HomeANDRA PRADESHLord Balaji: శ్రీవారికి అపూర్వ కానుక..121 కిలోల బంగారు ఆభరణాల విరాళం!

Lord Balaji: శ్రీవారికి అపూర్వ కానుక..121 కిలోల బంగారు ఆభరణాల విరాళం!

📰 Generate e-Paper Clip

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిపై భక్తులకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి మరో నిదర్శనం నిలిచింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్ తిరుమలేశునికి ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. ఈ ఆభరణాల విలువ సుమారు రూ.160 కోట్లు ఉంటుందని అంచనా.

ఇటీవల వర్ధమాన్ జైన్ తన కంపెనీలోని 60 శాతం వాటాను విక్రయించగా తద్వారా ఆయనకు సుమారు రూ.6 వేల కోట్లు సమకూరాయి. తనకు ఇంతటి గొప్ప విజయాన్ని, సంపదను ప్రసాదించిన శ్రీవారి కృపకు కృతజ్ఞతగా అందులో కొంత భాగాన్ని స్వామివారి సేవకు అంకితం చేయాలని ఆయన సంకల్పించారు. ఈ మేరకు 121 కేజీల స్వచ్ఛమైన బంగారంతో ప్రత్యేక ఆభరణాలను తయారు చేయించి, విరాళంగా అందించాలని నిర్ణయించారు.

స్వామివారి అలంకరణ కోసం అత్యంత నైపుణ్యంతో, శాస్త్రోక్తంగా ఈ ఆభరణాలను రూపొందించారు.కిరీటం, పాదుకలు, సాలగ్రామ హారాలు సహా మొత్తం 45 రకాల అపురూప ఆభరణాలను తయారు చేయించారు.వీటన్నింటినీ వేర్వేరు ఉత్సవాలు, అలంకరణలకు అనువుగా 9 ప్రత్యేక సెట్లుగా తీర్చిదిద్దారు.అత్యంత విలువైన ఈ బంగారు ఆభరణాలను ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య, ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ట్రక్కు ద్వారా తిరుమలకు తరలించారు.

భక్తుడు వర్ధమాన్ జైన్ సమర్పిస్తున్న ఈ అపూర్వ బంగారు కానుకలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమల శ్రీవారికి అందజేశారు. టీటీడీ (TTD) అధికారుల సమక్షంలో ఈ ఆభరణాలను స్వామివారికి సమర్పించే కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది.

తిరుమల శ్రీవారి చరిత్రలో ఒక భక్తుడు వ్యక్తిగతంగా ఇంత భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను విరాళంగా అందించడం విశేషంగా నిలుస్తోంది. వర్ధమాన్ జైన్ భక్తి భావాన్ని, సేవా దృక్పథాన్ని పలువురు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular