HomeINTERNATIONALBharat Summit: హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్..70 దేశాల ప్రతినిధులు హాజరు

Bharat Summit: హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్..70 దేశాల ప్రతినిధులు హాజరు

📰 Generate e-Paper Clip

Bharat Summit: తెలంగాణలో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌పై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే వారం హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ జరగనుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రోగ్రెసివ్ అలయన్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల విభాగం, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. గత ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ ఏడాది మరోసారి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 70 దేశాలకు చెందిన నాయకులు ఈ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం ఉందన్నారు.

ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ అని, దాదాపు 100 దేశాలకు చెందిన ప్రజాస్వామ్య పార్టీల నాయకులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావనను ప్రోత్సహించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రజాస్వామ్యం ఒక కీలకమైన ప్రపంచ ప్రజా ప్రయోజనమని పేర్కొన్నారు. వివిధ దేశాల నాయకులతో సమావేశమై ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న పరిస్థితులపై విస్తృతంగా చర్చించడమే ఈ సదస్సు ఉద్దేశమని తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో మార్పులు కనిపిస్తున్నాయని సామ్ పిట్రోడా అన్నారు. అమెరికా ఎన్నికలు ప్రజలు తమ ప్రజాస్వామ్య గొంతుకకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు. నిరంకుశ, విభజన రాజకీయ ధోరణులను ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. బ్రెజిల్, అర్మేనియా వంటి దేశాల్లోనూ ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

కొంతకాలంగా ప్రజాస్వామ్యం వివిధ రూపాల్లో హైజాక్‌కు గురవుతోందని తాము భావిస్తున్నట్లు పిట్రోడా పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం, ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ సాధించడం, ప్రజల మధ్య విభజనలు సృష్టించడం, పౌర సమాజాన్ని బలహీనపరచడం, మీడియాను ప్రభావితం చేయడం వంటి మార్గాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటి చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలేనని సామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular