Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Illicit Relationship: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. ఆపై ఘోరం

Author
Posted By STAR TRINETHRAM
| 22 Feb 2026, 10:33 PM | Crime
Illicit Relationship: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. ఆపై ఘోరం

Illicit Relationship: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కలకలం రేపిన కృష్ణ హత్య కేసును పోలీసులు చేధించారు. మొదట సహజ మరణంలా కనిపించిన ఈ ఘటన వెనుక సంచలన విషయాలు బయటపడ్డాయి. కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు విచారణలో తేలడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడం కృష్ణ (35) జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఉపాధి కోసం చేవెళ్లలోని చంద్రారెడ్డినగర్ ప్రాంతానికి వచ్చి అక్కడే నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ జీవితం సాధారణంగా సాగుతున్నట్లు బయటకు కనిపించినప్పటికీ లోపల తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

సుమారు 6 నెలల క్రితం రాజేశ్వరికి శరత్ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన కృష్ణ.. భార్యను ప్రశ్నించగా తరచూ గొడవలు జరిగేవని సమాచారం. ఈ వివాదాలు తీవ్ర స్థాయికి చేరడంతో కృష్ణను అడ్డు తొలగించుకోవాలనే ఆలోచన రాజేశ్వరి, శరత్‌లలో పెరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన కృష్ణతో రాజేశ్వరి మరోసారి వాగ్వాదానికి దిగింది. కొంతసేపటి తర్వాత కృష్ణ నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో రాజేశ్వరి తన ప్రియుడు శరత్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. అనంతరం ఇద్దరూ కలిసి కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి అతని ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశారు. అంతేకాకుండా శరత్ అతని ఛాతీపై బలంగా కొట్టడంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు విచారణలో తేలింది.

హత్య అనంతరం రాజేశ్వరి ఏమీ తెలియనట్లు ప్రవర్తించింది. శుక్రవారం ఉదయం తన భర్త లేవడం లేదని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన కృష్ణ తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది. పోలీసులు రాజేశ్వరిని కస్టడీలోకి తీసుకుని విచారించగా ఆమె అసలు విషయాన్ని ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా శరత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ALSO READ: Woman Harassment: 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: