HomeSPORTSVaibhav Sooryavanshi:దీపావళి స్పెషల్..వైభవ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్!

Vaibhav Sooryavanshi:దీపావళి స్పెషల్..వైభవ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్!

📰 Generate e-Paper Clip

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి మరో అదిరిపోయే గిఫ్ట్ లభించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ బీహార్ కుర్రాడు తాజాగా ఖరీదైన ఎస్‌యూవీ కారును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అతడికి టాటా సియెర్రా ఎస్‌యూవీని బహుమతిగా అందించారు. ఇటీవల సూర్యవంశీ తన కుటుంబ సభ్యులతో కలిసి టాటా షోరూమ్‌కు వెళ్లి కొత్త కారును అందుకున్నాడు. పసుపు రంగులో ఉన్న ఈ కారుతో తల్లిదండ్రులు, సోదరులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైభవ్ సూర్యవంశీకి ఇది తొలి కారు కాదు. గతంలోనూ అతడికి ఖరీదైన వాహనం బహుమతిగా లభించింది. ఐపీఎల్ 2025లో సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు గెలుచుకున్నందుకు టాటా కర్వ్ ఈవీ కారును అందించారు. తన దూకుడైన బ్యాటింగ్‌తో తొలి సీజన్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. ఇప్పుడు మరో టాటా ఎస్‌యూవీని తన కార్ల కలెక్షన్‌లో చేర్చుకున్నాడు.

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అతడి ఖాతాలో 63 ఫోర్లు, 72 సిక్సర్లు ఉన్నాయి. ఐదు అర్ధ సెంచరీలతో పాటు ఒక సెంచరీ కూడా సాధించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారాడు.

RELATED ARTICLES

Most Popular