Team India:గంభీర్ ప్రయోగాలపై తీవ్ర విమర్శలు..టీమిండియాకు నష్టమేంటున్న మాజీ క్రికెటర్

భారత జట్టు విదేశీ పిచ్‌లపై ఆడేటప్పుడు నెం.5 స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను బరిలోకి దించడంపై మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ స్థానానికి అక్షర్ దీర్ఘకాలిక ప్రత్యామ్నాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం మిడిల్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేస్తూ...కేఎల్ రాహుల్‌కు క్రీజులో తగినంత సమయం దక్కకుండా చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పందిస్తూ దొడ్డ గణేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు....