ్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
19 రోజుల క్రితం
Logo

TN Election Results: TVK విజయ్ సంచలనం.. 100కు పైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యం

TN Election Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. తాజా లెక్కల ప్రకారం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అన్నాడీఎంకే 70కు పైగా స్థానాల్లో, డీఎంకే 50కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....

TN Election Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. తాజా లెక్కల ప్రకారం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అన్నాడీఎంకే 70కు పైగా స్థానాల్లో, డీఎంకే 50కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య విజయ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం దాదాపు ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను భారీగా పెంచారు. ఫలితాల ట్రెండ్ బయటకు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునే అవకాశం ఉందని భావించిన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించి, జనసంచారాన్ని నియంత్రించేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. నివాసానికి వెళ్లే మార్గాల్లో ఇతర వాహనాల రాకపోకలను పరిమితం చేస్తూ ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయ్ నివాసం పరిసరాల్లో అభిమానుల సందడి క్రమంగా పెరుగుతోంది. పెద్ద ఎత్తున చేరుకుంటున్న మద్దతుదారులతో ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. రాజకీయంగా కీలక మలుపు తిరుగుతున్న ఈ సమయంలో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుండగా, టీవీకే పార్టీ ప్రదర్శన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. ASLO READ: Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి అమల్లోకి కొత్త విధానం
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
28 రోజుల క్రితం
Logo

Telangana Rastra Sena: కొత్త విప్లవం.. తెలంగాణలో కవిత కొత్త పార్టీ

Telangana Rastra Sena: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ ప్రాంతంలోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన సభలో ఆమె పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించిన కవిత.. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండాను ప్రజల ముందుంచారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ ఆకృతిని ప్రతిష్టించి, దానిపై పార్టీ పేరును సూచించే అక్షరాలను ప్రతిబింబించారు. అనంతరం సభలో మాట్లాడిన కవిత...

Telangana Rastra Sena: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ ప్రాంతంలోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన సభలో ఆమె పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించిన కవిత.. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండాను ప్రజల ముందుంచారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ ఆకృతిని ప్రతిష్టించి, దానిపై పార్టీ పేరును సూచించే అక్షరాలను ప్రతిబింబించారు. అనంతరం సభలో మాట్లాడిన కవిత తన పార్టీ ఏర్పాటుకు కారణమైన అంశాలను వివరిస్తూ, తెలంగాణ ఆత్మ దెబ్బతిన్నదనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ రోజు తన జీవితంలో మరపురాని రోజుగా నిలిచిందని పేర్కొన్న కవిత.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ప్రజల ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యమ నాయకుడిగా నిలిచిన కేసీఆర్ అభివృద్ధి దిశలో సాగించిన ప్రయాణం ప్రస్తుతం గాడితప్పిందని విమర్శించారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో తాను కూడా భాగమని అంగీకరిస్తూ, ప్రజల ముందు క్షమాపణ చెబుతున్నానని వెల్లడించారు. ఆ తప్పులను సరిదిద్దుకునే సంకల్పంతోనే కొత్త పార్టీ స్థాపనకు ముందుకొచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని ఆరోపిస్తూ, అందుకే తెలంగాణ రాష్ట్ర సేన రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. తాను తెలంగాణలోని 3.5 కోట్ల ప్రజలకు తల్లిగా మారాలని కోరుకుంటున్నానని కవిత పేర్కొన్నారు. అమ్మతనంతో పాలన సాగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని కోరుతూ, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఏర్పాటుపై ఆసక్తి లేదని విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాల అంశాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ కోసం పని చేసిన తాను, అప్పటి కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు ఎంతో తేడా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని, ప్రజలకు ఇబ్బందులు వచ్చినా స్పందించడం లేదని విమర్శించారు. అధికారం ముందు అనుబంధాలు తగ్గిపోయాయని, రాజకీయ పరిణతి లోపించిందని కూడా వ్యాఖ్యానించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మంచిదేనని చెప్పిన కవిత.. ఆ పార్టీలో కొనసాగి తాను బలంగా పోరాడలేకపోయానని అన్నారు. ఇప్పుడు రాష్ట్రం కోసం స్వేచ్ఛగా పోరాడతానని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినందుకే తనను పక్కన పెట్టారని ఆరోపించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తమ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందని, మరో 2 సంవత్సరాల తరువాత అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు ముందు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పార్టీ శ్రేణులతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నామని తెలిపారు. తాను తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ALSO READ: Interesting Facts: ఏడు గుర్రాల ఫొటో ఇంట్లో పెడుతున్నారా?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
4 రోజుల క్రితం
Logo

Telangana Politics: ఏడాది తర్వాత బహిరంగ సభకు కేసీఆర్..

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకే రోజు అధికార, ప్రతిపక్ష నాయకులు కీలక పర్యటనలకు సిద్ధమవుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రేపు జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కే.చంద్రశేఖర్ రావు హాజరుకానుండగా, అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతల ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ మైండ్ గేమ్ మొదలైందా అనే సందేహాలకు తావిస్తున్నాయి. దాదాపు ఒక సంవత్సర కాలం తర్వాత...

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకే రోజు అధికార, ప్రతిపక్ష నాయకులు కీలక పర్యటనలకు సిద్ధమవుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రేపు జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కే.చంద్రశేఖర్ రావు హాజరుకానుండగా, అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతల ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ మైండ్ గేమ్ మొదలైందా అనే సందేహాలకు తావిస్తున్నాయి. దాదాపు ఒక సంవత్సర కాలం తర్వాత ప్రజల ముందుకు రాబోతున్న కేసీఆర్ సభపై ప్రత్యేక దృష్టి నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజా వేదికలపై కనిపించని ఆయన, గతేడాది 27 ఏప్రిల్ న వరంగల్‌లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల తర్వాత మళ్లీ బహిరంగ సభలో పాల్గొనలేదు. అత్యవసర కార్యక్రమాలు తప్ప మిగతా వ్యవహారాలన్నీ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచే నిర్వహిస్తూ వచ్చిన ఆయన, ఇప్పుడు జగిత్యాల సభ ద్వారా మళ్లీ రాజకీయంగా చురుకుదనాన్ని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశాలు ఉండటంతో ఈ సభకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇన్నాళ్లు అధికార పక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా మౌనంగా ఉన్న కేసీఆర్ ఈసారి తన ప్రసంగంలో ఎలాంటి వ్యూహం అవలంబిస్తారన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఆయన టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారా, లేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడుపై కూడా విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కొనసాగుతోంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండటం మరో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చూపించాలన్నదే ఆయన వ్యూహంగా తెలుస్తోంది. ఇటీవల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం అంశంపై ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా రాజకీయంగా ప్రాధాన్యత పొందింది. ఇలా ఒకే రోజు అధికార, ప్రతిపక్ష నేతల పర్యటనలు జరగడం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠను పెంచింది. జగిత్యాల సభ ద్వారా ఒకవైపు ప్రతిపక్షం తన శక్తిని ప్రదర్శించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు మేడిగడ్డ పర్యటన ద్వారా అధికార పక్షం ప్రతిస్పందన ఇవ్వబోతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీస్తాయా అన్నది చూడాల్సి ఉంది.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
6 రోజుల క్రితం
Logo

Political: ఒకే రోజు సీఎం, మాజీ సీఎం పర్యటన!

Political: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారాయి. ఏప్రిల్ 20న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఆసక్తి నెలకొంది. కరీంనగర్ తూర్పు ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటన ఉండగా, పశ్చిమ దిశలో మాజీ ముఖ్యమంత్రి సభ జరగనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకేరోజు ఇద్దరు అగ్రనేతలు వేర్వేరు కార్యక్రమాలతో ప్రజల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిణామాలపై కేంద్రీకృతమవుతోంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ బ్లాక్ పిల్లర్లను ఆయన స్వయంగా...

Political: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారాయి. ఏప్రిల్ 20న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఆసక్తి నెలకొంది. కరీంనగర్ తూర్పు ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటన ఉండగా, పశ్చిమ దిశలో మాజీ ముఖ్యమంత్రి సభ జరగనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకేరోజు ఇద్దరు అగ్రనేతలు వేర్వేరు కార్యక్రమాలతో ప్రజల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిణామాలపై కేంద్రీకృతమవుతోంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ బ్లాక్ పిల్లర్లను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి, రాబోయే వర్షాకాలానికి ముందుగానే చేపట్టాల్సిన మరమ్మతులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద భారీ ప్రజాపాలన బహిరంగ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 40 ఎకరాల్లో విస్తరించిన స్థలంలో ఏర్పాట్లు జరుగుతుండగా, భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించేందుకు పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో ఇరిగేషన్ రంగంలో జరిగిన లోపాలను ఈ వేదికగా రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలం తర్వాత బహిరంగ సభలో పాల్గొనబోతుండటం విశేషం. జగిత్యాలలో నిర్వహించనున్న ఈ సభకు భారీ ప్రాధాన్యత లభిస్తోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ శిబిరంలో చేరుతున్న సమయంలో జరుగుతున్న ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని బీఆర్ఎస్ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 1 లక్ష మందిని సమీకరించేలా నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి పెద్ద బహిరంగ సభ కావడంతో, ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన చేసే వ్యాఖ్యలు ఏవీ అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ప్రాజెక్టు పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తేందుకు ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతుండగా, మరోవైపు పార్టీ పునరుద్ధరణ లక్ష్యంతో కేసీఆర్ ప్రజల్లోకి రావడం రాజకీయ సమీకరణాలను వేడెక్కిస్తోంది. ఒకేరోజు, ఒకే జిల్లాలో ఇద్దరు కీలక నాయకుల పర్యటనలతో భద్రతా పరంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం మీద ఏప్రిల్ 20న తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన కేంద్రంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిలవనుందని స్పష్టమవుతోంది. ALSO READ: Tablets: టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందంటే?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
National News
Reporter
STAR TRINETHRAM
9 రోజుల క్రితం
Logo

Indian Politics: ఇకపై 850కి చేరనున్న లోక్‌సభ సీట్ల సంఖ్య!

Indian Politics: దేశ రాజకీయ దిశలో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యను 850కు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూపొందించిన బిల్లు ముసాయిదాను ఇప్పటికే పార్లమెంట్ సభ్యులకు పంపించినట్లు సమాచారం. జనాభా ఆధారంగా రాష్ట్రాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ప్రతిపాదిత మార్పుల...

Indian Politics: దేశ రాజకీయ దిశలో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యను 850కు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూపొందించిన బిల్లు ముసాయిదాను ఇప్పటికే పార్లమెంట్ సభ్యులకు పంపించినట్లు సమాచారం. జనాభా ఆధారంగా రాష్ట్రాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ప్రతిపాదిత మార్పుల ప్రకారం మొత్తం 850 స్థానాల్లో 815 స్థానాలను రాష్ట్రాలకు కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన 35 స్థానాలను కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతున్న లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని కూడా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో సభ్యులు కూర్చునే విధంగా నిర్మించడం ఈ ప్రతిపాదనలకు బలం చేకూర్చుతోంది. అయితే ఈ సీట్ల పెంపు విషయంలో దేశవ్యాప్తంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీపై చర్చలు మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా శాస్త్రీయ ప్రమాణాలతో ఈ పునర్విభజన జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బిల్లుపై పార్లమెంట్‌లో విస్తృత చర్చ జరిగే అవకాశముండగా, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర వంటి భారీ జనాభా కలిగిన రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. నియోజకవర్గాల సరిహద్దుల పునర్నిర్మాణం, ఓటర్ల సంఖ్య వంటి కీలక అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రతి నియోజకవర్గం సమర్థవంతంగా పని చేసేలా చేయడం, ఓటు విలువను సమానంగా నిలబెట్టడం ఈ పునర్విభజన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. చారిత్రకంగా చూస్తే 1970వ దశకం నుంచి లోక్‌సభ స్థానాల్లో పెద్ద మార్పులు జరగలేదు. కానీ అప్పటి నుంచి దేశ జనాభా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ప్రతినిధుల సంఖ్య సరిపోవడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలో 850 స్థానాల ప్రతిపాదన అమలైతే అది భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఈ మార్పుల దిశగా తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో దేశ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే ఈ నిర్ణయం ఎంతవరకు అమలు అవుతుందో చూడాల్సి ఉంది. ALSO READ: Jobs: రూ.1 లక్ష జీతంతో 350 బ్యాంక్ జాబ్స్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
9 రోజుల క్రితం
Logo

KTR vs Kavitha: టీఆర్ఎస్ ఎవరిది?

అన్న ఆవేశం.. చెల్లి పోరాటం గులాబీ కోటలో కొత్త రాజకీయం! KTR vs Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు అప్రతిహత శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ అనే పేరు మరోసారి చర్చల కేంద్రంగా మారింది. పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోవడం, అధికారాన్ని కోల్పోవడం వంటి పరిణామాల మధ్య పాత బ్రాండ్ వైపు తిరిగి చూడాలనే ఆలోచన బలపడుతోంది. పార్టీ పేరు మార్పుతో రాజకీయంగా నష్టపోయామని భావిస్తున్న నేతలు, క్యాడర్‌లోనూ ఈ అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేటీఆర్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని...

అన్న ఆవేశం.. చెల్లి పోరాటం గులాబీ కోటలో కొత్త రాజకీయం! KTR vs Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు అప్రతిహత శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ అనే పేరు మరోసారి చర్చల కేంద్రంగా మారింది. పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోవడం, అధికారాన్ని కోల్పోవడం వంటి పరిణామాల మధ్య పాత బ్రాండ్ వైపు తిరిగి చూడాలనే ఆలోచన బలపడుతోంది. పార్టీ పేరు మార్పుతో రాజకీయంగా నష్టపోయామని భావిస్తున్న నేతలు, క్యాడర్‌లోనూ ఈ అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేటీఆర్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, తుది నిర్ణయం ఆయనదేనని స్పష్టం చేయడం గమనార్హం. అదే సమయంలో టీఆర్ఎస్ అనే పేరు ప్రస్తుతం ఖాళీగా ఉందని, ఎవరైనా వినియోగించుకోవచ్చని కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల్లో బలంగా నాటుకుపోయిన టీఆర్ఎస్ అనే పేరు ఇప్పటికీ భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తోంది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో ఉండటం వల్ల ప్రాంతీయ భావోద్వేగాలను మరింతగా రగిలించే శక్తి ఉంది. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత పార్టీ తన ప్రాథమిక సిద్ధాంతం నుంచి దూరమైందనే భావన ప్రజల్లో ఏర్పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గులాబీ క్యాడర్ కూడా ఇప్పటికీ తమను టీఆర్ఎస్ వాదులుగానే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ బ్రాండ్ విలువను మళ్లీ వినియోగించుకోవాలనే ఆలోచనతో కేటీఆర్, కవిత ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పార్టీని తిరిగి పాత పేరుతో బలపరచాలనే ప్రయత్నం సాగుతుండగా, మరోవైపు కవిత తన రాజకీయ ప్రస్థానానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి అదే పేరును వినియోగించే అవకాశాలు పరిశీలిస్తున్నారని సమాచారం. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్‌గా మారిన పార్టీకి ప్రస్తుతం ఆ దిశలో పెద్దగా పురోగతి కనిపించకపోవడం కూడా ఈ ఆలోచనలకు కారణంగా చెబుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించాలంటే పాత బ్రాండ్‌ను తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని నేతల్లో అభిప్రాయం పెరుగుతోంది. పార్టీ శ్రేణుల్లోనూ ఇదే భావన బలంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ పేరుతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లడం ద్వారా పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవచ్చనే నమ్మకం వ్యక్తమవుతోంది. అయితే ఈ మార్పు నిజంగా అమల్లోకి వస్తుందా లేదా అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశంగానే ఉంది. పార్టీ పేరు మార్పుపై తుది నిర్ణయం కేసీఆర్ చేతుల్లోనే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతారా లేదా అన్నది కీలకంగా మారింది. ఒకవేళ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చే నిర్ణయం తీసుకుంటే, జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించాలనే సంకేతంగా భావించే అవకాశం ఉంది. చట్టపరంగా కూడా టీఆర్ఎస్ బ్రాండ్‌పై పూర్తి హక్కులు కేసీఆర్‌కే ఉన్నాయని, పార్టీ జనరల్ బాడీ తీర్మానం ద్వారా పేరు మార్పు సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పేరు చుట్టూ ఉన్న భావోద్వేగాన్ని ఎంతవరకు రాజకీయంగా మలుచుకోగలుగుతారన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇదిలా ఉండగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు టీఆర్ఎస్ పేరును మళ్లీ తీసుకురావడం ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం అనే భావనను మళ్లీ ప్రజల్లో రగిలించేందుకు ఈ బ్రాండ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే కేవలం పేరు మార్పు మాత్రమే సరిపోదని, ప్రజా సమస్యలపై స్పందించే విధానం కూడా కీలకమని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. పేర్లు మారినా రాజకీయ వాస్తవాలు మారవని గుర్తుచేస్తున్నారు. ప్రజల్లోకి చేరేందుకు కేటీఆర్ పాదయాత్రను అస్త్రంగా ఎంచుకోవడం కూడా ఈ నేపథ్యంలోనే జరుగుతోందని చెప్పవచ్చు. 2027లో పాదయాత్ర చేపడతానని ప్రకటించిన ఆయన, పార్టీ మరియు ప్రజల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. గతంలో జరిగిన లోపాలను అంగీకరిస్తూ, క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించిందని ఒప్పుకోవడం గమనార్హం. ఇప్పుడు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ మళ్లీ బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు కవిత కూడా పాదయాత్ర ద్వారా మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో మహిళా ఓటర్ల మద్దతు కీలకంగా మారిన నేపథ్యంలో, వారితో నేరుగా మమేకమై తమ వైపు తిప్పుకోవాలనే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. హామీల అమలులో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థి పార్టీలపై దాడి చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యూహాలన్నీ విజయవంతం కావాలంటే సమయం, పరిస్థితులు అనుకూలించాల్సి ఉంటుంది. కేవలం భావోద్వేగాలపై ఆధారపడకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినప్పుడే ప్రజల మద్దతు లభించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ బ్రాండ్ మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందా లేక కేవలం చర్చలకే పరిమితమవుతుందా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ALSO READ: Telangana: బీజేపీలో చేరికలకు బ్రేక్!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
9 రోజుల క్రితం
Logo

Telangana: బీజేపీలో చేరికలకు బ్రేక్!

Telangana: ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో చేరికలను సాధిస్తూ వేగంగా ముందుకు సాగిన కమలం పార్టీ ఇప్పుడు ఆ జోరును కోల్పోయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో వరుసగా పలువురు కీలక నేతలు చేరినప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఆ ఉత్సాహం తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు ఇప్పుడు బీజేపీ వైపు చూడటంలో వెనకడుగు వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పార్టీలో చేరిన తర్వాత తమకు దక్కే ప్రాధాన్యతపై స్పష్టత లేకపోవడం, నాయకత్వం నుంచి సరైన గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్...

Telangana: ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో చేరికలను సాధిస్తూ వేగంగా ముందుకు సాగిన కమలం పార్టీ ఇప్పుడు ఆ జోరును కోల్పోయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో వరుసగా పలువురు కీలక నేతలు చేరినప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఆ ఉత్సాహం తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు ఇప్పుడు బీజేపీ వైపు చూడటంలో వెనకడుగు వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పార్టీలో చేరిన తర్వాత తమకు దక్కే ప్రాధాన్యతపై స్పష్టత లేకపోవడం, నాయకత్వం నుంచి సరైన గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం కూడా ఈ చర్చలకు మరింత బలం చేకూర్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ అంశంపై చురుకుగా వ్యవహరించినప్పటికీ, తుది నిర్ణయాన్ని రాష్ట్ర నాయకత్వంపైనే వదిలేసినట్లు సమాచారం. అయినప్పటికీ జీవన్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన తర్వాత తమ స్థానం ఏమిటి, ప్రాధాన్యత ఎంత మేరకు ఉంటుందన్న సందేహాలే ఈ నిర్ణయానికి కారణమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గత అనుభవాలను పరిశీలించినప్పుడు, పార్టీలో చేరిన కొందరు కీలక నేతలకు కూడా తగిన గుర్తింపు లభించలేదనే అభిప్రాయం కొత్తగా చేరదలచిన వారిలో ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కాషాయ పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకుల చేరికలు కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో పెద్ద స్థాయి నేతలు పార్టీలో చేరకపోవడం గమనార్హం. కొత్తగా చేరదలచిన నాయకుల మదిలో పార్టీలో అసలు ప్రాధాన్యత ఎవరికి ఉందన్న ప్రశ్న తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కీలక పాత్ర పోషించిన ఈటలకు కూడా తగిన గుర్తింపు దక్కలేదనే ఉదాహరణను చూపిస్తూ పలువురు నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా దశాబ్దాలుగా పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న పాత క్యాడర్‌కే సరైన గుర్తింపు లేకపోవడం వల్ల అంతర్గత అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు. పార్టీని నమ్ముకుని కష్టకాలంలో అండగా నిలిచిన వారిని పట్టించుకోకపోతే, కొత్తగా చేరే వారిని ఎంతవరకు గౌరవిస్తారన్న సందేహం కూడా కొత్త నాయకుల్లో పెరుగుతోంది. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం లోపించడం, గ్రూపు రాజకీయాలు పెరగడం వంటి అంశాలు కూడా ఆశావహులను వెనక్కి తగ్గిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ సిద్ధాంతాల పరంగా బలంగా ఉన్నప్పటికీ, రాజకీయంగా ఎదుగుదలకు అవసరమైన ప్రాధాన్యత, గౌరవం ఇవ్వడంలో నాయకత్వం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. పదవులు రాకపోయినా కనీస గుర్తింపు ఉండాలని భావిస్తున్న పలువురు నేతలు, ఆ గౌరవం లభించదనే భావనతో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇదే సమయంలో జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ఎంపీ అర్వింద్ కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడించారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జీవన్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం, ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. మొత్తానికి చేరికల ద్వారా పార్టీ బలాన్ని పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి, నాయకులకు ప్రాధాన్యత కల్పించే అంశమే ఇప్పుడు ప్రధాన సవాలుగా మారిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ALSO READ: Celebrations: సిద్ధిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
10 రోజుల క్రితం
Logo

Telangana Politics: కవిత ‘బ్లూ వార్’ సిద్ధం!

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపేలా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటుపై వేగం పెంచారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భావ తేదీని ప్రకటించిన ఆమె.. తాజాగా పార్టీ జెండా రంగును వెల్లడిస్తూ రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమయ్యారు. తమ పార్టీ జెండాలో నీలి రంగుకు ప్రధాన ప్రాధాన్యత ఉంటుందని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసిన కవిత.. ఈ రంగు తమ దార్శనికతను, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ‘కలర్ థియరీ’ అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించడంతో కొత్త పార్టీ...

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపేలా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటుపై వేగం పెంచారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భావ తేదీని ప్రకటించిన ఆమె.. తాజాగా పార్టీ జెండా రంగును వెల్లడిస్తూ రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమయ్యారు. తమ పార్టీ జెండాలో నీలి రంగుకు ప్రధాన ప్రాధాన్యత ఉంటుందని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసిన కవిత.. ఈ రంగు తమ దార్శనికతను, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ‘కలర్ థియరీ’ అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించడంతో కొత్త పార్టీ అజెండాపై మరింత ఆసక్తి పెరిగింది. కొత్త పార్టీ పేరుపై కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రారంభంలో ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, తరువాత పరిణామాలు కొత్త మలుపు తిప్పాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తిరిగి వినియోగించాలనే ఆలోచనపై కవిత తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాత పేరు, కొత్త జెండా, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని ఆమె ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ ఆవిర్భావం, జెండా, విధివిధానాలు, సిద్ధాంతాలను ఏప్రిల్ 25న అధికారికంగా ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మునీరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ వర్గాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ రూపకల్పనలో కవిత బిజీగా ఉన్నారు. పార్టీ సిద్ధాంతాల విషయంలో కూడా కవిత స్పష్టత ఇస్తున్నారు. నీలి రంగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతీకగా భావిస్తున్నట్లు ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు 50 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వివిధ వర్గాల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు అందించే దిశగా ఈ కమిటీలు పనిచేస్తాయని సమాచారం. మహిళా శక్తి ప్రాధాన్యంపై కూడా కవిత ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటివరకు పురుషులు స్థాపించిన పార్టీలను మాత్రమే చూశామని, ఒక మహిళగా తాను పార్టీ స్థాపిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. యువతతో పాటు మహిళలకు పార్టీలో కీలక స్థానాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మౌలిక అవసరాలైన నీళ్లు, నిధులు, నియామకాల సాధన దిశగా తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ALSO READ: Journalism: ఎవరు జర్నలిస్ట్?.. ఎవరికి అక్రిడిటేషన్?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
10 రోజుల క్రితం
Logo

Politics: నాడు తిట్టి.. నేడు జంపింగ్!

Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వలసల రాజకీయం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితిలోకి ఇతర పార్టీల నుంచి నాయకుల ప్రవాహం పెరుగుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది. ఇతర పార్టీల్లో సరైన గుర్తింపు, పదవులు లభించడం లేదనే అసంతృప్తితో ఉన్న నాయకులు గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలను తమవైపు తిప్పుకోవడంలో ముందుండిన ఈ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అదే వ్యూహాన్ని కొనసాగించడం విశేషంగా మారింది. అయితే ఈ నిర్ణయాలు పార్టీ అంతర్గతంగా...

Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వలసల రాజకీయం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితిలోకి ఇతర పార్టీల నుంచి నాయకుల ప్రవాహం పెరుగుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది. ఇతర పార్టీల్లో సరైన గుర్తింపు, పదవులు లభించడం లేదనే అసంతృప్తితో ఉన్న నాయకులు గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలను తమవైపు తిప్పుకోవడంలో ముందుండిన ఈ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అదే వ్యూహాన్ని కొనసాగించడం విశేషంగా మారింది. అయితే ఈ నిర్ణయాలు పార్టీ అంతర్గతంగా అసంతృప్తికి దారితీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో అధికార మార్పిడి సహజ ప్రక్రియ. ప్రజల అభిప్రాయాలు కాలక్రమేణా మారుతుంటాయి. ఒకప్పుడు ప్రజాదరణ పొందిన పార్టీ, హామీల అమలులో విఫలమైతే ప్రజలలో అసహనం పెరిగి ప్రతిపక్షానికి అవకాశం కల్పిస్తుంది. ఇదే పరిస్థితి భారత రాష్ట్ర సమితి విషయంలో కూడా కనిపించిందని రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న ఈ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకే పరిమితమవ్వడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నాయకత్వ శైలి, ఇతర పార్టీలను బలహీనపర్చే ప్రయత్నాలు, వలసలను ప్రోత్సహించడం వంటి అంశాలు ఈ ఓటమికి కారణమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాసంక్షేమం కంటే వ్యక్తిగత పదవులు, హోదాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఒక పార్టీలో సంవత్సరాల పాటు కీలక పదవులు అనుభవించిన నేతలు, కొంత ప్రాధాన్యత తగ్గినా వెంటనే పార్టీ మార్పు వైపు మొగ్గు చూపడం సాధారణంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇలాంటి ఉదంతాలు ఇప్పటికే అనేకం చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు భారత రాష్ట్ర సమితిలో కీలకంగా పనిచేసిన నేతలు ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో పదవులు అనుభవిస్తుండగా, గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని గులాబీ పార్టీ కీలక స్థానాల్లో నిలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోంది. ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన నాయకులనే పరిస్థితులు మారిన తర్వాత ప్రశంసించడం సాధారణంగా మారింది. పదవుల కోసం పార్టీలు మారడం, గతంలో ఉన్న పార్టీలను విమర్శించడం వంటి పరిణామాలు రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలను పెంచుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయాలు విలువల కంటే అవకాశాల ఆధారంగా నడుస్తున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. తాజాగా జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దాదాపు 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన ఆయన.. ప్రస్తుతం తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే కారణంతో గులాబీ పార్టీ వైపు అడుగులు వేయడం విమర్శలకు దారితీసింది. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయనకు ఇంకా ఏం కావాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో కూడా పదవుల కోసం పార్టీ మారడం ఎంతవరకు సమంజసమని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇక మరోవైపు, ప్రస్తుతం కొత్త నాయకులను ఆహ్వానిస్తూ వారికి ప్రాధాన్యత ఇస్తున్న భారత రాష్ట్ర సమితి ఒకవేళ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే, మొదటి నుంచి పార్టీతో ఉన్న నేతలకు అన్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో వలసల రాజకీయాలు మరోసారి చర్చకు దారితీస్తూ, పార్టీల భవిష్యత్తుపై ఆసక్తికరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ALSO READ: AP: వందే భారత్ రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
22 రోజుల క్రితం
Logo

Cabinet Expansion: 2029లో కేబినెట్‌ విస్తరణలో లక్కీ ఛాన్స్ ఎవరికో?

Cabinet Expansion: కేంద్ర రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎప్పటినుంచో పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుందనే ప్రచారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణకు సిద్ధత జరుగుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మే నెలలోనే ఈ విస్తరణ చేపడతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈసారి విస్తరణలో కొంతమందికి శాఖల మార్పులు, కొత్తవారికి అవకాశాలు, మరికొంతమందికి పదవుల కోతలు ఉండే అవకాశం ఉందన్న...

Cabinet Expansion: కేంద్ర రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎప్పటినుంచో పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుందనే ప్రచారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణకు సిద్ధత జరుగుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మే నెలలోనే ఈ విస్తరణ చేపడతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈసారి విస్తరణలో కొంతమందికి శాఖల మార్పులు, కొత్తవారికి అవకాశాలు, మరికొంతమందికి పదవుల కోతలు ఉండే అవకాశం ఉందన్న ప్రచారం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రానున్న జూన్‌తో 2 సంవత్సరాలు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై చర్చలు వేగం అందుకున్నాయి. గత విస్తరణలో అవకాశాలు కోల్పోయిన నేతలు ఈసారి తమకు అవకాశం కల్పించాలని కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇదే సమయంలో దేశంలో 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే పెద్ద ఎత్తున మంత్రివర్గ మార్పులు ఉంటాయన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్‌కు చెందిన సీనియర్ నేత నితీష్ కుమార్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు కూడా ఈసారి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మంత్రులు కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా, అదనంగా మరికొందరికి అవకాశం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నేతల పేర్లు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన అమలాపురం యువ ఎంపీ హరీష్ బాలయోగికి కూడా అవకాశం లభించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. గతంలో లోక్‌సభ సభాపతిగా పనిచేసిన జిఎంసి బాలయోగి సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రస్తుత మంత్రుల శాఖల్లో కూడా మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల్లో మార్పులు ఉంటాయన్న ప్రచారం కొనసాగుతోంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి మరియు రామ్మోహన్ నాయుడు వంటి నేతల శాఖల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్‌కు పదోన్నతి లభించే అవకాశముందని, స్వతంత్ర బాధ్యతలతో కూడిన శాఖ కేటాయించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రాబోయే 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన బృందాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరు, ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ లెక్కలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు ఉండనున్నాయి. పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తైన వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కేంద్ర రాజకీయాల్లో ఎవరికీ అవకాశం దక్కుతుంది, ఎవరు పదవి కోల్పోతారు, ఏ రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరుగుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. ALSO READ: War: గల్ఫ్‌లోని టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
23 రోజుల క్రితం
Logo

Charishma Reddy: రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు?

Charishma Reddy: తెలంగాణ రాజకీయాల్లో క్రమంగా వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 27 నెలలు గడిచినా.. ఇంకా మరో రెండున్నరేళ్లు అధికార కాలం మిగిలి ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే రాబోయే ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, విపక్ష పార్టీలు మాత్రం ఈసారి కాంగ్రెస్‌కు అవకాశమే ఇవ్వమని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య పోరు ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు తమ రాజకీయ వారసులను ముందుకు తీసుకురావడానికి సీనియర్ నేతలు అంతర్గతంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది....

Charishma Reddy: తెలంగాణ రాజకీయాల్లో క్రమంగా వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 27 నెలలు గడిచినా.. ఇంకా మరో రెండున్నరేళ్లు అధికార కాలం మిగిలి ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే రాబోయే ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, విపక్ష పార్టీలు మాత్రం ఈసారి కాంగ్రెస్‌కు అవకాశమే ఇవ్వమని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య పోరు ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు తమ రాజకీయ వారసులను ముందుకు తీసుకురావడానికి సీనియర్ నేతలు అంతర్గతంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే అవకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులకు భవిష్యత్ రాజకీయ స్థానం కల్పించాలనే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన నిర్ణయం వెనుక రాజకీయ వారసత్వ వ్యూహం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఆయన కోడలు చరిష్మా రెడ్డి త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని సమాచారం వినిపిస్తోంది. ఆమెకు అనుకూలంగా రాజకీయ వేదికను సిద్ధం చేయడానికే జీవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల్లో భాగంగా ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరే అవకాశాలు ఉన్నాయని, అక్కడ కీలక పదవి దక్కే అవకాశం ఉన్నదనే ప్రచారం కొనసాగుతోంది. అదే సమయంలో చరిష్మా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇదిలా ఉండగా, త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ అమలు దిశగా కేంద్రం ముందడుగు వేయబోతుందనే సంకేతాలు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. మహిళలకు రిజర్వ్ అయ్యే స్థానాలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు కీలక నేతలు దృష్టి సారించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళా వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ తమకు అనుకూలంగా అవకాశాలు రాకపోతే పార్టీ మారేందుకు కూడా వెనుకాడకూడదనే భావన కొంతమంది నేతల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ సమీకరణాలు రాబోయే రోజుల్లో పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుండగా, కొత్త రాజకీయ శక్తులు కూడా రంగంలోకి దిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఆమె త్వరలోనే తన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశముండటం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ALSO READ: Iran Conflict: అధ్యక్షుడి మాటకు విలువేది..?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
23 రోజుల క్రితం
Logo

Vijay's Speech: జగన్, పవన్‌పై పంచులు? (VIDEO)

Vijay's Speech: కోలివుడ్ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ రంగప్రవేశం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్, ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తిగా విజయ్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం, పొత్తులకు దూరంగా ఉండటం వంటి అంశాలను ఆధారంగా...

Vijay's Speech: కోలివుడ్ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ రంగప్రవేశం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్, ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తిగా విజయ్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం, పొత్తులకు దూరంగా ఉండటం వంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఊపందుకున్నాయి. https://twitter.com/PapalakeyPapa/status/2038911156677685688?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2038911156677685688%7Ctwgr%5Ee7d2f907764cde1f23c68297977be5e63fe32768%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FPapalakeyPapa%2Fstatus%2F2038911156677685688 ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో విజయ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భారీ చర్చ మొదలైంది. ‘Sandy Papa YSCRP’ అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో విజయ్ మాట్లాడిన మాటలకు తెలుగు అనువాదం జోడిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు చూపించారు. అందులో గొడ్డలితో దాడి చేసి అధికారంలోకి రావడం తనకు తెలియదని, కోడి కత్తి డ్రామాలు చేయనని, ఆస్తి కోసం కుటుంబ సభ్యులను దూరం చేసుకునే వ్యక్తిని కాదని పేర్కొన్నట్లు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి చేసినవిగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే వాస్తవానికి ఆ వీడియోలో విజయ్ చేసిన ప్రసంగం పూర్తిగా వేరే కోణంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన తన రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వివరిస్తూ ప్రజల కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి వచ్చానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని చెప్పారు. తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి పని చేయనని హామీ ఇచ్చారు. తమిళనాడులో ఎంత పార్టీలు వచ్చినా అసలు పోటీ రెండు శక్తుల మధ్యనే జరుగుతుందని, అందులో ఒకటి తమ పార్టీ కాగా మరొకటి డీఎంకే అని పేర్కొన్నారు. ప్రజలపై ఆధిపత్యం ప్రదర్శించే నాయకత్వం కావాలా లేదా ప్రజలతో అనుబంధం కలిగిన నాయకత్వం కావాలా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను మీ కుటుంబ సభ్యుడిలా భావించి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో విజయ్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలను కూడా రాజకీయ కోణంలో మలచి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా పొత్తులపై ఆయన చెప్పిన మాటలను ఏపీ రాజకీయాలతో ముడిపెడుతూ వివిధ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాను ఎవరి జెండా మోసే పరిస్థితి రానీయనని, స్వతంత్రంగా పోటీ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నానని ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని వైసీపీ వర్గాలు పవన్ కళ్యాణ్, టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ALSO READ: Telangana: ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
25 రోజుల క్రితం
Logo

Telangana Politics: గులాబీ పార్టీకి కవిత సవాల్?

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపులు తిరుగుతున్న తరుణంలో కల్వకుంట్ల కవిత తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ జాగృతి సంస్థను పూర్తిస్థాయి రాజకీయ పార్టీ (తెలంగాణ ప్రజా జాగృతి)గా మారుస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఆమె రాజకీయంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టైంది. ఏప్రిల్ 25న పార్టీ జెండా, ఎజెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించడంతో, ఇప్పటికే ఉన్న రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. తెలంగాణలో తమదొక్కటే నిజమైన ప్రాంతీయ పార్టీ అవుతామని కవిత ప్రకటించడం, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు ఉన్న పార్టీలకు భిన్నంగా, ప్రజల సమస్యలపై...

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపులు తిరుగుతున్న తరుణంలో కల్వకుంట్ల కవిత తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ జాగృతి సంస్థను పూర్తిస్థాయి రాజకీయ పార్టీ (తెలంగాణ ప్రజా జాగృతి)గా మారుస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఆమె రాజకీయంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టైంది. ఏప్రిల్ 25న పార్టీ జెండా, ఎజెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించడంతో, ఇప్పటికే ఉన్న రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. తెలంగాణలో తమదొక్కటే నిజమైన ప్రాంతీయ పార్టీ అవుతామని కవిత ప్రకటించడం, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు ఉన్న పార్టీలకు భిన్నంగా, ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కవిత తీసుకున్న ఈ నిర్ణయం వెనుక గల వ్యూహం గురించి రాజకీయ విశ్లేషకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత, రైతులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణ భావోద్వేగాన్ని మళ్లీ ప్రేరేపిస్తూ, రాష్ట్రంలో ప్రాంతీయ గుర్తింపును బలపరచే ప్రయత్నం కవిత చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. పార్టీ పేరులో తెలంగాణను కొనసాగించడం ద్వారా ప్రజల్లో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని సృష్టించాలనే ఆలోచన కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ పేరులో మార్పు చేసి తెలంగాణ పదాన్ని తొలగించిన అంశాన్ని పరోక్షంగా విమర్శిస్తూ, కవిత తన పార్టీని తెలంగాణ ఆత్మతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తోంది. గత కొంతకాలంగా రాజకీయంగా ఎదుర్కొన్న పరిణామాలు కూడా కవిత ఈ నిర్ణయానికి కారణమయ్యాయని భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆ పార్టీపై గుప్పించిన విమర్శలు ఇప్పటికే పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగిన నాయకురాలిగా కవితకు ఉన్న అనుభవం ఇప్పుడు ఆమెకు బలంగా మారనుంది. బీఆర్ఎస్‌లో పనిచేసిన అనుభవంతో ఆ పార్టీ బలహీనతలు, బలాలు ఆమెకు బాగా తెలిసిన నేపథ్యంలో, అదే ఆధారంగా వ్యూహాలను రూపొందించే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాను ఎవరికి నష్టం చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టడం లేదని చెప్పినా, వాస్తవానికి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌పై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వరుస ఎన్నికల్లో ఎదుర్కొన్న పరాజయాల తర్వాత కేడర్‌లో నిరుత్సాహం నెలకొన్న నేపథ్యంలో, కవిత పార్టీ ప్రకటన ఆ పార్టీకి కొత్త సవాల్‌గా మారే అవకాశముంది. ముఖ్యంగా అసంతృప్తిగా ఉన్న నేతలు, ఉద్యమ కార్యకర్తలు కొత్త అవకాశాల కోసం కవిత వైపు మొగ్గు చూపే పరిస్థితి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో కవిత పార్టీకి ఉద్యమ నేతల మద్దతు లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన కొంతమంది నాయకులు తమకు సరైన గుర్తింపు లభించలేదనే భావనతో ఉన్నారని, వారు కవిత పార్టీ వైపు వెళ్లే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇది సహజంగానే బీఆర్ఎస్‌కు మరింత ఒత్తిడిని పెంచే అంశంగా మారవచ్చు. ఇక మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ స్థాపించవచ్చని, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తే స్వాగతిస్తామని ప్రకటిస్తున్నప్పటికీ, అంతర్గతంగా మాత్రం ఈ కొత్త పార్టీ ప్రభావంపై లెక్కలు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఓటు బ్యాంక్ విభజన జరిగే అవకాశాలపై ఈ పార్టీలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కవిత పార్టీతో ప్రధానంగా బీఆర్ఎస్‌కు నష్టం జరిగే అవకాశమున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీపై కూడా ప్రభావం ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కవిత రాజకీయంగా ముందుకు వస్తున్న తీరు చూస్తే, కేవలం పార్టీ స్థాపనతో ఆగిపోకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సర్వోదయ తెలంగాణ అనే నినాదంతో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం రాజకీయ నినాదం మాత్రమే కాకుండా, తన పార్టీ సిద్ధాంతానికి మూలంగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో యువతకు ఉద్యోగాలు, రైతులకు మద్దతు, మహిళలకు భద్రత వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, కవిత పార్టీ స్థాపన తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ జెండా, ఎజెండా ప్రకటించిన తర్వాత అసలు ప్రభావం ఎలా ఉంటుందో స్పష్టత రానున్నప్పటికీ, ప్రస్తుతం ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఎలా ఎదుగుతుంది, ఏ వర్గాల మద్దతు పొందుతుంది, ఇతర పార్టీలపై ఎంత మేర ప్రభావం చూపుతుంది అనేది చూడాల్సి ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాలను మరోసారి ఉత్కంఠభరిత దశలోకి నెట్టింది. ALSO READ: MI vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్‌పై ముంబై ఘన విజయం
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
25 రోజుల క్రితం
Logo

TamilNadu: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. రెండు స్థానాల నుంచి పోటీకి విజయ్ సిద్ధం

TamilNadu: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకువస్తూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం చెన్నైలో భారీ భద్రత మధ్య జరిగిన సమావేశంలో పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను విజయ్ విడుదల చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల ముందు ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నటుడిగా విశేష ప్రజాదరణ పొందిన విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలో తన బలం చూపించేందుకు సిద్ధమవడం విశేషంగా మారింది. రాబోయే ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని...

TamilNadu: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకువస్తూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం చెన్నైలో భారీ భద్రత మధ్య జరిగిన సమావేశంలో పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను విజయ్ విడుదల చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల ముందు ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నటుడిగా విశేష ప్రజాదరణ పొందిన విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలో తన బలం చూపించేందుకు సిద్ధమవడం విశేషంగా మారింది. రాబోయే ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు కూడా కీలక స్థానాలు కేటాయించారు. ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కె ఎ సెంగోట్టయన్, సి టి ఆర్ నిర్మల్ కుమార్ వంటి నాయకులను వివిధ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులుగా ప్రకటించారు. నామినేషన్ పత్రాల్లో తన పేరును సి జోసెఫ్ విజయ్ గా నమోదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పార్టీ ఎన్నికల గుర్తు విజిల్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అభ్యర్థుల ఎంపికలో తన పార్టీ ప్రత్యేకతను విజయ్ స్పష్టంగా తెలియజేశారు. సామాన్య ప్రజల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చామని, వారికి అధికారం లేకపోయినా ప్రజల సమస్యలపై అవగాహన ఉందని పేర్కొన్నారు. అనుభవం కంటే నిజాయితీ, బాధ్యత, ప్రజల పట్ల నిబద్ధత ముఖ్యమని ఆయన అన్నారు. ప్రతి అభ్యర్థిని వ్యక్తిగతంగా పరిశీలించి, ప్రజలకు సేవ చేయగల సామర్థ్యం ఉన్న వారినే ఎంపిక చేశామని వివరించారు. ఈ నిర్ణయం ద్వారా సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త మార్గాన్ని చూపిస్తున్నట్లు భావిస్తున్నారు. అవినీతి రహిత పాలననే ప్రధాన లక్ష్యంగా ప్రకటించిన విజయ్ తన పార్టీ హామీలను కూడా వెల్లడించారు. ఇతర పార్టీల నాయకుల మాదిరిగా తమ అభ్యర్థులు అవినీతికి పాల్పడరని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయబోమని హామీ ఇచ్చారు. మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, మత్తు పదార్థాల రహిత తమిళనాడు నిర్మాణమే లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీవీకే అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.4000 భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తూ 75 శాతం ఉద్యోగాలను తమిళులకు కేటాయిస్తామని ప్రకటించారు. యువత విద్య కోసం రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని కూడా చెప్పారు. అలాగే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెడతామని వెల్లడించారు. సినిమా రంగం నుంచి వచ్చినవారు రాజకీయాల్లో గెలవలేరనే విమర్శలకు తన విజయంతోనే సమాధానం చెబుతానని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలను తాను మరియు ఎం కె స్టాలిన్ మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య పోటీగా అభివర్ణించారు. ఆరోగ్యకరమైన రాజకీయ పోటీ ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మొత్తంగా ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ALSO READ: LPG: కొత్త PNG కనెక్షన్‌ పొందేందుకు కావాల్సిన డాక్యూమెంట్స్ ఇవే!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
26 రోజుల క్రితం
Logo

Bhadrachalam vs Ayodhya: మోదీ గారు.. దక్షిణ అయోధ్యపై ఎందుకీ వివక్ష?

ఆయోధ్య రామాలయం తరహాలో భద్రాచలం అభివృద్ధి ఎందుకు ఆవశ్యకమని, ఎందుకు ఆలస్యంగా జరుగుతోందని చర్చలు గత కాలంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా భద్రాచలంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరుగడంతో ఈ ఆలయం అన్ని దృష్టులను ఆకర్షించింది. ఇదే నేపథ్యంలో భద్రాచలం అభివృద్ధి అంశంపై రాజకీయ చర్చలకు మిగతా పలు వర్గాలు పునరుద్ధరణగా దారితీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలను లక్ష్యంగా పెట్టుకుని ఈ అంశంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాయి. కేంద్రం భద్రాచలంపై నిర్లక్ష్యం చూపుతోందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయోధ్యలోని రామాలయాన్ని గణనీయంగా...

ఆయోధ్య రామాలయం తరహాలో భద్రాచలం అభివృద్ధి ఎందుకు ఆవశ్యకమని, ఎందుకు ఆలస్యంగా జరుగుతోందని చర్చలు గత కాలంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా భద్రాచలంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరుగడంతో ఈ ఆలయం అన్ని దృష్టులను ఆకర్షించింది. ఇదే నేపథ్యంలో భద్రాచలం అభివృద్ధి అంశంపై రాజకీయ చర్చలకు మిగతా పలు వర్గాలు పునరుద్ధరణగా దారితీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలను లక్ష్యంగా పెట్టుకుని ఈ అంశంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాయి. కేంద్రం భద్రాచలంపై నిర్లక్ష్యం చూపుతోందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయోధ్యలోని రామాలయాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిన నేపథ్యంలో, దక్షిణ భారతదేశంలోని భద్రాచలం ఆలయంపై కేంద్రం ఎందుకు పెద్ద స్థాయిలో దృష్టి పెట్టట్లేదు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ‘రాముడికి ఉత్తరాది, దక్షిణాది తేడా ఉంటుందా మోదీ?’ అని విరుచుకుపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, దక్షిణాది రాష్ట్రాల ఆలయాలపై వివక్ష కొనసాగుతోందా అని ప్రశ్నిస్తున్నారు. భద్రాచలంపై కేంద్ర రాజకీయ నేతల ప్రవర్తనపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శుక్రవారం భద్రాచలం ఆలయాన్ని సందర్శించలేదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాముడి పేరుతో ఓట్ల కోసం రాజకీయ కవలలు చేసే నేతలు రాముని పండుగ సమయంలో ఎందుకు దూరంగా ఉన్నారో హాజరు లేకపోవడం ద్వారా ప్రజల దృష్టిలోకి వచ్చింది. సోషల్ మీడియాలో బీజేపీ ప్రతినిధుల ఫొటోలు, పోస్టర్లు వైరల్ కావడంతో విమర్శలు మరింత బలపడాయి. కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదా అనే అంశంపై మరింత లోతైన విశ్లేషణ ఉంది. అయోధ్య రామాలయం నిర్మాణం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా పెద్ద స్థాయిలో జరిగిందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చింది. భద్రాచలం విషయంలో PRASHAD (Pilgrimage Rejuvenation and Spiritual, Heritage Augmentation Drive) పథకం కింద కేంద్రం రూ.41.38 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతోందని సమాచారం. అయితే అయోధ్య తరహా వేల కోట్లు వ్యయించే ప్రాజెక్టుగా కేంద్రం భద్రాచలాన్ని చేపట్టలేదని విమర్శలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రజలు మరింత భారీ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. భద్రాచలం ఆలయ అభివృద్ధి ఆలస్యానికి రాజకీయ, పాలన సంబంధిత కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో భద్రాచలాన్ని చుట్టుముట్టే ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో చేరడంతో ఆలయ భూముల యాజమాన్యం ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య స్పష్టత లేకపోవడం అభివృద్ధి పనులను ఆలస్యం చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించినా అవి పూర్తిగా ఉపయోగించబడలేదు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఇతర పార్టీలు అధికారంలో ఉండటంతో నిధుల కేటాయింపులో రాజకీయ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం ఆలయ పునర్నిర్మాణం, పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి దశ అభివృద్ధి పనుల కోసం రూ.351 కోట్లు కేటాయించారు. మొత్తం ప్రాజెక్ట్ మూడు దశల్లో కొనసాగుతుంది. మొత్తం ఖర్చు దాదాపు రూ.586 కోట్లు ఉంటుందని అంచనా. మొదటి దశలో ఆలయ విస్తరణ, గోదావరి ఘాట్ల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు ఏర్పాట్లు చేయబడతాయి. తదుపరి దశల్లో పట్టణ సుందరీకరణ, రవాణా సౌకర్యాల మెరుగుదల జరగనుంది. ALSO READ: Astrology: ఆడ, మగవారికి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మంచిదంటే?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
4 రోజుల క్రితం
Logo

KCR: గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తారా?

KCR: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. శుక్రవారం ఉదయం ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవిగా భావిస్తారు. ఈ సందర్భంలో ప్రతిపక్ష నేతలు సభకు హాజరై బడ్జెట్‌పై చర్చించడం, లోపాలను సూచించడం, ప్రజల తరఫున ప్రశ్నలు లేవనెత్తడం వంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే, అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు సభకు హాజరు కాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గత...

KCR: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. శుక్రవారం ఉదయం ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవిగా భావిస్తారు. ఈ సందర్భంలో ప్రతిపక్ష నేతలు సభకు హాజరై బడ్జెట్‌పై చర్చించడం, లోపాలను సూచించడం, ప్రజల తరఫున ప్రశ్నలు లేవనెత్తడం వంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే, అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు సభకు హాజరు కాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయన గైర్హాజరు కావడం గమనార్హంగా మారింది. కేవలం 2 సందర్భాల్లో మాత్రమే అసెంబ్లీకి వచ్చి హాజరు రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారని అధికారపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. హాజరు లేకుంటే శాసనసభ సభ్యత్వంపై ప్రభావం పడే అవకాశముండటంతో కేవలం హాజరు నమోదు కోసం మాత్రమే వస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగిన కే చంద్రశేఖర్ రావు, అధికారంలో ఉన్న సమయంలో సభలో చురుకుగా పాల్గొని ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి సభకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి తన అనుభవాన్ని పంచుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన సభకు రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. తనకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండటం, సభలో ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం వంటి కారణాలతోనే ఆయన దూరంగా ఉంటున్నారేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సభకు హాజరుకాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అవసరమన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలకు అయినా కే చంద్రశేఖర్ రావు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకవేళ సభకు రాకపోతే ఆయనకు ప్రభుత్వం ఎందుకు జీతం చెల్లించాలనే ప్రశ్నను లేవనెత్తారు. ప్రస్తుతం కే చంద్రశేఖర్ రావు రూ.1.06 లక్షల వేతనం పొందుతున్నప్పటికీ, సభకు హాజరుకాకపోవడం సరైంది కాదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలు తమ సమస్యలను సభలో వినిపించాలని ఆశించి నాయకులను ఎన్నుకుంటారని, కానీ సభకు రాకుండా ఫార్మ్ హౌస్‌లోనే ఉంటే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించకపోవడం సరికాదని స్పష్టం చేశారు. ఇకపై సభకు హాజరుకాని సభ్యుల జీతాలను కట్ చేయడం లేదా ఇప్పటికే పొందిన వేతనాలను తిరిగి వసూలు చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చలు మరింత వేడెక్కాయి. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కే చంద్రశేఖర్ రావు ఇప్పటివరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని స్వీకరించి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ జీతాన్ని తిరిగి ఇవ్వాలని నిర్ణయిస్తే భవిష్యత్తులో అసెంబ్లీకి హాజరు అయ్యే అవకాశాలు తగ్గిపోతాయని, మళ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తేనే సభలో అడుగుపెట్టే పరిస్థితి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. లేదంటే క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యే అవకాశమున్నదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ALSO READ: CM Revanth Reddy: రైతును రాజుగా చేయడమే లక్ష్యం
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
5 రోజుల క్రితం
Logo

Political Drugs: డ్రగ్ టెస్ట్‌కి ఎవరు రెడీ?

Political Drugs: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సమస్య ఇప్పుడు సాధారణ నేరంగా కాకుండా సమాజాన్ని లోపల నుంచి క్రమంగా కుదించే ప్రమాదకర వ్యాధిలా మారుతోంది. ఒకప్పుడు గోవా, ముంబై వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ దందా, గత 5-6 సంవత్సరాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలుమూలలకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా చూపిస్తోంది. యువతకు మార్గనిర్దేశం చేయాల్సిన నేతలు ఒకవైపు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతుండగా, మరోవైపు ఫామ్‌హౌస్‌ల్లో జరిగే పార్టీల్లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొనడం సమాజంలో...

Political Drugs: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సమస్య ఇప్పుడు సాధారణ నేరంగా కాకుండా సమాజాన్ని లోపల నుంచి క్రమంగా కుదించే ప్రమాదకర వ్యాధిలా మారుతోంది. ఒకప్పుడు గోవా, ముంబై వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ దందా, గత 5-6 సంవత్సరాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలుమూలలకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా చూపిస్తోంది. యువతకు మార్గనిర్దేశం చేయాల్సిన నేతలు ఒకవైపు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతుండగా, మరోవైపు ఫామ్‌హౌస్‌ల్లో జరిగే పార్టీల్లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొనడం సమాజంలో తీవ్ర ఆవేదనను రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే తరాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, పుట్ట మహేశ్ కుమార్ యాదవ్ సహా మొత్తం 11 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో కొందరికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడం మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ఎంపీ పుట్ట మహేశ్ బెయిల్‌పై ఉండగా, కాల్పుల ఘటనలో సంబంధం ఉన్న నేపథ్యంలో రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారం క్రమంగా రాజకీయ రంగు పులుముకుని రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేగంగా స్పందించడం గమనార్హంగా మారింది. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎంపీ పుట్ట మహేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంతవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించడం ద్వారా పార్టీ క్రమశిక్షణను కాపాడే ప్రయత్నం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ స్పందన ఆలస్యమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ, అది 2 రోజుల ఆలస్యంగా రావడం రాజకీయంగా నష్టం కలిగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిన పార్టీ, అప్పటివరకు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. అయితే ప్రారంభంలోనే కఠిన చర్యలు తీసుకుని ఉంటే పార్టీపై పడిన విమర్శలు తగ్గేవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ ఆస్తుల వ్యవహారం ఉందన్న అనుమానాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణం తర్వాత ఆస్తుల వివాదం నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టిన కొందరు ప్రముఖులు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితం కేదార్ అనుమానాస్పదంగా మరణించగా, ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారన్న ప్రచారం ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఇక అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కూడా ఈ కేసుపై ఉందన్న చర్చ సాగుతోంది. ఇరాన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడుల భవిష్యత్తుపై చర్చించేందుకే ఈ సమావేశం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే డ్రగ్స్ వినియోగం బయటపడటంతో ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ దుమారంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ అంశాన్ని ఆయుధంగా మలచుకుని బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రాజేంద్రనగర్ డీసీపీ నేతృత్వంలో ఏర్పడిన ఈ బృందం డ్రగ్స్ సరఫరా మార్గాలు, అంతర్జాతీయ సంబంధాలు, ఈ పార్టీలో పాల్గొన్న వారిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది. డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు, దుబాయ్ లింకులు ఉన్నాయా అనే అంశాలపై దృష్టి సారించనుంది. ఇది కేసులో కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయంగా ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ నేతలు కల్వకుంట్ల తారక రామారావుపై కూడా ఆరోపణలు చేస్తూ, ఆయన కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్, తాను ఎప్పుడైనా డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమని ప్రకటించారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్ టెస్టులకు రావాలన్న ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా కూడా ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ నేతలు గత 10 సంవత్సరాల్లో డ్రగ్స్ వ్యాప్తి పెరిగిందని ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్ నాయకులు ఈ కేసును రాజకీయంగా మలుస్తున్నారని ప్రతివాదిస్తున్నారు. ప్రజాప్రతినిధులందరికీ డ్రగ్ టెస్టులు నిర్వహించాలన్న డిమాండ్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ డ్రగ్స్ వ్యవహారం కేవలం ఒక కేసుగా కాకుండా, రాజకీయ నైతికత, ప్రజాప్రతినిధుల బాధ్యత, సమాజంపై ప్రభావం వంటి కీలక అంశాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే రాజకీయ నాయకులు తమ ప్రవర్తనలో పారదర్శకత చూపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు దర్యాప్తు ఎటువైపు దారితీస్తుందో, రాజకీయంగా ఎలాంటి మార్పులకు దారి తీస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. ALSO READ: Telangana Congress: జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలా?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
5 రోజుల క్రితం
Logo

Telangana Congress: జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలా?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ పాత చర్చలు కొత్త ఊపుతో ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి వ్యవహారాలు సవ్యంగా నడుస్తున్నాయనే భావన నెలకొన్న సమయంలోనే, పీసీసీ అధ్యక్ష పదవిపై వచ్చిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పీసీసీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్న నేపథ్యంలో, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిను పీసీసీ చీఫ్‌గా చేస్తే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తుందన్న వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ...

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ పాత చర్చలు కొత్త ఊపుతో ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి వ్యవహారాలు సవ్యంగా నడుస్తున్నాయనే భావన నెలకొన్న సమయంలోనే, పీసీసీ అధ్యక్ష పదవిపై వచ్చిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పీసీసీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్న నేపథ్యంలో, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిను పీసీసీ చీఫ్‌గా చేస్తే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తుందన్న వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డికు పార్టీ అధిష్టానం పగ్గాలు అప్పగించగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అనంతరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత కోమటిరెడ్డి కేబినెట్‌లో చోటు దక్కించుకోవడం వంటి పరిణామాలతో పరిస్థితి సర్దుకుపోయినట్లు కనిపించింది. అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి విజయాలు అందించడం ద్వారా తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కేబినెట్ విస్తరణపై వస్తున్న ఊహాగానాలు ఈ చర్చకు కొత్త కోణాన్ని తెచ్చాయి. మహేష్ కుమార్ గౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే పీసీసీ పదవిలో మార్పు అనివార్యమవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్‌గా చూడాలన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జగ్గారెడ్డి మాస్ లీడర్‌గా ప్రజల్లో బలమైన గుర్తింపు కలిగి ఉండటం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన దూకుడు, ప్రతిపక్షాలపై ఘాటైన స్పందన ఇవన్నీ కలిసి ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి లాభం ఉంటుందన్న అభిప్రాయం కొంతమంది నాయకుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను పార్టీ అంతర్గత రాజకీయాల కోణంలోనే చూడాలా, లేక వ్యక్తిగత అభిప్రాయంగా తీసుకోవాలా అన్నదానిపై చర్చ సాగుతోంది. జగ్గారెడ్డి గతంలో కోమటిరెడ్డికి బహిరంగంగా మద్దతు తెలపడం, ఆయనపై వచ్చిన విమర్శలకు ముందుండి సమాధానం చెప్పడం వంటి పరిణామాల నేపథ్యంలో, కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో వ్యక్తిగత అభిమానం కూడా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలకు అతిగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక సామాజిక సమీకరణాల కోణంలో చూస్తే.. ఇప్పటికే ముఖ్యమంత్రి స్థానంలో రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు ఉండటం వల్ల, పీసీసీ అధ్యక్ష పదవిని కూడా అదే వర్గానికి ఇవ్వడం సాధ్యంకాదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సమతుల్యతను కాపాడేందుకు వర్గాల మధ్య సమన్వయం అవసరమని, అందువల్ల పెద్ద మార్పులు త్వరలో జరిగే అవకాశాలు తక్కువనే అభిప్రాయం బలపడుతోంది. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అంతర్గత చర్చలకు దారి తీసినప్పటికీ, వాటి వెనుక పెద్ద రాజకీయ మార్పుల సంకేతాలు ఉన్నాయా లేదా అన్నది ఇప్పటికీ స్పష్టంగా కనిపించడం లేదు. కేబినెట్ విస్తరణ జరిగితేనే పరిస్థితులు మారే అవకాశం ఉందని, లేదంటే ప్రస్తుత వ్యవస్థ కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఈ చర్చలు ఎటువైపు దారితీస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ALSO READ: Pawan Kalyan: జనసేనలో అసలు ఏం జరుగుతోంది?.. వివాదాస్పదంగా ఆవిర్భావ వేడుకలు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
6 రోజుల క్రితం
Logo

Congress Strategy: హైదరాబాద్‌లో హస్తం స్ట్రాటజీ!

Congress Strategy: గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదిక సిద్ధమవుతోంది. నగర పాలక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సాధారణ ప్రకటనలా కనిపించినా, వాస్తవానికి ఇది భారీ రాజకీయ వ్యూహానికి సంకేతంగా మారింది. 300 మంది యోధులు కావాలంటూ పార్టీ అంతర్గతంగా ఇచ్చిన పిలుపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా మూడు మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో బలమైన నాయకత్వాన్ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇంకా 4 నుంచి...

Congress Strategy: గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదిక సిద్ధమవుతోంది. నగర పాలక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సాధారణ ప్రకటనలా కనిపించినా, వాస్తవానికి ఇది భారీ రాజకీయ వ్యూహానికి సంకేతంగా మారింది. 300 మంది యోధులు కావాలంటూ పార్టీ అంతర్గతంగా ఇచ్చిన పిలుపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా మూడు మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో బలమైన నాయకత్వాన్ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇంకా 4 నుంచి 5 నెలల్లో హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయనే సమాచారం నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహాలను పదునుపెడుతోంది. గతంలో గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉండగా, తాజా విభజనతో ఆ సంఖ్య 300కి పెరిగింది. పాలన సౌలభ్యం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపుతోంది. అయితే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన కాంగ్రెస్, ఈసారి మాత్రం పరిస్థితిని పూర్తిగా మార్చాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. పార్టీకి పెద్ద సవాల్‌గా నిలుస్తున్న అంశం నాయకుల కొరత. గత పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో పలువురు నేతలు పార్టీని వీడడం వల్ల సంస్థాగత బలం తగ్గింది. అయినప్పటికీ ఇటీవల కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో సాధించిన విజయాలు పార్టీకి కొంత ఉత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం అధికారంలో ఉండటం కూడా కాంగ్రెస్‌కు అదనపు బలంగా మారింది. దీంతో ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని హస్తం పార్టీ నేతలు సంకల్పించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు పలకడం కూడా రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. లెక్కల పరంగా చూస్తే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బలం పెరిగినట్లు కనిపించినా, సంస్థాగతంగా ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బలాన్ని పెంచుకునేందుకు పార్టీ నాయకత్వం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలను పార్టీలోకి చేర్చుకున్న కాంగ్రెస్, మరికొందరిని ఆకర్షించే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తోంది. ఇక ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి సారించిన కాంగ్రెస్, వారిని ఎన్నికల బరిలో దింపే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కార్పొరేషన్ ఛైర్మన్‌లుగా ఉన్న పలువురు నేతల పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో వారందరినీ నేరుగా ఎన్నికల రంగంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ బలం పెరగాలంటే కీలక నేతలందరూ ప్రత్యక్ష పోటీలో ఉండాలని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు కార్పొరేషన్లలోని 300 డివిజన్లకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను కాంగ్రెస్ ఇప్పటికే ప్రారంభించింది. జూన్ నెల చివరి నాటికి పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కొందరు నేతలకు ఆయా డివిజన్లలో పోటీకి అనుమతులు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రక్రియ మొత్తం చూస్తే, రాబోయే ఎన్నికలను కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. మొత్తంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈసారి అత్యంత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 300 మంది యోధులతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. నగర రాజకీయాల్లో తమ ముద్ర వేయాలని సంకల్పించిన కాంగ్రెస్ ఈసారి ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాల్సి ఉంది. ALSO READ: Mosquito Bite: దోమలకు రక్తం రుచి చూపించింది ఎవరంటే?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
6 రోజుల క్రితం
Logo

State Elections 2026: అసలు సిసలు తీర్పు అప్పుడే..

తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. విజయ్ ఎంట్రీతో మారిన సమీకరణాలు పుదుచ్చేరిలో రాజకీయ రసవత్తరం కేరళలో పినరయి విజయన్ హ్యాట్రిక్ లక్ష్యం State Elections 2026: దేశ రాజకీయాల్లో మరోసారి కీలక ఘట్టం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, ఉత్తర దిశలో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు ముమ్మరమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా కూడా వివిధ వాదనలు, విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో డీఎంకే మరోసారి...

తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. విజయ్ ఎంట్రీతో మారిన సమీకరణాలు పుదుచ్చేరిలో రాజకీయ రసవత్తరం కేరళలో పినరయి విజయన్ హ్యాట్రిక్ లక్ష్యం State Elections 2026: దేశ రాజకీయాల్లో మరోసారి కీలక ఘట్టం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, ఉత్తర దిశలో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు ముమ్మరమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా కూడా వివిధ వాదనలు, విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో డీఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందా, కేరళలో పినరయి విజయన్ వరుసగా మూడోసారి విజయం సాధిస్తారా, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాలుగోసారి గెలుస్తారా, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా, పుదుచ్చేరిలో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్న అంశాలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సాంప్రదాయ పోటీ కొనసాగుతుండగా, కొత్తగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రంగంలోకి రావడం పోటీని మరింత కఠినతరం చేసింది. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే డీఎంకే స్థిరంగా బలపడుతున్నట్టు కనిపిస్తోంది. 2016లో 89 స్థానాలు గెలిచిన ఈ పార్టీ, 2021లో 133 స్థానాలను సాధించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కూడా గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మరోవైపు అన్నాడీఎంకే గణనీయంగా పడిపోయి 134 స్థానాల నుంచి 66 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ కూడా తన స్థాయిని కొంత పెంచుకున్నప్పటికీ, ఇంకా పెద్ద స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈసారి టీవీకే పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాలు గెలుస్తుంది అన్న అంశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. అధికార డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, ప్రత్యక్ష నగదు బదిలీ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో మంచి మద్దతు సంపాదించిందనే అభిప్రాయం ఉంది. మహిళలు, విద్యార్థులు, వివిధ వర్గాల కార్మికులకు అందించిన ప్రయోజనాలు ప్రభుత్వానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. అయితే కొందరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, సహజ వ్యతిరేకత, కూటమి సీట్ల పంపకాలలో తలెత్తిన సమస్యలు కొంత ప్రతికూలతను కలిగిస్తున్నాయి. విజయ్ పార్టీ రంగప్రవేశం యాంటీ డీఎంకే ఓట్లను చీల్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. యువ ఓటర్లను ఆకర్షించడంలో ఎవరు ముందుంటారన్నది కీలకంగా మారింది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి కూడా తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. జయలలిత పేరు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అంతర్గత విభేదాలు, శశికళ, పన్నీర్ సెల్వం వంటి అంశాలు పార్టీకి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. టీవీకే పార్టీ ప్రభావం ఇక్కడ కూడా ఓట్ల విభజనకు దారి తీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం తమిళనాడులో కొత్త మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. యువత, మార్పు కోరుకునే ఓటర్లలో ఆయనకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే పార్టీకి బూత్ స్థాయిలో బలం లేకపోవడం, అనుభవం లోపించడం వంటి అంశాలు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. కరూర్ ఘటనపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తు కూడా కొంత ప్రభావం చూపవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో కూడా రాజకీయ పోటీ ఉత్కంఠభరితంగా మారింది. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే పార్టీల బలం మారుతూ వస్తోందని తెలుస్తోంది. ఎన్. రంగస్వామి మరోసారి ముఖ్యమంత్రి కావాలని చూస్తుండగా, బీజేపీతో మళ్లీ చేతులు కలపాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారంపై ఉన్న అసంతృప్తి కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్రం ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఒకవైపు ఉంటే, రాష్ట్ర హోదా అంశం మరోవైపు చర్చనీయాంశంగా మారింది. డీఎంకే, కాంగ్రెస్ కూడా ఈసారి అవకాశాలపై ఆశాభావంతో ఉన్నాయి. కేరళలో రాజకీయ సమీకరణాలు ఎప్పటిలాగే ఉత్కంఠభరితంగా ఉన్నాయి. 2021లో వరుసగా రెండోసారి గెలిచిన పినరయి విజయన్ ఇప్పుడు మూడోసారి విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తోంది. బూత్ స్థాయిలో కేడర్ బలం, నాయకత్వంపై ఉన్న విశ్వాసం కూటమికి బలంగా నిలుస్తున్నాయి. అయితే వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండటంతో సహజ వ్యతిరేకత పెరిగినట్లు కనిపిస్తోంది. అంతర్గత వ్యవస్థ బలహీనపడటం, మేధావులతో సంబంధాలు తగ్గడం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం ఎల్డీఎఫ్‌కు కలిసొస్తోంది. బీజేపీ కూడా పోటీలో ఉండటం వల్ల ఓట్ల విభజన జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా తమ బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. మైనారిటీల మద్దతు, స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఈ కూటమికి ఊపిరి పోస్తున్నాయి. అయితే అంతర్గత విభేదాలు, బూత్ స్థాయి బలహీనత పార్టీకి సవాల్‌గా మారింది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూడా ఈసారి కేరళలో ప్రభావం చూపాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ఓటు శాతం పెరగడం, కేడర్‌లో ఉత్సాహం పెరగడం గమనార్హం. అయితే రాష్ట్ర స్థాయి నాయకత్వం బలహీనంగా ఉండటం ప్రధాన అడ్డంకిగా మారింది. సంప్రదాయ ఓటు బ్యాంకులను చెరిపివేయడం ఎంతవరకు సాధ్యమవుతుందన్నది చూడాల్సి ఉంది. ఈసారి ఎన్నికలు దేశవ్యాప్తంగా రాజకీయ దిశను ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలో వేర్వేరు సమీకరణాలు, వేర్వేరు సవాళ్లు కనిపిస్తున్నాయి. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే అసలు సిసలు తీర్పు కోసం మే 4వరకు వేచి చూడాల్సిందే. ALSO READ: Safest Countrys: ఈ దేశాల్లో యుద్ధాలే ఉండవట!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
11 రోజుల క్రితం
Logo

BJP: రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ వన్నాల వెంకటరమణ

BJP: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ వన్నాల వెంకటరమణను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ఈ నెల 12 నుండి అమలులోకి వస్తుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ తరఫున ప్రజలకు పార్టీ అభిప్రాయాలను తెలియజేయడం, వివిధ రాజకీయ అంశాలపై పార్టీ వైఖరిని సమాజానికి చేరవేయడం వంటి కీలక బాధ్యతలను ఈ పదవి నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ వన్నాల వెంకటరమణకు...

BJP: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ వన్నాల వెంకటరమణను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ఈ నెల 12 నుండి అమలులోకి వస్తుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ తరఫున ప్రజలకు పార్టీ అభిప్రాయాలను తెలియజేయడం, వివిధ రాజకీయ అంశాలపై పార్టీ వైఖరిని సమాజానికి చేరవేయడం వంటి కీలక బాధ్యతలను ఈ పదవి నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ వన్నాల వెంకటరమణకు ఈ బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. నియామక ఉత్తర్వులు వెలువడిన అనంతరం డాక్టర్ వన్నాల వెంకటరమణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కార్యకర్తలతో సమన్వయం పెంచుకోవడం, రాష్ట్రవ్యాప్తంగా సంస్థను మరింత బలోపేతం చేయడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. డాక్టర్ వన్నాల వెంకటరమణ గతంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ సంస్థ అభివృద్ధికి తన వంతు సేవలు అందించారు. తన సేవలను గుర్తించి రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలను అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుకు, రాష్ట్ర నాయకత్వానికి, అలాగే జాతీయ స్థాయి పార్టీ నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేయడానికి మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ వన్నాల వెంకటరమణ చిన్ననాటి నుంచే సేవా భావంతో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ వచ్చారు. విద్యార్థి దశలోనే వివిధ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని సామాజిక చైతన్య కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించారు. మహేశ్వరం, నర్సంపేట ప్రాంతాల్లోని గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి నుండి ఇంటర్ వరకు విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకుని సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకున్నారు. వన్నాల వెంకటరమణ కుటుంబం కూడా రాజకీయంగా విశిష్ట గుర్తింపు పొందింది. ఆయన తండ్రి వన్నాల శ్రీరాములు ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా సేవలందించారు. రాజకీయ రంగంలో అనుభవం కలిగిన నాయకుడిగా ఆయన ప్రజలకు సేవలందించారు. ఈ కుటుంబ నేపథ్యం డాక్టర్ వన్నాల వెంకటరమణకు కూడా ప్రజా సేవల పట్ల ఆసక్తిని పెంపొందించింది. కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆయన కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన వెంకటరమణ దంత వైద్య రంగంలో నిపుణుడిగా గుర్తింపు పొందారు. ఉన్నత విద్యను పూర్తిచేసి దంత వైద్య శాస్త్రంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. అధ్యాపకుడిగా సేవలందిస్తూ అనేక మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. దేశీయ స్థాయిలోనే కాకుండా విదేశీ వేదికలపై కూడా తన విద్యా సేవలతో గుర్తింపు పొందిన ఆయన వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించారు. సామాజిక సేవల విషయంలో కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. గత 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు. వాక్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సహాయం అందిస్తున్నారు. పేద కుటుంబాలకు సహాయం చేయడం, విద్యార్థుల విద్యకు ప్రోత్సాహం అందించడం వంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజల మధ్య మంచి పేరు సంపాదించారు. రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్ ప్రాంత ప్రజలతో మమేకమై పనిచేస్తున్న ఆయన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విశేష ఆదరణ పొందారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలతో సమన్వయం పెంచుకుని ముందుకు సాగుతానని ఈ సందర్భంగా డాక్టర్ వన్నాల వెంకటరమణ పేర్కొన్నారు. ALSO READ: Rythu Bharosa: రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వ స్పష్టత
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
16 రోజుల క్రితం
Logo

CM Revanth Reddy: మహిళల కోసం చట్టాలు రూపొందిస్తే సరిపోదు

CM Revanth Reddy: మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు రూపొందించడం మాత్రమే సరిపోదని, అవి ప్రజల మధ్య నిజంగా అమలయ్యే విధంగా ప్రభుత్వాలు కృషి చేసినప్పుడే అసలు లక్ష్యం సాధ్యమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమాజంలో మహిళలకు భద్రత, గౌరవం కల్పించడం ప్రతి ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నగరంలోని జేఎన్‌టీయూలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” అనే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మహిళా సాధికారతపై పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా బలపడితేనే...

CM Revanth Reddy: మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు రూపొందించడం మాత్రమే సరిపోదని, అవి ప్రజల మధ్య నిజంగా అమలయ్యే విధంగా ప్రభుత్వాలు కృషి చేసినప్పుడే అసలు లక్ష్యం సాధ్యమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమాజంలో మహిళలకు భద్రత, గౌరవం కల్పించడం ప్రతి ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నగరంలోని జేఎన్‌టీయూలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” అనే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మహిళా సాధికారతపై పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ నిర్మాణంలో మహిళలు చూపిస్తున్న పట్టుదల, కృషి రాష్ట్ర ప్రగతికి బలమైన పునాది అని ఆయన అన్నారు. మహిళల ప్రతిభను గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు వివిధ రంగాల్లో కీలక బాధ్యతలు అప్పగించడం మాత్రమే కాకుండా, సంక్షేమ పథకాల అమలులో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థను బలపరచడంలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమని భావించి అనేక పథకాలను మహిళల పేరుమీద అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి తమ కాళ్లపై తామే నిలబడేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోందని ముఖ్యమంత్రి వివరించారు. మహిళలను చిన్న స్థాయి వ్యాపారాలు చేసే స్థితి నుంచి పెద్ద స్థాయి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా మార్గం సుగమం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాలకు సమీపంగా మహిళలు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు ప్రత్యేకంగా “ఇందిరా మహిళా స్టాల్స్” ఏర్పాటుకు స్థలం కేటాయించినట్లు తెలిపారు. దీంతో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించి వారి ఆదాయం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయించే అవకాశాన్ని కల్పించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. దీనివల్ల గ్రామీణ మహిళలు తయారు చేసే వస్తువులు మరింత పెద్ద మార్కెట్‌కు చేరుకుని వారికి ఆర్థికంగా మంచి లాభాలు వచ్చే అవకాశముందని అన్నారు. ఈ చర్యల ద్వారా మహిళల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. మహిళల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడం కోసం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం మాత్రమే కాకుండా మహిళా సంఘాల భాగస్వామ్యంతో ప్రజా రవాణా రంగంలో కూడా వారికి అవకాశాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణా సంస్థ పరిధిలో 1000 బస్సులను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిపిస్తూ వారిని వ్యాపార భాగస్వాములుగా మార్చామని ఆయన వివరించారు. ఈ చర్యల ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు వారు సమాజంలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడంలో మహిళల కృషి ఎంతో కీలకమని ముఖ్యమంత్రి కొనియాడారు. విద్య, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాలు వంటి అనేక రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, వారి రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలు ఎక్కడైనా భయపడకుండా తమ ప్రతిభను ప్రదర్శించే వాతావరణం కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళలకు గౌరవం ఇవ్వాలని, వారి అభివృద్ధికి అండగా నిలవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ALSO READ: RevanthReddy: తెలంగాణ మావోయిస్టు స్టేట్ కమిటీ ముగింపు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
17 రోజుల క్రితం
Logo

Congress Government: తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై దృష్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊరట రైతులకు రుణమాఫీతో ఉపశమనం ఆరోగ్యశ్రీ విస్తరణతో పేదలకు వైద్య భరోసా విజన్ 2047తో తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలు Congress government: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు అజేయ శక్తిగా కనిపించిన బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో పెద్ద మలుపుగా నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నదనే భావన బలంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా మందిలో లేకపోయినా, ఆ పార్టీ...

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై దృష్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊరట రైతులకు రుణమాఫీతో ఉపశమనం ఆరోగ్యశ్రీ విస్తరణతో పేదలకు వైద్య భరోసా విజన్ 2047తో తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలు Congress government: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు అజేయ శక్తిగా కనిపించిన బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో పెద్ద మలుపుగా నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నదనే భావన బలంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా మందిలో లేకపోయినా, ఆ పార్టీ నాయకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లి బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూనే తమ పాలన ఎలా ఉండబోతుందో వివరించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను వివరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. ఈ హామీలపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించింది. బీఆర్‌ఎస్‌ను ఓడించడం అసాధ్యమని భావించిన రాజకీయ విశ్లేషకులకే ఈ ఫలితం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశను చూపిస్తున్నారు. మార్పు కోరుకున్న ప్రజల ఆశలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ తన పాలనను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న ఈ సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోంది. ప్రజా పాలన అనే నినాదంతో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలను సమానంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన పథకాలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయడం ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం పెద్ద మార్పుగా నిలిచింది. ఉద్యోగాలు లేదా ఇతర పనుల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళలకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో మహిళల నుంచి విస్తృతమైన స్పందన వచ్చింది. అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ రూ.500కే అందించే విధంగా సబ్సీడీ అమలు చేయడం ద్వారా మహిళలపై పడే ఖర్చును తగ్గించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఇంకా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది. విద్యుత్ ఖర్చు తగ్గడంతో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గింది. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే సమయంలో అర్హుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. పథకాలు సరైన వారికి చేరేలా పర్యవేక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేసింది. ఆరోగ్య రంగంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిని విస్తరించి రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులను భరించే విధంగా మార్పులు చేసింది. దీంతో పేదలకు ఖరీదైన వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స పొందే అవకాశం కలగడంతో పేద కుటుంబాలకు ఇది పెద్ద సహాయంగా మారింది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సాధారణ ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని మరింత విస్తరించింది ప్రభుత్వం. రైతుల సంక్షేమం విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు మద్దతుగా నిలుస్తూ రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసింది. దాదాపు రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేయడం ద్వారా లక్షలాది మంది రైతులకు ఉపశమనం కలిగించింది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సుమారు రూ.31,000 కోట్ల నిధులను కేటాయించింది. దాదాపు 40 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీ ద్వారా లాభం చేకూరింది. అదేవిధంగా రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతులు అప్పుల బారిన పడకుండా ఉండేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణను భవిష్యత్తులో బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తోంది. రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో విజన్- 2047 ప్రణాళికను రూపొందించింది. అలాగే పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పేదలకు సొంత ఇల్లు కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రభుత్వం పునఃప్రారంభించింది. సొంత స్థలం ఉన్నా ఇల్లు కట్టుకోలేని పేదలకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి సొంతింటి కలను నిజం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు ప్రయోజనం పొందే అవకాశముంది. అయితే ప్రభుత్వంపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో హైడ్రా చర్యల పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నా, ఈ చర్యలు పేదలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పెద్దల నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ఘటన కూడా ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఒక్కసారిగా కూల్చివేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఇక నిరుద్యోగుల సమస్య కూడా ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఎన్నికల తర్వాత కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ జాబ్ క్యాలెండర్ అమలు కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. యువతకు ఇచ్చిన కొన్ని హామీలు అమలు కాలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కొన్ని లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఉండవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ALSO READ: Missile Strike: ఖమేనీని ఎలా టార్గెట్ చేశారో తెలుసా?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
18 రోజుల క్రితం
Logo

Revanth Reddy: పెరుగుతున్న నేరాల నేపథ్యంలో అదనపు ఐపీఎస్ అధికారుల అవసరం

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న పరిపాలనా అవసరాలు, మారుతున్న భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం దేశ రాజధానిలో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా కేంద్ర గృహ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పెరుగుతున్న నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన సంఖ్యలో ఉన్నత స్థాయి అధికారులు అవసరమని వివరించారు....

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న పరిపాలనా అవసరాలు, మారుతున్న భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం దేశ రాజధానిలో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా కేంద్ర గృహ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పెరుగుతున్న నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన సంఖ్యలో ఉన్నత స్థాయి అధికారులు అవసరమని వివరించారు. తెలంగాణలో పరిపాలన విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారుల సంఖ్యను పెంచాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం పోలీసు ఉన్నతాధికారుల కేటాయింపుపై సమీక్ష మొదటిసారి 2016 సంవత్సరంలో జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తర్వాత జరగాల్సిన రెండో సమీక్ష 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల అది ఆలస్యమై 2025లో మాత్రమే పూర్తయిందని తెలిపారు. అయితే ఆ సమీక్షలో తెలంగాణకు అదనంగా కేవలం 7 మంది ఉన్నతాధికారులను మాత్రమే కేటాయించినట్టు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న పరిపాలనా అవసరాలు, భద్రతా సవాళ్లు మరియు విస్తరిస్తున్న నగరాల పరిస్థితిని పరిశీలిస్తే ఈ సంఖ్య సరిపోదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా కొత్త తరహా నేరాలు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా సాంకేతికతను ఉపయోగించి జరిగే మోసాలు, మత్తు పదార్థాలకు సంబంధించిన కేసులు, ఆర్థిక నేరాలు వంటి ఘటనలు పోలీసు వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణత కలిగిన ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సంఖ్య పెరగడం చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. నేరాలను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా ప్రజలకు భద్రతను మరింత బలంగా అందించేందుకు అదనపు అధికారుల అవసరం ఉందని వివరించారు. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న జనాభా కూడా పోలీసు వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని పెంచుతోందని ముఖ్యమంత్రి కేంద్రానికి వివరించారు. ముఖ్యంగా నగర పరిధిలోని కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో కొత్త పరిపాలనా అవసరాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. భవిష్యత్ నగర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేయనున్న కొత్త నగర పరిపాలనా వ్యవస్థకు కూడా అదనపు ఉన్నతాధికారులు అవసరమవుతారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి తగిన స్థాయిలో అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 83 మంది ఉన్నత స్థాయి పోలీసు అధికారులు సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి సమావేశంలో వివరించారు. అయితే రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంఖ్యను కనీసం 103కు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో తదుపరి సమీక్ష ప్రక్రియను నిర్ణయించిన విధంగానే 2026 సంవత్సరంలో నిర్వహించాలని కూడా కేంద్రాన్ని కోరినట్టు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర భద్రతకు సంబంధించిన మరికొన్ని అంశాలపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో గతంలో చురుకుగా పనిచేసిన సాయుధ విప్లవ కార్యకలాపాల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేంద్రానికి వివరించారు. ఇటీవల కాలంలో పలువురు కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆయుధాలు వదిలి సాధారణ జీవితంలోకి రావడానికి ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ మార్పు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అనుకూలంగా మారుతోందని వివరించారు. గత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ తీసుకున్న చర్యల ఫలితంగా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కాలంలో మొత్తం 591 మంది సాయుధ కార్యకర్తలు తమ ఆయుధాలను వదిలి సాధారణ జీవన విధానంలోకి చేరారని ఆయన వివరించారు. ఇటీవల కొంతమంది ఉన్నత స్థాయి నాయకులు కూడా లొంగిపోవడం ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఇది రాష్ట్రంలో శాంతి స్థాపనకు ఒక మంచి సంకేతంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం ఆర్థిక సహాయం, పునరావాస అవకాశాలు మరియు జీవనోపాధి మార్గాలు కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేంద్రానికి వివరించారు. ఆయుధాలు వదిలి సమాజంలో తిరిగి స్థిరపడేలా చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ విధానం వల్ల తిరిగి హింసాత్మక కార్యకలాపాల వైపు వెళ్లకుండా వారిని సమాజంలో భాగస్వాములుగా మార్చడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కేంద్ర సహకారం అవసరమని కూడా ముఖ్యమంత్రి కేంద్ర గృహ శాఖకు విజ్ఞప్తి చేశారు. మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైతే శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ALSO READ: Stock Market: స్టాక్ మార్కెట్ల రికవరీ.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
18 రోజుల క్రితం
Logo

Ponguleti Srinivas Reddy: జనం గుండెల్లో నిలిచిన నాయకుడి గాధ

అజాతశత్రువు నుంచి అగ్రనేత వరకూ.. కాంగ్రెస్‌కు ఖమ్మం కంచుకోట నిర్మాత.. ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. భూభారతి రూపకర్త ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రజాసేవ జర్నలిస్టుల పెద్దన్న.. సేవా మార్గంలో శ్రీనన్న అన్నివర్గాల వారికి ఆపదలో ఆసరా.. తెరకెక్కుతున్న బయోపిక్‌తో మరింత ఎత్తుకెళ్లనున్న గుర్తింపు! Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో పదునైన వ్యక్తిత్వం, ప్రజల నడకలో నడిచే నాయకత్వం, మాటిస్తే నిలబెట్టుకునే ధైర్యం.. ఇవన్నీ ఒకే పేరులో కలిస్తే అది ‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’. స్వశక్తితో రాష్ట్ర మంత్రివర్యుడి స్థాయికి ఎదిగినా, అధికార అంచులపై నిలబడినా, ప్రజల అంచులకే దగ్గరగా నిలిచిన జన...

  • అజాతశత్రువు నుంచి అగ్రనేత వరకూ..
  • కాంగ్రెస్‌కు ఖమ్మం కంచుకోట నిర్మాత..
  • ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. భూభారతి రూపకర్త
  • ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రజాసేవ
  • జర్నలిస్టుల పెద్దన్న.. సేవా మార్గంలో శ్రీనన్న
  • అన్నివర్గాల వారికి ఆపదలో ఆసరా..
  • తెరకెక్కుతున్న బయోపిక్‌తో మరింత ఎత్తుకెళ్లనున్న గుర్తింపు!
Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో పదునైన వ్యక్తిత్వం, ప్రజల నడకలో నడిచే నాయకత్వం, మాటిస్తే నిలబెట్టుకునే ధైర్యం.. ఇవన్నీ ఒకే పేరులో కలిస్తే అది ‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’. స్వశక్తితో రాష్ట్ర మంత్రివర్యుడి స్థాయికి ఎదిగినా, అధికార అంచులపై నిలబడినా, ప్రజల అంచులకే దగ్గరగా నిలిచిన జన హ‌ృదయ నాయకుడు ఆయన. ఖమ్మం నేలపై తన మాటతో రాజకీయ సమీకరణాలు మార్చగల శక్తి, సేవతో హృదయాలు గెలుచుకున్న సహజ స్వభావం ఆయన సొంతం. ఇచ్చిన మాట తప్పని నైజం, సేవ, కరుణ ఎన్నో లక్షణాల సమన్వయమే శ్రీనన్న బ్రాండ్. అధికారంలో ఉన్నా అహంకారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నా వెనుకడుగు లేకుండా ప్రజల కోసం పోరాడిన ప్రయాణమే ఆయన కథ. ఇప్పుడు ఆ ప్రయాణమే వెండితెరపై ‘శ్రీనన్న అందరివాడు’గా మారబోతుండటం, ఆయనకు ఉన్న ప్రజాభిమానానికి ప్రతీక. ‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’ తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రజలు ముద్దుగా శ్రీనన్న అని పిలుచుకునే పొంగులేటి జనహృదయ నేత. కాంట్రాక్టర్‌గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇలా అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అనతికాలంలోనే ప్రజలనాడిని పట్టిన పొంగులేటి.. లీడర్ బేస్ రాజకీయం కాదు క్యాడర్ బేస్, ప్రజల బేస్ రాజకీయం చేస్తూ అజాతశత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపద ఉంది అంటూ తన గడపతొక్కిన వారికి సాయం చేసేందుకు వెనుకాడరు శ్రీనన్న. 2013లో వైసీపీ తరపున రాజకీయ ఆరంగేట్రం చేసిన పొంగులేటి.. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరుపున ఖమ్మం ఎంపీగా గెలిచారు. తాను ఎంపీగా గెలవడమే కాదు ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించి సత్తాచాటారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు పొంగులేటి. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో తనకు సీటు దక్కకపోయినా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అయితే బీఆర్ఎస్‌లో జరిగిన వెన్నుపోటు రాజకీయాలతో విసిగిపోయి 2023లో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ (టీ-పీసీసీ) ప్రచార కమిటీ కో-ఛైర్మన్‌గా నియమితులై కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో తనవంతు పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో పొంగులేటి చేసిన కామెంట్స్ తెలంగాణ అంతటా ప్రతిధ్వనించాయి. ఖమ్మం నుండి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనీయనని శపథం పూని.. దానిని నిలబెట్టుకున్నారు పొంగులేటి. ప్రజలు సైతం శ్రీనన్న వెంటే నిలవడంతో ప్రస్తుతం ఖమ్మంలో బీఆర్ఎస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. పొంగులేటి కుటుంబ నేపథ్యం.. 1959లో ఖమ్మంలోని కల్లూరు మండలం నారాయణపురంలో రాఘవరెడ్డి, స్వరాజ్యం దంపతులకు జన్మించారు పొంగులేటి. ఆయనకు భార్య మాధురి కుమారుడు (హర్షారెడ్డి), కుమార్తె (సప్ని) ఉన్నారు. 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో క్రాస్‌వాల్‌ నిర్మాణం చేపట్టి కాంట్రాక్టర్‌గా మారిన పొంగులేటికి తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పొంగులేటి కంపెనీలు కాంట్రాక్ట్‌లు చేస్తున్నాయి. ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. భూభారతి తీసుకొచ్చిన మంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పొంగులేటి. ప్రధానంగా ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతూ.. ప్రజలు, రైతులకు మరింత పారదర్శకంగా సేవలు అందించాలనే తపనతో భూభారతి పోర్టల్‌ను తీసుకురావడంలో పొంగులేటి చూపిన చొరవ అనితర సాధ్యం. అలాగే తనకు కేటాయించిన అన్ని శాఖలకు న్యాయం చేస్తూనే మంత్రిగా ఉన్నా.. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగానే కాదు సేవకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అవసరమైన వారికి వైద్య సహాయం, విద్యార్థులకు విద్యా సహాయం, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం వంటి చర్యలతో ప్రజల విశ్వాసాన్ని చురగొన్నారు పొంగులేటి. పార్టీలోనే కాదు పాలనలోనూ పొంగులేటి మార్క్.. ఇక మంత్రిగా తన పాలనకు నిదర్శనంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తాచాటారు పొంగులేటి. ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ కంచుకోటగా చేయడమే కాదు తాను ఇంఛార్జీగా ఉన్న మున్సిపాలిటీల్లో హస్తం జెండా ఎగరయేడంలో మాస్టర్ మైండ్ పొంగులేటి అని నిరూపించుకున్నారు. మంత్రిగా లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారంటే ఆయన కమిట్‌మెంట్‌ను అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ తర్వాత నెంబర్ 2 పొంగులేటి.. ప్రజాప్రభుత్వం పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉన్నారు పొంగులేటి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి -డీఎస్‌ కాంబినేషన్‌లో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగా తాజాగా సీఎం రేవంత్ -టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి సారథ్యంలో రెండోసారి కూడా అధికారం కాంగ్రెస్‌దేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జర్నలిస్టుల పెద్దన్న శ్రీనన్న.. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ ప్రభుత్వాలు చేసిన పొరపాట్లను ప్రజాప్రభుత్వంలో జరగకుండా పెద్దన్నలా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు పొంగులేటి. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరికి న్యాయం చేసే విధంగా ముందుకుసాగుతున్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు వివిధ సమస్యల పరిష్కారానికి దశల వారిగా ప్రణాళికలు రచిస్తున్నారు. కులం లేదు.. మతం లేదు.. సాయం అంటూ తన గడపతొక్కిన వారికి కాదు, లేదు అనకుండా సాయం చేయడమే పొంగులేటికి తెలుసు. అందుకే ఆయన అభిమానులే కాదు ప్రజలు సైతం ఆప్యాయంగా "మనసున్న మారాజు" అని పిలుచుకుంటారు. రాజకీయాల్లోకి చాలామంది నేతలు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో గుర్తింపు తెచ్చుకున్న వారే చిరకాలంగా నిలబడతారు. అలాంటి కోవకే చెందిన వ్యక్తి శ్రీనన్న. అందుకే ఆయన జీవిత చరిత్రపై బయోపిక్ వస్తుందంటే పొంగులేటికి ఉన్న గుర్తింపు అర్థం చేసుకోవచ్చు. 'శ్రీనన్న అందరివాడు' పేరుతో తెలుగు, హిందీ, తమిళ్ సహా మొత్తం 6 భాషల్లో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో మంత్రి పొంగులేటి పాత్రలో సీనియర్ నటుడు సుమన్ నటించనున్నారు. "ఎన్నికల వరకే రాజకీయం, ఆ తర్వాత ప్రజాసేవ" అనే నినాదంతో పనిచేయడమే పొంగులేటికి తెలుసు. నిత్యం ప్రజల్లో ఉండటం, వారి సమస్యలను నేరుగా వినడం, అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపించడం పొంగులేటి ప్రత్యేకత. ఆ సేవాగుణమే పొంగులేటిని రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేనినేతగా నిలబెట్టింది. ALSO READ: CM Revanth Reddy: దేశం కోసమైనా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి

ప్రధాన కేటగిరీలు (Categories)

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు (26)

తెలంగాణ జిల్లాలు (33)