Kavitha: నాగార్జున సాగర్ డెడ్‌ స్టోరేజీ నుండి నీటి తరలింపా?, రేవంత్ సర్కార్ మౌనంపై కవిత ఫైర్

నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ టన్నెల్ ప్రాజెక్టును చేపడుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు పనులు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కవిత....రేవంత్ రెడ్డి అనుమతితోనే ఏపీ ప్రభుత్వం ఈ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టిందా? అని...