Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Post Office Job: 28,740 పోస్టులకు నోటిఫికేషన్.. టెన్త్ ఉంటే సరిపోద్ది

Author
Posted By STAR TRINETHRAM
| 31 Jan 2026, 12:39 PM | Edu/Jobs
Post Office Job: 28,740 పోస్టులకు నోటిఫికేషన్.. టెన్త్ ఉంటే సరిపోద్ది

Post Office Job: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త వచ్చింది. పోస్టల్ శాఖలో ఉద్యోగాల జాతర మొదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ 2026 సంవత్సరానికి గానూ గ్రామీణ డాక్ సేవక్ విభాగంలో భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం 28,740 పోస్టులను భర్తీ చేయనుంది. కేవలం పదో తరగతి ఉత్తీర్ణత అర్హతగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దక్కే అవకాశముండటంతో గ్రామీణ యువతలో ఈ నోటిఫికేషన్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి.

పోస్టాఫీస్ ఉద్యోగాలు అంటేనే స్థిరత్వం, భద్రత, గౌరవం అన్న భావన ఉంది. అలాంటి ఉద్యోగాలను రాత పరీక్ష లేకుండా, నేరుగా పదో తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేయనుండటం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకతగా నిలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ సొంత ప్రాంతంలోనే పని చేయాలనుకునే వారికి ఇది నిజంగా కలల అవకాశంగా మారనుంది. ఈ నియామకాల ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ వంటి కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు.

జనవరి 31 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 14 వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి, ఫిబ్రవరి 28 నాటికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని ఇండియా పోస్ట్ భావిస్తోంది. విద్యార్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. పూర్తిగా పదో తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అందుకే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వేతనాల పరంగా కూడా పోస్టల్ శాఖ ఉద్యోగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవక్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ పోస్టులకు నెలకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు వేతనం అందుతుంది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ హోదాలో ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు జీతం లభిస్తుంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి. తక్కువ పని వేళలు, సొంత ప్రాంతంలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. పోస్టల్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ నింపాలి. ఫోటో, సంతకం, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో తమకు నచ్చిన పోస్టల్ సర్కిల్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఈ భారీ నియామక ప్రక్రియ ద్వారా వేలాది నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దక్కనుంది. రాత పరీక్ష భయం లేకుండా ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది నిజంగా ఒక సువర్ణావకాశమని చెప్పొచ్చు.

ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ విజ్ఞప్తి తిరస్కరణ

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: