Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Crime: మామ మర్మాంగాన్ని కోసిన కోడలు

Author
Posted By STAR TRINETHRAM
| 20 Jul 2026, 09:45 AM | Crime
Crime: మామ మర్మాంగాన్ని కోసిన కోడలు

Crime: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన ఓ కుటుంబ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్లుగా తనపై నిరంతరం లైంగిక దాడులు, వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ 23 ఏళ్ల కోడలు తన 67 ఏళ్ల మామ మర్మాంగాన్ని బ్లేడుతో కోసిన ఘటన ముజఫర్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. బుధానా పరిధిలోని సఫీపూర్ పట్టిలో జూలై 17న జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసుల వివరాల ప్రకారం సయ్యదా(23) భర్త హర్యానాలో ఆటో రిక్షా నడుపుతూ ఎక్కువ సమయం అక్కడే ఉండడంతో, ఆమె తన ఇద్దరు కుమారులతో పాటు మామ జాకిర్(67)తో కలిసి ముజఫర్‌నగర్‌లో నివసిస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న జాకిర్ గత 2 ఏళ్లుగా తనపై అత్యాచారం చేస్తూ, లైంగికంగా వేధిస్తున్నాడని సయ్యదా ఆరోపించింది. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఇరుగుపొరుగు వారికి చెప్పినా ఎవరూ స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె చివరకు శుక్రవారం బ్లేడుతో మామపై దాడి చేసి అతని మర్మాంగాన్ని కోసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన జాకిర్‌ను రక్తపు మడుగులో నుంచి బయటకు తీసి సమీప కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సయ్యదాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై బుధానా సర్కిల్ అధికారి గజేంద్ర పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇరు వర్గాల నుంచి ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించి సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు దారితీసిన అన్ని పరిస్థితులపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ALSO READ: Hyderabad: పిల్లలున్నా పెళ్లిచేసుకుంటానని.. మోజు తీరాక బ్లాక్!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: