Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Girl Assault: నాలుగు కార్లలో బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై!

Author
Posted By STAR TRINETHRAM
| 14 Feb 2026, 11:06 PM | Crime
Girl Assault: నాలుగు కార్లలో బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై!

Girl Assault: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు నాలుగు కార్లలో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో ప్రధాన పాత్ర పోషించినట్లు విచారణలో తేలింది. పలుమార్లు ఆమెను కార్లలోకి తీసుకెళ్లి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ దారుణాన్ని ఒక నిందితుడు ఐఫోన్‌లో చిత్రీకరించి, ఆ వీడియోను బాధితురాలికి పంపినట్లు సమాచారం. అనంతరం రూ.40 వేలు ఇవ్వాలని బెదిరిస్తూ, ఇవ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బెదిరింపులకు గురైన బాలిక ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులను ఆశ్రయించింది.

ఫిర్యాదు ఆధారంగా ప్రధాన నిందితులు ఆసఫ్ అలీ ఖాన్, మేజ్ ఖాన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న థార్ వాహనంతో పాటు మొత్తం 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తూ, వీడియో రికార్డ్ చేసిన ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణలపై ఓ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ALSO READ: ఆ ఫోటో తీసి పంపితే.. ఖాతాలోకి రూ.1000

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: