‘PM SVANidhi’ పథకం గురించి మీకు తెలుసా?.. ఆధార్ కార్డుతో రూ.90 వేల లోన్!

PM SVANidhi: కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు శుభవార్త చెప్పింది. పీఎం స్వనిధి పథకం కింద ఇప్పటి వరకు అమలులో ఉన్న రుణ సదుపాయాలను మరింత విస్తరిస్తూ, ఈ పథకాన్ని 2030 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న వ్యాపారుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, గరిష్టంగా రూ.90,000 వరకు రుణం అందించడమే కాకుండా, తాజాగా యూపీఐ-లింక్డ్ స్వనిధి క్రెడిట్ కార్డు సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది చిరు వ్యాపారులకు మరింత భరోసా లభించనుంది. పీఎం స్వనిధి పథకం కింద రుణాలు మూడు విడతల్లో మంజూరు చేస్తారు. మొదటి విడతలో అర్హులైన వ్యాపారులకు రూ.15,000 వరకు రుణం...