STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 5:55 pm Posted by : ARUN

Allu Arjun:రణ్‌బీర్ ‘రామాయణం’ కోసం రంగంలోకి అల్లు అర్జున్!

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం రామాయణం  ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న(రేపు) థియేటర్లలో విడుదల కానుంది. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే సినిమా ప్రదర్శనలు చూసిన కొందరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రామాయణం చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా అల్లు అర్జున్ స్పందించారు. రామాయణం టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. మన సంస్కృతికి ప్రతిరూపం. భారతీయ సినిమాల స్థాయిని మరింత పెంచే ప్రయత్నం. ఈ దైవిక ప్రయత్నంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా స్వచ్ఛమైన, సానుకూల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.

అలాగే మన కథలు, సంస్కృతి, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. మనమంతా ఒక్కటై ఈ ప్రయత్నానికి అండగా నిలుద్దాం. జై శ్రీరామ్ అంటూ పేర్కొన్నారు.

 

‘రామాయణం: పార్ట్ 1’లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండో భాగం 2028లో థియేటర్లలోకి రానుంది.