HomeANDRA PRADESHAP Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి పొంచి ఉన్న ‘అక్వాన్’ తుఫాన్ ముప్పు!

AP Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి పొంచి ఉన్న ‘అక్వాన్’ తుఫాన్ ముప్పు!

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందా? బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి తుఫాన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ తుఫాన్‌కు ‘అక్వాన్’ అనే పేరు పెట్టారు. ఈ పరిణామంతో ఏపీ తీర ప్రాంతాల్లో వాతావరణ మార్పులపై ఉత్కంఠ నెలకొంది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడనుంది. నవంబర్ 14 నాటికి అల్పపీడనం మరింత బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారి నవంబర్ 15 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగితే మరింత తీవ్రరూపం దాల్చి తుఫాన్‌గా మారే అవకాశం ఉంది.

ఈ నెల 16 నాటికి తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఇది ఉత్తర కోస్తాంధ్ర వైపు పయనించి నవంబర్ 19వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. అయితే తుఫాన్ గమనం, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

నవంబర్ 15 నుంచి ఏపీ తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సముద్రంలో అలజడి పెరిగే పరిస్థితులు ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తుఫాన్ ప్రభావం, వర్షపాతం, గాలుల వేగంపై వాతావరణ శాఖ నుంచి వచ్చే తాజా హెచ్చరికలను ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular