AP Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి పొంచి ఉన్న ‘అక్వాన్’ తుఫాన్ ముప్పు!
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందా? బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి తుఫాన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ తుఫాన్‌కు ‘అక్వాన్’ అనే పేరు పెట్టారు. ఈ పరిణామంతో ఏపీ తీర ప్రాంతాల్లో వాతావరణ మార్పులపై ఉత్కంఠ నెలకొంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడనుంది. నవంబర్ 14 నాటికి అల్పపీడనం మరింత బలపడే సూచనలు ఉన్నాయి....