HomePOLITICALAndhra Pradesh:మాటకు మాట.. బుగ్గన vs కోట్ల సుజాతమ్మ

Andhra Pradesh:మాటకు మాట.. బుగ్గన vs కోట్ల సుజాతమ్మ

📰 Generate e-Paper Clip

ఉమ్మడి కర్నూలు జిల్లా మున్సిపల్ ఫలితాల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, టీడీపీ నేత కోట్ల సుజాతమ్మ గట్టి కౌంటర్ ఇచ్చారు.

అధికారుల కాలయాపనపై బుగ్గన సంచలన ఆరోపణలుఎన్నికల ఫలితాల ప్రకటనలో అధికారులు కావాలనే తీవ్ర జాప్యం చేశారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు మున్సిపల్ పోరులో వైసీపీ 10 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రత్యర్థి వర్గాలు సైక్లింగ్ పద్ధతిలో విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేశాయని విమర్శించారు. దొంగ ఓట్లతో గెలిచిన కూటమి నేతలు, ఆ ఓట్లు వేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలని ఎద్దేవా చేశారు

బుగ్గన ఆరోపణలను టీడీపీ నేత కోట్ల సుజాతమ్మ తీవ్రంగా ఖండించారు.నిజాలు త్వరలోనే బయటపడతాయి…అసలు దొంగ ఓట్లు వేయించింది ఎవరో, అక్రమాలకు పాల్పడింది ఎవరో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని ఆమె వ్యాఖ్యానించారు.ఓటమి భయంతోనే బుగ్గన ఇలాంటి సాకులు వెతుక్కుంటున్నారని నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని సవాల్ విసిరారు.

డోన్ మున్సిపల్ స్థానంతో పాటు సమీప ప్రాంతాలలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ‘బుగ్గన – కోట్ల’ కుటుంబాల రాజకీయ శత్రుత్వం మున్సిపల్ ఎన్నికల వేళ మరింత తీవ్రరూపం దాల్చింది.

RELATED ARTICLES

Most Popular