HomeSPORTSTeam India:గంభీర్ ప్రయోగాలపై తీవ్ర విమర్శలు..టీమిండియాకు నష్టమేంటున్న మాజీ క్రికెటర్

Team India:గంభీర్ ప్రయోగాలపై తీవ్ర విమర్శలు..టీమిండియాకు నష్టమేంటున్న మాజీ క్రికెటర్

📰 Generate e-Paper Clip

భారత జట్టు విదేశీ పిచ్‌లపై ఆడేటప్పుడు నెం.5 స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను బరిలోకి దించడంపై మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ స్థానానికి అక్షర్ దీర్ఘకాలిక ప్రత్యామ్నాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం మిడిల్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేస్తూ…కేఎల్ రాహుల్‌కు క్రీజులో తగినంత సమయం దక్కకుండా చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు.

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పందిస్తూ దొడ్డ గణేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. SENA దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అక్షర్ పటేల్ మీ నెం.5 బ్యాటర్ కాజాలడు. అక్కడక్కడా కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగలడేమో కానీ అతను ఖచ్చితంగా దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం కాదు. ఈ వ్యూహం వల్ల మీరు కేఎల్ రాహుల్‌కు తగినంత బ్యాటింగ్ సమయాన్ని కోల్పోయేలా చేస్తున్నారు అని గణేష్ రాసుకొచ్చారు.

వర్షం కారణంగా రద్దయిన ఈ రెండో వన్డేలో, 135 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ తడబడింది. న్యూజిలాండ్ పేస్ దాటికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (డకౌట్), విరాట్ కోహ్లీ (7), రోహిత్ శర్మ (23) త్వరగానే పెవిలియన్ చేరారు. నెం.5 స్థానంలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతమైన సంయమనం ప్రదర్శించి అజేయంగా 26 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో గంభీర్ చేస్తున్న ప్రయోగాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular