Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

‘PM SVANidhi’ పథకం గురించి మీకు తెలుసా?.. ఆధార్ కార్డుతో రూ.90 వేల లోన్!

Author
Posted By STAR TRINETHRAM
| 26 Jan 2026, 02:25 PM | Govt Schemes
‘PM SVANidhi’ పథకం గురించి మీకు తెలుసా?.. ఆధార్ కార్డుతో రూ.90 వేల లోన్!


PM SVANidhi: కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు శుభవార్త చెప్పింది. పీఎం స్వనిధి పథకం కింద ఇప్పటి వరకు అమలులో ఉన్న రుణ సదుపాయాలను మరింత విస్తరిస్తూ, ఈ పథకాన్ని 2030 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న వ్యాపారుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, గరిష్టంగా రూ.90,000 వరకు రుణం అందించడమే కాకుండా, తాజాగా యూపీఐ-లింక్డ్ స్వనిధి క్రెడిట్ కార్డు సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది చిరు వ్యాపారులకు మరింత భరోసా లభించనుంది.



పీఎం స్వనిధి పథకం కింద రుణాలు మూడు విడతల్లో మంజూరు చేస్తారు. మొదటి విడతలో అర్హులైన వ్యాపారులకు రూ.15,000 వరకు రుణం అందిస్తారు. ఈ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రెండో విడతగా రూ.25,000 వరకు రుణం మంజూరు చేస్తారు. రెండో విడతను కూడా సమయానికి చెల్లించిన వారికి మూడో విడతలో గరిష్టంగా రూ.50,000 వరకు రుణం అందుతుంది. ఈ విధంగా మొత్తం రూ.90,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.



ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే.. ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేకపోవడం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేవలం ఆధార్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా అధికారిక పీఎం స్వనిధి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రుణాన్ని ఈఎంఐ పద్ధతిలో సులభంగా తిరిగి చెల్లించవచ్చు.



చిరు వ్యాపారుల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం యూపీఐ-లింక్డ్ రూపే స్వనిధి క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా రోజువారీ వ్యాపార అవసరాలు, అత్యవసర ఖర్చుల కోసం తక్షణమే క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రెండో విడత రుణాన్ని సకాలంలో చెల్లించిన వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డు అందుబాటులోకి వస్తుంది.


ఇవి కూడా చదవండి


డిజిటల్ చెల్లింపులను వినియోగించే వారికి క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలను కూడా కేంద్రం అందిస్తోంది. నెలకు గరిష్టంగా రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుండగా, ఏడాదికి సాధారణ వ్యాపార లావాదేవీలపై రూ.1,200 వరకు ప్రోత్సాహకం పొందే అవకాశం ఉంది. దీంతో డిజిటల్ లావాదేవీల వైపు వ్యాపారులు మరింతగా ఆకర్షితులవుతారని కేంద్రం భావిస్తోంది.



ఈ పథకం కింద ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండానే బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు. కోవిడ్-19 సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు 2020 జూన్‌లో పీఎం స్వనిధి పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. తాజాగా ఆగస్టు 2025లో ఈ పథకం పొడిగింపుకు ఆమోదం తెలిపిన కేంద్రం.. రుణ వ్యవధిని మార్చి 31, 2030 వరకు పొడిగించింది.



ఇప్పటి వరకు డిసెంబర్ 2025 నాటికి సుమారు 69.66 లక్షల మంది చిరు, వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, రూ.15,191 కోట్లకు పైగా నిధులను కేంద్రం పంపిణీ చేసింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 1.15 కోట్ల మంది చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.


ALSO READ: T20 World Cup 2026: ప్రధానితో PCB చైర్మన్ నఖ్వీ అత్యవసర భేటీ


మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: