Girl Assault: నాలుగు కార్లలో బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై!

Girl Assault: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు నాలుగు కార్లలో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో ప్రధాన పాత్ర పోషించినట్లు విచారణలో తేలింది. పలుమార్లు ఆమెను కార్లలోకి తీసుకెళ్లి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దారుణాన్ని ఒక నిందితుడు ఐఫోన్‌లో చిత్రీకరించి, ఆ వీడియోను బాధితురాలికి పంపినట్లు సమాచారం. అనంతరం రూ.40 వేలు ఇవ్వాలని బెదిరిస్తూ, ఇవ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బెదిరింపులకు గురైన బాలిక ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులను ఆశ్రయించింది....