HomePOLITICALKavitha: నాగార్జున సాగర్ డెడ్‌ స్టోరేజీ నుండి నీటి తరలింపా?, రేవంత్ సర్కార్ మౌనంపై కవిత...

Kavitha: నాగార్జున సాగర్ డెడ్‌ స్టోరేజీ నుండి నీటి తరలింపా?, రేవంత్ సర్కార్ మౌనంపై కవిత ఫైర్

📰 Generate e-Paper Clip

నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ టన్నెల్ ప్రాజెక్టును చేపడుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు పనులు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కవిత….రేవంత్ రెడ్డి అనుమతితోనే ఏపీ ప్రభుత్వం ఈ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టిందా? అని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో ప్రాజెక్టు పనులు చేపడుతున్నా తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదా అని ప్రశ్నించారు. అదే నిజమైతే రాష్ట్ర నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుపై కనీస సమాచారం కూడా లేకపోతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, సాగునీటి హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమ ప్రాజెక్టు పనులను తక్షణమే అడ్డుకోవాలని కోరారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular