Lord Balaji: శ్రీవారికి అపూర్వ కానుక..121 కిలోల బంగారు ఆభరణాల విరాళం!

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిపై భక్తులకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి మరో నిదర్శనం నిలిచింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్ తిరుమలేశునికి ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. ఈ ఆభరణాల విలువ సుమారు రూ.160 కోట్లు ఉంటుందని అంచనా. ఇటీవల వర్ధమాన్ జైన్ తన కంపెనీలోని 60 శాతం వాటాను విక్రయించగా తద్వారా ఆయనకు సుమారు రూ.6 వేల కోట్లు సమకూరాయి. తనకు ఇంతటి గొప్ప విజయాన్ని, సంపదను ప్రసాదించిన శ్రీవారి...