Post Office Job: 28,740 పోస్టులకు నోటిఫికేషన్.. టెన్త్ ఉంటే సరిపోద్ది

Post Office Job: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త వచ్చింది. పోస్టల్ శాఖలో ఉద్యోగాల జాతర మొదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ 2026 సంవత్సరానికి గానూ గ్రామీణ డాక్ సేవక్ విభాగంలో భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం 28,740 పోస్టులను భర్తీ చేయనుంది. కేవలం పదో తరగతి ఉత్తీర్ణత అర్హతగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దక్కే అవకాశముండటంతో గ్రామీణ యువతలో ఈ నోటిఫికేషన్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి. పోస్టాఫీస్ ఉద్యోగాలు...