HomeTELANGANANarayana Schools:బోడుప్పల్ నారాయణ స్కూల్‌లో ఘనంగా ఈ-కిడ్స్ స్పోర్ట్స్ మీట్

Narayana Schools:బోడుప్పల్ నారాయణ స్కూల్‌లో ఘనంగా ఈ-కిడ్స్ స్పోర్ట్స్ మీట్

📰 Generate e-Paper Clip

స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: బోడుప్పల్‌లోని నారాయణ విద్యాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-కిడ్స్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ క్రీడా పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలపరమేశ్వర్ రావు, ఆర్ అండ్ డీ హెడ్‌లు, కోఆర్డినేటర్లు హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మహేశ్వరి మేడమ్‌తో కలిసి అతిథులు క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మహేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థలు విద్యకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలను కల్పిస్తున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ క్రీడా విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ ఆటల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. చిన్నారుల ప్రదర్శనలను అతిథులతో పాటు తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని మరింత ప్రోత్సహించారు. ఈ-కిడ్స్ స్పోర్ట్స్ మీట్‌తో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular