Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Cooking Tips: ఇలా చేస్తే దోశ పిండి పర్ఫెక్ట్‌గా రావాల్సిందే.. దోశల టేస్ట్ అదిరిపోతుంది..

Author
Posted By STAR TRINETHRAM
| 03 Feb 2026, 05:04 PM | Life Style
Cooking Tips: ఇలా చేస్తే దోశ పిండి పర్ఫెక్ట్‌గా రావాల్సిందే.. దోశల టేస్ట్ అదిరిపోతుంది..

Cooking Tips: ఇంట్లో దోశలు తరచూ చేసుకునే చాలా మందిని వేధించే ఒకే ఒక్క ప్రశ్న ఉంటుంది. నిన్న అద్భుతంగా వచ్చిన దోశలు ఈరోజు ఎందుకు అలానే రావు? అదే పిండి, అదే పెనం, అదే స్టవ్ అయినా దోశల రంగు, రుచి, కరకరలాడే గుణం మారిపోతుంటాయి. దీనికి కారణం పెద్ద తప్పులేమీ కాకపోయినా.. దోశ పిండి తయారీలో జరిగే చిన్న చిన్న నిర్లక్ష్యాలేనని వంట నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పదార్థాల నిష్పత్తి, నానబెట్టే సమయం, రుబ్బే విధానం, పులియబెట్టే పద్ధతి ఇవన్నీ దోశల ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.

హోటల్ స్టైల్‌లో పలుచగా, క్రిస్పీగా, అంచుల వద్ద కరకరలాడే దోశలు ఇంట్లో రావాలంటే ముందుగా పిండి తయారీపై పూర్తి దృష్టి పెట్టాలి. దోశ పిండికి బియ్యం, మినపప్పు సరైన నిష్పత్తిలో ఉండటం అత్యంత కీలకం. సాధారణంగా చెఫ్స్ సూచించే ఉత్తమ కొలత ప్రకారం ఒక కిలో బియ్యానికి పావు కిలో మినపప్పు వాడాలి. ఇంటి కొలతల్లో చెప్పాలంటే.. నాలుగు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు సరిపోతుంది. ఈ నిష్పత్తిని పాటిస్తే దోశలు మృదువుగా ఉండటంతో పాటు సరైన క్రిస్పీనెస్ కూడా వస్తుంది.

దోశలు అందంగా ఎర్రగా, రుచిగా రావాలంటే పిండిలో కొన్ని అదనపు పదార్థాలు తప్పనిసరి. సుమారు 50 గ్రాముల అటుకులు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు కలిపితే పిండికి సహజమైన రంగు, మంచి సువాసన, తేలికపాటి పులుపు వస్తుంది. అటుకులు దోశలను పలుచగా చేయడంలో సహాయపడుతాయి. మెంతులు పిండికి బైండింగ్ ఇచ్చి దోశలు సాఫ్ట్‌గా ఉండేలా చేస్తాయి.

నానబెట్టే విధానంలోనే చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. బియ్యం, మినపప్పులను కలిపి నానబెట్టడం వల్ల సరైన ఫలితం రావడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. బియ్యాన్ని విడిగా కనీసం 5 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. అలా నానబెట్టిన బియ్యం రుబ్బేటప్పుడు మెత్తగా మారి దోశలకు మంచి బేస్‌ను ఇస్తాయి. మినపప్పు, మెంతులను కలిపి సుమారు 4 గంటలు నానబెడితే చాలు. అటుకులను మాత్రం రుబ్బే అరగంట ముందు మాత్రమే నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే అవి అధికంగా నీరు పీల్చుకుని పిండిలో సరిగ్గా కలిసిపోతాయి.

నానబెట్టే ముందు బియ్యం, మినపప్పులను రెండు మూడు సార్లు శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే పొడి, మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. దీని ఫలితంగా పిండి తెల్లగా, శుభ్రంగా తయారవుతుంది. నానబెట్టే పాత్రలు కూడా పెద్దవిగా ఉండాలి. పదార్థాలు పూర్తిగా నీటిలో మునిగేలా ఉండేలా చూసుకుంటే అవి బాగా ఉబ్బి రుబ్బేటప్పుడు సులభంగా మెత్తబడతాయి.

ఇవి కూడా చదవండి

రుబ్బుకునే సమయంలో ముందుగా నానబెట్టిన బియ్యం, అటుకులను కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమం పూర్తిగా స్మూత్‌గా ఉండాలి. తర్వాత మినపప్పు, మెంతులను వేసి వెన్నలా మృదువుగా రుబ్బాలి. గట్టిగా కాకుండా, చేత్తో తాకితే నారగా అనిపించేలా ఉండటం సరైన లక్షణంగా చెఫ్స్ చెబుతున్నారు. ఈ రెండు మిశ్రమాలను ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని చేత్తో బాగా కలపాలి. చేత్తో కలపడం వల్ల పిండిలో గాలి చేరి దోశలు మరింత లైట్‌గా, స్పాంజీగా వస్తాయి.

పిండి గట్టిగా కూడా కాకుండా, నీళ్లలా పలుచగా కూడా కాకుండా మధ్యస్థ స్థితిలో ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలపాలి కానీ ఒకేసారి ఎక్కువ నీరు పోయకూడదు. పిండి పులియే ప్రక్రియ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో పిండి పులవడానికి 10 నుంచి 12 గంటల వరకు పట్టవచ్చు. వేసవిలో అయితే 7 నుంచి 8 గంటల్లోనే పిండి బాగా పులుస్తుంది.

పిండి బాగా పులిసిన తర్వాత మాత్రమే ఉప్పు కలపాలి. ముందే ఉప్పు వేస్తే పులియే ప్రక్రియ నెమ్మదించి దోశలు సరిగా రావని వంట నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది పిండి రుబ్బిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. అయితే బయట ఉంచితేనే సహజంగా ఈస్ట్ పెరిగి పిండి బాగా పులుస్తుంది. ఫ్రిజ్‌లో పెట్టాల్సి వస్తే దోశలు వేసే ముందు కనీసం గంట ముందే బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు వచ్చేలా ఉంచాలి.

దోశ వేయే ముందు పెనాన్ని బాగా వేడి చేయాలి. కొద్దిగా నీళ్లు చిలకరిస్తే ఆవిరి రావాలి. ఆ తర్వాత తడి గుడ్డతో పెనాన్ని తుడిచి స్వల్పంగా నూనె రాస్తే పిండి అంటకుండా సాఫీగా తిరుగుతుంది. గరిటెతో పిండి వేసి మధ్య నుంచి అంచుల వరకు వృత్తాకారంగా సాగదీస్తే హోటల్ స్టైల్‌లో పలుచగా, కరకరలాడే దోశలు సిద్ధమవుతాయి. సరైన కొలతలు, పద్ధతులు పాటిస్తే ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని ప్రతిరోజూ ఆస్వాదించవచ్చని చెఫ్స్ సూచిస్తున్నారు.

ALSO READ: Jaggery Tea: ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బెల్లం టీ తయారు చేసేటప్పుడు పాలు పగలవు!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: