Suicide: 30 ఏళ్లు వచ్చినా ఇక 3 ముళ్లు వేసే యోగ్యం లేదేమోనని..

Suicide: పెళ్లి ఆలస్యమవుతుందనే మనస్తాపం ఒక యువకుడి ప్రాణాలను బలిగొన్న విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. జోగిపేట మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన తుపాకి అశోక్ అనే 30 ఏళ్ల యువకుడు, తన వివాహం జరగకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబంలో ఆనందంగా జరగాల్సిన పెళ్లి మాటలు చివరకు విషాదానికి దారి తీసిన ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది. ఇటీవలి కాలంగా అశోక్ తన పెళ్లి విషయంలో ఆందోళన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనకు త్వరగా సంబంధం చూడాలని, నెల రోజుల్లోనే పెళ్లి జరగాలని తండ్రి రాములు వద్ద పలుమార్లు...