నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం రామాయణం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న(రేపు) థియేటర్లలో విడుదల కానుంది. రణ్బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే సినిమా ప్రదర్శనలు చూసిన కొందరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రామాయణం చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ స్పందించారు. రామాయణం టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. మన సంస్కృతికి ప్రతిరూపం. భారతీయ సినిమాల స్థాయిని మరింత పెంచే ప్రయత్నం. ఈ దైవిక ప్రయత్నంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా స్వచ్ఛమైన, సానుకూల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
అలాగే మన కథలు, సంస్కృతి, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. మనమంతా ఒక్కటై ఈ ప్రయత్నానికి అండగా నిలుద్దాం. జై శ్రీరామ్ అంటూ పేర్కొన్నారు.
My best wishes to the entire #Ramayana team. It’s not just a movie. It’s a representation of our culture and an attempt to raise the bar of Indian films. I wholeheartedly send my pure, positive wishes to the entire team for their divine attempt. Let’s all unite and come forward to support a pure attempt that carries our stories, our culture and our glory. Jai Sri Ram 🙏🏽
#RanbirKapoor @TheNameIsYash @Sai_Pallavi92 @iamsunnydeol @niteshtiwari22 @malhotra_namit @arrahman @HansZimmer @raviedubey @LaraDutta @Rakulpreet @vivekoberoi @AnupamPKher @MsKajalAggarwal
— Allu Arjun (@alluarjun) November 4, 2026
‘రామాయణం: పార్ట్ 1’లో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండో భాగం 2028లో థియేటర్లలోకి రానుంది.

