HomeSPORTSSurya Kumar Yadav:కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిసిన సూర్యకుమార్ యాదవ్

Surya Kumar Yadav:కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిసిన సూర్యకుమార్ యాదవ్

📰 Generate e-Paper Clip

భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శుక్రవారం కలిశారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో సూర్యకుమార్‌తో పాటు ఆయన భార్య దేవిషా, చిన్నారి కుమార్తె, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సూర్యకుమార్ యాదవ్ వెంట ఆయన భార్య దేవిషా, కుమార్తెతో పాటు మరదలు దీక్ష, బావ అజయ్ శెట్టి, వారి పిల్లలు రామ్, సరయు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు.

ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిన్నారి సరయు పాట. ప్రధానమంత్రి మోదీ సమక్షంలో ఆమె కన్నడ పాట పాడింది. చిన్నారి ఆలపించిన పాటను ప్రధాని ఎంతో ఆసక్తిగా విన్నారు. ఆమె ప్రతిభను ఆస్వాదిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు. దీపావళి పండుగ వాతావరణంలో రామ్, సరయు రాక వేడుకలకు మరింత పవిత్రతను శోభను తీసుకొచ్చిందని హిందీలో పేర్కొన్నారు.

కాగా, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భారత టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సూర్యకుమార్…ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

క్రికెట్ మైదానంలో తన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకునే సూర్యకుమార్ యాదవ్.. తాజాగా కుటుంబంతో కలిసి ప్రధానిని కలవడం ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular