Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Health Tips: కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!

Author
Posted By STAR TRINETHRAM
| 21 Mar 2026, 08:22 PM | Life Style
Health Tips: కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!

Health Tips: అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా వెల్లడించిన నివేదిక గుండె ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. గుండె జబ్బులను ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా దాదాపు 80 నుంచి 90 శాతం వరకు ఈ సమస్యలను నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం అత్యంత కీలకమని ఈ అధ్యయనం చెబుతోంది. కేవలం ఆహారం, వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్‌ను పూర్తిగా అదుపులో ఉంచలేకపోతే, ఆలస్యం చేయకుండా ముందుగానే మందులు ప్రారంభించడం అవసరమని సూచిస్తున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని, ఇది గుండె ఆరోగ్యానికి నేరుగా సంబంధించిన అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల వయస్సు నుంచే కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, అవి అధికంగా ఉంటే వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం ప్రతి వ్యక్తి తమ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని 100 కంటే తక్కువగా ఉంచుకోవడం అత్యంత అవసరంగా మారింది. ఇప్పటికే గుండెపోటు లేదా పక్షవాతం ఎదుర్కొన్న వారు ఈ స్థాయిని 55 కంటే తక్కువగా ఉంచుకోవాలి. గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారు 70 కంటే తక్కువగా నియంత్రించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, 30 ఏళ్ల నుంచే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. ఒకవేళ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే, వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవడంతో పాటు జీవనశైలిలో మార్పులు చేయడం తప్పనిసరి.

కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. కుటుంబంలో ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే మధుమేహం ఉన్నవారు, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్నవారిలో కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న రోగులు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు, హెచ్ఐవీతో బాధపడుతున్నవారు, అలాగే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి జీవనశైలిలో మార్పులు అత్యంత అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, పొగతాగడం పూర్తిగా మానేయడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవడం వంటి అలవాట్లు పాటించాలి. అదనంగా, ప్రతి 3 నెలలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకుంటూ ఉండాలి. మన దేశంలో గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయి 100 కంటే ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం. ఆహారంలో పిండి పదార్థాలు, నూనెల వినియోగాన్ని తగ్గించడం ద్వారా కూడా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.

ALSO READ: Mumaith Khan: ఆ స్టార్ హీరో హగ్ చేసుకోగానే సిగ్గు పడ్డాడు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: