HomePOLITICALWarangal Congress: అయూబ్ నాయకత్వానికి పార్టీ శ్రేణుల నీరాజనం

Warangal Congress: అయూబ్ నాయకత్వానికి పార్టీ శ్రేణుల నీరాజనం

📰 Generate e-Paper Clip

()అయూబ్ నాయకత్వంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం

()వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏడాది ప్రస్థానం పూర్తి చేసుకున్న మహమ్మద్ అయూబ్

()ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ అనుబంధ సంఘాల నేతలు, శ్రేణులు

స్టార్ త్రినేత్రం, వరంగల్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహమ్మద్ అయూబ్ బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏడాది కాలంగా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, మండల, టౌన్, డివిజన్ స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆయన చూపిన చొరవ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన తీరును పలువురు నాయకులు ప్రశంసించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మహమ్మద్ అయూబ్ నాయకత్వంలో గత ఏడాది కాలంగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి విశేష కృషి జరిగిందని కొనియాడారు. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడంలో భాగంగా జిల్లా కమిటీతో పాటు మండల, డివిజన్, టౌన్ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ పార్టీ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేయడంలో అయూబ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు నిరంతరం కృషి చేశారని తెలిపారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ), తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపునిచ్చిన కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అయూబ్ చురుకైన పాత్ర పోషించారని నాయకులు వెల్లడించారు. పార్టీ ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వాటి ప్రయోజనాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రజలతో నిరంతర సంబంధాల ద్వారా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పునాదులను మరింత బలోపేతం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు.

కేవలం పార్టీ పదవికే పరిమితం కాకుండా వివిధ స్థాయిల్లోని నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించడం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భాగస్వాములను చేయాలని ఆకాంక్షించారు. మహమ్మద్ అయూబ్ నాయకత్వంలో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని, పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే కార్యక్రమంలో వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మూడవసారి నియమితులైన కర్నాటి పార్వతమ్మను కూడా ఘనంగా సత్కరించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పార్టీ శ్రేణులతో కలిసి ఆమెకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి, మహిళలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడానికి ఆమె మరింత కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఒకవైపు జిల్లా అధ్యక్షుడిగా ఏడాది ప్రస్థానం పూర్తి చేసుకున్న మహమ్మద్ అయూబ్‌కు అభినందనలు, మరోవైపు మూడవసారి మహిళా జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన కర్నాటి పార్వతమ్మకు సన్మానం జరగడంతో కార్యక్రమం సందడిగా సాగింది.

ఈ అభినందన కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చిలువేరు శ్రీనివాస్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రవీందర్ నాయక్, మహిళా జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, మైనారిటీ జిల్లా నాయకులు మహమ్మద్ కమాలుద్దీన్, ఓబీసీ సెల్ జిల్లా నాయకులు కోదాటి అనిల్, టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల అధ్యక్షులు పోశాల వెంకన్న, రవీందర్ రెడ్డి, దాడి శివ, డివిజన్ అధ్యక్షులు జన్ను అరుణాకర్, సయ్యద్ ఇంతియాజ్, మాడుగుల రాజ్ కుమార్, కందుల అశోక్, మహమ్మద్ జానీ, పసునూరి శ్రవణ్, జన్ను వివేక్, గిన్నెరపు రాజు, జన్ను వేణు, సన్నీతో పాటు నాయకులు జాటోత్ శ్రీనివాస్, రవి, బండ్ల సురేందర్, దేవేందర్ నాయక్, కుద్దూస్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular