కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. ఆస్పత్రుల్లో రూ.20 లక్షల వరకు ఉచిత వైద్యం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పథకం పేరే ‘పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా’. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబసభ్యులు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.20 లక్షల వరకు క్యాష్ లెస్ వైద్యం పొందగలుగుతారు. సంక్రాంతి కానుకగా మోదీ సర్కార్ ఈ స్కీమ్ ప్రారంభించింది. ఈ బీమా పథకం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉన్న ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. కుటుంబంలో ఆరుగురు వరకు లబ్ధి పొందవచ్చు. ఉద్యోగులు హాస్పిటల్లో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని వైద్య ఖర్చులు ఈ పథకం ద్వారా కవర్...