Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. ఆస్పత్రుల్లో రూ.20 లక్షల వరకు ఉచిత వైద్యం

Author
Posted By STAR TRINETHRAM
| 26 Jan 2026, 02:21 PM | Govt Schemes
కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. ఆస్పత్రుల్లో రూ.20 లక్షల వరకు ఉచిత వైద్యం


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పథకం పేరే ‘పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా’. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబసభ్యులు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.20 లక్షల వరకు క్యాష్ లెస్ వైద్యం పొందగలుగుతారు. సంక్రాంతి కానుకగా మోదీ సర్కార్ ఈ స్కీమ్ ప్రారంభించింది.



ఈ బీమా పథకం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉన్న ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. కుటుంబంలో ఆరుగురు వరకు లబ్ధి పొందవచ్చు. ఉద్యోగులు హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని వైద్య ఖర్చులు ఈ పథకం ద్వారా కవర్ అవుతాయి.



హాస్పిటల్‌లో జనరల్ వార్డులో చేరిన ఉద్యోగులు బీమా సొమ్ములో కేవలం 1% మాత్రమే చెల్లిస్తారు. ఐసీయూలో చేరితే 2% చెల్లింపు మాత్రమే. ఇక చికిత్సకు ఒక నెల ముందు మరియు చికిత్స తర్వాత 2 నెలల మధ్య వచ్చే ఖర్చులు కూడా ఈ స్కీమ్ కింద భరిస్తారు.



కో-పేమెంట్ ఆప్షన్ కూడా ఈ పథకంలో ఉంది. దీని ప్రకారం.. వైద్య ఖర్చులో కేంద్రం 70% చెల్లిస్తే, మిగతా 30% పాలసీదారుడు భరిస్తారు. పూర్తిగా క్యాష్ లెస్ విధానం అమలు కావడం వల్ల ముందుగా డబ్బు చెల్లించి తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి



క్యాష్ లెస్ విధానం ఉద్యోగులకి అత్యవసర పరిస్థితుల్లో సౌకర్యాన్ని ఇస్తుంది. ఆసుపత్రులకు కేంద్రం నేరుగా డబ్బు చెల్లిస్తుంది. దీంతో ఉద్యోగులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల లేకుండా అత్యాధునిక వైద్య సౌకర్యం పొందగలుగుతారు.



ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆరోగ్య భద్రతను విశ్వసనీయంగా పొందగలుగుతారు. ఇది ఉద్యోగుల సంక్షేమంలో, కుటుంబ వైద్య రక్షణలో ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని పలువురు సూచిస్తున్నారు.


ALSO READ: Protocol Controversy: రాహుల్ గాంధీ, ఖర్గేకి మూడో వరుసలో సీటు


మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: