Affair: మామపై పెట్రోల్ పోసి నిప్పటించిన కొడలి ప్రియుడు
Affair: తమిళనాడు కడలూరు జిల్లాలో చోటు చేసుకున్న అమానవీయ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై ఓ వృద్ధుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారి, ప్రజలను షాక్కు గురి చేస్తున్నాయి. మంటల్లో కాలిపోతూ ప్రాణాల కోసం సహాయం కోరుతూ రోడ్డుపై పరుగులు తీసిన ఆ వృద్ధుడి వీడియోను చూసిన వారంతా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఈ దారుణ ఘటన వెనుక సొంత కోడలు, ఆమె ప్రియుడు కలిసి పన్నిన కుట్ర వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. కడలూరు జిల్లా పణ్రుట్టి సమీపంలోని మాలిగంపట్టు గ్రామానికి చెందిన రాజేంద్రన్ అనే 70 ఏళ్ల జీడిపప్పు రైతు ఈ...