HomeENTERTAINMENTహైదరాబాద్‌లో 'రాకా'..భారీ యాక్షన్ షెడ్యూల్!

హైదరాబాద్‌లో ‘రాకా’..భారీ యాక్షన్ షెడ్యూల్!

📰 Generate e-Paper Clip

అట్లీ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం రాకా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండగా తాజాగా సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా త్వరలోనే హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు దర్శకుడు అట్లీ. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ షూటింగ్ చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం.

ఇక సినిమాలోని ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ రెండో వారం నుంచి ఈ కీలక పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్‌ను గత చిత్రాలకు భిన్నమైన యాక్షన్ అవతార్‌లో చూపించేందుకు అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ మూవీలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోండగా దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 చివర్లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్-అట్లీ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో రాకా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

RELATED ARTICLES

Most Popular