Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పీరియడ్స్ టైంలో మహిళలు ఈ తప్పులు అసలు చేయకండి

Author
Posted By STAR TRINETHRAM
| 27 Feb 2026, 12:31 PM | Life Style
పీరియడ్స్ టైంలో మహిళలు ఈ తప్పులు అసలు చేయకండి

అమ్మాయిలు, మహిళల జీవితంలో నెలసరి ఒక సహజ శారీరక ప్రక్రియ అయినప్పటికీ, ఆ రోజుల్లో ఎదురయ్యే అసౌకర్యాలు మాత్రం చాలా మందికి ఇబ్బందికరంగా మారుతుంటాయి. కొందరికి స్వల్పంగా ఉండే నొప్పులు, మరికొందరికి తీవ్ర స్థాయికి చేరుకుని రోజువారీ పనులపై ప్రభావం చూపుతాయి. కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, అధిక రక్తస్రావం, నీరసం, చిరాకు, తిమ్మిర్లు, వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు శారీరకంగానే కాక మానసికంగానూ అలసటను కలిగిస్తాయి. వ్యక్తిగత జీవితం, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ పనులు అన్నీ ఈ సమయంలో కొంత మేరకు దెబ్బతింటాయి. అయితే ఈ రోజుల్లో తెలియక చేసే కొన్ని పొరపాట్లు సమస్యలను మరింత ఎక్కువ చేసే అవకాశముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీర సహజ ప్రక్రియలకు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల ఒత్తిడి పెరిగి నొప్పులు, అసౌకర్యాలు తీవ్రతరం కావచ్చని ఆమె చెబుతున్నారు.

నెలసరి సమయంలో యోగా సాధన చేస్తున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరాన్ని తలకిందులు చేసే ఆసనాలను పూర్తిగా నివారించాలి. సర్వాంగాసనం, శిర్షాసనం, హలాసనం వంటి ఆసనాల్లో కాళ్లను పైకి ఎత్తి శరీరాన్ని గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో ఉంచాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ రక్తప్రవాహ సహజ దిశను తాత్కాలికంగా మార్చి అసౌకర్యాన్ని పెంచే అవకాశముంది. ఇప్పటికే నొప్పులతో బాధపడుతున్న సమయంలో ఇలాంటి ఆసనాలు వేయడం వల్ల కడుపునొప్పి, తిమ్మిర్లు మరింత ఎక్కువ కావచ్చని హెచ్చరిస్తున్నారు.

అదేవిధంగా అధిక శారీరక శ్రమ కూడా ఈ రోజుల్లో అనవసరమని నిపుణులు చెబుతున్నారు. తీవ్ర వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి విశ్రాంతి దెబ్బతింటుంది. పొత్తికడుపు, నడుముపై అదనపు ఒత్తిడి పడటంతో నొప్పులు పెరగవచ్చు. కాబట్టి భారమైన వ్యాయామాలకంటే మృదువైన చలనం, సున్నితమైన స్ట్రెచింగ్, నెమ్మదైన నడక వంటి అలవాట్లు మేలు చేస్తాయి. పూర్తిగా మంచంపైనే విశ్రాంతి తీసుకోవడం కూడా సరైన పరిష్కారం కాదని సూచిస్తున్నారు. రోజంతా కదలిక లేకుండా ఉండటం వల్ల రక్తప్రసరణ మందగించి నొప్పులు పెరిగే అవకాశముంది. స్వల్ప వ్యాయామం, శ్వాసాభ్యాసాలు మానసిక ప్రశాంతతను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించగలవని నిపుణులు చెబుతున్నారు.

ఆహారపు అలవాట్లపైనా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సమయంలో తీపి పదార్థాలపై ఆకర్షణ ఎక్కువగా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. అయితే అధిక కొవ్వు, ఉప్పు, చక్కెరలతో కూడిన ప్యాకేజ్డ్ ఆహారాలు తీసుకోవడం వల్ల వాపు, అలసట పెరిగే అవకాశం ఉంది. పోషకాలు లేని అలాంటి ఆహారాలకు దూరంగా ఉండి, ఇనుము, ప్రోటీన్, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. శరీరానికి అవసరమైన నీటి పరిమాణం నిలబెట్టుకోవడం కూడా ఎంతో ముఖ్యం.

ఇవి కూడా చదవండి

ఇక తలస్నానం విషయానికొస్తే, నెలసరి సమయంలో చల్లని నీటితో తలస్నానం చేయడం కొంతమందిలో అసౌకర్యాన్ని పెంచవచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారితే నొప్పులు తీవ్రతరం కావచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరి శరీర స్వభావం భిన్నంగా ఉండేందున వ్యక్తిగత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే నెలసరి రోజుల్లో శరీరానికి విశ్రాంతి, మితమైన కదలిక, సమతుల ఆహారం, మానసిక ప్రశాంతత చాలా అవసరం. సహజ ప్రక్రియను అర్థం చేసుకుని సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజులను సులభంగా ఎదుర్కోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

NOTE: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టార్ త్రినేత్రం దీనిని అధకారికంగా ధృవీకరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. పాఠకులు గమనించగలరు.

ALSO READ: Hollywood: వార్నర్ బ్రదర్స్ డీల్ నుంచి వైదొలిగిన నెట్‌ఫ్లిక్స్.. పారామౌంట్ చేతికి హాలీవుడ్ సామ్రాజ్యం

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: