తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదృష్టం కలిసొచ్చి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి సీఎం కావడాన్ని తాను తప్పుపట్టడం లేదని, అయితే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను ప్రభుత్వం సమానంగా చూడాలని అన్నారు. అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులో వివక్ష చూపడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.
కొడంగల్‌కు వేల కోట్లు.. మునుగోడుకు ఎందుకు రావు?
కొడంగల్ నియోజకవర్గంలో సుమారు రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నప్పుడు మునుగోడుకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారని, తమ నియోజకవర్గానికి నిధులు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
నిధుల కోసం ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు
మునుగోడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం చుట్టూ ఎన్నోసార్లు తిరిగానని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి అవసరమైన నిధులు కేటాయించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలని సూచించారు.
సొంత పార్టీ ముఖ్యమంత్రిపై రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రభుత్వ పనితీరు, నిధుల కేటాయింపుపై రేవంత్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. చేశారు.

