ALERT: వాట్సాప్ నంబర్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త!

ALERT: ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వాట్సాప్ ఒకటి. వ్యక్తిగత అవసరాలు కావొచ్చు, వృత్తిపరమైన కమ్యూనికేషన్ కావొచ్చు.. రెండు బిలియన్లకు పైగా వినియోగదారులు రోజూ ఈ యాప్‌పై ఆధారపడుతున్నారు. సులభమైన వినియోగ విధానం, వేగవంతమైన సందేశ వ్యవస్థ వల్ల ప్రతి వయసువారిలోనూ వాట్సాప్ విపరీతమైన ఆదరణ పొందింది. అయితే ఈ యాప్‌ను ఉపయోగించే సమయంలో తెలిసీ తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు మీ వాట్సాప్ అకౌంట్‌కు పెద్ద ప్రమాదంగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘిస్తే ఖాతా తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చాలా మంది వినియోగదారులు అదనపు ఫీచర్లు వస్తాయనే...