Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Railway Jobs: ఇండియన్ రైల్వేస్‌లో 192 పోస్టులకు నోటిఫికేషన్

Author
Posted By STAR TRINETHRAM
| 15 Mar 2026, 12:43 PM | Edu/Jobs
Railway Jobs: ఇండియన్ రైల్వేస్‌లో 192 పోస్టులకు నోటిఫికేషన్

Railway Jobs: టెక్నికల్ స్కిల్స్ కలిగి, ఇండియన్ రైల్వేస్‌లో స్థిరమైన కెరీర్ ప్రారంభించాలని కలలకొంటున్న యువతకు గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రెంటిస్‌షిప్ భవిష్యత్తులో రైల్వే ఉద్యోగాల సాధనకు బలమైన పునాదిలా ఉంటుంది. ఈ కలను నిజం చేస్తూ బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 192 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ అవకాశంలో మంచి స్టైపెండ్ పొందడంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ కూడా అభ్యర్థులకు లభిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే, ఎలాంటి రాతపరీక్షలు లేకుండా, మెరిట్ ఆధారంగా డైరెక్ట్ ఎంపిక జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రాసెస్..

సాక్షి ఎడ్యుకేషన్ సమాచారం ప్రకారం.. రిక్రూట్‌మెంట్ ఫిబ్రవరి 28న అధికారికంగా ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి గడువు 2026 ఏప్రిల్ 1 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంది.

ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ ప్రాసెస్..

అభ్యర్థులు ఏలా అప్లై చేయాలంటే?..

అప్లికేషన్ ఫారం తప్పులేకుండా పూర్తి చేయాలి

రైల్ వీల్ ఫ్యాక్టరీ ఆవరణలోని డ్రాప్ బాక్స్లో స్వయంగా వేయాలి

లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపొచ్చు

గమనిక: పోస్టల్ డిలే వలన అప్లికేషన్ రద్దు కాకుండా, త్వరగా పంపడం మంచిది.

అర్హతలు, వయోపరిమితి..

అభ్యర్థులు పదో తరగతి పాసు కావాలి

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌లో పేర్కొన్న ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NCVT గుర్తింపు) ఉండాలి

అభ్యర్థుల వయసు 15-24 ఏళ్లు ఉండాలి

ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రకారం:

SC, ST: +5 ఏళ్లు

OBC: +3 ఏళ్లు

ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ కండిషన్..

అభ్యర్థులు స్థానిక ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి

రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అయి ఉండాలి

కొంతమందికి మినహాయింపు:

ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఈ రిజిస్ట్రేషన్ అవసరం లేదు

వారు అనెక్సర్-D ఫారం జత చేసి, సంబంధిత గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో అప్లికేషన్ పంపాలి.

ALSO READ: Induction Stove: ఇండక్షన్ స్టవ్ వాడితే ఖర్చులు, జాగ్రత్తలు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: