HomeENTERTAINMENTPriya Bhavani Shankar:త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఇరుముడి బ్యూటీ!

Priya Bhavani Shankar:త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఇరుముడి బ్యూటీ!

📰 Generate e-Paper Clip

తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ హీరోయిన్‌, ఇటీవల ‘ఇరుముడి’ సినిమాతో ఘన విజయం అందుకున్న ప్రియా భవానీ శంకర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రియుడు రాజ్‌వెల్ రాజ్‌తో ఆమె ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల భోగట్టా.

ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ ప్రియా భవానీ శంకర్ ఇటీవల తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఆసక్తికరమైన ప్రీ-వెడ్డింగ్ వేడుకల ఫోటోలను పంచుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, మెడలో మల్లెపూల దండలు వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలతో పాటు, చేతులకు అందంగా గోరింటాకు (మెహందీ) పెట్టుకున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు ఎంతో కోలాహలంగా ప్రారంభమైనట్లు ఈ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది.

ప్రియా భవానీ శంకర్, రాజ్‌వెల్ రాజ్‌ల బంధం నిన్న మొన్నటిది కాదు. కాలేజీ రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడిన ఈ జంట, దాదాపు పదేళ్లకు పైగా పటిష్టమైన ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తమ అనుబంధానికి గుర్తుగా 2022లోనే ఒక డ్రీమ్ హోమ్‌ను కూడా కొనుగోలు చేసి సొంతం చేసుకున్నారు.

వివాహ తేది, వేదికకు సంబంధించిన వివరాలను ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించనప్పటికీ అర్భాటం లేకుండా కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మరియు అత్యంత ఆప్త మిత్రుల మధ్య ఈ వివాహాన్ని నిరాడంబరంగా పూర్తి చేయాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నట్లు సమాచారం.పెళ్లికి సంబంధించి నటి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular