Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ALERT: వాట్సాప్ నంబర్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త!

Author
Posted By STAR TRINETHRAM
| 08 Feb 2026, 04:46 PM | Crime
ALERT: వాట్సాప్ నంబర్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త!

ALERT: ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వాట్సాప్ ఒకటి. వ్యక్తిగత అవసరాలు కావొచ్చు, వృత్తిపరమైన కమ్యూనికేషన్ కావొచ్చు.. రెండు బిలియన్లకు పైగా వినియోగదారులు రోజూ ఈ యాప్‌పై ఆధారపడుతున్నారు. సులభమైన వినియోగ విధానం, వేగవంతమైన సందేశ వ్యవస్థ వల్ల ప్రతి వయసువారిలోనూ వాట్సాప్ విపరీతమైన ఆదరణ పొందింది. అయితే ఈ యాప్‌ను ఉపయోగించే సమయంలో తెలిసీ తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు మీ వాట్సాప్ అకౌంట్‌కు పెద్ద ప్రమాదంగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘిస్తే ఖాతా తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చాలా మంది వినియోగదారులు అదనపు ఫీచర్లు వస్తాయనే ఆశతో GBWhatsApp, WhatsApp Plus వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవి అధికారిక వాట్సాప్‌కు చెందినవి కావు. ఈ యాప్స్ వాడటం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఖాతా ముందుగా తాత్కాలికంగా సస్పెండ్ కావచ్చు. అదే అలవాటు కొనసాగితే శాశ్వతంగా బ్లాక్ అయ్యే అవకాశమూ ఉంది.

అలాగే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వారికి తరచుగా ప్రొమోషనల్ లేదా ఆటోమేటెడ్ సందేశాలు పంపితే వాట్సాప్ సిస్టమ్ వెంటనే అప్రమత్తమవుతుంది. స్పామింగ్‌ను గుర్తించేందుకు వాట్సాప్ అధునాతన అల్గారిథమ్‌లను ఉపయోగిస్తోంది. ఒకవేళ మీరు తరచూ ఇలాంటి సందేశాలు పంపితే మీ ఖాతాను లాక్ చేయడం లేదా శాశ్వతంగా నిషేధించడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

తప్పుడు వార్తలు, చట్టవిరుద్ధ సమాచారం, హానికరమైన కంటెంట్‌ను ఫార్వర్డ్ చేయడం కూడా తీవ్రమైన ఉల్లంఘనగా వాట్సాప్ పరిగణిస్తుంది. ఇలాంటి కంటెంట్‌ను వ్యక్తిగత చాట్స్‌లో లేదా గ్రూప్‌లలో షేర్ చేస్తే మీ అకౌంట్ నేరుగా నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంది. వినియోగదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేసే వాట్సాప్.. ద్వేషపూరిత వ్యాఖ్యలు, బెదిరింపులు, వేధింపులపై వచ్చిన ఫిర్యాదులను చాలా గంభీరంగా తీసుకుంటుంది. అలాంటి సందర్భాల్లో ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే ఖాతాను శాశ్వతంగా బ్లాక్ చేసే అవకాశముంది.

ఉచితంగా లభిస్తున్నప్పటికీ వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తోంది. కాబట్టి ఈ యాప్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ నిబంధనలను గౌరవిస్తూ, జాగ్రత్తగా వాడితేనే తమ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోగలరని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: ‘పవన్ సార్. నన్ను చంపేయండి’.. ఎమ్మెల్యే బాధితురాలి మరో వీడియో

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: