Cooking Tips: ఇలా చేస్తే దోశ పిండి పర్ఫెక్ట్‌గా రావాల్సిందే.. దోశల టేస్ట్ అదిరిపోతుంది..

Cooking Tips: ఇంట్లో దోశలు తరచూ చేసుకునే చాలా మందిని వేధించే ఒకే ఒక్క ప్రశ్న ఉంటుంది. నిన్న అద్భుతంగా వచ్చిన దోశలు ఈరోజు ఎందుకు అలానే రావు? అదే పిండి, అదే పెనం, అదే స్టవ్ అయినా దోశల రంగు, రుచి, కరకరలాడే గుణం మారిపోతుంటాయి. దీనికి కారణం పెద్ద తప్పులేమీ కాకపోయినా.. దోశ పిండి తయారీలో జరిగే చిన్న చిన్న నిర్లక్ష్యాలేనని వంట నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పదార్థాల నిష్పత్తి, నానబెట్టే సమయం, రుబ్బే విధానం, పులియబెట్టే పద్ధతి ఇవన్నీ దోశల ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. హోటల్ స్టైల్‌లో పలుచగా, క్రిస్పీగా, అంచుల వద్ద కరకరలాడే దోశలు ఇంట్లో రావాలంటే...