Health Tips: కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!

Health Tips: అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా వెల్లడించిన నివేదిక గుండె ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. గుండె జబ్బులను ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా దాదాపు 80 నుంచి 90 శాతం వరకు ఈ సమస్యలను నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం అత్యంత కీలకమని ఈ అధ్యయనం చెబుతోంది. కేవలం ఆహారం, వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్‌ను పూర్తిగా అదుపులో ఉంచలేకపోతే, ఆలస్యం చేయకుండా ముందుగానే మందులు ప్రారంభించడం అవసరమని సూచిస్తున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని,...