Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Affair: మామపై పెట్రోల్ పోసి నిప్పటించిన కొడలి ప్రియుడు

Author
Posted By STAR TRINETHRAM
| 01 Feb 2026, 06:37 PM | Crime
Affair: మామపై పెట్రోల్ పోసి నిప్పటించిన కొడలి ప్రియుడు

Affair: తమిళనాడు కడలూరు జిల్లాలో చోటు చేసుకున్న అమానవీయ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై ఓ వృద్ధుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ప్రజలను షాక్‌కు గురి చేస్తున్నాయి. మంటల్లో కాలిపోతూ ప్రాణాల కోసం సహాయం కోరుతూ రోడ్డుపై పరుగులు తీసిన ఆ వృద్ధుడి వీడియోను చూసిన వారంతా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఈ దారుణ ఘటన వెనుక సొంత కోడలు, ఆమె ప్రియుడు కలిసి పన్నిన కుట్ర వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.

కడలూరు జిల్లా పణ్రుట్టి సమీపంలోని మాలిగంపట్టు గ్రామానికి చెందిన రాజేంద్రన్ అనే 70 ఏళ్ల జీడిపప్పు రైతు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో రాజేంద్రన్ తన గ్రామానికి చెందిన కందన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అకస్మాత్తుగా ఓ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు వృద్ధుడిని అడ్డగించి, అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు చుట్టుముట్టిన రాజేంద్రన్ తీవ్ర వేదనతో కేకలు వేస్తూ, రోడ్డుపై పరుగులు తీస్తూ సహాయం కోరాడు. ఆ దృశ్యాలు అక్కడున్నవారిని సైతం కలచివేశాయి.

స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేసి, రాజేంద్రన్‌ను సమీప ఆస్పత్రికి తరలించారు. అతడి శరీరంపై సుమారు 70 శాతం కాలిన గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన కడలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని తేలింది. రాజేంద్రన్ కుమారుడు భూపతికి జయప్రియా అనే యువతితో వివాహం జరిగింది. వారికి 9 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అయితే భూపతి మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మరణం తర్వాత జయప్రియా తన ఇద్దరు పిల్లలతో కలిసి మామ రాజేంద్రన్ ఇంట్లోనే నివసిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ సమయంలోనే జయప్రియాకు మణికందన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రన్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. కోడలు తన ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించడంతో పాటు, మణికందన్‌ను కూడా హెచ్చరించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ హెచ్చరికలతో కోపం పెంచుకున్న జయప్రియా, మణికందన్ కలిసి రాజేంద్రన్‌ను అడ్డంగా తొలగించాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

ఆ కుట్రలో భాగంగా మణికందన్ తన స్నేహితులు కుపేంద్రన్, పార్థిబన్‌ల సహాయంతో ఈ దాడికి పాల్పడ్డాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వృద్ధుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మణికందన్, కుపేంద్రన్, పార్థిబన్‌లతో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి, లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ అమానవీయ ఘటన తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. వృద్ధుడిపై జరిగిన ఈ క్రూర దాడిలో నిందితులకు కఠిన శిక్ష పడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ALSO READ: Phone Tapping: సిట్ విచారణ.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: