మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన భర్త నటించిన సినిమాల్లో తనకు అత్యంత ఇష్టమైన చిత్రం ఏదో వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో ఆమె చరణ్ సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
ఈ సదస్సులో చరణ్ సినిమాల్లో ఏ మూవీ అంటే ఇష్టమని ఉపాసనను మంత్రి నారా లోకేశ్ అడగగా ఆమె చెప్పిన సమాధానం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ కెరీర్లో భారీ విజయాలు సాధించిన ఆర్ఆర్ఆర్ , మగధీర , రంగస్థలం కాకుండా.. వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ సినిమా తనకు ఎంతో ఇష్టమని ఉపాసన తెలిపారు. ఉపాసన సమాధానం విని నారా లోకేశ్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఇక సినిమాల విషయానికొస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి తన తదుపరి చిత్రం ‘RC17’ కోసం సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


