Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Suicide: 30 ఏళ్లు వచ్చినా ఇక 3 ముళ్లు వేసే యోగ్యం లేదేమోనని..

Author
Posted By STAR TRINETHRAM
| 18 Apr 2026, 01:04 PM | Crime
Suicide: 30 ఏళ్లు వచ్చినా ఇక 3 ముళ్లు వేసే యోగ్యం లేదేమోనని..

Suicide: పెళ్లి ఆలస్యమవుతుందనే మనస్తాపం ఒక యువకుడి ప్రాణాలను బలిగొన్న విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. జోగిపేట మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన తుపాకి అశోక్ అనే 30 ఏళ్ల యువకుడు, తన వివాహం జరగకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబంలో ఆనందంగా జరగాల్సిన పెళ్లి మాటలు చివరకు విషాదానికి దారి తీసిన ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది.

ఇటీవలి కాలంగా అశోక్ తన పెళ్లి విషయంలో ఆందోళన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనకు త్వరగా సంబంధం చూడాలని, నెల రోజుల్లోనే పెళ్లి జరగాలని తండ్రి రాములు వద్ద పలుమార్లు కోరినట్లు సమాచారం. అయితే అంత తక్కువ సమయంలో సంబంధం కుదరడం కష్టమని తండ్రి చెప్పడంతో అశోక్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. ఆ క్షణికావేశంలో అతను తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఇంట్లో ఉన్న ఇనుప పైపుకు నూలు తాడుతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.

ఇంటికి సమీపంలో ఉన్న వారు కిటికీ ద్వారా గమనించి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే తలుపులు పగులగొట్టి అశోక్‌ను కిందికి దించారు. హుటాహుటిన జోగిపేట ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న విషయాలపై క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి దుర్ఘటనలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.

ఇవి కూడా చదవండి

జీవితంలో సమస్యలు, ఒత్తిడులు ఎదురైనప్పుడు వాటిని ఒంటరిగా మోసుకెళ్లకుండా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడం అవసరం. ఆత్మహత్య ఆలోచనలు కలిగితే వెంటనే సహాయం పొందడం అత్యంత ముఖ్యం. ఇందుకోసం భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330 ద్వారా సహాయం పొందవచ్చు. అదేవిధంగా సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న 18005990019 హెల్ప్ లైన్ కూడా 13 భాషల్లో అందుబాటులో ఉంది.

ALSO READ: Viral News: మంచు గర్భంలో మహాద్భుతం.. 24 వేల ఏళ్ల తర్వాత కళ్లు తెరిచిన జీవి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: