Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Indiramma Houses: 4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు PMAY నిధులు

Author
Posted By STAR TRINETHRAM
| 02 Feb 2026, 11:24 AM | Govt Schemes
Indiramma Houses: 4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు PMAY నిధులు

Indiramma Houses: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన తాజా బడ్జెట్ తెలంగాణకు ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూర్చలేదన్న భావన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించినప్పటికీ తెలంగాణ విషయంలో స్పష్టమైన పెద్ద కేటాయింపులు కనిపించలేదు. హైదరాబాద్ నుంచి ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లు తప్ప రాష్ట్రానికి గణనీయమైన ప్రాజెక్టులు బడ్జెట్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి.

అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మాత్రం కేంద్రం తన వాటాను ప్రకటించడం రాష్ట్రానికి కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందించనుంది. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు కేంద్రం నుంచి రూ.లక్ష 50 వేలు అందనుండగా, గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు రూ.72 వేల చొప్పున సహాయం చేయనుంది.

రాష్ట్రంలో మొత్తం 4.13 లక్షల ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం నిధులు కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరినప్పటికీ ప్రస్తుతానికి పరిమిత స్థాయిలోనే కేటాయింపులు జరిగాయి. పీఎంఏవై అర్బన్ 2.O పథకం కింద రాష్ట్రానికి 1.13 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది.

ఈ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుడికి 1.50 లక్షల చొప్పున కేంద్రం భారం మోయనుండగా ఇందుకోసం సుమారు రూ.1,690 కోట్లు కేటాయించింది. అలాగే ఇప్పటికే నిర్మించిన 33 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేంద్రం రూ.500 కోట్లు మేర నిధులు విడుదల చేయనుంది. గ్రామీణ పీఎంఏవై పథకం కింద దేశవ్యాప్తంగా 25 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణకు కూడా గణనీయమైన వాటా దక్కనుంది.

ఇవి కూడా చదవండి

కేంద్రం ప్రకటించిన నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఒక్కో ఇంటికి రూ.72 వేల చొప్పున మొత్తం రూ.2,160 కోట్లను కేంద్రం కేటాయించింది. అదేవిధంగా ఆదివాసీ కుటుంబాల కోసం 10 వేల ఇళ్ల నిర్మాణాన్ని కూడా కేంద్రం ప్రకటించింది. ఈ ఇళ్లకు ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.20 లక్షల చొప్పున సహాయం అందనుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.

దశలవారీగా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేస్తూ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మార్చి నెల నుంచి కొత్త ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి నిధుల హామీ రావడం రాష్ట్ర ప్రభుత్వానికి బలాన్నిచ్చే అంశంగా మారింది. పీఎం ఆవాస్ యోజన పీఎంఏవై అర్బన్, పీఎంఏవై గ్రామీణ పథకాల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి కేంద్రం వాటా అందనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కీలకంగా తీసుకుని ముందుకు సాగుతున్న సమయంలో కేంద్రం సహకారం ప్రకటించడంతో ప్రభుత్వ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ALSO READ: Shocking Murder: భర్త గొంతుకోసి చంపి.. వెంటిలేటర్ గ్రిల్‌కు వేలాడదీసి!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: