Illicit Relationship: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. ఆపై ఘోరం

Illicit Relationship: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కలకలం రేపిన కృష్ణ హత్య కేసును పోలీసులు చేధించారు. మొదట సహజ మరణంలా కనిపించిన ఈ ఘటన వెనుక సంచలన విషయాలు బయటపడ్డాయి. కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు విచారణలో తేలడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడం కృష్ణ (35) జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఉపాధి కోసం చేవెళ్లలోని చంద్రారెడ్డినగర్ ప్రాంతానికి వచ్చి అక్కడే నివసిస్తూ కూలీ...