HomeENTERTAINMENTPawan Kalyan Divorce:భార్య అన్నాతో పవన్ కళ్యాణ్ విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేక్

Pawan Kalyan Divorce:భార్య అన్నాతో పవన్ కళ్యాణ్ విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేక్

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్, అన్నా సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన కాలాన్ని కలిసి గడిపామని, అయితే పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తమ వివాహ బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. అలాగే తమ పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉంటామని తెలిపారు. పిల్లల సంతోషం, భవిష్యత్తు, సంక్షేమమే తమ ఇద్దరి ప్రధాన ప్రాధాన్యతగా ఉంటుందని వెల్లడించారు.

ఈ వ్యక్తిగత మార్పు సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలను పవన్ కళ్యాణ్, అన్నా కోరారు. ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయానికి గల కారణాలను మాత్రం సంయుక్త ప్రకటనలో వెల్లడించలేదు.

పవన్ కళ్యాణ్ …రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను 2013లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఇది మూడో వివాహం కావడం గమనార్హం. అంతకుముందు 1997లో నందినిని వివాహం చేసుకోగా 1999లో విడిపోయారు. అనంతరం 2009లో నటి రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. 2012లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇప్పుడు అన్నాతో కూడా విడిపోతున్నట్లు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular