Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Mystery: గుప్తనిధులు దొరికాయని హ్యాపీగా ఉన్నారా?

Author
Posted By STAR TRINETHRAM
| 24 Mar 2026, 06:16 PM | Interesting
Mystery: గుప్తనిధులు దొరికాయని హ్యాపీగా ఉన్నారా?

Mystery: ఆశతో మొదలై దురాశగా మారే గుప్త నిధుల వెతుకులాట మనిషిని ఎంతటి ప్రమాదాల దారిలోకి నెట్టేస్తుందో ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. కొందరు వ్యక్తులు తమకు కలల్లో నిధి కనిపించిందని, రహస్య సంకేతాలు వచ్చాయని, అనూహ్యంగా శబ్దాలు వినిపించాయని నమ్ముతూ తవ్వకాలకు దిగుతుంటారు. అయితే ఈ ప్రక్రియ వెనుక ఉన్న అనర్థాలు, ప్రమాదాలు చాలా మందికి తెలియకపోవడం వల్లే ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పండితులు చెబుతున్నారు. నిధి కోసం తవ్వకాలు చేస్తూ కొందరు తీవ్ర గాయాలకు గురవడం, కాళ్లు చేతులు విరగడం, రక్తస్రావంతో బాధపడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు చెబుతుంటారు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో కుటుంబాలపై కూడా దురదృష్టకర పరిణామాలు పడటం, ఆరోగ్య సమస్యలు పెరగడం, ప్రాణాపాయం సంభవించడం వంటి ఘటనలు జరుగుతాయని ఆధ్యాత్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా నిధులకు కాపలాగా ఉన్న అజ్ఞాత శక్తులను భావిస్తున్నారు. దుష్టశక్తులు, ధన పిశాచాలు, నాగ బంధనాలు వంటి ఆధ్యాత్మిక ప్రభావాలు ఈ గుప్త నిధులను రక్షిస్తాయని విశ్వసిస్తారు. ఇవి మన కంటికి కనిపించకపోయినా, వాటి ప్రభావం మాత్రం తీవ్రమైందిగా ఉంటుందని చెబుతారు. తవ్వకాల సమయంలో అనూహ్యంగా రక్తం కనిపించడం, భయంకర శబ్దాలు వినిపించడం, గజ్జెల మోగినట్లుగా అనిపించడం వంటి సంఘటనలు చాలామందిని భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఈ అనుభవాల కారణంగా చాలామంది తమ ప్రయత్నాలను మధ్యలోనే నిలిపివేయాల్సి వస్తుంది. కొందరు పూజలు, హోమాలు చేయించినా సరైన విధానం, సంకల్పం లేకపోతే నిధి దొరకకపోవడమే కాకుండా, మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. గుప్త నిధుల విషయంలో సరైన జ్ఞానం, నియమాలు లేకుండా చేసే ప్రతి ప్రయత్నం ప్రమాదాలకు దారితీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

NOTE: పై వార్తలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే తెలియజేశాము. నమ్మడం, నమ్మకపోవడం మీ వ్యక్తిగత విషయం. స్టార్ త్రినేత్రం దీనిని అధికారికంగా ధృవీకరించడం లేదు. పాఠకులు గమనించగలరు.

ALSO READ: Suspense Thriller: ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: