HomeENTERTAINMENTChiranjeevi:చిరు-ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..మెగావర్స్‌లోకి రెబల్‌ స్టార్, లైవ్‌ ఎప్పుడంటే?

Chiranjeevi:చిరు-ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..మెగావర్స్‌లోకి రెబల్‌ స్టార్, లైవ్‌ ఎప్పుడంటే?

📰 Generate e-Paper Clip

తన అద్భుతమైన నటనతో వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమయ్యారు. మెగావర్స్ పేరుతో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.

గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై ప్రసారం కానున్న ఈ ప్రత్యేకమైన టాక్ షోలో చిరంజీవి తనదైన చరిష్మా, హాస్యం, విభిన్నమైన ఆలోచనా విధానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, SOL ప్రొడక్షన్ LLP సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి.

ఇక ఈ షోకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ వార్త నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో ఓ మైలురాయి అనే చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్‌లను ఒకే షోలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 20, 2026న ప్రభాస్‌కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు ఈ షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తమ ఎపిసోడ్ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో మెగావర్స్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ టాక్‌షోకు సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు ప్రీమియర్ తేదీని నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular