Indiramma Houses: 4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు PMAY నిధులు
Indiramma Houses: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన తాజా బడ్జెట్ తెలంగాణకు ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూర్చలేదన్న భావన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించినప్పటికీ తెలంగాణ విషయంలో స్పష్టమైన పెద్ద కేటాయింపులు కనిపించలేదు. హైదరాబాద్ నుంచి ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లు తప్ప రాష్ట్రానికి గణనీయమైన ప్రాజెక్టులు బడ్జెట్లో చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మాత్రం కేంద్రం తన వాటాను ప్రకటించడం రాష్ట్రానికి కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా...